చెన్నై లవ్‌స్టోరీ.. పీఆర్‌ టీమ్‌తో హిట్‌ కొట్టారా? కిరణ్‌ ఏమన్నారంటే? | Chennai Love Story Hero Kiran Abbavaram Responds On PR Trolls | Sakshi
Sakshi News home page

అలా అయితే.. ప్రతి సినిమా రూ. 200, 300 కోట్లు వసూలు చేయాలి

Jul 29 2026 11:16 AM | Updated on Jul 29 2026 11:23 AM

Chennai Love Story Hero Kiran Abbavaram Responds On PR Trolls

కిరణ్‌ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం చెన్నై లవ్‌స్టోరీ హిట్‌ టాక​్‌తో దూసుకెళ్తోంది. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే రూ. 40 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ నేపథ్యంలో నిన్న  ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ మీట్ ను యువసామ్రాట్ నాగచైతన్య ముఖ్య అతిథిగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు కిరణ్‌ అబ్బవరం తనదైన శైలీలో విశ్లేషణాత్మకమైన సమాధానం ఇచ్చాడు.

ప్రశ్నేంటి? కిరణ్‌ సమాధానమేంటి?
చెన్నై లవ్‌స్టోరీ హిట్‌ అవ్వడానికి కిరణ్‌ అబ్బవరం పీఆర్‌ టీమ్‌ అని.. తన పారితోషికంలో కొంత పీఆర్‌కి ఖర్చు చేసి.. తనే టికెట్లు కొనిచ్చి థియేటర్స్‌ నింపేశాడనే రూమర్స్‌ సోషల్‌ మీడియాలో వచ్చాయి. ఇదే విషయాన్ని నిన్నటి సక్సెస్‌ మీట్‌లో ఓ విలేకరి ప్రస్తావిస్తూ..‘సినిమా హిట్ అయిన తర్వాత పిఆర్ టీమ్ వల్లే ఈ హిట్ వచ్చిందని  మీమ్స్ వస్తున్నాయి.. దీనిపై మీ స్పందన ఏంటి?' అని ప్రశ్నించాడు.

దానికి కిరణ్‌ తనదైన శైలీలో జవాబు ఇచ్చాడు. ‘కేవలం పీఆర్‌తోనే  హిట్లు కొట్టేటట్లయితే ప్రతి సినిమా అందరూ కొడతారు కదండి. ఎప్పుడు ఏదో ఒక సక్సెస్ వచ్చినప్పుడు ఎవరో ఒకరిని ఏదో ఒక మాట అనాలన్న ఆలోచనతో అలా అనకండి. ఏ సినిమా అయినా పిఆర్‌తో ఎవరు ఎంత రుద్దినా ఏమీ అవ్వదు, మనం ఆడియన్స్‌ని, వాళ్ల తీర్పుని రెస్పెక్ట్ చేద్దాం. చెన్నై లవ్ స్టోరీ సినిమాకి థియేటర్లలో 60% ఫ్యామిలీస్ ఉన్నారు, వాళ్ళు ట్విటర్‌లో ఉండేవాళ్లు కాదు.. కేవలం మౌత్ టాక్‌తో థియేటర్లకు వచ్చినవాళ్లు. ఏదో ఒకటి అనాలని అనడం చాలా ఈజీ, కానీ సక్సెస్ వచ్చినప్పుడు ఇలాంటివి ఉంటాయి.

కొత్తేమి కాదు.. 
నాకు మొదటి సినిమా నుంచి ఇదంతా కొత్తేమీ కాదు. నాకు తెలిసింది ఒకటే.. కష్టపడాలి, నిజాయితీగా ఉండాలి, అదే సక్సెస్ ఇస్తుంది. దయచేసి ఆడియన్స్‌ని, వాళ్ల రివ్యూని రెస్పెక్ట్ చేయండి. పిఆర్ తోనే వస్తుందంటే అందరి దగ్గర కోట్ల డబ్బులు ఉంటాయి, అందరికన్నా నా దగ్గర తక్కువ ఉన్నాయి.. అలా అయితే అందరి సినిమాలు రూ. 200 కోట్లు, రూ.300 కోట్లు రావాలి కదా. కాబట్టి ఊరికే పిఆర్ అని ప్రచారం చేయవద్దని కోరుతున్నాను' అని  విజ్ఞప్తి చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్పు నెట్టింట చక్కర్లు కొడుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement