హైదరాబాద్ : జూ పార్క్‌లో (Nehru Zoological Park) బుధవారం అంతర్జాతీయ పులుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. (International Tiger Day)
డ్రాయింగ్, పెయింటింగ్, వాస్యరచన, వక్తృత్వం, క్విజ్, పులులపై డిబేట్‌లో విజేతలుగా నిలిచిన తమ విద్యార్థులకు నాజర్, వీఐపీ ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రతినిధులు బహుమతులను అందజేశారు.
విద్యార్థులు, సందర్శకులకు పులుల గురించి ఆనిమల్ కీపర్లు వివరించారు.
బయోస్కోప్ వద్ద 50 అడుగుల బ్యానర్‌పై సంతకాలు పులులపై నినాదాలు రాయడంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.


