హైదరాబాద్ : ప్రఖ్యాత కవి, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి జయంతి సందర్భంగా బుధవారం రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన రచించిన సీతాపహరణం నాటికను ఆవిష్కరించారు.
మీరా పదావలి అనే అంశంపై కళాకారుల నృత్య ప్రదర్శన ఆహూతులను ఆకట్టుకుంది. సుశీల నారాయణరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఉర్దూ గజల్స్‌ను తెలుగులోకి అనువదించి వాటికి జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిన గొప్ప వ్యక్తి అని సినారెను కొనియాడారు.


