వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు | Sri Rama Navami Celebrations At Ysrcp Central Office | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు

Mar 27 2026 1:24 PM | Updated on Mar 27 2026 5:20 PM

Sri Rama Navami Celebrations At Ysrcp Central Office

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు నిర్వహించారు. వైభవంగా సీతారాముల కల్యాణం నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి, మల్లాది విష్ణు, జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని త్యజించి.. వనవాసం చేసిన మహోన్నతుడు శ్రీరాముడు ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మాన్ని వదలని శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడు. ఆ సకల గుణాభిరాముడు, శ్రీరాముడి దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

 విజయవాడ YSRCP ఆఫీస్ లో" శ్రీరామనవమి వేడుకలు

 

Advertisement
 
Advertisement
Advertisement