breaking news
International Tiger Day
-
పెరిగిన ‘పులి’కేక
సాక్షి, అమరావతి: మన దేశంలో పులుల గర్జనలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు అంతరించిపోయే దశకు చేరిన ఈ వన్యప్రాణుల సంఖ్య పెంచేందుకు దశాబ్దాలుగా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వన్యప్రాణుల సంరక్షణ ప్రాజెక్టులలో ‘ఇండియా ప్రాజెక్ట్ టైగర్’ ఒకటిగా నిలిచింది. నేడు ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా ఈ ప్రాజెక్టు అమలు, మన దేశంలో పులుల చరిత్ర ఆసక్తికరంగా మారింది. పులుల అవసరం ఎందుకంటే? పర్యావరణ వ్యవస్థలో పులుల ప్రాముఖ్యత అమూల్యం. పులులు ఉన్న చోట అటవీ వ్యవస్థ బలంగా ఉంటుంది. పులులు ఉన్న ప్రాంతాలు నీటి వనరులు, పచ్చదనం, వన్యప్రాణులకు మూలస్థానంగా ఉంటాయి. వాటిని సంరక్షించడం అంటే నీటి సంరక్షణ, ప్రకృతి సంరక్షణ. ఒక అడవిలో పులి ఉండడాన్ని ఆరోగ్యవంతమైన ప్రకృతికి సంకేతంగా భావిస్తారు. పులులను కాపాడితే అడవులు స్థిరంగా ఉండి మానవ మనుగడకు అవసరమైన ఆక్సిజన్ అందుతుంది. కానీ ఇప్పటికీ అక్రమ వేట, అడవి నాశనం వల్ల పులులు ప్రమాదంలో ఉన్నాయి. అప్పట్లో 40 వేల పులులు 20వ శతాబ్దం ప్రారంభంలో భారతదేశంలో సుమారు 40 వేల పులులు ఉండేవని అంచనా. కొందరు నిపుణుల లెక్కల ప్రకారం ఈ సంఖ్య లక్షకుపైనే. కానీ రాజులు, జమీందార్లు పులుల్ని వేటాడడం గొప్పగా భావించడం, పులుల అవయవాలు ధరిస్తే మంచి జరుగుతుందనే మూఢ నమ్మకం కారణంగా వాటిని వేటాడి ఇష్టానుసారం చంపేశారు. దీంతో 1972 నాటికి దేశంలో కేవలం 1,827 పులులు మాత్రమే మిగిలాయి. కేవలం 70 ఏళ్లలో పులుల జనాభా 95 శాతం తగ్గిపోయింది. దీంతో పర్యావరణ పరిరక్షణ, అడవుల మనుగడ ప్రమాదకరంగా పరిణమించింది. ఈ నేపథ్యంలోనే 1973లో కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ టైగర్‌ను ప్రారంభించింది. మన దేశంలో నివసించే బెంగాల్ టైగర్ జాతి పులులను, వాటి సహజ నివాసాలను సంరక్షించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. 9 రిజర్వుల నుంచి 58 టైగర్ రిజర్వులకు... ఈ ప్రాజెక్టులో భాగంగా దేశవ్యాప్తంగా పులుల ఆవాసాల కోసం కోర్, బఫర్ జోన్ వ్యూహాన్ని అనుసరించారు. పూర్తిగా పులులు నివాసం ఉండేలా ప్రధాన ప్రాంతాలు (కోర్), పరిమితమైన మానవ సంచారం ఉండేలా అటవీ పరిసర ప్రాంతాల్లో బఫర్ జోన్లలో టైగర్ రిజర్వులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ)ను స్థాపించారు. 1972 వన్యప్రాణుల పరిరక్షణ చట్టం ప్రకారం ఏర్పడిన ఈ సంస్థ పులుల సంరక్షణ, నియంత్రణ, నిధుల పంపిణీ వంటి విషయాలను చూస్తోంది. 1972లో ఈ ప్రాజెక్టు ప్రారంభమయ్యే నాటికి దేశంలో 9 టైగర్ రిజర్వులు మాత్రమే ఉన్నాయి. 50 ఏళ్ల తర్వాత తిరిగి చూసుకుంటే వాటి సంఖ్య 18 రాష్ట్రాల్లో 58కి పెరిగింది.దేశంలో అత్యంత పేరొందిన పులి.. మచ్లి మన దేశంలో ఇప్పటివరకు ఉన్న పులుల్లో అత్యంత ప్రసిద్ధి పొందిన పులి మచ్లి. రాజస్థాన్‌లోని రణథంబోర్ రిజర్వులో ఇది ఉండేది. ప్రపంచంలో అత్యధిక ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీసిన పులి ఇదే. రెండేళ్ల నుంచే వేట ప్రారంభించింది. 14అడుగుల మొసలిని చంపడంతో దీని పేరు మార్మోగింది. ఈ పోరులో తన రెండు దంతాలు కోల్పోయినా దాని ధైర్యం ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచింది. ఐదుసార్లు గర్భం దాల్చి 11 పులి పిల్లలను కని.. పెంచడం ద్వారా రణథంబోర్ టైగర్ రిజర్వులో పులుల సంఖ్యను పెంచడంలో కీలక పాత్ర పోషించింది. క్వీన్ ఆఫ్ రణథంబోర్గా ప్రసిద్ధి పొందిన మచ్లి 2016లో మృతి చెందింది. -
దేశంలో క్రమంగా పెరుగుతున్న పులుల సంఖ్య
-
‘ప్రపంచ పులుల దినోత్సవం’ పోస్టర్ విడుదల
-
ఈ పులి ఫోటోతో పోలీసులు ఏం చెబుతున్నారంటే..
నాగ్‌పూర్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకీ విజృంభిస్తోన్న నేపథ్యంలో ఆ మహమ్మారి కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో శ్రమిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో ఉన్న క్లిష్ట పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రజల సంక్షేమం కోసం పోలీసులు నిర్విరామంగా పనిచేస్తున్నారు. ప్రమాదకరంగా మారుతున్న కరోనా వైరస్ గురించి ఎప్పటికప్పుడూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కరోనా వైరస్ ఆకారాన్ని పోలిన హెల్మెట్లను ధరించి కొందరు పోలీసులు అవగాహన కల్పిస్తుంటే మరికొందరు సోషల్‌మీడియా వేదికగా పలు మీమ్స్ చేశారు. తాజాగా నాగ్‌పూర్ పోలీసులు తమ అధికారిక ట్విటర్ ఖాతా వేదికగా ఓ పులి ఫోటోతో మాస్కులు ధరించడం పట్ల ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. (చదవండి: వైరల్: పెద్దపులినే బురిడి కొట్టించిన బాతు ) వరల్డ్ టైగర్ డే సందర్భంగా ఓ పులి తన కాలిని ముఖానికి అడ్డంగా పెట్టుకున్న ఫోటోను షేర్ చేస్తూ.. ‘ముక్కు కిందకు మాస్క్ ధరించిన వ్యక్తులను చూసినప్పుడు ఇలాంటి ఫీలింగ్ కలుగుతుంది’క్యాప్షన్ పెట్టారు. మరో ట్వీట్లో ‘మాస్క్ ధరించి పులిలా ఉండండి’అని చెప్పుకొచ్చారు. చాలా మంది మాస్కులు సరిగా ధరించకపోవడంతో అవగాహన కోసం పోలీసులు ఈ ట్వీట్ చేశారు. That moment when we see people wearing masks below their nose: pic.twitter.com/Hq7x9r3nIM — Nagpur City Police (@NagpurPolice) July 29, 2020 నాగ్‌పూర్ పోలీసులు పెట్టిన ఈ పోస్ట్.. ముసిముసి నవ్వులు నవ్వించడమే కాకుండా ముసుగు ఎలా ధరించాలో కూడా తెలియజేస్తుంది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ట్వీట్ కామెడీగానే ఉన్నా.. మంచి విషయం చెప్పారని నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘పులి అడవికి రాజు అయితే.. నాగ్‌పూర్ పోలీసులు సోషల్ మీడియాకు రాజులు’,‘మాస్కులు ఎలా ధరించకూడదో చెప్పినందుకు ధన్యవాదాలు’అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. Be a Tiger. Wear masks properly.#InternationalTigerDay#NagpurPolice — Nagpur City Police (@NagpurPolice) July 29, 2020 -
అటవీశాఖ అధికారులకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: ప్రపంచ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అటవీ శాఖ రూపొందించిన పోస్టర్లు, బ్రోచర్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా పులుల సంరక్షణ, వాటి ఆవాసాల పరిరక్షణ కోసం చేపడుతున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 3727.82 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వు ఫారెస్టు దేశంలోనే అతిపెద్దదని, ప్రస్తుతం అక్కడ 60 పులులు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పులులు సంఖ్య నానాటికీ తగ్గిపోతున్నా.. రాష్ట్రంలో చేపడుతున్న సంరక్షణ చర్యల వల్ల పులులు సంఖ్య పెరిగిందని అటవీశాఖ అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చారు. (ఏపీలో రూ.40 కోట్లతో 13 మోడల్ డిగ్రీ కాలేజీలు) అదే విధంగా పులుల రక్షణ అటవీ వన్యమృగాల సంరక్షణలో నాగార్జునసాగర్–శ్రీశైలం రిజర్వు ఫారెస్టులో ఉన్న ఆదిమ చెంచు తెగలు గొప్ప పాత్ర పోషిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఫారెస్టు రిజర్వు నిర్వహణలో చెంచుల సహకారంతో సమర్ధవంతమైన మానవ వనరుల నిర్వహణకు గాను భారత ప్రభుత్వం, నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ ఎక్సెలెన్స్ అవార్డును ప్రదానం చేసినట్లు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ నేపథ్యంలో అంతరించిపోతున్న పులుల జాతిని సంరక్షించేందుకు అటవీ శాఖ అధికారులు చేస్తున్న కృషిని సీఎం జగన్ అభినందించారు. ఈ సమావేశంలో నీరబ్‌కుమార్ ప్రసాద్, (అటవీ, పర్యావరణ శాఖ స్పెషల్ సిఎస్) ఎన్. ప్రతీప్ కుమార్ (ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్), అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు -
టైగర్ జిందా హై..!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న పులుల గణన నివేదికను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో విడుదల చేశారు. పులులకు ప్రపంచంలోనే అత్యంత భద్రమైన నివాస స్థలంగా భారత్‌లోని అడవులు మారాయని ఆయన తెలిపారు. ప్రపంచ పులుల దినోత్సవమైన సోమవారమే మోదీ ‘అఖిల భారత పులుల సంఖ్య అంచనా–2018’ నివేదికను విడుదల చేస్తూ భారత్‌లో పులుల సంఖ్యను పెంచే ప్రక్రియలో పాలుపంచుకున్న వారందరినీ తాను ప్రశంసిస్తున్నానన్నారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ), జాతీయ పులుల సంరక్షణ సంస్థ (ఎన్టీసీఏ) కలిసి సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి. నివేదికలో వెల్లడించిన అంశాల ప్రకారం 2006లో దేశంలో 1,411 పులులు మాత్రమే ఉండగా, వాటి సంఖ్య 2014కు 2,226కు, 2018కి 2,967కు పెరిగింది. పులి పిల్లలను లెక్కలోకి తీసుకోకుండా కేవలం ఎదిగిన పులులను మాత్రమే లెక్కించారు. మోదీ మాట్లాడుతూ ‘పులుల సంఖ్యను పెంచడంపై 9 ఏళ్ల క్రితం రష్యాలోని సెయింట్‌పీటర్స్‌బర్గ్‌లో అంతర్జాతీయ స్థాయి సమావేశం జరిగింది. 2022 నాటికల్లా పులుల సంఖ్యను రెట్టింపు చేయాలని ఆ సమావేశంలో పాల్గొన్న దేశాలన్నీ లక్ష్యంగా పెట్టుకున్నాయి. గడువు పూర్తవ్వడానికి నాలుగేళ్ల ముందే భారత్‌లో పులుల సంఖ్యను మనం రెట్టింపు చేశాం. సంకల్పంతో మనం దేన్నయినా సాధించవచ్చు అనడానికి ఇదే ఉదాహరణ’ అని వెల్లడించారు. 2006 నాటి లెక్కలను 2018 లెక్కలతో పోల్చుతూ మోదీ ఈ విషయం చెప్పారు. అదే 2014 లెక్కలను 2018 గణాంకాలతో పోలిస్తే పులుల సంఖ్య నాలుగేళ్లలో 33 శాతం పెరిగింది. దాదాపు మూడు వేల పులులను కలిగిన ఇండియా ఇప్పుడు ప్రపంచంలోనే పులులకు అత్యంత భద్రమైన, పెద్ద నివాస స్థలంగా మారిందని మోదీ పేర్కొన్నారు. కాగా, ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి, ఎం–స్ట్రైప్స్ అనే మొబైల్ యాప్ సాయంతో పులుల సంఖ్యను సులభంగా లెక్కించగలిగామని డబ్ల్యూఐఐలో పనిచేసే శాస్త్రవేత్త వైవీ.ఝాలా చెప్పారు. సమాచారాన్ని సేకరించడం సులభమైందిగానీ, దానిని విశ్లేషించడం కష్టంగా మారిందని ఆయన తెలిపారు. ‘ఎక్ థా టైగర్’ నుంచి... సల్మాన్ ఖాన్ నటించిన రెండు బాలీవుడ్ చిత్రాల పేర్లను మోదీ ప్రస్తావిస్తూ, పులుల సంఖ్య పెరుగుదలపై చమత్కారంగా మాట్లాడారు. భారత్‌లో పులుల సంరక్షణ ప్రక్రియ ‘ఎక్ థా టైగర్’ (గతంలో ఓ పులి ఉండేది)తో మొదలై, ఇప్పుడు ‘టైగర్ జిందా హై’ (పులి బతికే ఉంది) వరకు చేరుకుందని మోదీ వివరించారు. అయితే ఇది ఇక్కడితో ఆగకూడదనీ, పులుల సంరక్షణను మరింత వేగవంతం, విస్తృతం చేయాలని ఆయన సూచించారు. పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి మధ్యన ఆరోగ్యకరమైన సమతుల్యం తీసుకురావడం సాధ్యమేనని మోదీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం మౌలిక వసతుల నిర్మాణంతోపాటు అడవుల విస్తీర్ణాన్ని కూడా పెంచగలిగిందని మోదీ తెలిపారు. 2014లో దేశంలో సంరక్షణ ప్రాంతాలు 692 ఉండగా, ప్రస్తుతం 860కి పెరిగిందని వెల్లడించారు. ప్రభుత్వం జంతువుల కోసం కూడా మరిన్ని ఆవాసాలను ఏర్పాటు చేస్తుందన్నారు. మధ్యప్రదేశ్‌లో అధికం దేశంలోనే అత్యధిక సంఖ్యలో పులులు మధ్యప్రదేశ్‌లో ఉన్నాయి. ఆ రాష్ట్రంలో 2014లో 308గా ఉన్న పులుల సంఖ్య 2018కి ఏకంగా 526కి పెరిగింది. అలాగే మహారాష్ట్రలోనూ 2014లో 190 పులులు ఉండగా, 2018లో 312 ఉన్నాయి. 2018 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 48 పులులు ఉన్నాయి. తెలంగాణలో గత నాలుగేళ్లలో పులుల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలోనే పెరిగింది. తెలంగాణలో ఆమ్రాబాద్, కవ్వాల్‌ల్లో పులుల సంరక్షణ కేంద్రాలుండగా, ఈ రెండింటిలో కలిపి 2014లో 20 పులులు ఉండేవి. 2018 నాటికి ఆ సంఖ్య 26కు పెరిగింది. ఇవే కాకుండా, మరో ఆరు పులి పిల్లలు కూడా ఆమ్రాబాద్, కవ్వాల్‌ల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పులుల సంఖ్య దేశవ్యాప్తంగా పెరిగినప్పటికీ ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం తగ్గింది. ఛత్తీస్‌గఢ్‌లో 2014లో 46 పులులు ఉండగా, 2018కి వాటి సంఖ్య 19కి పడిపోయింది. -
పులుల సంఖ్య పెరగడం సంతోషం : సీఎం జగన్
సాక్షి, అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో పులులు సంఖ్య పెరగడం సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఏపీలో పులుల సంఖ్య 48కి చేరడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పులుల సంరక్షణకు మరిన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మన జాతీయ జంతువు అయిన పులులను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. అందుకోసం పర్యావరణ సమతుల్యతను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ ట్విటర్లో సందేశాన్ని పోస్ట్ చేశారు. కాగా, దేశంలో మొత్తం 2,967 పులులు ఉన్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ సోమవార ఉదయం ట్విటర్లో వెల్లడించారు. ‘దేశంలో పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. నాలుగేళ్లలో 700 పులులు పెరిగాయి. మొత్తం 2,967 పులులతో ఇండియా పులులకు అత్యంత ఆవాసయోగ్యమైన దేశంగా మారింద’ని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. -
టైగర్స్ కోసం టైగర్ ష్రాఫ్..
బాలీవుడ్ యువ కెరటం టైగర్ ష్రాఫ్.. పులుల సంరక్షణ కోసం కేంద్రమంత్రికి లేఖ రాశాడు. శుక్రవారం అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా టైగర్.. టైగర్స్ గురించి తన లేఖలో పేర్కొన్నాడు. ప్రభుత్వం అడవులను సంరక్షించాలని, అంతరించిపోతున్న పులుల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, ఇతర జంతువులను, విలువైన అడవులను రక్షించాలని విన్నవిస్తూ పెటా సభ్యుడైన టైగర్ కేంద్ర పర్యావరణశాఖ మంత్రి అనిల్ మాధవ్ దేవ్ ను తన లేఖలో కోరాడు. ఇప్పటికే టైగర్ ఓ జూలో ఉన్న ఓ ఆడపులికి సంరక్షకుడిగా ఉన్నాడు. సామాజిక స్పృహ కలిగిన హీరో టైగర్ తన తదుపరి చిత్రం 'ఫ్లయింగ్ జాట్'లో సూపర్ హీరోగా కనిపించనున్నాడు. We tigers gotta stick together :D Make every day a happy one for the Tigers :) #InternationalTigerDay pic.twitter.com/yKgaDb1JyW — Tiger Shroff (@iTIGERSHROFF) July 29, 2016