పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రస్థాయికి చేరుకుంది. దుబాయి నుంచి భారత్ వస్తున్న నౌకపై ఇరాన్ అటాక్ చేసింది. హర్మూజ్ జలసంధి సమీపంలో ఈ దాడి జరిగింది. నౌకలో మెుత్తం 23 మంది సిబ్బంది ఉండగా ముగ్గురు గల్లంతైనట్లు తెలుస్తోంది.. అయితే ఈ నౌకలో ఏం సరఫరా జరుగుతుంది. అనే వివరాలు తెలియాల్సి ఉంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని యుఎఇలోని ఖలీఫా పోర్టు నుండి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ నౌకథాయ్ కంపెనీ ప్రెషియస్ షిప్పింగ్ పిసిఎల్‌కు చెందింది. భారతదేశంలోని కాండ్లా పోర్టుకు ప్రయాణమైన ఈ నౌక.. హార్ముజ్ జలసంధిని దాటుతుండగా అటాక్ జరిగింది.
ఈ దాడిపై ఇరాన్ స్పందించింది. వ్యుహాత్మక హర్ముాజ్ జలసంధిలో లైబీరియా జెండా ఎగరేస్తూ ఇజ్రాయెల్ యాజమాన్యంలోని ఎక్స్‌ప్రెస్ రోమ్, థాయ్ బల్క్ క్యారియర్, మయూరీ నరీ అనే ఓడలు ప్రయాణిస్తున్నాయని.. వాటికి హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో వాటిపై దాడి చేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తెలిపింది. వ్యూహాత్మక జలమార్గం గుండా ప్రయాణించే ఏ నౌక అయినా ఇరాన్ అనుమతి పొందాలని ఐఆర్‌జీసీ కమాండర్ అలిరేజా టాంగ్‌సిరి స్పష్టం చేశారు.

అయితే ఇటీవల ఇరాన్ నౌకలకు భారత్ ఆశ్రయం కల్పించింది. అయినప్పటీకీ భారత్‌కు వస్తున్న నౌకలపై దాడి చేయడం కొంత ఇబ్బంది కలిగించే విషయం. కాగా హర్మూజ్ జలసంధి గుండా దాదాపు 20 శాతం చమురు రవాణా జరుగుతుంది. దీనిని ఇరాన్ తన ఆధీనంలోకి తీసుకోవడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హర్మూజ్ జలసంధిని స్వాధీనం చేసుకుంటానని ప్రకటించారు. తాజాగా ఇరాన్ ఆ మార్గం గుండా ప్రయాణించిన నౌకపై దాడి చేయడంతో ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి


