దర్శకుడికి జాక్ పాట్.. గిఫ్ట్‌గా బంగారు గొలుసు, ఖరీదైన కారు | Vishnu Vishal Gifts Car To Gatta Kusthi 2 Director Chella Ayyavu | Sakshi
Sakshi News home page

Gatta Kusthi 2 Director: సినిమా సూపర్ హిట్.. దర్శకుడికి కాస్ట్ లీ బహుమతులు

Jul 17 2026 3:21 PM | Updated on Jul 17 2026 3:33 PM

Vishnu Vishal Gifts Car To Gatta Kusthi 2 Director Chella Ayyavu

విష్ణు విశాల్ హీరోగా, నిర్మాతగా చేసిన సినిమా 'గట్ట కుస్తీ 2'. రెండు వారాల క్రితం థియేటర్లలో రిలీజైంది. రివ్యూలు ఓ మాదిరిగా వచ్చినప్పటికీ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన దక్కించుకుంది. రూ.50 కోట్ల కలెక్షన్ దిశగా దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు చెల్ల అయ్యావుకి విష్ణు విశాల్ ఖరీదైన కారుని బహుమతిగా ఇచ్చాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

(ఇదీ చదవండి: సోనమ్ వాంగ్‌చుక్‌కు '3 ఇడియట్స్‌'తో సంబంధం లేదు)

'గత 11 ఏళ్లుగా నా జీవితంలో ప్రతి సంతోషంలో, ప్రతి కష్టంలో తోడుగా నిలిచావు. నీ నమ్మకం, స్నేహం, సపోర్ట్ గురించి మాటల్లో చెప్పలేను. ఈ బహుమతి నీకోసం. నువ్వు దీనికి పూర్తిగా అర్హుడివి' అని విష్ణు విశాల్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. సినిమా విడుదలకు ముందే చిత్రం భారీ విజయాన్ని సాధిస్తే కారును బహుమతిగా ఇస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లు విష్ణు విశాల్ చెప్పాడు. దర్శకుడు చెల్ల అయ్యావును ఆశ్చర్యపరుస్తూ కొత్త టయోటా హైక్రాస్ కారును అందజేశాడు. దీని ధర మార్కెట్ లో రూ.15-20 లక్షల మధ్య ఉంది.

ఇకపోతే కొన్నిరోజుల క్రితం ఇదే చిత్రానికి సక్సెస్ మీట్ జరిగింది. ఇందులో మరో నిర్మాత అయిన ఇషారి గణేశ్.. హీరో విష్ణు విశాల్‌కి బీఎండబ్ల్యూ 3 సిరీస్ కారును బహుమతిగా ఇచ్చారు. దర్శకుడు చెల్ల అయ్యావుకు 10 గ్రాముల బంగారు గొలుసు, బ్రేస్‌లెట్ బహుమతిగా ఇచ్చారు. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులకు 40 గ్రాముల వెండి నాణేలను అందజేశారు.

'గట్ట కుస్తీ 2' విషయానికొస్తే... కీర్తి రెజ్లింగ్ కెరీర్‌కు అండగా నిలబడతానని ఇచ్చిన మాట ప్రకారం వీరా, ఇంటి బాధ్యతలు స్వీకరించి హౌస్ హస్బెండ్‌గా మారతాడు. అయితే పిల్లల పెంపకం విషయంలో భార్యభర్తల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో దాంపత్య జీవితంలో విభేదాలు పెరుగుతాయి. విడాకుల వరకు వెళ్లిన వారి బంధం చివరకు కుటుంబ విలువల ప్రాముఖ్యతని ఎలా గుర్తించిందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement