అనంతపురం : ఖాద్రీ లక్ష్మీ నారసింహుని బ్రహ్మ రథోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది.
‘నమో.. నారసింహ’ నామస్మరణతో ఖాద్రీ క్షేత్రం మార్మోగింది. సోమవారం రాత్రి ఐరావతంపై తిరు వీధుల గుండా భక్తులకు దర్శనమిచ్చి తిరిగి ఆలయం చేరుకొన్న ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు తెల్లవారు జామున శుభ ఘడియల్లో రథారోహణం చేశారు.
ఉదయాన్నే ఆలయ అర్చక బృందం తేరు ముందు బలిహరణం, ఆస్థాన పూజలు నిర్వహించింది.


