సుమంత్ న్యూటన్స్ థర్డ్ లా.. టిక్కెట్లపై బంపరాఫర్ | Tollywood Hero Sumanth Newtons third Law movie ticket price | Sakshi
Sakshi News home page

Newtons third Law: సుమంత్ న్యూటన్స్ థర్డ్ లా.. టిక్కెట్లపై బంపరాఫర్

Jul 29 2026 4:31 AM | Updated on Jul 29 2026 4:31 AM

Tollywood Hero Sumanth Newtons third Law movie ticket price

సుమంత్ లీడ్ రోల్‌లో వస్తోన్న లేటేస్ట్ మూవీ న్యూటన్స్ థర్డ్ లా. ఈ క్రైమ్ థ్రిల్లర్‌ మూవీకి రాజేష్ కర్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జూలై 31న థియేటర్లలో సందడి చేయనుంది.

ఈ సందర్భంగా మేకర్స్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. ఈ సినిమా థియేటర్లలో వీక్షించేందుకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఒక్కో టికెట్ కేవలం రూ.105కే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ త్వరలోనే ప్రారంభం కానున్నాయని మేకర్స్ తెలిపారు. ప్రేక్షకులు ఈ ఆఫర్‌ను వినియోగించుకోవాలని చిత్ర యూనిట్ కోరింది. కాగా.. ఈ సినిమాకు సింజిత్ యర్రమిల్లి సంగీతమందించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement