breaking news
CELEBRATIONS
-
‘అనగనగా ఒక రాజు’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
నాటి రోజుల్లో.. రెండో పెద్ద పండుగ!
ప్రతీయేటా పెద్ద పండుగ(సంక్రాంతి) తరువాత రిపబ్లిక్ డే వస్తుంటుంది. నాటి రోజుల్లో ఈ గణతంత్ర వేడుకలు రెండో పెద్ద పండుగలా జరిగేవి... అంటే ఇప్పుడు అలా లేదని కాదు.. నాడు ఇళల్లో నెలకొన్న ఉత్సాహం కాస్త తగ్గినట్లు అనిపిస్తుంది. దూరదర్శన్ ప్రధాన వినోద మాధ్యమంగా ఉన్న 90ల నాటి ఆ తీపి జ్ఞాపకాల తుట్టెను ఒకసారి కదిలిస్తే..నాటి రోజుల్లో రిపబ్లిక్ డే ఉదయం అంటే చాలు.. అదొక తెలియని ఉత్సాహం.. బయట చలి గాలులు వీస్తున్నా.. దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిలో అందరూ తెల్లవారుజామునే నిద్రలేచేవారు. నాడు స్మార్ట్ఫోన్ల స్క్రోలింగ్ అనేదే లేదు.. ఆపకుండా వచ్చే నోటిఫికేషన్ల గోల అంతకన్నా లేదు.. వందల కొద్దీ టీవీ ఛానెళ్ల గందరగోళం అసలే లేదు. కుటుంబ సభ్యులంతా చలిని తట్టుకునేందుకు దుప్పట్లు కప్పుకుని, చేతిలో వేడి వేడి టీ కప్పులతో టీవీ ముందుకు చేరేవారు. దూరదర్శన్‌లో వచ్చే రిపబ్లిక్ డే ప్రసారాలను చూసేందుకు ఎంతో ఉత్పాహం చూపించేవారు.దూరదర్శన్ రిపబ్లిక్ డే ప్రసారాలకు ఒక ప్రత్యేకమైన నేపథ్య సంగీతం ఉండేది. వ్యాఖ్యాతల గంభీరమైన గొంతు, రాజ్‌పథ్ దృశ్యాలు మనసులో దేశభక్తిని నింపేవి. సైనికుల కవాతును పిల్లలు ఆశ్చర్యంగా చూస్తుంటే, శకటాల గురించి తల్లిదండ్రులు చర్చించుకునేవారు. తాతయ్యలు, నాయనమ్మలు గత స్మృతులను నెమరువేసుకునేవారు. కెమెరా చూపించే ప్రతి కోణం, ప్రతి క్షణం ఎంతో ముఖ్యమైనదిగా భావించేవారు. రాష్ట్రపతి సెల్యూట్ నుంచి చివరిలో యుద్ధ విమానాల విన్యాసాల వరకు, కుటుంబం మొత్తం ఆ కార్యక్రమాలనన్నింటినీ కన్నార్పకుండా చూసేది.నాటి పాఠశాల విద్యార్థులకు రిపబ్లిక్ డే అంటే రెట్టింపు ఉత్సాహం వచ్చేది. బడికి వెళ్లే హడావిడి లేదు, హోంవర్క్ టెన్షన్ లేదు. కొంతమంది పిల్లలు ముందు రోజే స్కూల్ ఉత్సవాల్లో పాల్గొని ఉంటే, మరికొందరు నాటి సెలవును ఆస్వాదించేవారు. టీవీలో వచ్చే పరేడ్ తప్పనిసరిగా చూసేవారు. ఈ ప్రసారం ముగిశాక కొందరు జెండా వందనం కోసం బయటకు వెళ్తే, మరికొందరు ఇంట్లోనే ఉండి పిండివంటలు ఆరగించేవారు. ఆనాటి గణతంత్ర సంబరం ఆత్మీయత, అనుబంధాల మధ్య జరిగేది.ప్రతి ఒక్కరి చేతిలో తలొక ఫోను లేని ఆ రోజుల్లో, కుటుంబం మొత్తం ఒకే టీవీ సెట్ ముందు కూర్చునేది. వ్యక్తిగత స్క్రీన్లు లేవు, చెవులకు హెడ్ ఫోన్లు పెట్టుకుని ఎవరి లోకంలో వారు ఉండటాలు లేవు. నేడు రిపబ్లిక్ డేని మనం ఎంతో గొప్పగా జరుపుకుంటున్నా, ఆనాటి దూరదర్శన్ జ్ఞాపకాలు అందరి మదిలో చెరగని ముద్ర వేశాయి. ఒకే ఒక్క దూరదర్శన్ ప్రసారం కోట్లాది మందిని ఏకం చేసిన తరుణం అది. రిపబ్లిక్ డే అంటే కేవలం దేశభక్తి మాత్రమే కాదు, కుటుంబంతో గడిపే సంతోషకరమైన రోజు అని మనకు గుర్తుచేస్తుంది. ఇది కూడా చదవండి: గణతంత్ర వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్స్ ఇవే.. -
గణతంత్ర వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్స్ ఇవే..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో జరిగిన పరేడ్‌లో.. భారత్ తన రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచం ముందు ప్రదర్శించింది. ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణలు ఇలా..77వ గణతంత్ర దినోత్సవం: 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చిన చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని.. భారత్ 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది.ముఖ్య అతిథులు: ఈ ఏడాది యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.యుద్ధ స్మారకం వద్ద నివాళి: ప్రధాని నరేంద్ర మోదీ నేషనల్ వార్ మెమోరియల్‌ను సందర్శించి, దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు.రాష్ట్రపతి రాక: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ముఖ్య అతిథులతో కలిసి సంప్రదాయ 'రాష్ట్రపతి బగ్గీ'లో కర్తవ్య పథ్‌కు చేరుకున్నారు.జాతీయ జెండా ఆవిష్కరణ: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం, 21 గన్ సెల్యూట్‌తో గౌరవ వందనం సమర్పించారు.బ్రహ్మోస్ క్షిపణి ప్రదర్శన: పరేడ్‌లో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.అపాచీ హెలికాప్టర్ల గర్జన: గగనతలంలో అపాచీ హెలికాప్టర్లు తమ విన్యాసాలతో వీక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.ధనుష్ గన్ సిస్టమ్: భారత సైన్యానికి వెన్నెముకగా నిలిచే ధనుష్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ పరేడ్‌లో భాగస్వామ్యం వహించింది.అశోక చక్ర ప్రదానం: అంతరిక్ష యాత్రికుడు గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాకు దేశ అత్యున్నత పురస్కారం ‘అశోక చక్ర’ను రాష్ట్రపతి ప్రదానం చేశారు.యూరోపియన్ యూనియన్ బృందం: తొలిసారిగా ఈ పరేడ్‌లో యూరోపియన్ యూనియన్ (EU) మిలిటరీ బృందం పాల్గొని గౌరవ వందనం సమర్పించింది.ఆపరేషన్ సింధూర్ : ఇటీవల వార్తల్లో నిలిచిన ‘ఆపరేషన్ సింధూర్’ ఇతివృత్తంతో రూపొందించిన శకటం ప్రత్యేక గుర్తింపు పొందింది.61వ కావల్రీ: ప్రపంచంలోనే ఏకైక క్రియాశీల గుర్రపు దళం అయిన '61వ కావల్రీ' పరేడ్‌లో తన రాజసాన్ని ప్రదర్శించింది.వందేమాతరం థీమ్: ఈ ఏడాది పరేడ్ ‘వందేమాతరం - 150 ఏళ్లు’ అనే ప్రత్యేక థీమ్‌తో సాగింది.రాష్ట్రాల శకటాలు: దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తూ 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, మరో 13 వివిధ మంత్రిత్వ శాఖల శకటాలు ప్రదర్శనలో నిలిచాయి.వికసిత్ భారత్ 2047: 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న లక్ష్యంతో వేడుకలు జరిగాయి.కర్నల్ సోఫియా ఖురేషీకి గౌరవం: ఆపరేషన్ సింధూర్‌లో కీలక పాత్ర పోషించిన కర్నల్ సోఫియా ఖురేషీకి ‘విశిష్ట సేవా మెడల్’ ప్రకటించారు.పద్మ అవార్డుల ప్రకటన: గణతంత్ర వేడుకల సందర్భంగా 131 మందికి పద్మ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది.ట్రాఫిక్ ఆంక్షలు: పరేడ్ నేపథ్యంలో ఢిల్లీ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.లైవ్ స్ట్రీమింగ్: దేశ ప్రజలందరూ వీక్షించేలా దూరదర్శన్, యూట్యూబ్ ఛానళ్లలో వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేశారు.ఇది కూడా చదవండి: మావోయిస్టు కోటలో మొదటిసారి మువ్వన్నెల రెపరెపలు -
హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో గణతంత్ర వేడుకలు
-
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, మురుగుడు హనుమంతరావు తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. దేశానికి స్వతంత్రం కోసం ఎంతోమంది మహానుభావులు ప్రాణత్యాగం చేశారన్నారు. అంబేద్కర్ తలపెట్టిన ఆశయాలకు అనుగుణంగా అందరూ పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ‘‘అంబేద్కర్ స్ఫూర్తికి ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయి. స్వార్థం, అవినీతితో ప్రభుత్వాలు పాలన చేస్తున్నాయి. రాష్ట్రం ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలకు వ్యతిరేకంగా పని చేస్తోంది’’ అని బొత్స పేర్కొన్నారు.వైఎస్సార్ ఆశయ సాధనకు జగన్ కృషి చేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. ప్రతిపక్షంగా ప్రజల కోసం వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది. పేద ప్రజల శ్రేయస్సు కోసం పని చేయాలన్నది పార్టీ అధినేత జగన్ నిర్ణయం. ఆ మేరకు కేడర్ పని చేయాలి’’ అని బొత్స పిలుపునిచ్చారు. -
తెలంగాణలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో గణతంత్ర దినోత్స వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. గవర్నర్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వాగతం పలికారు. జాతీయజెండాను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆవిష్కరించారు. ముందుగా అమర వీరుల స్తూపం వద్ద గవర్నర్ నివాళులర్పించారు. ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్, డీజీపీ, మంత్రులు పాల్గొన్నారు.గవర్నర్ ప్రసంగిస్తూ.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్రం అనంతరం 1950 జనవరి 26 నుంచి మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని.. అప్పటి నుంచి భారత్ ఒక గణతంత్ర దేశంగా అవతరించిందన్నారు. ఆ చారిత్రాత్మక క్షణం నుంచే రాజ్యాంగం దేశానికి మార్గ నిర్దేశం చేస్తోందన్న గవర్నర్.. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే మూల సూత్రాలతో దేశాన్ని నడిపిస్తోందన్నారు.‘‘గణతంత్ర దినోత్సవం కేవలం పండుగ మాత్రమే కాదు... మన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం, రాజ్యాంగ విలువలను కాపాడటం, సుసంపన్నమైన మన వైవిధ్యంలో ఐక్యతను సాధించాలనే మన గురుతర బాధ్యతను గుర్తు చేసే పవిత్ర దినం. ఇది భారత ఆత్మను ప్రతిబింబించే జాతీయ పండుగ...మన రాజ్యాంగ నిర్మాణానికి ప్రజాస్వామ్యమే పునాది. ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజల ద్వారా పాలనను అందించడానికి ఇది మార్గ నిర్దేశం చేస్తుంది. ఈ పవిత్ర దినాన... న్యాయం, సమానత్వం, సోదరభావం వంటి విలువలను మరింత పరిరక్షించడానికి పునరంకితమవుతూ ముందుకు సాగాలి. ఇవే ఒక బలమైన దేశానికి మూల స్థంభాలు...సీఎం రేవంత్ నాయకత్వంలో రెండేళ్ల క్రితం ఏర్పడిన ప్రజా ప్రభుత్వం.. గణనీయమైన విజయాలను సాధించి ప్రజల విశ్వాసాన్ని, ప్రశంసలను సంపాదించింది. రెండు సంవత్సరాల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ విజన్–2047’ అనే దార్శనిక పత్రాన్ని ఆవిష్కరించింది. దీని ద్వారా ప్రభుత్వం సమగ్ర, సమానమైన, సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించింది...వికసిత్ భారత్’ ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. అదే క్రమంలో తెలంగాణ రాష్ట్రం కూడా 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న మహత్తర లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. ఈ లక్ష్య సాధనకే తెలంగాణ రైజింగ్ - 2047 దార్శనిక పత్రాన్ని రూపొందించింది. గత డిసెంబరులో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో ప్రపంచ ప్రతినిధుల మధ్య ప్రభుత్వం ఈ దార్శనిక పత్రాన్ని ఆవిష్కరించింది’’ అని గవర్నర్ వివరించారు.శాసనమండలిలో..తెలంగాణ శాసనమండలిలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిపారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. జాతీయ జెండాను ఎగుర వేశారు. డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, వాణి దేవి, తక్కెళపెళ్ళి రవిందర్ రావు, అంజిరెడ్డి, మల్కాకొమురయ్య , శ్రీపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.అసెంబ్లీలో..అసెంబ్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు హాజరయ్యారు. -
టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ బర్త్ డే పార్టీలో సెలబ్రిటీల సందడి (ఫోటోలు)
-
వీకే నరేశ్ బర్త్ డే సెలబ్రేషన్స్.. స్పెషల్ అట్రాక్షన్‌గా పవిత్రా లోకేశ్.. వీడియో వైరల్
టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ ఇటీవలే నారీ నారీ నడుమ మురారి సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. సంక్రాంతికి రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత శుభకృత నామ సంవత్సరం అనే కన్నడ చిత్రంలో నటిస్తున్నారు వీకే నరేశ్. వరుస చిత్రాలతో ఫుల్ బిజీ అయిపోయారు.అయితే ఇటీవలే తన 54న పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు వీకే నరేశ్. ఈ బర్త్ డే వేడుకల్లో టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. హీరో శర్వానంద్, రవిబాబు, నారా రోహిత్, జయసుధ లాంటి పలువురు సినీతారలు హాజరయ్యారు. ఈ వేడుకలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూస్తుంటే ఫుల్ గ్రాండ్‌గా బర్త్ డే వేడుక జరిగినట్లు తెలుస్తోంది.స్పెషల్ అట్రాక్షన్‌గా పవిత్రా లోకేశ్..అయితే ఈ బర్త్ డే వేడుకల్లో నటి పవిత్రా లోకేశ్ స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించింది. వేదికపైనే నరేశ్‌తో పాటు ఈ వేడుకల్లో పాల్గొన్నారామె. ఈ సందర్భంగా వీరిద్దరిని గజమాలతో సత్కరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Grand 54th birthday celebrations of @ItsActorNaresh garu pic.twitter.com/nlwSwEx4Gs— H A N U (@HanuNews) January 22, 2026 -
సుకుమార్ కుమార్తె బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
-
కోడిని కోస్తే తప్పు అన్నారు.. ఏకంగా రికార్డింగ్ డాన్సులే పెట్టారు
-
హీరోయిన్ సంఘవి కూతురి బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
‘నారీ నారీ నడుమ మురారి’ సక్సెస్ సెలెబ్రేషన్స్ (ఫోటోలు)
-
సంక్రాంతి అంటే జూదం, అశ్లీల నృత్యాలుగా మార్చేశారు
-
భోగి మంటల్లో బాబుగారి జీవో.. చిత్రాలు
-
శిల్పారామంలో సంక్రాంతి సంబరాల సందడి (ఫొటోలు)
-
కత్రినా కైఫ్ చెల్లిని ఎప్పుడైనా చూశారా? (ఫొటోలు)
-
భర్తతో సమంత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. వీడియో వైరల్
టాలీవుడ్ హీరోయిన్ సమంత గతేడాది రెండోసారి పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఏడడుగులు వేసింది. వీరిద్దరు కలిసి ది ఫ్యామిలీ మ్యాన్, సిటాడెల్ వెబ్ సిరీస్‌ల్లో కలిసి పనిచేశారు. ఆ పరిచయమే వీరిద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది. కొన్నేళ్లుగా వీరిపై రూమర్స్ వస్తున్నా పట్టించుకోలేదు. చివరికీ ఇద్దరు పెళ్లి చేసుకుని ఆ రూమర్స్‌ను నిజం చేశారు.తాజాగా ఈ నూతన జంట న్యూ ఇయర్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సమంతతో కలిసి ఆమె భర్త రాజ్ నిడిమోరు కొత్త ఏడాదికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఈ వీడియో సామ్ నవ్వుతూ సంతోషంగా కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్, అభిమానులు సమంతకు న్యూ ఇయర్ విషెస్ చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా..సమంత- రాజ్ కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో లింగ భైరవి సన్నిధిలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. Unplanned moments will be one of those nights where boundaries quietly disappeared ❤️😍Samantha with her husband and frnds at a celebration 😍 Happy New Year🔥#Samantha pic.twitter.com/ykKy16Gre3— Dhruv Arjun (@Dhruv_Arjunan) January 1, 2026 -
800 KG కేక్ కట్టింగ్.. జగన్ ఆశీస్సులతో మనదే విజయం
-
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
తిరుమలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు..
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని మంగళవారం తిరుమలలో స్వర్ణరథోత్సవం కన్నుల పండువగా సాగింది. ఉదయం 9 నుంచి 10.30 గంటల నడుమ శ్రీవారి రథరంగ డోలోత్సవాన్ని పురమాడ వీధుల్లో నేత్రపర్వంగా నిర్వహించారు. నేడు బధవారం వైకుంఠ ద్వాదశి కావడంతో ఉదయం శ్రీవారి పుష్కరిణిలో అర్చకులు సంప్రదాయబద్ధంగా చక్రస్నానం నిర్వహించారు. ఈ సందర్భంగా పుష్కరిణి పరిసరాలు భక్తులతో నిండిపోయాయి.వైకుంఠ ఏకాదశి సందర్భంగా పరిమిత సంఖ్యలోనే వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం కల్పించామని టీటీడీ అధికారులు తెలిపారు. మొత్తం పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతాయని, ఇప్పటికే వైకుంఠ ద్వార దర్శన టికెట్లు కలిగిన భక్తులకు మాత్రమే రేపటి వరకు దర్శనం ఉంటుందని వెల్లడించారు. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు సర్వదర్శనంలో భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ ప్రకటించింది.వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.అలిపిరి మెట్ల మార్గం ద్వారా లక్కీడిప్‌లో టికెట్ పొందిన భక్తులు మెట్టు మెట్టుకు పూజలు చేస్తూ భక్తిశ్రద్ధలతో తిరుమలకు చేరుకుంటున్నారు. తిరుపతితో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లోనూ ఉత్తర ద్వారం గుండా స్వామివారి దర్శనానికి భక్తులు కిటకిటలాడుతున్నారు.వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న భక్తులు: 67,053నిన్న తలనీలాలు సమర్పించిన భక్తులు: 16,301వైకుంఠ ఏకాదశి హుండీ ఆదాయం: ₹2.25 కోట్లు -
ఈవినింగ్ చిల్ అయిపోతున్న సుప్రీత (ఫొటోలు)
-
బిగ్‌బాస్ శివజ్యోతి మరోసారి బేబీ షవర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
‘శంబాల’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
క్రిస్మస్ కాంతులు.. భిన్నస్వరాలు!
ప్రేమ, శాంతి, దయ అనే సార్వత్రిక విలువలు ప్రతిబింబించేది క్రిస్మస్ పండుగ. అందుకే ప్రపంచవ్యాప్తంగా.. అన్నిమతాల వాళ్లు ఈ పండుగను గౌరవిస్తారు. భారత్‌లోనూ క్రిస్మస్ వెలుగులు విరజిమ్ముతున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ మొదలు.. సినీ, రాజకీయ ఇతర రంగాల ప్రముఖులు వేడుకల్లో పాల్గొంటున్నారు. ఇక క్రిస్మస్ ట్రీలు, బహుమతులు, కేక్‌ల హడావిడి.. చాలా ఇళ్లలో కనిపిస్తోంది. అదే సమయంలో.. కొన్నిచోట్ల అసాధారణ దృశ్యాలు కనిపించాయి. ఒకవైపు శాంటాక్లాజ్ వేషధారణలో క్రైస్తవులు ర్యాలీగా వెళ్తున్నారు. అదే సమయంలో.. వాళ్లకు అనుకోని దృశ్యం తారసపడింది. కేరళ సంప్రదాయ వాయిద్యం చండా వాయిస్తూ ఆ ఎదురు రోడ్డులో మరో ఊరేగింపు వచ్చింది. పైగా శాంటాక్లాజ్ టోపీలతో చండా బృందం సంప్రదాయ పంచెకట్టులో కనిపించింది. అది చూసి అవతలివాళ్లలో కొందరు నిర్ఘాంతపోగా.. మరికొందరు మాత్రం ఆ వైబ్కు ఊగిపోతూ కనిపించారు. May Christmas bring renewed hope, warmth and a shared commitment to kindness.Here are highlights from the Christmas morning service at The Cathedral Church of the Redemption. pic.twitter.com/BzvKYQ8N0H— Narendra Modi (@narendramodi) December 25, 2025During a Christmas procession, Chande Vadya used by players wearing traditional Panche & Shallya!Looks like converts won’t stop until they convert Jesus to Hinduism😭😭😭 pic.twitter.com/5KD2dZ0UBQ— Sree Harsha (@AapathBandhava) December 24, 2025మరో ఘటనలో.. అస్సాం పినాగావ్ నల్బరి ఏరియాలో హిందూ సంఘాల ఓ క్రిస్టియన్ స్కూల్లోకి చొరబడి.. అక్కడి క్రిస్మస్ వేడుకల సామాగ్రిని తగలబెట్టారు. ఆ సమయంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు జై శ్రీరామ్.. జై హిందూ రాష్ట్ర నినాదాలు చేశారు. On Christmas Eve, Vishva Hindu Parishad and Bajrang Dal goons entered St. Mary’s School in Panigaon, Nalbari, chanting slogans like “Jai Shri Ram” and “Jai Hindu Rashtra.” They destroyed and set fire to all Christmas decorations prepared at the school. pic.twitter.com/LQHV7FWUvz— Mohammed Zubair (@zoo_bear) December 24, 2025This is why @RahulGandhi said to BJP You can never rule TamilNadu 🔥 pic.twitter.com/WXyqyzjrCy— BAKWAS FELLOW (@bakwasfellow) December 24, 2025స్వామి వివేకానంద బాటలోనే.. బేలూరు రామకృష్ణ మఠం నిర్వహకులు పయనిస్తున్నారు. ప్రతీ ఏడులాగే.. ఈసారి క్రిస్మస్కు జీషూ పూజ నిర్వహించారు. Every Xmas Eve Jishu Puja is organised by the monks of Ramakrishna Mission at Belur & at all their missions the world over in memory of Swami Vivekananda who celebrated it! Peace and Joy from the city of Joy to you all!pic.twitter.com/qTsYm2z1d5 ప్రపంచమంతా ప్రశాంతంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహించుకుంటోంది. అయితే పైన చెప్పుకున్న దృశ్యాలు కలిసినప్పుడు మనకు కనిపించేది భిన్నత్వంలో ఏకత్వం. ఇదే కదా మన భారతం..! pic.twitter.com/SqZomQJSeg— Codex_Indîa (@Codex_India6) December 24, 2025 -
ఐర్లాండ్ లో వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలు
-
పార్వతీపురంలో YS జగన్ పుట్టినరోజు వేడుకలు
-
జీడీ నెల్లూరులో ఘనంగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
-
అద్దంకిలో YS జగన్ పుట్టినరోజు వేడుకలు
-
ఒకరోజు ముందే ఏపీ వ్యాప్తంగా సంబరాలు
-
హైదరాబాదులో ఘనంగా YSRCP అధినేత YS జగన్ జన్మదిన వేడుకలు
-
జగన్ హయాంలోనే అభివృద్ధి.. ఆ రెండేళ్లు కోవిడ్ లేకపోతే ఏపీ పరిస్థితి మరోలా ఉండేది
-
గోదావరి నడి మధ్యలో.. జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు
-
మెల్బోర్న్లో YS జగన్ జన్మదిన వేడుకలు
-
కువైట్ లో ఘనంగా YS జగన్ బర్త్ డే వేడుకలు
-
మురిపిస్తున్న ముగింపు!
డిసెంబర్ చివరి వారం వచ్చిందంటే చాలు.. ప్రపంచమంతా కొత్త ఉత్సాహం నిండుకుంటుంది. క్యాలెండర్ మారుతున్న వేళ, పాత జ్ఞాపకాలకు వీడ్కోలు చెబుతూ కొత్త ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికే ఈ సమయం కేవలం వేడుకలకే పరిమితం కాదు; ఇది ఒక భారీ ఆర్థిక చక్రానికి ఎనర్జీగా ఉంటుంది. నగరాల్లోని పబ్ కల్చర్ నుంచి గ్రామాల్లోని సెలబ్రేషన్స్ వరకు.. ఇయర్ ఎండింగ్ అనేది కోట్లాది రూపాయల వాణిజ్యానికి వేదికగా మారుతోంది.డిసెంబర్ 31 రాత్రి.. గడియారం ముల్లు 12 గంటలు దాటకముందే దేశవ్యాప్తంగా వ్యాపార సంస్థల గల్లా పెట్టెలు నిండిపోతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి భారత్‌లో పండుగ సీజన్, ఇయర్ ఎండింగ్ ఖర్చులు సుమారు 32% పెరిగాయని మార్కెట్ విశ్లేషణలు చెబుతున్నాయి. విశేషమేమిటంటే కేవలం మెట్రో నగరాలకే పరిమితమైన ఈవెంట్ కల్చర్ ఇప్పుడు ద్వితీయ శ్రేణి నగరాలకు, పల్లెటూళ్లకు కూడా పాకింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. డిసెంబర్ ముగింపు అంటే ఒక వేడుక కాదు, అదొక భారీ వాణిజ్య జాతర!నగరాల్లో ఈవెంట్లు - కార్పొరేట్ వాణిజ్యంనగరాల్లో ఇయర్ ఎండింగ్ అంటేనే విలాసవంతమైన పార్టీలు, మ్యూజిక్ కాన్సర్ట్‌లు, స్టే-కేషన్లు(స్టేయింగ్+వెకేషన్స్ Staycations). ఇక్కడ వాణిజ్యం ప్రధానంగా వివిధ రంగాల్లో కేంద్రీకృతమై ఉంటుంది.హోటళ్లు, పబ్‌లు, రిసార్ట్లు ఒక నెల ముందే బుకింగ్‌లు ప్రారంభిస్తాయి. ఒక్కో ఎంట్రీ టికెట్ ధర సుమారు రూ.2,000 నుంచి రూ.20,000 అంత కంటే ఎక్కువే పలుకుతుంది. డీజేలు, డ్యాన్సర్లు, లైటింగ్ డెకరేటర్లకు ఈ సమయంలో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. నగరవాసులు ఇయర్ ఎండింగ్ కోసం గోవా, పాండిచ్చేరి, కేరళ.. వంటి పర్యాటక ప్రాంతాలకు వెళ్లడం వల్ల ట్రావెల్ ఏజెన్సీలు, విమానయాన సంస్థలు లాభాలను ఆర్జిస్తాయి. బట్టలు, గాడ్జెట్లు, కానుకల అమ్మకాలు పెరగనున్నాయి. ఇయర్ ఎండింగ్ సేల్ పేరుతో షాపింగ్ మాల్స్ ఇచ్చే ఆఫర్లు మధ్యతరగతి వినియోగదారులను ఆకర్షిస్తాయి.ఇదీ చదవండి: పార్లమెంట్లో ‘శాంతి’ బిల్లుకు ఆమోదం! -
ఆ గుడిలో వెలగపండే ప్రసాదం!
డిసెంబరు నెలలో తొలి పున్నమి వచ్చిందంటే చాలు.. గూడచి వీరభద్రస్వామి ఆలయ ప్రాంగణంలో వెలగపండ్లు రాశులు పోసి కనిపిస్తాయి. దైవ దర్శనం పూర్తి చేస్తున్న భక్తులందరూ ఈ రాశుల వద్దకు చేరి డజన్లకు డజన్లు కొనుగోలు చేస్తూ కనిపిస్తారు. ఎందుకంటే కర్ణాటకలోని బెళగావి జిల్లా, రామదుర్గ తాలూలోని గూడచి వీరభద్రేశ్వర స్వామి జాతరకు హాజరైన వారందరూ స్వామివారి ప్రసాదంలా వెలగపండ్లు ఇళ్లకు తీసుకెళ్లడం వాడుక. అనాది కాలపు సంప్రదాయం. పౌర్ణమితో మొదలై ఐదు రోజులపాటు వైభవంగా జరిగే ఈ జాతరలో బెళగావితోపాటు పొరుగునే ఉన్న బాగల్‌కోట, విజయపుర, హావేరి జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తూంటారు. జాతర ఐదవ రోజున ఆలయంలో జరిగే లక్ష దీపోత్సవం ఒక హైలైట్. సాంప్రదాయికంగా ఈ జాతర జరిగేది ఐదు రోజులే అయినప్పటికీ పౌర్ణమి నుంచి తరువాతి అమావాస్య వరకూ భక్తుల రాకపోకలు జోరుగానే సాగుతూంటాయి. వచ్చిన వారిలో అత్యధికులు వెలగపండ్లను ప్రసాదంగా తీసుకెళ్లడమూ కద్దు. మనమంటే వెలగపండ్లు అని పిలుస్తున్నాం కూడా కర్ణాటకలో దీనికి బోలెడన్ని పేర్లు. బేల, బలవత్తే, దంతశఠ, కపిత్థ అన్న పేర్లు వాడుకలో ఉన్నాయి ఈ ప్రాంతంలో. శాస్త్రీయ నామం లిమోనియా అసిడిసిమా. ఇంగ్లీషులో ‘వుడ్ ఆపిల్’. వీరభద్రేశ్వర ఆలయమున్న రామదుర్గ ప్రాంతంలో బళువల అని పిలుస్తారు. ఈ పండ్లను తీసుకెళ్లడంతోనే జాతర పూర్తయినట్లు వీరి నమ్మకం. అందుకే ఈ జాతరకు వెలగపండ్ల జాతరని కూడా స్థానికులు పిలుస్తూంటారని ఈరణ్ణ కామన్నవర తెలిపారు. లారీల కొద్దీ పంట..వీరభద్రేశ్వర స్వామి ఆలయ జాతరకు లారీల కొద్దీ వెలగపండ్లు వస్తూంటాయి. ఈ ఏడాది సుమారు 15 లారీల వరకూ పండ్లు వచ్చినట్లు సమాచారం. ఏటా సుమారు యాభై మంది వరకూ వ్యాపారులు ఇక్కడ వెలగపండ్ల విక్రయాలు సాగిస్తూంటారు. వీటిని రాశులుగా పోసుకుని అమ్ముకునేందుకు, భక్తుల అవసరాల కోసం గ్రామపంచాయతీ, జాతర కమిటీలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి. జాతరకు వచ్చిన ఒక్కో కుటుంబం కనీసం ఐదారు డజన్ల వెలగపండ్లను ఖరీదు చేస్తాయని వ్యాపారి ద్యామణ్ణ నాగప్ప అమరగోళ తెలిపారు. మరి అన్ని పండ్లు ఏం చేసుకుంటారని ప్రశ్నిస్తే.. ఊళ్లో బంధు మిత్రులకు జాతర ప్రసాదంగా పంచుతారని సమాధానమిచ్చారు ఆయన. వెలగపండ్ల గుజ్జుకు బెల్లం కలిపి ఒక్కరోజు వదిలి తింటే ఆ రుచి అద్భుతం అని మనలో చాలామందికి తెలుసుకదా? ప్రసాదంగా పొందిన వారందరూ అంత మధురానుభూతి పొందాలన్నది ఈ సంప్రదాయం ఉద్దేశమేమో?ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. రామదుర్గం తాలూకాలో వెలగపండ్లు అందుబాటులో ఉండటం తక్కువ కావడం. హావేరీ, శిగ్గావి, హానగల్, గోందీ, అనవట్టి వంటి ప్రాంతాల్లో దొరికే పండ్లను వ్యాపారలు ఇక్కడకు తీసుకొస్తూంటారు. ఎప్పుడో 12వ శతాబ్ధంలో మడివాళ మాచప్ప శరణరు సందర్శించిన సందర్భంలో ఇక్కడి ప్రజలు ఎక్కువ మంది రోగాలపాలై ఉన్నారట. పోషకాలతో నిండిన వెలగపండ్లు తింటే మేలు జరుగుతుందని చెబితే ప్రజలు పట్టించుకోరని.. వీరభద్రేశ్వర ఆలయం.. జాతర వంటి ఏర్పాట్లు చేశారని ప్రతీతి. ప్రసాదంగా ఈ వెలగపండ్లు పంచడం కూడా అప్పుడే మొదలైందని చెబుతారు. అయితే ఈ కథకు సంబంధించి ఎక్కడ రాతపూర్వక ఆనవాళ్లయితే లేవు. పోషకాల పుట్ట...వాస్తవానికి వెలగపండ్లు పోషకాల పుట్ట. తీపి, పులుపు రుచులతో ఉండే ఈ పండులో విటమిన్-సీ, పొటాషియం, ఫాస్పరస్ తదితర పోషకాలు మెండుగా ఉంటాయి. పలు రకాల ఆరోగ్య సమస్యలకు మందుగా పనిచేస్తుందని అంచనా. అంటే.. దైవ ప్రసాదం మంచి రుచిని మాత్రమే కాదు. ఆరోగ్యాన్నీ ఇస్తోందన్నమాట.- గానధళు శ్రీకంఠ, ప్రజావాణి సౌజన్యంతో -
పెళ్లయి 15 ఏళ్లు.. 'మన్మథుడు' హీరోయిన్ పార్టీ మూడ్ (ఫొటోలు)
-
ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా! గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ సంబరాలు
-
బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఏపీలో సందడి సందడిగా వనభోజనాలు (ఫొటోలు)
-
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో భక్త కనకదాసు జయంతి వేడుకలు
సాక్షి, తాడేపల్లి: సాహిత్యంతో సామాజిక విప్లవం సాధించవచ్చని నిరూపించిన మహానుభావుడు భక్త కనకదాసు అని కురుబ సంఘం నాయకులు కీర్తించారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో భక్త కనకదాసు 538వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయ ఇన్చార్జి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీ కురుబ కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం రామకృష్ణతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి వచ్చిన కురుబ నాయకులు పాల్గొన్నారు.భక్త కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం పుష్పాంజలి ఘటించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఆదేశాలతో భక్త కనకదాసు జయంతి వేడుకలను పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కార్యాలయాల్లో నిర్వహిస్తున్నందుకు వారు ధన్యవాదాలు తెలియజేశారు.భక్త కనకదాసు స్ఫూర్తితోనే మాజీ సీఎం వైయస్ జగన్ సామాజిక అంతరాలు తొలగించేలా పాలన అందించారని కొనియాడారు. వెనుకబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు రాజకీయ పదవులు ఇచ్చి ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక భక్త కనకదాసు విగ్రహంతో పాటు ఆయన పేరుతో సామాజిక భవనం ఏర్పాటు చేయాలని కురుబ సోదరులు కోరగా ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ దృష్టికి తప్పకుండా తీసుకెళ్తానని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వారికి హామీ ఇచ్చారు. గడ్డం రామకృష్ణ మాట్లాడుతూ.. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశాలతో భక్త కనకదాసు 538వ జయంతి వేడుకలు పార్టీ కేంద్ర కార్యాలయంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కార్యాలయాల్లో నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉంది. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ భక్త కనకదాసు జయంతి వేడుకలు నిర్వహించబోతున్నాం. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ.. ప్రముఖ రచయిత, కవి, ఆధ్యాత్మిక వేత్త భక్త కనకదాసు కుల దురహంకారంపై సాహిత్యమనే ఆయుధంతో పోరాడి సామాజిక విప్లవం తీసుకొచ్చారు. భక్త కనకదాసు స్ఫూర్తితోనే మాజీ సీఎం వైయస్ జగన్ సైతం కులదురహంకారంపై పోరాడి తన పాలన ద్వారా వెనుకబడిన వర్గాలకు అండగా నిలిచారు. కులాల మధ్య అంతరాలు తొలగించడానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను రాజకీయంగా ప్రోత్సహించారు. పార్టీ, ప్రభుత్వంలో ఉన్నత పదవులు కల్పించి ముందుకు నడిపించారు.ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. సాహిత్యంతో సామాజిక విప్లవం సాధించవచ్చని నిరూపించిన మహానుభావుడు శ్రీ భక్త కనకదాసు. కురుబ గౌడ దాస సమాజానికి ఆరాధ్య ధైవంగా నిలిచారు. పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ ఆదేశాలతో శ్రీకృష్ణ భగవానుడికి గొప్ప భక్తుడైన శ్రీ భక్త కనకదాసు జయంతి వేడుకలను పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించడం జరుగుతోంది. రానున్న రోజుల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక భక్త కనకదాసు విగ్రహం ఏర్పాటుతో పాటు భవన నిర్మాణం చేయాలని కురుబ సోదరులు కోరుతున్నారు. ఈ విషయాన్ని ఖచ్చితంగా పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ దృష్టికి తీసుకెళతానని హామీ ఇస్తున్నాను. భక్త కనకదాసు స్ఫూర్తితో మాజీ సీఎం వైయస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో వెనుకబడిన వర్గాల ఉన్నతికి ఎంతగానో కృషిచేశారు. రాజకీయంగా అవకాశాలు కల్పించి అండగా నిలిచారు. రానున్న రోజుల్లోనూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తోందని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి స్పష్టం చేశారు. -
వేయి స్తంభాల దేవాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు (ఫోటోలు)
-
బాలీవుడ్ ముద్దుగుమ్మ ఖుషీ కపూర్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫోటోలు
-
హీరోయిన్ ప్రియా వారియర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
-
నిర్మాత దిల్‌రాజు ఇంట్లో పెళ్లి సందడి (ఫొటోలు)
-
బిగ్‌బాస్ ఆదిరెడ్డి కూతురి బర్త్ డే సెలబ్రేషన్స్... (ఫోటోలు)
-
నా బిడ్డ పుట్టి పదేళ్లు.. యాంకర్ రవి ఎమోషనల్ (ఫోటోలు)
-
హీరోయిన్ అమలాపాల్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఐటమ్ బ్యూటీ మలైకా 50వ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
మనవరాలితో పోటీ : సీనియర్ నేత దివాలీ సెలబ్రేషన్స్
అనంతపురం జిల్లాకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి డా. ఎన్ రఘువీరారెడ్డి ఈ దీపావళిని అందరికంటే భిన్నంగా జరుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది నెట్టింట అందర్నీ ఆకట్టు కుంటోంది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాజీ మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సహా కీలక బాధ్యతలు నిర్వర్తించిన డా. నీలకంఠం రఘువీరారెడ్డి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ, ప్రకృతిలో మమేకమై, వ్యవసాయాన్ని చేసుకుంటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపు తున్నారు. ఆయన ఫోటోలు బాగా వైరలయ్యాయి. రఘువీరారెడ్డి సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందుబాటులో ఉంటారు. తరచూ అనేక వీడియోలను పోస్ట్ చేస్తూ, పలువురికి ప్రేరణగా నిలుస్తూ ఉంటారు. అంతేకాదు తనముద్దుల మనవరాలితో ఆనందంగా గడుపుతున్న విశేషాలను గతంలోనూ పంచుకున్నారు. అయితే దీపావళి సందర్భంగా మనవరాలితో చిన్నపిల్లాడిలా సంతోషంగా గడిపిన ఒక వీడియోను షేర్ చేశారు. దీపాల వెలుగులు, స్వీట్లతోపాటు మనవరాలితో సరదాగా ఆర్మ్ రెజ్లింగ్ మ్యాచ్‌తో ఈ దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నాను అని పోస్ట్ చేశారు.Celebrated Diwali with smiles, sweets, lights and a friendly Arm wrestling match with my granddaughter! 💪✨ pic.twitter.com/DegpdBQ6Oq— Dr. N Raghuveera Reddy (@drnraghuveera) October 22, 2025దీంతో చాలామంది అభిమానులు ఫిదా అవుతున్నారు. అదిరింది సార్...సర్ చిన్న పాప సార్ నొప్పి పుడుతుంది విజయాన్ని తనకే ఇచ్చేయండి సార్...మమ్మల్ని అందరినీ గెలుపు వైపు నడిపించినట్టుగానే.. పాపను కూడా గెలిపించండి అని కమెంట్ చేశారు. రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత మాకు రాజకీయాల్లో నచ్చిన వ్యక్తి మీరే.. మళ్లీ రాజకీయాల్లోకి రావాలి అంటూ మరొకరు వ్యాఖ్యానించారు. -
పిల్లలతో పటాసులు కాల్చిన కాజల్ అగర్వాల్ (ఫోటోలు)
-
రాజాసాబ్ బ్యూటీ దీపావళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
దీపావళి వేడుకల్లో బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య, దీపికా పిల్లి.. ఫోటోలు
-
టెక్సాస్ గవర్నర్ అధికార నివాసభవనంలోవైభవంగా దీపావళి వేడుకలు
డాలస్, టెక్సాస్: టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ , సిసిలీయా అబ్బాట్ దంపతులు రాష్ట్రంలోని కొంతమంది ప్రవాస భారతీయనాయకులను ఆహ్వానించి, తమ అధికార నివాసభవనంలో దీపావళి పండుగను ఘనంగా నిర్వహించారు. గత 11 సంవత్సరాలుగా ప్రతీ ఏడాదీ గవర్నర్ దంపతులు దీపావళి పండుగ జరుపుకోవడం విశేషం. గౌరవ గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ దంపతులు వివిధరంగాలలో విశేషంగా కృషి చేస్తూ, టెక్సస్ రాష్ట్ర శరవేగ అభివృద్ధికి తోడ్పడుతున్న ప్రవాస భారతీయులకు కృతజ్ఞతలతోపాటు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ వంటకాలతో దీపావళి విందు ఏర్పాట్లు చెయ్యడమేగాక అందరికీ దీపావళి కానుకలిచ్చి సత్కరించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అనురాగ్ జైన్ దంపతులు ఈ సంవత్సరపు దీపావళి వేడుక ఏర్పాట్లను సమన్వయపరచారు. గౌరవ కాన్సల్ జనరల్ ఆఫ్ ఇండియా డి.సి మంజునాథ్ దంపతులు, టెక్సస్ రాష్ట్ర కార్యదర్శి జేన్ నెల్సన్ లు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. టెక్సాస్ రాష్ట్రంలోని వివిధ నగరాలైన డాలస్, హూస్టన్, ఆస్టిన్, శాన్అంటానియో, కార్పస్ క్రిస్టీ, మిడ్‌ల్యాండ్, ఓడిస్సా మొదలైన నగరాలనుండి 100 మందికి పైగా పాల్గొన్న ప్రవాస భారతీయులలో ప్రవాసాంధ్రులైన డా. ప్రసాద్ తోటకూర, చిన సత్యం వీర్నపు, కుమార్ నందిగం, వెంకట్ ఏరుబండి, వెంకట్ గొట్టిపాటి, సతీష్ మండువ, నీలిమ గోనుగుంట్ల, ఆషా రెడ్డి, సుజిత్ ద్రాక్షారామ్, బంగార్ రెడ్డి, రాజ్ కళ్యాణ్ దుర్గ్ వారి కుటుంబ సభ్యులున్నారు.భారత అమెరికా దేశాలమధ్య సంభందాల బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తున్న టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ కు ప్రవాసభారతీయులందరి తరపున డా. ప్రసాద్ తోటకూర కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రవాసభారతీయుల ముఖ్యమైన అన్ని ఉత్సవాలకు హాజరయ్యే గవర్నర్ మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో డాలస్ లో జరిగిన మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలలో ముఖ్యఅతిథిగా హాజరైన సంఘటన గుర్తుచేసుకుని గవర్నర్ కు మరోసారి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు. -
దీపావళి వేడుకల్లో వైఎస్ జగన్ దంపతులు (ఫొటోలు)
-
మతాబులా వెలిగిపోతున్న భూమి పడ్నేకర్ ఫెస్టివ్ లుక్ చూశారా?
-
Diwali 2025: బిగ్‌బాస్ బ్యూటీల దీపావళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
దీపావళి పూట...శివాజీ కోట, పేడ దీపావళి, దివ్య దీపావళి!
భారతీయులందరూ అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఒకటి దీపావళి.మన మహర్షులు ఏర్పరచిన పండుగలన్నీ ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువలు కలిగి, ఆచార వ్యవహారాలతో కలిసి ఉంటాయి. ఈ పండుగల వెనుక అపారమైన శాస్త్రీయత, సమాజానికి హితకరమైన అంశాలు అనేకం దాగి ఉంటాయి. ఈనేపథ్యంలో వివిధ ప్రాంతాల్లోజరుపుకునే వేడుకల గురించి తెలుసుకుందాం.దీపావళి పూట...శివాజీ కోట! దీపావళి సీజన్లో మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో శివాజీ పాలించిన కోటకు ప్రతిరూపంగా మట్టికోటలను తయారుచేయడం అనేది ఆచారం. ఈ కోటను నిర్మించే క్రమంలో బురదలో విత్తనాలు నాటుతారు. కోట చుట్టూ పచ్చదనం ఉండేలా చేస్తారు. రాత్రివేళల్లో ఈ మట్టి కోటపై చిన్న చిన్న దీపాను వెలిగిస్తారు.జార్ఖండ్‌లో దీపావవళి పండగ సందర్భంగా సోహ్రై వేడుకను జరుపుకుంటారు.ఈ వేడుకలో భాగంగా దేవతలను స్వాగతించడానికి ఘరోండాలు(మట్టి బొమ్మల ఇళ్ళు) తయారు చేస్తారు. లక్ష్మీదేవిని స్వాగతించడానికి అగరువత్తులు కాల్చుతారు. సోహ్రై వేడుకలలో పశువులకు స్నానం చేయించి పూజలు చేస్తారు.పేడ పూసుకునివేడుక చేసుకుంటారు: కర్నాటక, తమిళనాడు సరిహద్దులలోని గుమతాపుర గ్రామంలో దీపావళి ముగింపును పురస్కరించుకొని ‘గోరెహబ్బ’ వేడుక జరుపుకుంటారు. ఈ వేడుకలో భాగంగా మగవాళ్లు ఆవు పేడను ఒకరిపై ఒకరు విసురుకుంటారు. ఆడవాళ్లు ఒంటికి రాసుకుంటారు. ఆవుపేడలో ఔషధగుణాలు ఉన్నాయనే నమ్మకంతో ఏర్పడిన శతాబ్దాల నాటి సంప్రదాయం ఇది.దీపావళి తరువాత పదిహేను రోజులకు వారణాసిలో దేవ దీపావళిని జరుపుకుంటారు. కార్తిక పూర్ణిమ రాత్రి గంగానది వెంబడి ఉన్న ఘాట్లు లక్షలాది దీపాలతో వెలుగుతాయి. ఆ వెలుగులప్రతిబింబాలు నదిలో అందమైన చిత్రాలను ఆవిష్కరిస్తాయి. గంగానదిలో స్నానం చేయడానికి దేవతలు భూమి మీదికి దిగి వచ్చిన రోజుగా ఈ రోజును జరుపుకుంటారు.ఈ సారి రికార్డ్ బ్రేక్ : గత సంవత్సరం అక్టోబర్‌లో అయోధ్యలో 25.12 లక్షల దీపాలను వెలిగించి ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సెట్ చేసింది. తాజాగా...28 లక్షల దీపాలను వెలిగించి తన రికార్డ్‌ను తానే బ్రేక్ చేయాలనుకుంటోంది. -
తెలుగు రాష్ట్రాల్లో దీపావళి సందడి.. బాణాసంచా దుకాణాల వద్ద ఫుల్ రష్ (ఫొటోలు)
-
కోట్లు విలువ చేసే దున్న.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
-
పిల్లలతో కలిసి సమంత దీపావళి సెలెబ్రేషన్స్ (ఫోటోలు)
-
'కె- ర్యాంప్' థాంక్స్ మీట్లో సందడిగా చిత్ర యూనిట్ (ఫోటోలు)
-
‘తెలుసు కదా’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
డిఫరెంట్‌గా బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్న టాలీవుడ్ బ్యూటీ (ఫోటోలు)
-
సారా టెండుల్కర్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఫారిన్లో అల్లు స్నేహా బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
-
హీరోయిన్ పూజా హెగ్డే బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
హీరో నితిన్ కొడుకు బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
గ్రాండ్‌గా జరిగిన జెనిత్ ఫెస్ట్ 2025 (ఫోటోలు)
-
కన్నుల పండువగా పైడితల్లి సిరిమానోత్సవం.. విజయనగరం జనసంద్రం (ఫొటోలు)
-
భర్తతో 'కూలీ' ఫేమ్ రెబా మోనిక.. మాలీవుడ్ సెలబ్రిటీలతో ఇలా (ఫొటోలు)
-
ఫ్యామిలీతో అనసూయ దసరా సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
పూలను చూస్తే పూనకాలే.. ఆట పాటలతో సద్గుల సంబరం..
-
భాగ్యనగరంలో బతుకమ్మతో పాటు గర్భా, దాండియా నృత్యాల సందడి
-
కొత్తమ్మకు చల్లదనం.... మురిసిన భక్తజనం!
కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి శతాబ్ది ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. ఈ నెల 23 నుంచి ఆరంభమైన ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు లక్షలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలు సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, హెలికాప్టర్ రైడ్ వంటి కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చివరి రోజున కమ్మకట్టు కుటుంబం ఇంటి వద్ద నుంచి అమ్మవారి జంగిడితో పాటు అధిక సంఖ్యలో మహిళలు ముర్రాటలు, ఘటాలతో ఆలయానికి చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. దారి పొడవునా కొత్తమ్మతల్లి నినాదాలతో కోట»ొమ్మాళి, పరిసర ప్రాంతాల్లో ఆధ్యాతి్మకత వెల్లివిరిసింది. ఊరేగింపులో పలువురు యువకులు కొట్లాటకు దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడికి పాల్పడ్డారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని చెదరగొట్టారు. అనంతరం పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. –టెక్కలి -
జాహ్నవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్..బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)
-
పార్టీలో మెరిసిన 90స్ సినీ తారలు (ఫొటోలు)
-
భాగ్యనగరంలో ఆటాపాటలతో వైభవంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)
-
సాక్షి ఆధ్వర్యంలో బడిలో బతుకమ్మ సంబురాలు (ఫొటోలు)
-
Delhi: 15 రోజుల పాటు ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలు.. రోజుకొక బహుమతి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టిన రోజు వేడుకలకు ఢిల్లీ ప్రభుత్వం భారీ ఎత్తున సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ 17న ప్రధాని మోదీ పుట్టినరోజు నుండి రాజధానిలో 15 రోజుల పాటు పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగనున్నాయి. త్యాగరాజు స్టేడియంలో జరిగే కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా 15 కీలక ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, మౌలిక సదుపాయాలు తదితర అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా, ఇతర మంత్రులు, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవాలు ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన సన్నాహాలను సమీక్షించారు. వేడుకలలో ఢిల్లీ పౌరులకు ప్రతిరోజూ కొత్త బహుమతిని అందించనున్నామని ప్రకటించారు. ఇవి ఢిల్లీ అభివృద్ధికి కొత్త ఊపునిస్తాయని, వీక్షిత్ ఢిల్లీ దార్శనికతను నెరవేర్చడంలో సహాయపడతాయని సీఎం రేఖా గుప్తా పేర్కొన్నారు. వీటిలో 101 ఆరోగ్య నిలయాలు, 150 డయాలసిస్ కేంద్రాలు, కొత్త హాస్పిటల్ బ్లాక్‌లు, అవయవ మార్పిడి, అవగాహన పోర్టల్ ప్రారంభం మొదలైనవి ఉండనున్నాయి.అలాగే ఢిల్లీ కంటోన్మెంట్‌లోని రాజ్‌పుతానా రైఫిల్స్ బేస్ సమీపంలో ఫుట్ ఓవర్‌బ్రిడ్జికి పునాది వేయడం, ఆటోమేటెడ్ మల్టీలెవల్ పార్కింగ్ వ్యవస్థలకు శ్రీకారం, గ్రీన్ ఎనర్జీ,పరిశుభ్రత విస్తరణ ప్రణాళికలు, నంగ్లీ సక్రవతిలో బయోగ్యాస్ ప్లాంట్, ఘోఘా డైరీలో బయోగ్యాస్ ప్లాంట్, యమునా యాక్షన్ ప్లాన్ అప్‌గ్రేడ్, మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టులు మొదలైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. నరేలాలో కొత్త అగ్నిమాపక కేంద్రం, మండోలి జైలు సమీపంలో రూ. 65 కోట్ల గ్రిడ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఆరోగ్య సంరక్షణ , పారిశుధ్యం, విద్య, రవాణా, పునరుత్పాదక ఇంధనం వరకు మొత్తం 75 ప్రాజెక్టులు, పథకాలను 15 రోజుల పాటు జరిగే ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలలో భాగంగా ప్రారంభించనున్నారు. -
వెళ్లి రావయ్యా.. బొజ్జ గణపయ్య.. హైదరాబాద్‌లో కోలాహలంగా నిమజ్జనాలు (ఫోటోలు)
-
టీచర్స్ డే.. ఆరోజులు మళ్ళీ రావు!
టీచర్ అంటే పాఠాలు చెప్పేవాడు కాదు, జీవితం ఎలా ఉండాలో చూపించే దారిదీపం.. ఇది ఇవాళ విపరీతంగా కనిపిస్తున్న ఓ కొటేషన్. వాట్సాప్‌లో స్టేటస్‌గా, ఇన్స్టాగ్రామ్ ఎడిటింగ్‌లతో తెగ వైరల్ అవుతోంది. డిజిటల్ యుగంలో టీచర్స్ డే సెలబ్రేషన్స్ మారిపోయిందనడానికి ఇదే ఒక రుజువు. కానీ.. నిజమైన టీచర్స్ డే సెలబ్రేషన్స్ ఎలా ఉండేవో మీకు తెలుసా?టీచర్స్ డే అంటే గుర్తొచ్చేది.. ఒకానొక టైంలో స్కూళ్లలో జరిగిన అద్భుతమైన వేడుకలు. టీచర్ల కోసం దాచుకున్న, పేరెంట్స్‌ను అడుక్కున్న సొమ్ముతో కొనే గిఫ్ట్‌లు, ఫేవరెట్ టీచర్ల కోసం స్పెషల్‌గా రాసి.. గీసి తీసుకొచ్చే గ్రీటింగ్స్, వాళ్ల కోసం కొని తెచ్చే గులాబీ పువ్వులు.. బొకేలు, శాలువాలు, చాకెట్లు.. అబ్బో మామూలు హడావిడి నడిచేది కాదు. మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.. బడి పిల్లలే టీచర్ల అవతారం ఎత్తి పాఠాలు బోధించడం గురించి. టీచర్స్ డే.. స్టూడెంట్స్ టీచర్లుగా మారి పాఠాలు చెప్పేవారు. అబ్బాయిలు ప్యాంట్షర్టులు.. పంచెలు, అమ్మాయిలు చీరలు, ప్రిన్సిపాల్ గెటప్‌కు సూట్ బూట్ స్పెషల్‌గా వచ్చేవాళ్లు. టీచర్లు హాయిగా విశ్రాంతి తీసుకుని.. నవ్వుతూ, ఆటలాడుతూ సందడిగా గడిపేవారు. విద్యార్థులు టీచర్ల వేషాలు వేసుకుని, బోధనలో తాము నేర్చుకున్నదాన్ని తిరిగి చూపించేవారు. ఆ సమయంలో టీచర్లనూ అనుకరించేవాళ్లు. అలా బడులలో ఒక పండుగ వాతావరణం కనిపించేది. అయితే ఈ ఒక్కరోజు మార్పు.. ఒక ఆట కాదు. గురుపూజోత్సవం ఉద్దేశం వేరు. గురువుల బాధ్యతను అర్థం చేసుకునే ప్రయత్నం. టీచర్ అంటే మనల్ని భయపెట్టే వ్యక్తి కాదు.. మనల్ని అర్థం చేసుకునే వ్యక్తి అని తెలియజేసేది. ఆ అనుభవం విద్యార్థుల్లో గౌరవం, కృతజ్ఞత, నైతికత పెంచేది. నేను చదివిన బడిలో నాలుగేళ్లపాటు టీచర్స్ డే రోజున.. ‘సార్’గా మారిపోయాను నేను. అందులో.. పదో తరగతి చదివే టైంలో మా క్లాస్ వాళ్లకే పాఠాలు చెప్పాల్సి రావడం నన్ను ఎంతో ఎగ్జయిట్ చేసింది. నీట్‌గా టక్ చేసుకుని.. సోషల్ బుక్ చేతిలో పట్టుకుని.. పైకి గంభీరంగా బిల్డప్ ఇచ్చినా, లోపల మాత్రం ఉప్పొంగే ఆనందంతో తరగతి గదిలో అడుగుపెట్టాను. సీరియస్‌గా పాఠం చెబుతూ.. మధ్యలో ప్రశ్నలు అడుగుతూ, చాక్‌పీస్ ముక్కలను వాళ్లపైకి విసురుతూ.. ఆన్సర్ చెప్పనివాళ్లకు పన్మిష్మెంట్ కూడా ఇస్తూ చేసిన ఓవరాక్షన్ అంతా ఇంత కాదు. ‘‘ఆగరా.. రేపు నీ పని చెప్తాం’’ అంటూ నా ఫ్రెండ్స్ నావైపు చూసిన గుర్రుచూపు ఇప్పటికీ నాకు గుర్తు. అరేయ్.. నిజంగా టీచర్లా చేస్తున్నావ్ కదరా అంటూ మా హెడ్ మాస్టర్, టీచర్లు ఇచ్చిన కాంప్లిమెంట్లు, ఆరోజు సాయంత్రం నాకు బెస్ట్ టీచర్‌గా ఇచ్చిన షీల్డ్.. ఏనాటికి మరిచిపోలేను. నాకే కాదు.. మీలోనూ ఇలాంటి అనుభవాల్లో ఏదో ఒకటి ఉండి ఉండొచ్చు. ఈరోజుల్లో.. అలాంటి వేడుకలు కొంత తగ్గినట్లే అనిపిస్తుంది. టెక్నాలజీ, విద్యావిధానాలు కారణాలు ఏమైనా కావొచ్చు. ఇప్పుడు అలాంటి అనుభవాలు తగ్గిపోయాయి. టీచర్స్ డే అంటే ఏదో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్‌లా.. స్కూల్ ఈవెంట్‌లా అతికష్టంలా కనిపిస్తోంది. టీచర్స్ డే వేడుకలు సోషల్ మీడియా పోస్టులకే పరిమితమైపోతున్నాయి. ఎంతైనా ఆరోజులే వేరు.. బడిలో మాత్రమే కాదు.. ప్రతి వ్యక్తి జీవితంలో ఒక గురువు ఉంటారు. వారు చూపిన దారే మన ప్రయాణానికి మార్గదర్శకంగా మారుతుంది. అలాంటి వ్యక్తులకు ఒక చిన్న మెసేజ్, ఒక చిన్న ఫోన్‌కాల్, ఒక చిన్న “థ్యాంక్యూ” కూడా వాళ్ల హృదయాన్ని తాకొచ్చు. ఇట్లు.. ఓ నిత్యవిద్యార్థి -
ధనరాజ్ కుమారుడి బర్త్‌డే ఫంక్షన్లో సెలబ్రిటీలు (ఫోటోలు)
-
గణపతి బప్పా మోరియా..ట్రెడిషనల్ లుక్‌లో ఎలిగెంట్‌గా జాన్వి (ఫోటోలు)
-
భర్తతో కలిసి దీపికా గణపతి పూజ, రణ్వీర్ న్యూ లుక్ వైరల్
బాలీవుడ్ స్వీట్ కపుల్ దీపికా పదుకొనే-రణ్వీర్ సింగ్ గణేష్ చతుర్థి (ఆగస్టు 27న)ని ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈ జంట అంబానీ నివాసాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా దురంధర్ నటుడు రణవీర్ న్యూలుక్ వైరల్‌గా మారింది. పాప పుట్టిన తరువాత పబ్లిక్ అప్పియరన్స్‌కు దూరంగా ఉన్న వీరిద్దరూ జంటగా కనిపించడంతో ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. పల్లవ్ పల్లీవాల్ ఇన్‌స్టాలో షేర్ చేసిన కొన్ని సెకన్లు మాత్రమే ఉన్న వీరి వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది.గోల్డ్ అండ్‌గ్రీన్ దుస్తుల్లో దీపికా ,రణ్వీర్ సింగ్ మెరిసారు. ముఖ్యంగా ధురంధర్ షూటింగ్ ప్రారంభించిన నెలల తర్వాత వచ్చిన క్లీన్-షేవ్ లుక్ నెటిజన్లు ఆకర్షిస్తోంది. పొడవాటి జుట్టు, గడ్డాన్ని తొలగించి కనిపించాడు. ఈ దంపతులు ముంబైలోని వరసిద్ధి వినాయకుడిని ఎక్కువగా ఆరాధిస్తారు. గర్భంతో ఉన్నపుడు దీపికా ఈ గణపతిని దర్శించుకున్న సంగతి తెలిసిందే.దీపికా పదుకొనే- రణ్వీర్ సింగ్ గత ఏడాది సెప్టెంబర్ 8న తమ తొలి సంతానం దువాకు జన్మనిచ్చారు. దువాకు మరికొన్ని రోజుల్లో సంవత్సరం నిండనుంది. తమ కుమార్తెను ప్రజల దృష్టి నుండిదూరంగా ఉంచాలని నిర్ణయించుకున్నారు. ఫోటోలను తీయవద్దని కూడా అభ్యర్థించారు కూడా. మరి దువా ఫస్ట్ బర్త్‌డే వేడుకలు ఘనంగా ఉండబోతున్నాయా?ఈ సందర్భంగా నైనా పాపను చూపిస్తారా? అనే ఉత్కంఠ అభిమానుల్లో ఉందైంది. View this post on Instagram A post shared by Pallav Paliwal (@pallav_paliwal)కాగా రణ్వీర్ సింగ్ ధురంధర్ ఫస్ట్ లుక్ సినిమా హాళ్లలో సందడి చేయనుంది. ఇటీవల డిజిటల్‌గా లాంచ్ అయిన 2 నిమిషాల 42-సెకన్ల కట్, రేపు సినిమాల్లో విడుదలయ్యే పరమ సుందరికి జతచేయబడుతుంది. జాతీయ అవార్డు గ్రహీత ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 5 డిసెంబర్ 2025న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. -
వినాయక చవితి వేడుకలో పాల్గొన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి
-
5 వేల చీరలతో గణనాథుడు
-
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు (ఫొటోలు)
-
Pune: భారీ వర్షం మధ్య గణపతికి ఆహ్వానం
పూణె: భారీవర్షం నడుమ మహారాష్ట్రలోని పూణెవాసులు గణపతికి స్వాగతం పలికారు. #WATCH | Pune, Maharashtra | A procession is being carried out to take Shrimant Dagdusheth Halwai Ganpati idol to the 'Pandal' for 'Sthapana' pic.twitter.com/P6J77wEgo9— ANI (@ANI) August 27, 2025నగరంలో ప్రముఖంగా నెలకొల్పిన కస్బా గణపతి, తంబ్డి జోగేశ్వరి గణపతి, గురూజీ తాలిమ్ గణపతి, తులసిబాగ్ గణపతి, కేసరివాడ గణపతి, దగ్దుషేత్ హల్వాయి గణపతి, భౌసాహెబ్ రంగరి గణపతి తదితర వినాయక మండలాల వద్ద సందడి వాతావరణం నెలకొంది.Punekars Welcome Ganpati Bappa With Devotion Despite Heavy Rains pic.twitter.com/YBVi15wNx1— Pune First (@Pune_First) August 27, 2025నగరం అంతటా పండుగ వాతావరణం కనిపిస్తోంది పలువురు తమ ఇళ్లకు గణపతి విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువెళ్లారు. నగరంలో మొత్తం 3,959 గణేశ్ మండపాలు ఏర్పాటయ్యాయి.ఉత్సవాలు శాంతియుతంగా, సురక్షితంగా జరిగేందుకు పూణే పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.ఇందుకోసం ఏఐ ఆధారిత వీడియో విశ్లేషణలతో కూడిన నిఘా కెమెరాలు, ఆధారిత పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌లు, మొబైల్ నిఘా వాహనాలు, డ్రోన్ ఆధారిత వైమానిక పర్యవేక్షణ, జీపీఎస్ ట్రాకర్లు వినియోగిస్తున్నారు.రాష్ట్ర శబ్ద కాలుష్య నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 6న సాయంత్రం 6 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే లౌడ్ స్పీకర్ల వినియోగానికి అనుమతులిచ్చారు.శాంతిభద్రతల దృష్ట్యా ఆగస్టు 27, సెప్టెంబర్ 6వ తేదీలలో పూణే జిల్లా అంతటా మద్యం అమ్మకాలు నిషేధించారు. -
యాంకర్ లాస్య బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
వినాయక చవితి పూజల్లో వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్రకార్యాలయంలో బుధవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గణనాథుడి తొలి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. విఘ్నేషుడికి హారతి ఇచ్చి.. తీర్థప్రసాదాలు స్వీకరించారు.వైఎస్ జగన్ షెడ్యూల్ ప్రకారం.. బుధవారం ఉదయం విజయవాడ రాణిగారితోట వద్ద జరిగే వినాయక పూజలో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే భారీ వర్షాల కారణంగా ఆ పర్యటన రద్దు అయ్యింది. దీంతో తాడేపల్లి ఆఫీసులోనే జరిగే పూజలోనే ఆయన పాల్గొన్నారు. ఈ వేడుకలకు ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్ సహా పార్టీ నేతలు హాజరయ్యారు. -
ఖైరతాబాద్ విశ్వశాంతి మహా గణపతి..రేపటి నుంచి దర్శనం (ఫొటోలు)
-
బోనాలతో ఘనంగా తెలంగాణ గంగ తెప్పోత్సవం (ఫొటోలు)
-
హైదరాబాద్ : పార్శీల నూతన సంవత్సర వేడుకలు (ఫొటోలు)
-
రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ధీర వనితలు
-
Pakistan: స్వాతంత్ర్య సంబరాల్లో కాల్పుల మోత.. ముగ్గురు మృతి
కరాచీ: పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. కరాచీ నగరంలో జరిగిన వేర్వేరు కాల్పుల ఘటనల్లో ముగ్గురు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. అలాగే నగరంలో జరుగుతున్న దోపిడీలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఐదుగురు హతమయ్యారు.కరాచీలోని పలు ప్రాంతాలలో వైమానిక కాల్పులు జరిగినట్లు పాక్ మీడియా తెలిపింది. వివిధ ఘటనల్లో 20 మందికి పైగా అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. పలువురి నుంచి తుపాకీలను స్వాధీనం చేసుకున్నారు. వైమానిక కాల్పులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారువైమానిక కాల్పుల కారణంగా కరాచీలో ఒక వృద్ధుడు, ఎనిమిదేళ్ల బాలిక, మరొక యువకుడు మరణించారని రెస్క్యూ అధికారులు పాకిస్తాన్ జియో న్యూస్‌కు తెలిపారు. నగరం అంతటా చోటు చేసుకున్న వేర్వేరు సంఘటనల్లో 64 మంది గాయపడ్డారు. పాకిస్తాన్‌లోని లియాఖతాబాద్, కోరంగి, లియారి, మెహమూదాబాద్, అక్తర్ కాలనీ, కీమారి, జాక్సన్, బాల్డియా, ఓరంగి టౌన్, పపోష్ నగర్లలో వైమానిక కాల్పుల సంఘటనలు జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. గాయపడిన వారిని సివిల్, జిన్నా, అబ్బాసి షహీద్ ఆసుపత్రులకు, ప్రైవేట్ వైద్య కేంద్రాలకు పోలీసులు తరలించారు. వైమానిక కాల్పులకు పాల్పడినవారిపై వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. -
అమ్మతో కలిసి సుప్రీత బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఆత్మీయ అనురాగ బంధానికి ఆనవాళ్లు: రాఖీ సెలబ్రేషన్స్ ఫోటోలు
-
12th ఫెయిల్ హీరోయిన్ మేధా శంకర్ బర్త్ డే స్పెషల్ (ఫోటోలు)
-
తిరుపతి : అట్టహాసంగా (ఐఐఎస్ఈఆర్) స్నాతకోత్సవ వేడుక (ఫొటోలు)
-
నాగ పంచమి.. భక్తులతో దేవాలయాలు కిటకిట (ఫొటోలు)
-
ఘనంగా ముగిసిన నాట్స్ 8వ తెలుగు సంబరాలు
ఫ్లోరిడా రాష్ట్రం టాంపాలో 8వ నాట్స్ తెలుగు సంబరాలు వైభవంగా ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ సంభరాల్లో వేలాదిమంది తరలి వచ్చారు.....వేదిక ప్రాంగణం తెలుగువాళ్ళతో క్రిక్కిరిసిపోయింది. మహాసభల కన్వీనర్ గుత్తికొండ శ్రీనివాస్, ఈ తెలుగు సంబరాలు విజయవంతానికి కృషి చేశారు.అంతే కాక సంబరాల కమిటీ డైరెక్టర్లు, కో డైరెక్టర్లు, చైర్, కో చైర్, టీం మెంబర్లు, విజయవంతానికి కృషి చేశారు. ఈ తెలుగు సంబరాల్లో నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేశ్, అల్లు అర్జున్, శ్రీలీల తో పాటు అలనాటి నటీమణులు జయసుధ, మీనా సందడి చేసారు...థమన్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేసారు సంబరాలకు వచ్చిన వారిని ఉర్రుతలూగించారు...తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేల నెవ్వర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే విధంగా ఈ తెలుగు సంభరాలు అంభరాన్ని అంటాయి...నాట్స్ తెలుగు సంబరాల కోసం సైనికుల్లా పని చేసిన ప్రతి ఒక్కరికి... హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు నాట్స్ కమిటీ కన్వీనర్ పాస్ట్ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ......ఈ వేడుకలకు వచ్చిన అతిధులకు, కమ్యూనిటీకి, కళాకారులకు, సహకరించిన వలంటీర్లు అందరికీ నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ ధన్యవాదాలుతెలియజేశారు...ఇది మన తెలుగు సంబరం జరుపుకుందాం కలిసి అందరం అనే నినాదం ప్రారంభమైన ఈ సంభరాల్లో 20 వేల మందికి పైగా హాజరయ్యారు...నాట్స్ కన్వీనర్ పాస్ట్ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, సెక్రెటరీ మల్లాది శ్రీనివాస్చక్కని ప్రణాళిక, సమన్వయంతో తమ సత్తా చాటారు..సంబరాలే కాక సామాజిక బాద్యత గా హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి నాట్స్ 85లక్షల విరాళం అందజేసింది. ఈ విరాళాన్ని ఆస్పత్రి చైర్మన్, సినీనటుడు నందమూరి బాలకృష్ణకు.. నాట్స్ లీడర్ షిప్ అందజేశారు. నందమూరి బాలకృష్ణ-వసుంధర దంపతులను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు.. అనేక సాంస్కృతిక సామాజిక సేవ కార్యక్రమాలు సైతం విజయవంతంగా నిర్వహించారు.. -
మహానేతకు ఘన నివాళి
-
విదేశాల్లో ఘనంగా వైఎస్సార్ జయంతి (ఫొటోలు)
-
సింగపూర్ లో ఘనంగా డాక్టర్ వైఎస్సార్ 76వ జయంతి వేడుకలు
-
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు ఆషాఢ సారె (ఫొటోలు)
-
NRI డాలస్‌లో యోగాడే సెలబ్రేషన్స్
డాలస్, టెక్సాస్: అమెరికాలో ఇర్వింగ్ (డాలస్) నగరంలోని మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద జూన్ 21 న మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వందలాదిమంది ప్రవాస భారతీయులు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. గంటన్నరకు పైగా సాగిన యోగా, ధ్యాన కార్యక్రమానికి ‘హార్ట్ ఫుల్నెస్’ యోగా సంస్థ సారధ్యం వహించింది. ఈ కార్యక్రమంలో ఇషా ఫౌండషన్, ది ఐ వై ఇసి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్, వన్ ఎర్త్ వన్ చాన్స్ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్, డి ఎఫ్ డబ్లు హిందూ టెంపుల్ మొదలైన సంస్థలనుండి వందలాదిమంది పాల్గొన్నారు.మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక కార్యదర్శి రావు కల్వాల అతిథులందరికీ స్వాగతం పలికి, యోగా చెయ్యడం కోసం సుప్రభాత సమయంలో తరలివచ్చిన వారందరికీ ధన్యవాదములు అని సభను ప్రారంభించారు. మహాత్మాగాంధీ మెమోరియల్ కో ఛైర్మన్ రాజీవ్ కామత్ శుభాకాంక్షలు తెలియజేశారు.మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “యోగా, ధ్యానం కేవలం జూన్ 21 న మాత్రమేగాక మన దైనందిన జీవితంలో దినచర్యలో ఒక భాగంగా చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందన్నారు. భారత ప్రధాని పిలుపు మేరకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు జూన్ 21న యోగా దినోత్సవం జరుపుకోవడం ఆనందదాయకం అన్నారు.” మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండిముఖ్యఅతిథిగా హాజరైన ఇర్వింగ్ నగర మేయర్ రిక్ స్టాపర్ మహాత్మాగాంధీ మెమోరియల్ దశమ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక శిలాఫలకాన్ని ఆవిష్కరించి, అన్ని వయస్సులవారు వందలాదిమంది ఈ రోజు యోగాలో పాల్గొనడం సంతోషం అని, ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిభావంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మహాత్మాగాంధీ మెమోరియల్ కార్యవర్గ సభ్యులకు అభినందనలు అన్నారు. మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర మరియు కార్యవర్గసభ్యుల విజ్ఞప్తి ననుసరించి, అతిత్వరలో 5 మిలియన్ డాలర్లకు పైగా ధనాన్నివెచ్చించి ఈ 18 ఎకరాల సుందరమైన పార్క్ లో వాకింగ్ ట్రాక్స్, ఎల్ యి డి విద్యుత్ దీపాలను మెరుగుపరుస్తామని ప్రకటించడంతో అందరూ హర్షధ్వానాలు చేశారు.ప్రత్యేకఅతిథులుగా హాజరైన కాపెల్ నగర కౌన్సిల్ సభ్యులు బిజు మాథ్యూ, రమేష్ ప్రేమ్ కుమార్, ఫ్రిస్కో ఇండిపెండెంట్ స్కూల్ ట్రస్టీ బోర్డ్ సభ్యుడు సురేష్ మండువ ఈ కార్యక్రమంలో పాల్గొనడం తమకెంతో సంతోషాన్ని కల్గించింది అంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర సహచర కార్యవర్గ సభ్యులు రాజీవ్ కామత్, రావు కల్వాల, బి.ఎన్ రావు, తయాబ్కుండావాల, రాజేంద్ర వంకావాల, రాంకీ చేబ్రోలు, మహేంద్ర రావు, జె పి పాండ్య, రన్నా జానీ, అనంత్ మల్లవరపులతో కలసి అతిథులందర్నీ సత్కరించారు.యోగా అనంతరం నిర్వాహాకులు చక్కటి ఉపాహారాన్ని ఏర్పాటు చేశారు. గాంధీ మెమోరియల్ బోర్డ్ సభ్యుడు బి.ఎన్ రావు తన ముగింపు సందేశంలో యోగా కార్యక్రమంలో పాల్గొన్నవారికి, అతిథులకు, వివిధ ప్రసార మాధ్యమాలకు, హార్ట్ ఫుల్నెస్’ యోగా సంస్థ నిర్వాహాకులు సురేఖా కోయ, ఉర్మిల్ షా మరియు వారి బృంద సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. -
భాగ్యనగరంలో మొదలైన బోనాల సందడి
-
10 లక్షల కుటుంబాలు కోర్టుకెక్కితే.. ఇది కదా అసలైన గిన్నీస్ రికార్డు
-
దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
-
మోదీ వేసిన యోగాసనాలు ఇవే
-
విశాఖ వాసుల కష్టాలు
-
హీరోయిన్ శ్రీలీల బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఇంతకంటే అదృష్టం ఇంకేం కావాలి : సింగర్ సునీత ఫ్యామిలీ పిక్స్ (ఫొటోలు)
-
తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
-
పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ ఆవిర్భావ వేడుక 2025
-
డల్లాస్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
-
‘భైరవం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
వైఎస్ రాజారెడ్డి శత జయంతి.. దివ్యాంగ చిన్నారులతో వైఎస్ జగన్ (ఫొటోలు)
-
నాని ‘హిట్ 3’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
దిల్ రాజు కూతురి 10వ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
పూర్ణ కుమారుడి సెకండ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
'మ్యాడ్ స్క్వేర్' స్వాతిరెడ్డికి పెళ్లయిపోయిందా? భర్త ఇతడే (ఫొటోలు)
-
పెళ్లిబంధంలోకి టాలీవుడ్ నటి అభియన.. గ్రాండ్‌గా వేడుకలు (ఫొటోలు)
-
టాలీవుడ్ నటి అభినయ పెళ్లి.. సంబురాల్లో ఇరు కుటుంబాలు
తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన నటి అభినయ. శంభో శివ శంబో చిత్రంలో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించింది. కర్ణాటకకు చెందిన అభినయ తెలుగు, తమిళంలోనే ఎక్కువగా పాపులర్ అయింది. ఇటీవలే అభినయ తన చిరకాల ప్రియుడు, సన్నీ వర్మ (వేగేశ్న కార్తీక్)తో మార్చి 9, 2025న నిశ్చితార్థం చేసుకుంది. తాజాగా బుధవారం వివాహాబంధంలోకి అడుగుపెట్టనుంది ముద్దుగుమ్మ.అభినయ-సన్నీ వర్మల పెళ్లి వేడుక ఈ నెల 16న అంటే బుధవారం గ్రాండ్‌గా జరగనుంది. ప్రస్తుతం ఇరు కుటుంబాలు పెళ్లి సంబురాల్లో మునిగిపోయారు. ఇటీవలే తన ఫ్రెండ్స్‌కు బ్యాచ్‌లరేట్ పార్టీ ఇచ్చిన అభినయ మరి కొన్నిగంటల్లోనే వివాహాబంధంలోకి అడుగుపెట్టనుంది. హైదరాబాద్‌లోని ప్రముఖ కన్వెన్షన్ హాల్లో వారిద్దరూ ఒక్కటిగా ఏడడుగులు వేయనున్నారు. తాజాగా తన పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలను అభియన ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.కాగా.. 'నేనింతే' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అభినయ.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కింగ్, శంభో శివ శంభో వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్గా 'పని' అనే మలయాళ సినిమాలో ఆమె అద్భుతంగా నటించారని ప్రశంసలు కూడా దక్కాయి. View this post on Instagram A post shared by M.g Abhinaya (@abhinaya_official) -
జర్మనీలో ఉగాది, శ్రీరామనవమి సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
విశాఖపట్నం : చీర,పంచెకట్టులో మెరిసిన ఏయూ విద్యార్థులు (ఫొటోలు)
-
Rama Navami 2025: రామాయణం మానవజాతికి దిక్సూచి
‘భారతీయ సంస్కృతి ఎంతో గొప్పది. రామాయణాది పౌరాణికాలు మానవజాతికి దిక్సూచి లాంటివి. మనిషి సాటి మనిషిని ప్రేమించే తత్వాన్ని అలవర్చుకోవాలని రామాయణం మనకు నేర్పుతుంది. ఇందులో ప్రతి పాత్ర ఆదర్శవంతమే’ అని జస్టిస్ బి.ఎన్.కృష్ణ ఉద్ఘాటించారు. శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఆంధ్ర మహాసభ, వేంకటేశ్వర పూజా మందిరం ట్రస్ట్ సంయుక్తంగా, శనివారం సాయంత్రం దాదర్ హిందూ కాలనీలోని ఆచార్య బి.ఎన్.వైద్య సభాగహంలో నిర్వహించిన రామాయణం నృత్యరూపక కార్యక్రమానికి ఆయన విశిష్ట అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘తెలుగులో ప్రదర్శించిన ఈ నృత్యరూపకం కనులపండువగా సాగింది. దర్శకత్వంతో పాటు కళాకారుల అభినయం అద్భుతంగా ఉంది’ అని కొనియాడారు. తొలుత ఆంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి యాపురం వెంకటేశ్వర్ సభకు స్వాగతం పలికారు. ముందుగా పరిచయాత్మకంగా జరిగిన వేదిక కార్యక్రమంలో స్థానిక లోక్‌సభ సభ్యులు అనిల్ దేశాయ్, ఎమ్మెల్సీ సునీల్ శిందే పాల్గొన్నారు. అనిల్ దేశాయ్ మాట్లాడుతూ ఆంధ్ర మహాసభ గత తొమ్మిది దశాబ్దాలుగా సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో అసామాన్యమైన సేవలందిస్తోందని, తెలుగువారికి, మరాఠీయులకు పురాతన కాలం నుంచి అవినాభావ సంబంధాలున్నాయని, ఆంధ్ర మహాసభ అభివృద్ధి పనుల కోసం ఎంపీ ల్యాడ్స్ నుంచి తప్పకుండా సహాయం అందిస్తానని సభాముఖంగా ప్రకటించారు. ధర్మకర్తల మండలి చైర్మన్ మంతెన రమేశ్, అధ్యక్షుడు మాదిరెడ్డి కొండారెడ్డి, ప్రధాన కార్యదర్శి యాపురం వెంకటేశ్వర్ తదితరులు అనిల్ దేశాయ్‌ని, సునీల్ శిందేని ఘనంగా సన్మానించారు. కనువిందు చేసిన నృత్యరూపకం తర్వాత జగన్నాథాచార్యులు రచించగా, సూర్యారావు సంగీత దర్శకత్వంలో, సూర్యనారాయణ గాత్ర సహకారంతో, భాగవతుల వెంకట రామశర్మ దర్శకత్వంలో ప్రదర్శించిన రామాయణం నృత్యరూపకం సభికుల్ని అక్షరాలా మంత్ర ముగ్ధుల్ని చేసింది. సంగీతం, గానానికి అనుగుణంగా నటీ నటుల అభినయం వీక్షించిన రసికుల్ని అబ్బురపరిచింది. రామాయణంలోని సీతా స్వయంవరం, పరుశరామ గర్వభంగం, మందర కైకేయి సంవాదం, శూర్పణక నాసికా ఖండనం, సీతాపహరణ దశ్యం, వాలి వధ, రామ రావణ యుద్ధం, చివరికి శ్రీరామ పట్టాభిõÙకం తదితర ప్రధాన ఘట్టాల్ని కళ్ళకు కట్టినట్టుగా ప్రదర్శించారు. ఆయా ఘట్టాల్లో సభికులు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఆయా సందర్భాల్లో ఎంతో భావోద్వేగాలకు గురయ్యారు. దశాబ్దాల తర్వాత ఇంతటి అద్భుతమైన నృత్యరూపకాన్ని చూశామని ప్రేక్షకులు కొనియాడారు. విజయవాడకు చెందిన శ్రీనత్య అకాడమీ వారు ప్రదర్శించిన ఈ నృత్యరూపకంలో రాముడిగా, బి.ఎన్.ఎన్.సౌమ్య, సీతగా అలకనందాదేవి, రావణుడిగా సీహెచ్ రామకృష్ణ అనితరసాధ్యంగా నటించారు. తతిమ్మ నటీనటులు కూడా తమతమ పాత్రల్లో జీవించారు. ప్రముఖ రచయిత్రి తురగా జయశ్యామల, రవీంద్ర దంపతులు రూపకం తీరుకు ఆనందించి అప్పటికప్పుడే ఆర్థిక సహాయం అందించారు. రూపకం ప్రదర్శనానంతరం అధ్యక్షుడు మాదిరెడ్డి కొండారెడ్డి మాట్లాడుతూ, చక్కటి కార్యక్రమాలకు ప్రేక్షకాదరణ ఉంటుందని రుజువైందని, భవిష్యత్తులో కూడా వివిధ ప్రక్రియలకు సంబంధించిన నాణ్యమైన కార్యక్రమాల నిర్వహణకు ఆంధ్ర మహాసభ కట్టుబడి ఉందని ప్రకటించారు. తెలుగేతర నేలపై తెలుగు భాషా సంస్కృతుల్ని పరిరక్షించడమే కాకుండా, వాటి వికాసానికి కూడా మహాసభ తప్పకుండా ప్రయతి్నస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి ముంబైలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా జనం తరలివచ్చారు. కాగా, ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ మంతెన రమేశ్, కార్యదర్శి కస్తూరి హరిప్రసాద్, ధర్మకర్తలు బోగ సహదేవ్, ద్యావరిశెట్టి గంగాధర్, సంగం ఏక్నాథ్, అధ్యక్షుడు మాదిరెడ్డి కొండారెడ్డి, ప్రధాన కార్యదర్శి యాపురం వెంకటేశ్వర్, పరిపాలన విభాగ ఉపాధ్యక్షుడు తాల్ల నరేశ్, సాహిత్య విభాగ ఉపాధ్యక్షుడు బొమ్మకంటి కైలాశ్, సాంస్కృతిక శాఖ ఉపాధ్యక్షుడు గాజెంగి వేంకటేశ్వర్, సంయుక్త కార్యదర్శి అల్లె శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు కొక్కుల రమేశ్, చిలుక వినాయక్, కూచన్ బాలకృష్ణ, శేర్ల ప్రహ్లాద్, మహిళా శాఖ అధ్యక్షురాలు మంచికంటి మేఘమాల, కార్యదర్శి పిల్లమారపు పద్మ, ఉపాధ్యక్షురాలు వి.శ్యామల రామ్మోహన్, సభ్యులు బోగ జ్యోతిలక్షి్మ, వీరబత్తిని రాజశ్రీ, తాళ్ల వనజ, పూజా మందిరం ట్రస్ట్ చైర్మన్ జి.హరికిషన్, కార్యదర్శి నూకల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. సాంస్కృతిక శాఖ ఉపాధ్యక్షుడు గాజెంగి వేంకటేశ్వర్ సభకు వందన సమర్పణ చేశారు. -
Ugadi 2025 సింగపూర్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
'శ్రీ సాంస్కృతిక కళాసారథి' ఆధ్వర్యంలో సింగపూర్ లోని తెలుగువారి కోసం ప్రత్యేక 'విశ్వావసు ఉగాది వేడుకలు' కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం భారతదేశం నుండి ఇండియా ఫౌండేషన్ అధ్యక్షులు, రచయిత డాక్టర్ రామ్ మాధవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా లోక్‌సభ సభ్యులు డీకే అరుణ, ప్రముఖ రాజకీయవేత్త, సింగపూర్ తెలుగు సమాజం పూర్వ అధ్యక్షులు వామరాజు సత్యమూర్తి విచ్చేశారు.సింగపూర్ తెలుగు గాయనీ గాయకులు చక్కటి సాంప్రదాయబద్ధమైన పాటలతో ప్రేక్షకులను అలరించారు. నాట్య కళాకారుల ప్రత్యేక నృత్య ప్రదర్శనలు, చిన్నారుల పద్య పఠనాలు అందరినీ ఆకర్షించాయి. సింగపూర్ తెలుగు ప్రజలందరూ ఆనందంగా ఉగాది వేడుకలు జరుపుకున్నారు.సింగపూర్‌లోని తెలుగువారి సాంస్కృతిక ప్రతిభను ప్రదర్శించేందుందుకు వేదికను ఏర్పాటు చేయగలగడం, దానికి ప్రత్యేకించి భారతదేశం నుండి అతిథులు విచ్చేసి తమను అభినందించడం చాలా ఆనందంగా ఉందన్నారు కార్యక్రమ ప్రధాన నిర్వాహకులు, సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్. మరిన్ని NRI న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈ సందర్బంగా సింగపూర్ కవయిత్రి కవిత కుందుర్తి రచించిన కవితా సంపుటి "Just A Housewife", రామ్ మాధవ్ రచించిన “Our Constitution Our Pride” అనే పుస్తకాలు ఆవిష్కరించారు. దాదాపు 350 మంది పైగా హాజరైన ఈ కార్యక్రమంలో సింగపూర్ లోని "స్వర" నాట్య సంస్థ నుండి కళాకారుల నాట్య ప్రదర్శనలు, చిన్నారులు ఉగాది పాటకు నాట్య ప్రదర్శన చేయగా, సంగీత విద్యాలయాలైన స్వరలయ ఆర్ట్స్, మహతి సంగీత విద్యాలయం, విద్య సంగీతం, జయలక్ష్మి ఆర్ట్స్ సంస్థల నుండి విద్యార్థులు గీతాలాపన చేశారు. చిన్నారుల వేద పఠనం, భగవద్గీత శ్లోక పఠనం వంటివి అందరినీ ఆకట్టుకున్నాయి.సింగపూర్ గాయనీమణులు తంగిరాల సౌభాగ్య లక్ష్మి, శైలజ చిలుకూరి, సౌమ్య ఆలూరు, శరజ అన్నదానం, షర్మిల, శేషు కుమారి యడవల్లి, ఉషా గాయత్రి నిష్టల, రాధిక నడదూర్, శ్రీవాణి, విద్యాధరి, దీప తదితరులు సంప్రదాయ భక్తి పాటలు, ఉగాది పాటలు, శివ పదం కీర్తనలు మొదలైనవి వినిపించారు. వాద్య సంగీత ప్రక్రియలో వీణపై వేదుల శేషశ్రీ,, వయోలిన్ పై భమిడిపాటి ప్రభాత్ దర్శన్ తమ ప్రతిభను ప్రదర్శించారు. ముఖ్యఅతిథి డాక్టర్ రామ్ మాధవ్ మాట్లాడుతూ తెలుగు భాషకు ఆదరణ తగ్గుతున్న ఈ రోజుల్లో తెలుగు భాష గొప్పతనం చాటేలా ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ఇళ్లలో తెలుగు రాయడం, చదవడం తగ్గిపోవడం వలన, తెలుగుభాష కనుమరుగు కావడానికి ముఖ్యకారణమన్నారు. ప్రపంచములో త్వరితగతిన అంతరించుకుపోతున్న భాషలో తెలుగు బాషా కూడా ఉండడం బాధాకరమని, దానిని కాపాడుకోవడం మన బాధ్యత అని తెలిపారు. వారి ప్రసంగం ఆధ్యంతం ఒక్క ఆంగ్ల పదం లేకుండా అచ్చతెలుగులో ప్రసంగించడం విశేషంగా నిలిచింది.కార్యక్రమ విశిష్ట అతిథి డీకే అరుణ మాట్లాడుతూ "నేను 14 ఏళ్ల తర్వాత ఎంపీ హోదాలో సింగపూర్ లో ఇలా ఉగాది వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే సంతోషిస్తున్నాం, కానీ తెలుగు భాష గొప్పతనాన్ని వాళ్లకు నేర్పించడం లేదు. విదేశాలలో ఉన్నటువంటి తెలుగువారు ఇలా తెలుగు భాష గొప్పతనాన్ని చాటుతూ, మన సంప్రదాయాలు, కట్టుబాట్లు చిన్న పిల్లలకు, భావి తరాలకు నేర్పుతుండటం అభినందనీయం" అని చెపుతూ అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.కార్యక్రమ ఆత్మీయ అతిధి వామరాజు సత్యమూర్తి మాట్లడుతూ "విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలలో సింగపూర్ లో పాల్గొనడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది, నేను సింగపూర్ కి వచ్చినప్పుడల్లా అత్తవారింటికి వెళ్లిన ఆడపిల్ల పుట్టింటికి వచ్చినంత సంతోషం గా ఉందని" తెలియచేస్తూ కార్యక్రమములో పాల్గొన్న తన పాత మిత్రులను పేరు పేరున పలకరిస్తూ వారితో తనకున్న పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగిన వారి ప్రసంగములో అందరినీ నవ్విస్తూ, కొన్ని సామెతలను చెపుతూ, కవులను గుర్తుచేస్తూ, చివరలో కార్యక్రమ నిర్వాహుకులకు ఉండే కష్టాలను సోదాహరణంగా వివరించి అందరిని నవ్వించారు.ఈ కార్యక్రమములో తెలంగాణ కల్చరల్ సొసైటీ కార్యవర్గ సభ్యులు, తెలుగు సమాజం సభ్యులు, సింగపూర్ నలుమూలలు నుండి తెలుగువారు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ సభ్యులు రామాంజనేయులు చామిరాజు, శ్రీధర్ భరద్వాజ్, పాతూరి రాంబాబు, వ్యాఖ్యాతగా సౌజన్య బొమ్మకంటి తదితరులు పాల్గొన్నారు. GIIS స్కూల్ నిర్వాహకులు అతుల్ మరియు ప్రముఖ పారిశ్రామకవేత్త కుమార్ నిట్టల ప్రత్యేక సహాయ సహకారాలు అందించారు.స్కేటింగ్ లో విశేష ప్రతిభను ప్రపంచ స్థాయిలో ప్రదర్శితున్న నైనికా ముక్కాలను, తాను సాధించిన విజయాలను అభినందిస్తూ అతిధులు మరియు నిర్వాహుకులు నైనికా ఘనంగా సత్కరించారు. అతిథులని ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను బహుకరించి, కళాకారులకు అతిథులచే సర్టిఫికెట్ ప్రదానం చేయించారు, కాత్యాయనీ గణేశ్న ,వంశీకృష్ణ శిష్ట్లా సాంకేతిక సహాయం అందించగా, వీర మాంగోస్ వారు స్పాన్సర్ గా వ్యవహరించారు, అభిరుచులు, సరిగమ గ్రాండ్ వారు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. నిర్వాహకులు, సభా వేదిక అందించిన GIIS యాజమాన్యానికి, అతిథులకు సహకరించిన కళాకారులకు స్పాన్సర్స్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. -
భక్తి శ్రద్ధలతో ఈద్–ఉల్–ఫిత్ర్
సోలాపూర్, భివండీ: సోలాపూర్ పట్టణం, జిల్లా వ్యాప్తంగా సోమవారం ఈద్ ఉల్ ఫిత్ర్(రంజాన్)పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా హోటగి రోడ్డు వైపునున్న అలంగీర్ ఈద్గా మైదానం, జూని మిల్ కాంపౌండ్ హాల్లోని అదిల్ శాయి ఈద్గా మైదానం, అసర్ మైదానంలో ముస్లిం సోదరులు రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తర్వాత అందరూ ఒకరికొకరిని ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పోలీసులు బందోబస్తు నిర్వహించారు. చదవండి: శోభిత ధూళిపాళ బ్యూటీ సీక్రెట్స్ తెలిస్తే షాకవుతారు!భివండీలో... భివండీలోని పలుప్రాంతాల్లో సోమవారం రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుంచే ఈద్గా మైదానం సహా పట్టణంలో 113 మసీదులలో వేలాది ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పండుగ సందర్భంగా కోటర్ గేట్ వద్ద డీసీపీ మోహన్ దహికర్, ఏసీపీ దీపక్ దేశ్‌ముఖ్ ముస్లిం సోదరులకు గులాబీలు అందజేసి ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: Ugadi 2025 వైభవంగా ‘విశ్వావసు’ స్వాగతం, వేడుకలు -
Ugadi 2025 వైభవంగా ‘విశ్వావసు’ కి స్వాగతం, వేడుకలు
పన్వేల్ ఆంధ్రా కళా సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఉగాది వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ క్రోధి నామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, శ్రీ విశ్వావసు నామ సంవత్సరానికి ఆనందోత్సాహాలతో స్వాగతం చెప్పారు. ఈ వేడుకల్లో సమితి సభ్యులు, పన్వేల్‌లోని తెలుగు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తాండవ కృష్ణ పంచాంగ పఠనం, క్రాంతి నాట్య, గానాలు సభికులను అలరించాయి. ఈ సందర్భంగా వేడుకలకు విచ్చేసిన వారికి సమితి సభ్యులు ఉగాది పచ్చడితో పాటు నూతన పంచాంగం పుస్తకాలను పంపిణీ చేశారు. ముంబై ఆంధ్ర ప్రజా సంఘం ఆధ్యర్యంలో... ముంబై ఆంధ్ర ప్రజా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో మహిళలు, పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొని పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఉగాది పచ్చడి తయారు చేసి ఒకరొకొకరు పంచుకున్నారు. ఈ సందర్భంగా సంఘం జాయింట్ సెక్రటరీ రాజకుమార్ సతీమణి జ్యోతి ఆధ్వర్యంలో ఉగాది ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించి చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రెసిడెంట్ మాకె రాంబాబు, భోగి విష్ణు, సాయిబాబా, ఉండు శ్రీనివాస్, ఎల్లమెల్లి శ్రీనివాస్, ధోనిపాటి శ్రీను, జే ఎస్ మూర్తి, మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు. వాషి తెలుగు కళా సమితిలో.... వాషిలోని తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఉగాది వేడుకలను వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తెలుగుప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ జ్యోతిష పండితుడు పూజ్యం సత్యనారాయణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం సమర్పణం గ్రూప్ ఆలపించిన భక్తి గీతాలు, సిద్ధి నాట్య మందిర్ (గురు రష్మి – శ్రద్ధా భిడే పరివార్) కథక్ నాట్య ప్రదర్శన, ఢీ ప్రోగ్రాం సహాయ నృత్య దర్శకుడు సాయి టీం మెంబర్స్ గ్రూప్‌డాన్స్ ప్రేక్షకులను అలరించాయి. ఈ సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త ఎల్ది సుదర్శన్‌కు తెలుగు కళా సమితి సభ్యులు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. అనంతరం విందు భోజన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకల్లో సమితి అధ్యక్షుడు బి. నారాయణరెడ్డి , ప్రధాన కార్యదర్శి జి. సుబ్రహ్మణ్యం, సంయుక్త కార్యదర్శులు టి. విజయలక్ష్మి, సంయుక్త కోశాధికారులు వెలుగొండరెడ్డి, కోటిరెడ్డి, వహీదా, ప్రత్యూష, శోభ, రాధిక, జానకి, కృష్ణ, శ్యామల, శ్రీనివాసరెడ్డి, లక్ష్మణ్ పాల్గొన్నారు. తెలుగు కళావేదిక ఆధ్వర్యంలో... నవీ ముంబై, సిబిడి బేలాపూర్‌లోని సాంస్కృతిక సంస్థ తెలుగు కళావేదిక ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ నూతన సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి తెలుగు కళా వేదిక సభ్యులు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన తెలుగు ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సామూహిక మహాలక్ష్మీ పూజ , పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో మాస్టర్ సాయి హరి భగవద్గీత శ్లోకాల పారాయణ, కుమారి పద్మశ్రీ భరతనాట్య ప్రదర్శన, ప్రముఖ గాయని అనూరాధ శిష్యుల గానం , కవులు అద్దంకి లక్ష్మి రాజశేఖర్ కవితాగానం ప్రేక్షకులను అలరించాయి. అలాగే మహిళా సభ్యులు ప్రదర్శించిన ‘కిట్టీ పార్టీ’హాస్య నాటిక ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఈ కార్యక్రమానికి రవి చిమట వ్యాఖ్యాతగా వ్యవహరించారు. తెలుగు సంఘం బోనాలు..అంధేరీ వెస్ట్‌లోని చార్‌బంగ్లా ప్రాంతంలో ఆదివా రం స్థానిక తెలుగు ప్రజలు బోనాల ర్యాలీతో ఉగాదికి స్వాగతం పలికారు. తెలుగు సంఘం ఆధ్వర్యంలో మొదటిసారిగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీసంఖ్యలో తెలుగువారు హాజరయ్యారు. భివండీలో ఉగాది సంబరాలు..ఉగాది పర్వదినం సందర్భంగా ఆదివారం అఖిల పద్మశాలీ సమాజ్ ఆధ్వర్యంలో మండాయిలోని మార్కండేయ మహాముని మందిరంలో ప్రత్యేక పూజలు, ఉగాది పచ్చడి వితరణ జరిగాయి. ఈ సందర్భంగా సమాజ్ అధ్యక్షుడు పొట్టబత్తిని రామకృష్ణ, న్యాయదాని కమిటీ చైర్మన్ ఎలిగేటి శ్రీనివాస్ పట్టణ వ్యాప్తంగా ఉన్న సమాజ్ పెద్దలను టోపీ, శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ ఉగాది ప్రత్యేక కార్యక్రమంలో పట్టణంలోని వివిధ ప్రాంతాంలకు చెందిన అఖిల పద్మశాలీ సమాజం న్యాయనిర్ణేతలు, పెద్దలతోపాటు సమాజ్ ప్రధాన కార్యదర్శి కళ్యాడపు బాలకిషన్, కోశాధికారి యెల్లె సాగర్, కార్యాధ్యక్షుడు గాజెంగి రాజు, ఉపాధ్యక్షుడు వల్లాల్ మోహన్, కొంక మల్లేశం, సుంఖ శశిధర్, కోడం లక్ష్మీనారాయణ, ట్రస్టీలు వేముల నర్సయ్య, పాశికంటి లచ్చయ్య, ఎస్. మల్లేశం, వంగ పురుషోత్తం, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. పద్మశాలీ సమాజ్ యువక్ మండల్లో... ప్రతి ఏడాది మాదిరిగానే పద్మశాలీ సమాజ్ యువక్ మండల్లో, అధ్యక్షుడు వాసం రాజేందర్ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అఖిల పద్మశాలీ సమాజ్ కార్యవర్గం కాల పరిమితి పూర్తి కావస్తున్న సందర్భంగా గౌరవ సత్కార సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంంలో సమాజ్ పెద్దలు, యువక్ మండలి కార్యవర్గ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కపిల్ పాటిల్ ఫౌండేషన్ కార్యాలయంలో... కపిల్ పాటిల్ ఫౌండేషన్ కార్యాలయం, బాలాజీనగర్ సంఘం, కామత్‌ఘర్‌లోని పలు సంఘాల్లో ఉగాది వేడుకలు, ఘనంగా నిర్వహించారు. -
గ్రాండ్‌గా ఈద్ పార్టీ, సందడి చేసిన సెలబ్రిటీలు (ఫోటోలు)
-
గ్రాండ్‌గా మంచు ఫ్యామిలీ ఉగాది వేడుకలు (ఫోటోలు)
-
Ramzan celebrations : హైదరాబాద్ లో ఘనంగా రంజాన్ వేడుకలు (ఫొటోలు)
-
సింగపూర్‌లో విశ్వావసు నామ ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణం
తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి పోటోన్గ్ పాసిర్ లోని శ్రీ శివ దుర్గ ఆలయంలో మార్చి 30న ఘనంగా జరిగాయి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వదినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో బాగంగా శ్రీ పేరి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. గంటల పంచాంగాన్ని ప్రముఖ పంచాంగ కర్తలు పండిత బుట్టే వీరభద్ర దైవజ్ఞ (శ్ర శ్రీశైల దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి)సిద్ధం చేయడం జరిగింది. ఈ వేడుకల్లో 300పైగా ప్రవాస తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులు పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సాంప్రదాయ ఉగాది పచ్చడి తదితర ప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గాప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి , ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము,కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్ పాల్గొన్నారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు చేస్తున్న కార్యక్రమాలను భక్తులు కొనియాడారు.ఉగాది వేడుకల నిర్వహణ, దాతలకు, స్పాన్సర్లతోపాటు, సంబరాల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి TCSS ధన్యవాదాలు తెలిపింది. ఈ వేడుకలలో పాల్గొన్న వై.ఎస్.వి.ఎస్.ఆర్.కృష్ణ (పాస్స్పోర్ట్ అటాచ్, ఇండియన్ హై కమిషన్, సింగపూర్) గారికి అధ్యక్షులు గడప రమేష్ బాబు, కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. అలాగే మై హోమ్ బిల్డర్స్, సంపంగి రియాలిటీ & ఇన్ఫ్రాస్ట్రక్చర్, ASBL కన్స్ట్రక్షన్ కంపెనీ, గారాంటో అకాడమీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, వజ్రా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ, ఏపీజే అభిరామి, ఏపీజే జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవోల్వ్, సౌజన్య డెకార్స్‌కు సొసైటీ కృతజ్ఞతలు తెలిపింది.మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Ugadi 2025 అంబరాన్నంటిన ఉగాది సంబరాలు
ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉగాది (Ugadi2025) సంబరాలు (మరాఠీ ప్రజలు జరుపుకునే పండగా గుడిపడ్వా) అంబరాన్ని అంటాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉగాది వేడుకలను కనులపండువగా నిర్వహించారు. ముఖ్యంగా హిందూ నూతన సంవత్సరానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ర్యాలీలు, ఇతర కార్యక్రమాల ద్వారా నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు. మరాఠీ ప్రజలు ఉగాది పండుగ రోజును గుడిపడ్వాగా జరుపుకుంటారు. మరోవైపు ఈ సందర్భంగా తెలుగు ప్రజలు తమ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ఉగాది పచ్చళ్లు తయారు చేయడంతో పాటు పంచాంగ శ్రవణ కార్యక్రమాలను ఏర్పాటు చేయగా మహారాష్ట్ర ప్రజలు తమ సంస్కృతి సంప్రదాయ పద్ధతుల్లో ఉగాది (గుడిపడ్వా)ను జరుపుకున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర ప్రజలు గుడిపడ్వా రోజున ఓ కర్రకు రాగిచెంబును బోర్లించి దానిపై నూతన వస్త్రం, మామిడి కొమ్మలు, చక్కెర పాకంతో తయారు చేసే చక్కెర బిల్లల హారాలతో అలంకరిస్తారు. వాటిని ఇంటి ముందు, ఎత్తైన స్థలాల్లో కడతారు. ఇలా ఏర్పాటు చేసిన వాటిని ‘గుడి’లుగా పేర్కొంటారు. ఇలాంటి ‘గుడి’లు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేశారు. అదే విధంగా నూతన సంవత్సరానికి సంప్రదాయ పద్ధతుల్లో స్వాగతం పలికారు. ముఖ్యంగా ముంబైలోని గిర్గావ్, థానే, డోంబివలి, పుణే, నాగ్పూర్లతో పాటు అనేక ప్రాంతాల్లో నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు శోభాయాత్రలు ఊరేగింపులు నిర్వహించారు. ఈ శోభాయాత్రలో సంగీత వాయిద్యాలు వాయించడంతోపాటు సంప్రదాయమైన దుస్తులు ధరించిన మహిళలు, పురుషులు నృత్యం చేశారు. అదే విధంగా ఈ యాత్రలలో బైకులు, అశ్వాలు కూడా కని్పంచాయి. మరోవైపు భారీ రంగోళి (ముగ్గులు)లు వేశారు. రథయాత్రల ద్వారా అనేక అంశాలపై సందేశాలిచ్చే ప్రయత్నం చేశారు. ముంబైలో... ముంబైలోని గిర్గావ్, దాదర్, కాందివలి తదితరాలతోపాటు అనేక ప్రాంతాల్లో శోభాయాత్రలు నిర్వహించారు. ముఖ్యంగా గిర్గావ్లో ఉదయం నిర్వహించిన శోభాయాత్రలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. గిర్గావ్ శోభాయాత్రలో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు బైకులు, బుల్ల్ట్లపై సంప్రదాయ దుస్తులు ధరించి ర్యాలీ నిర్వహించారు. దాదర్‌లో సంప్రదాయ దుస్తులతో మహిళలు కత్తులను తిప్పుతూ చేసిన విన్యాసాలు అందిరినీ ఆకట్టుకున్నాయి. అలాగే ములూండ్‌లో కూడా ఈ సారి శోభాయాత్ర జరిగింది. థానేలో... థానేలో కౌపినేశ్వర్ ఆలయం ఆధ్వర్యంలో మాసుందా జలాశయం (తలావ్పాలి) వద్ద శనివారం రాత్రి దీపోత్సవం జరిగింది. దీన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. మరోవైపు థానే, డోంబివలి ఫడ్కేరోడ్డుపై బైకుల ర్యాలీలతోపాటు బ్యాండు మేళాలతో శోభాయాత్ర జరిగింది. ముఖ్యంగా డోంబివలిలో అనేక సందేశాలతో ర్యాలీలు నిర్వహించారు. ఆలయాల్లో భక్తుల కిటకిట.. ఉగాది నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. పలు ప్రాంతాల్లో టపాసులు కాల్చి నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఇదే తరహా ముంబై, థానే, డోంబివలి, పుణే, భివండీలతోపాటు రాష్ట్రంలోని మందిరాల్లో భక్తుల సందడి కని్పంచింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని దేవుళ్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముంబైలోని ముంబాదేవి ఆలయంతోపాటు అనేక ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
దేశ వ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు
-
తిరుపతి : గుడి సంబరం..అంగరంగ వైభవంగా (ఫొటోలు)
-
విశ్వావసు నామ ఉగాది వేడుక సంబరాల్లో యువత (ఫొటోలు)
-
హీరో రామ్‌చరణ్ 40వ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
విశ్వావసు నామ ఉగాది సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
మోహన్‌బాబు యూనివర్సిటీ 33వ వార్షికోత్సవ వేడుకలు (ఫోటోలు)
-
‘ఆమె క్షేమంగా వస్తే చాలూ.. మాకు పండుగే!’
ఢిల్లీ: తొమ్మిది నెలలపాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్(sunita williams) , బుచ్ విల్మోర్లు ఎట్టకేలకు భూమికి తిరుగు పయనమయ్యారు. వ్యోమగాములంతా సురక్షితంగా భూమ్మీద అడుగు మోపాలని కోట్ల మంది ప్రార్థిస్తున్నారు. అయితే ఒక ఊరు మాత్రం ప్రత్యేకంగా సునీత క్షేమం కోసం పూజలు, హోమాలు చేస్తోంది. ఆమె రాకను ఒక పండుగలా జరిపేందుకు సన్నాహాలు చేస్తోంది. సునీతా విలియమ్స్ భారత సంతతి అనే విషయం తెలిసిందే కదా. గుజరాత్‌లోని మెహసానా జిల్లా ఝూలాసన్ ఆమె పూర్వీకుల గ్రామం(Ancestral Village). అక్కడ ఇప్పటికీ ఆమెకు బంధువులు ఉన్నారు. కిందటి ఏడాది.. సునీత అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయినప్పటి నుంచి వాళ్లంతా ఆందోళనతోనే ఉన్నారు. ఆమె క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు.. ఆమె తిరిగి వస్తుండడంపై వాళ్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.‘‘నా సోదరి సునీతా రాక కోసం మేమంతా ఎంతో ఎదురుచూస్తున్నాం. సునీత తల్లి, సోదరి, సోదరుడుతో సహా ఈ దేశంలోని కుటుంబంలోని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. ఆమె సురక్షితంగా కిందకు దిగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. సునీత కోసం దేవాలయాలకు వెళ్లి పూజలు చేశాం. సునీతా కోసం యజ్ఞం నిర్వహిస్తున్నాం’’ అని ఆమె సోదరుడు దినేశ్ అంటున్నారు. మరోవైపు ఊరు ఊరంతా.. సునీత రాకను చిరస్మరణీయమైన రోజు.. దేశం గర్వించదగిన రోజుగా చెబుతోంది. దీపావళి పండుగలా ఆమె రాకను సంబురంగా జరిపేందుకు సిద్ధం అయ్యింది. సునీతా విలియమ్స్ గతంలో రెండుసార్లు భారత్ పర్యటనకు వచ్చారు. 2007లో తొలిసారి ఇండియాకు వచ్చిన ఆమె.. ఝూలాసన్తో పాటు సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. తిరిగి 2013లో పర్యటనకు వచ్చి.. కోల్‌కతా, న్యూఢిల్లీతో పాటు తన పూర్వీకుల గ్రామాన్ని సందర్శించారు. ఆ సమయంలో ఝూలాసన్ గడ్డకు ఆమె ప్రత్యేకంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే.. కిందటి వ్యోమగాములను భూమ్మీదకు తీసుకొచ్చేందుకు అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్(Space X Crew Dragon Capsule)లోకి వీరు చేరుకున్నారు. ఈ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోయి భూమ్మీదకు బయల్దేరింది. స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్ ఐఎస్ఎస్ను వీడే అన్‌డాకింగ్ దృశ్యాలను ప్రపంచమంతా వీక్షించేందుకు నాసా ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. -
Birthday Special: అలియా భట్ 32వ బర్త్‌డే వేడుకలో స్పెషల్ ఫొటోస్
-
భర్తతో బుల్లితెర నటి వాసంతి హోలి సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
ఫిలడెల్ఫియాలో తానా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
తానా మిడ్-అట్లాంటిక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని వెస్ట్ చెస్టర్ నగరంలో పియర్స్ మిడిల్ స్కూల్ లో నిర్వహించిన ఈ వేడుకలకు వెయ్యికి మందికి పైగా హాజరై సాంస్కృతిక కార్యక్రమాలు, స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు, డైనమిక్ ఫ్యాషన్ షో, స్టాల్ల్స్, రుచికరమైన విందుతో ఆరు గంటల నాన్ స్టాప్ వినోదాన్ని ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గత ఐదున్నర దశాబ్దాల నుండి డెలావేర్ రాష్ట్రంలోని డోవర్ నగరంలో విశేషసేవలు అందిస్తున్న ప్రముఖ చిన్న పిల్లల వైద్యురాలు డాక్టర్ జానకి కాజా గారిని తానా బోర్డు ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ జానకి కాజా అమెరికా వచ్చినప్పటి నుంచి అనుభవాలను వివరిస్తూ స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేసారు. మన జన్మభూమి భారతదేశం లాగానే కర్మభూమి అమెరికా చాలా గొప్ప దేశమని 1971 లో అమెరికా లో అడుగుపెట్టినప్పటి నుండి ఈరోజు వరకు ఆసుపత్రికి వెళ్లినా, 86 దేశాలు పర్యటించినా మన భారతీయ సంప్రదాయం మరచిపోకుండా తాను ఇప్పటికీ చీర మాత్రమే ధరిస్తానని చీర మన సాంస్కృతిక గర్వానికి చిహ్నంగా ఉంటుందని పేర్కొంటూ మహిళల జీవితం సవాళ్లతో కూడినదని పట్టుదలతో, దృఢసంకల్పంతో అవకాశాలు అందిపుచ్చుకుని జీవితంలో ఎదగాలని ఆకాంక్షించారు. తానా మిడ్ అట్లాంటిక్ మహిళల బృందం ఈ కార్యక్రమం విజయవంతం కోసం అవిశ్రాంతంగా పనిచేసింది. మిడ్-అట్లాంటిక్ మహిళా కమిటీ ఛైర్ సరోజా పావులూరి నేతృత్వంలోని బృందం ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. వ్యాఖ్యాత లక్ష్మి మంద ఎనర్జిటిక్ హోస్టింగ్‌తో అలరించారు. రాజేశ్వరి కొడాలి, భవాని క్రొత్తపల్లి, సౌజన్య కోగంటి, రవీనా తుమ్మల, భవానీ మామిడి, మైత్రి రెడ్డి నూకల, నీలిమ వోలేటి , రమ్య మాలెంపాటి, బిందు లంక, దీప్తి కోకా తదితరుల కృషిని హాజరైన వారందరూ అభినందించారు.తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి తన ప్రసంగంలో మహిళలకు అభినందనలు తెలిపారు. తానా ఫౌండేషన్ మరియు ఇతర సేవా సంస్థల ద్వారా అమెరికాలోనే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మిలియన్ల డాలర్లు వెచ్చించి ఎనలేని సేవలందిస్తున్న బాబు రావు, డాక్టర్ జానకి కాజా దంపతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. డెలావేర్ మిడిల్ టౌన్ నమస్తే ఇండియా రెస్టారంట్ సహా వాలంటీర్లు మరియు క్రాస్ రోడ్స్ రెస్టారంట్, జో కేధార్, రాజన్ అబ్రహం ఇతర దాతలకు అభినందనలు తెలిపారు.2025 జూలై 3 నుంచి 5 వరకు డెట్రాయిట్లో 24వ తానా మహాసభలు జరగబోతున్నాయని తెలిపారు. అందమైన అలంకరణలకు ఫణి కంతేటి మరియు సంగీతాన్ని అందించినందుకు మూర్తి నూతనపాటి, రమణ రాకోతు, ఫోటోగ్రఫీ విశ్వనాధ్ కోగంటిలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తానా మిడ్ అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి వెంకట్ సింగు, సతీష్ తుమ్మల, సునీల్ కోగంటి, టీం స్క్వేర్ చైర్మన్ కిరణ్ కొత్తపల్లి, కృష్ణ నందమూరి, రంజిత్ మామిడి, గోపి వాగ్వాల, సురేష్ యలమంచి, చలం పావులూరి, ప్రసాద్ క్రొత్తపల్లి, కోటి యాగంటి, రవి ముత్తు, రాజు గుండాల, శ్రీనివాస్ అబ్బూరి, సుబ్బా ముప్పా, లీలాకృష్ణ దావులూరి, జాన్ ఆల్ఫ్రెడ్, హేమంత్ ఎర్నేని, సనత్ వేమూరి, హరీష్ అన్నాబత్తిన, రంజిత్ కోమటి, సంతోష్ రౌతు, ఉత్తమ్, హేమరాజ్, రాజా గందె, నాగ రమేష్, కృషిత నందమూరి, ప్రసాద్ కస్తూరి తదితరులు ఈ వేడుకలను విజయవంతం చేయడంలో కృషి చేశారు. -
YSRCP అంటే వాయిస్ ఆఫ్ వాయిస్‌లెస్.. పార్టీ ఆవిర్భావ వేడుకల్లో వైఎస్ జగన్ (చిత్రాలు)
-
Watch Live: YSRCP ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
-
ఎల్లప్పుడూ ప్రజల వెంటే.. మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. వైఎస్సార్సీపీ ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని, ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటుందని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ 15వ ఆవిర్భావ వేడుకలు(YSRCP Formation Day) బుధవారం ఏపీ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకలకు హాజరైన వైఎస్ జగన్.. మహానేత వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి, పార్టీ జెండా ఆవిష్కరించి ప్రసంగించారు. వైఎస్సార్సీపీ ఇవాళ 15వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. ప్రజల కష్టాల నుంచి వైఎస్సార్సీపీ పుట్టింది. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి పోరాడుతోంది. ప్రతిపక్షంలో కూర్చోవడం మనకు కొత్త కాదు. అధికారంలో ఉన్నవాళ్లకు ఎప్పటికప్పుడు ధీటైన సమాధానమే ఇస్తున్నాం. ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటాం.జగన్ చెప్పాడంటే.. చేస్తాడంతే అనే నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. ఇవాళ ప్రజల్లోకి ధైర్యంగా కాలర్ ఎగరేసుకుని వెళ్లగలిగే స్థితిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఉన్నారు. వైఎస్సార్సీపీ ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుంది. 3-4 ఏళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే అని అన్నారాయన. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన ఆయన.. ఇవాళ వైఎస్సార్సీపీ చేపట్టిన ఫీజు పోరు గురించి ప్రస్తావించారు. ఈ వేడుకల్లో పార్టీ ముఖ్యనేతలంతా పాల్గొన్నారు.ప్రజాభ్యుదయమే పరమావధిగా ఎదుగుతున్న వైఎస్సార్సీపీ(YSRCP).. సవాళ్లనే సోపానాలుగా మార్చుకుంది. ప్రజాసమస్యల పరిష్కారంపై మడమ తిప్పకుండా పోరాటాలు చేస్తోంది. మహానేత వైఎస్సార్ ఆశయ సాధన లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే రాజకీయాల్లో నైతిక విలువలను చాటిచెప్పిన వైఎస్ జగన్(YS Jagan) ‘నేను విన్నాను.. నేను ఉన్నానంటూ’ ప్రజలకు భరోసా ఇస్తున్నారు. -
పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సిద్ధమైన వైఎస్ఆర్సీపీ కార్యాలయం


