విశాఖ ఆర్కే బీచ్‌లో ఫ్రెండ్‌షిప్‌ డే తీపి కిక్కు..(ఫొటోలు) | Friendship Day Celebrations RK Beach Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖ సాగర తీరం నీలి సముద్రం...గులాబీ స్నేహం (ఫొటోలు)

Aug 3 2026 6:19 AM | Updated on Aug 3 2026 6:18 AM

Friendship Day Celebrations RK Beach Visakhapatnam1
1/14

విశాఖపట్నం : అది ఆర్కే బీచ్‌. ప్రతిరోజూ అలలు వచ్చి తీరాన్ని ముద్దాడి వెళ్లే చోటే. కానీ ఈ ఆదివారం... అలల కన్నా ముందే తీరాన్ని ముంచెత్తింది ఒక అమృతం! దాని పేరు స్నేహం.

Friendship Day Celebrations RK Beach Visakhapatnam2
2/14

క్యాలెండర్‌లో ఆగస్టు మొదటి ఆదివారం రాగానే విశాఖ సాగర తీరం ఒక్కసారిగా కొత్త రంగు పులుముకుంది.

Friendship Day Celebrations RK Beach Visakhapatnam3
3/14

ఒకవైపు వారాంతపు హాయి... మరోవైపు ఫ్రెండ్‌షిప్‌ డే (Friendship Day 2026) తీపి కిక్కు.. ఈ రెండూ కలిసి ఆర్కే బీచ్‌ను ఓ అపురూప స్నేహ సామ్రాజ్యంగా మార్చేశాయి. సూర్యకాంతి కన్నా, అక్కడ మెరిసిన యువత చిరునవ్వుల కాంతులే బీచ్‌ను ఎక్కువ వెలిగించాయి.

Friendship Day Celebrations RK Beach Visakhapatnam4
4/14

సముద్రం రోజూ ఘోషిస్తుంది... కానీ ఈ రోజు ఆ ఘోషను మించి ఫ్రెండ్‌షిప్‌ డే అల్లర్లు మిన్నంటాయి.

Friendship Day Celebrations RK Beach Visakhapatnam5
5/14

చేతులకు రంగురంగుల ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్లు, చేతిలో బర్త్‌డే కేక్‌లు కాకపోయినా ‘స్నేహానికి పుట్టినరోజు’ అని చెప్తూ కట్‌ చేసిన కేక్‌ ముక్కలు, ఆప్యాయంగా తినిపించుకున్న తీపి క్షణాలు... ప్రతి అడుగులోనూ అనుబంధాల సువాసనలే!..సాహసానికి, ఆనందానికి మధ్య నడిచే నూనూగు మీసాల కుర్రాళ్లు.. చేతుల్లో చేతులు వేసి నడిచే పడికట్టు స్నేహితురాళ్లు... రాళ్ల పైన నిలబడి ఎగిసే అలలతో పోటీపడుతూ తీసుకున్న సెల్ఫీలు, తీసిన ఫొటోలు ఆ నిమిషాలను శాశ్వతం చేశాయి.

Friendship Day Celebrations RK Beach Visakhapatnam6
6/14

నీటి బిందువులు తడిపిన మాటలు, నవ్వుల తుంపరలు విశాఖ సముద్రాన్ని కూడా కాసేపు తన హొయలు మరిచిపోయేలా చేశాయి. సముద్రపు ఉప్పు నీటిలో... అమృతం లాంటి స్నేహం నిండిన వేళ, ఆర్‌.కె.బీచ్‌ ఒక వార్త కాదు, ఒక తీపి జ్ఞాపకం.

Friendship Day Celebrations RK Beach Visakhapatnam7
7/14

Friendship Day Celebrations RK Beach Visakhapatnam8
8/14

Friendship Day Celebrations RK Beach Visakhapatnam9
9/14

Friendship Day Celebrations RK Beach Visakhapatnam10
10/14

Friendship Day Celebrations RK Beach Visakhapatnam11
11/14

Friendship Day Celebrations RK Beach Visakhapatnam12
12/14

Friendship Day Celebrations RK Beach Visakhapatnam13
13/14

Friendship Day Celebrations RK Beach Visakhapatnam14
14/14

ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement