'నా బిడ్డ పెళ్లి.. మా అయ్య లొల్లి.. ఏందిరా ఈ పళ్లబురుసు' | Tollywood Movie Pallaburusu Title Glimpse out now | Sakshi
Sakshi News home page

'నా బిడ్డ పెళ్లి.. మా అయ్య లొల్లి.. ఏందిరా ఈ పళ్లబురుసు'

Jul 17 2026 5:47 PM | Updated on Jul 17 2026 5:55 PM

Tollywood Movie Pallaburusu Title Glimpse out now

బలగం నటులు సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న లేటేస్ట్ రూరల్ కామెడీ ఎంటర్‌టైనర్ పళ్లబురుసు. ఈ చిత్రానికి  ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్‌ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.

ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా రిలీజైన వీడియో చూస్తుంటే పక్కా విలేజ్ కామెడీ డ్రామాగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీని రూపొందించారు. ఈ చిత్రంలో ప్రజ్వల్, గోమతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు పవన్ సీహెచ్ సంగీతమందిస్తున్నారు. ఈ మూవీని ఆగస్టు 14న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement