న్యూటన్స్ థర్డ్ లా.. వారం ముందుగానే వస్తోంది | Sumanth Latest Movie newtons Third Law new release date | Sakshi
Sakshi News home page

Newtons Third Law: న్యూటన్స్ థర్డ్ లా.. వారం ముందుగానే వస్తోంది

Jul 17 2026 7:04 PM | Updated on Jul 17 2026 7:11 PM

Sumanth Latest Movie newtons Third Law new release date

సుమంత్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ న్యూటన్ థర్డ్ లా. ఈ క్రైమ్ థ్రిల్లర్‌ సినిమాకు రాజేశ్ కర్ణ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ ఖరారు చేశారు మేకర్స్. వారం రోజులు ముందుగానే థియేటర్లలో సందడి చేయనుందని ప్రకటించారు. జూలై 31న రిలీజ్ కానుందని వెల్లడించారు.

ఈ చిత్రాన్ని క్రైమ్ థ్రిల్లర్ కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.  జంట హత్యల చుట్టూ సాగే కథగా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రంలో సుమంత్‌తో పాటు జగపతి బాబు, కార్తీక్ రత్నం, రవివర్మ, నేహా పఠాన్, హరిణి రావు కీలక పాత్రల్లో నటించారు. మొదటి ఈ చిత్రాన్ని ఆగస్టు 7న విడుదల చేస్తామని ప్రకటించారు. తాజాగా వారం ముందుగానే ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement