breaking news
Newtons Third Law
-
ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా
అక్కినేని హీరోల్లో సుమంత్ ఒకడు. చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ సత్యం, మళ్లీ రావా లాంటి మూవీస్ తప్పితే చెప్పుకోదగ్గ హిట్స్ లేవు. 'సీతారామం' లాంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ చేశాడు. ఇతడు నటించిన ఓ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.(ఇదీ చదవండి: కియారా నువ్వు చాలా లక్కీ.. ఆ సినిమా చేయలేదు)సుమంత్, జగపతిబాబు ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'న్యూటన్స్ థర్డ్ లా'. గత నెల 31న థియేటర్లలోకి వచ్చింది. థ్రిల్లర్ అంశాలు ఓ మాదిరిగా ఉన్నాయంతే. దీంతో జనాలు పెద్దగా పట్టించుకోలేదు. బహుశా ఓటీటీకి వచ్చిన తర్వాత చూద్దామని అనుకున్నట్లున్నారు. ఈ క్రమంలోనే నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించింది. ఈ శుక్రవారం నుంచి మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుందని వెల్లడించింది.'న్యూటన్స్ థర్డ్ లా' విషయానికొస్తే.. వినయ్(త్రినాథ్ వర్మ) ఇంజినీరింగ్ స్టూడెంట్. ఓరోజు అనుమానాస్పద రీతిలో చనిపోతాడు. ఈ కేసుని పోలీసాఫీసర్ వాసుదేవ్(సుమంత్) దర్యాప్తు చేయడం మొదలుపెడతాడు. వినయ్ తల్లిదండ్రుల్ని విచారించగా కొన్ని విషయాలు బయటపడతాయి. వీళ్లు ఏదో దాస్తున్నారని వాసుదేవ్ అనుమానిస్తాడు. ఇంతకీ వినయ్ ఎవరు? ఇతడికి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మెర్క్యురి(జగపతిబాబు)కి సంబంధమేంటి? ఈ కేసుకి 'న్యూటన్ థర్డ్ లా' పుస్తకంతో సంబంధమేంటనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్) -
సుమంత్ న్యూటన్స్ థర్డ్ లా.. టిక్కెట్లపై బంపరాఫర్
సుమంత్ లీడ్ రోల్లో వస్తోన్న లేటేస్ట్ మూవీ న్యూటన్స్ థర్డ్ లా. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి రాజేష్ కర్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జూలై 31న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ సందర్భంగా మేకర్స్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. ఈ సినిమా థియేటర్లలో వీక్షించేందుకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఒక్కో టికెట్ కేవలం రూ.105కే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ త్వరలోనే ప్రారంభం కానున్నాయని మేకర్స్ తెలిపారు. ప్రేక్షకులు ఈ ఆఫర్‌ను వినియోగించుకోవాలని చిత్ర యూనిట్ కోరింది. కాగా.. ఈ సినిమాకు సింజిత్ యర్రమిల్లి సంగీతమందించారు. -
న్యూటన్స్ థర్డ్ లా.. వారం ముందుగానే వస్తోంది
సుమంత్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ న్యూటన్ థర్డ్ లా. ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు రాజేశ్ కర్ణ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ ఖరారు చేశారు మేకర్స్. వారం రోజులు ముందుగానే థియేటర్లలో సందడి చేయనుందని ప్రకటించారు. జూలై 31న రిలీజ్ కానుందని వెల్లడించారు.ఈ చిత్రాన్ని క్రైమ్ థ్రిల్లర్ కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. జంట హత్యల చుట్టూ సాగే కథగా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రంలో సుమంత్‌తో పాటు జగపతి బాబు, కార్తీక్ రత్నం, రవివర్మ, నేహా పఠాన్, హరిణి రావు కీలక పాత్రల్లో నటించారు. మొదటి ఈ చిత్రాన్ని ఆగస్టు 7న విడుదల చేస్తామని ప్రకటించారు. తాజాగా వారం ముందుగానే ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. The reaction begins sooner than expected. ⚡️🔥 Newton's 3rd Law is now arriving in cinemas on July 31!!!Get ready for the ThrillerOfTheYear.#Newtons3rdLawMovie – In Theatres Worldwide on July 31#Newtons3rdLaw #ThrillerOfTheYear #TheReactionBegins #ReleaseUpdate… pic.twitter.com/19nuf5MfTp— Annapurna Studios (@AnnapurnaStdios) July 16, 2026 -
న్యూటన్ థర్డ్ లా మర్చిపోవద్దు!
బీజేపీ నాయకత్వానికి శత్రుఘ్న సిన్హా సవాలు న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం తనపై పార్టీ నాయకత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకోనుందన్న వార్తలపై బీజేపీ సీనియర్ నేత శత్రుఘ్న సిన్హా తీవ్రంగా స్పందించారు. ధైర్యముంటే తనపై చర్య తీసుకోవాలంటూ పార్టీకి పరోక్ష సవాలు విసిరారు. ‘‘వ్యక్తిగత రాజకీయ లబ్ధి లక్ష్యంగా కొందరు చేసే అనధికార వ్యాఖ్యలపై నేను స్పందించాలనుకోవడం లేదు. అయితే, ఒక విషయం ఎవరూ మర్చిపోకూడదు. ‘ప్రతీ చర్యకూ దానికి సమానమైన ప్రతిచర్య ఉంటుంది’ అన్న న్యూటన్ మూడో సూత్రాన్ని అంతా గుర్తుపెట్టుకోవాలి’’ అంటూ ఆ బీజేపీ రెబెల్ ఎంపీ మంగళవారం ట్వీట్ చేశారు. పార్టీ నాయకత్వంపై తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేసిన సిన్హా.. రాష్ట్రంలో తన ప్రాచుర్యంపై అసూయ పెంచుకున్న కొందరు రాష్ట్రస్థాయి బీజేపీ నేతలు తనకు వ్యతిరేకంగా పార్టీ అగ్రనాయకత్వానికి చాడీలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. గతంలో బీజేపీ ప్రధాన ప్రచార కర్తగా ఉన్న తనకు బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కోర్ కమిటీలో స్థానం లేకపోవడాన్ని, పార్టీ ప్రచార చిత్రాల నుంచి తన ఫొటోను తొలగించడాన్ని సిన్హా ప్రశ్నించారు. ప్రధాని మోదీ సాహసవంతుడని ప్రశంసించారు. తనను పిలిచి, అడిగితే రాష్ట్రంలో పార్టీకి సంబంధించిన వాస్తవాలను మోదీ సహా అగ్ర నాయకత్వానికి వివరిస్తానన్నారు.


