నిజమైన విజయం లభించింది | Chennai Love Story Rs 50 Crore Blockbuster Celebrations | Sakshi
Sakshi News home page

నిజమైన విజయం లభించింది

Aug 2 2026 1:42 AM | Updated on Aug 2 2026 1:42 AM

Chennai Love Story Rs 50 Crore Blockbuster Celebrations

రవి నంబూరి, శ్రీ గౌరిప్రియ, కిరణ్‌ అబ్బవరం, ఎస్‌కేఎన్, ధీరజ్‌

‘‘ఒక సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండటమే నిజమైన విజయం. ఆ సక్సెస్‌ మా ‘చెన్నై లవ్‌స్టోరీ’కి లభించింది’’ అని కిరణ్‌ అబ్బవరం అన్నారు. కిరణ్‌ అబ్బవరం, శ్రీ గౌరిప్రియ జంటగా నటించిన సినిమా ‘చెన్నై లవ్‌ స్టోరీ’. సాయి రాజేశ్‌ కథతో రవి నంబూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఎస్‌కేఎన్, సాయి రాజేశ్‌ నిర్మించిన ఈ సినిమా జూలై 24న విడుదలైంది. ఈ చిత్రం రూ. 50 కోట్ల వసూళ్లు సాధించిందని యూనిట్‌ పేర్కొంది.

శనివారం యూనిట్‌  నిర్వహించిన రూ. 50 కోట్ల బ్లాక్‌ బస్టర్‌ సెలబ్రేషన్‌లో కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ– ‘‘మా ‘చెన్నై లవ్‌స్టోరీ’ ప్రేమకథా చిత్రం కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్‌ వస్తారా? అనే సందేహం కలిగింది. ఇటీవల మేం థియేటర్స్‌ విజిట్‌ చేశాం. ప్రతి థియేటర్‌లో ఎక్కువ సంఖ్యలో ఫ్యామిలీ ఆడియన్స్‌ ఉంటున్నారు’’ అన్నారు. ‘‘ఒక సినిమాను ఎలా ప్రమోట్‌ చేయాలో ఈ సినిమా ప్రయాణంలో మా నిర్మాతల నుంచి నేర్చుకున్నాను’’ అని తెలి పారు రవి నంబూరి.

‘‘కంటెంట్‌ బాగుంటే విజయాన్ని అందించడంలో తెలుగు ప్రేక్షకులు ముందుంటారని మా సినిమాతో మరోసారి నిరూపితమైంది’’ అని చె΄్పారు శ్రీగౌరి ప్రియ.‘‘మా సినిమాకి ఘనవిజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అని అన్నారు సహ–నిర్మాత ధీరజ్‌ మొగిలినేని. ‘‘8 రోజుల్లోనే కిరణ్‌ గారి కెరీర్‌లో ఈ సినిమా బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలవడం హ్యాపీగా ఉంది’’ అని చె΄్పారు ఎస్‌కేఎన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement