తుది దశకు యుద్ధం.. ట్రంప్‌ గుడ్‌న్యూస్‌ | Trump Claims U.S. Has Crippled Iran’s Targets | Sakshi
Sakshi News home page

తుది దశకు యుద్ధం.. ట్రంప్‌ గుడ్‌న్యూస్‌

Mar 11 2026 9:03 PM | Updated on Mar 11 2026 10:03 PM

Trump Claims U.S. Has Crippled Iran’s Targets
  • త్వరలోనే ఇరాన్‌తో యుద్ధం ముగిస్తాం
  • ఇరాన్‌లోని అన్ని లక్ష్యాలను ఛేదించాం
  •  ఇరాన్‌ దగ్గర ఇంకేమీ మిగల్లేదు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఇరాన్‌తో యుద్ధం ముగిస్తామని అ‍న్నారు. ఇప్పటికే ఇరాన్‌లోని అన్ని లక్ష్యాలను ఛేదించామని తెలిపారు. ఇప్పుడు కొత్తగా టార్గెట్‌ చేయడానికి ఇరాన్‌ దగ్గర ఇంకేమీ మిగల్లేదని అన్నారు. తాను ఎప్పుడు అనుకుంటే అప్పుడు యుద్ధం ఆగుతుందని చెప్పారు.

కాగా, ఇరాన్ నౌకాదళం పనిచేస్తున్న పోర్టుల దగ్గరకు వెళ్లవద్దని అమెరికా సైన్యం పౌరులను హెచ్చరించింది. ఆ ప్రాంతాల్లో భద్రతకు హామీ ఇవ్వలేమని తెలిపింది. యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ ఇరానీ డాక్ కార్మికులు, పరిపాలనా సిబ్బంది, వాణిజ్య నౌకల సిబ్బంది ఇరాన్ నేవీ నౌకలు దగ్గరికి, సమీప సైనిక ప్రాంతాల వద్దకు వెళ్లవద్దని సూచించింది. అమెరికా దళాలు ఇరాన్ నౌకాదళ ఆస్తులపై దాడులు కొనసాగిస్తున్న సమయంలో యూఎస్‌ ఈ హెచ్చరిక చేసింది. ఇప్పటివరకు సుమారు 60 ఇరానీ నౌకలు ధ్వంసం చేశామని అమెరికా తెలిపింది.

మరోవైపు, ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ భీకరదాడులు చేసింది. దాడుల్లో కొత్త సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీ గాయపడినట్లు ప్రచారం జరుగుతోంది. ఖమేనీ కాలికి ఫ్రాక్చర్‌, ఎడమ కంటి వద్ద గాయాలైనట్లు సమాచారం. అయితే, గత ఏడాది జరిగిన హత్యాప్రయత్నంలోనే ఖమేనీ గాయపడ్డారని ఇజ్రాయెల్‌ అంటోంది. ఇప్పటి వరకు ప్రజల ముందుకు మొజ్తబా ఖమేనీ రాలేదు.  
 

Advertisement
 
Advertisement
Advertisement