రాజకీయాల్లోకి ఎంట్రీకి ముందు విజయ్ నటించిన చివరి సినిమా జన నాయగన్. ఎప్పుడో సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం సెన్సార్ సమస్యలతో వాయిదా పడింది. ఆ వివాదం ముగియడంతో దాదాపు ఏడు నెలల తర్వాత థియేటర్లలో రిలీజైంది. అభిమానుల భారీ అంచనాల మధ్య జన నాయకుడు ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
ఈ సినిమా రిలీజ్ వేళ సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ సినిమాకు దళపతి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనే నెట్టింట చర్చించుకుంటున్నారు. అయితే ఈ సినిమా కోసం విజయ్‌కు ఏకంగా రూ. 220 కోట్ల నుంచి రూ. 275 కోట్ల వరకు చెల్లించారని టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఓ ఇండియన్ హీరోకు దక్కిన అత్యధిక పారితోషికాలలో ఒకటిగా నిలిచే అవకాశముంది. అయితే ఈ విషయంలో మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనైతే లేదు.
మరోవైపు ఓ నివేదిక ప్రకారం దర్శకుడు హెచ్ వినోద్‌కు ఈ సినిమా కోసం రూ. 25 కోట్లు అందుకున్నారని టాక్. ఇదే నిజమైతే ఆయన కెరీర్‌లోనే అతిపెద్ద పారితోషికం కానుందని చెబుతున్నారు. ఈ మూవీకి సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఏకంగా రూ. 13 కోట్లు తీసుకున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా హీరోయిన్ పూజా హెగ్డేకు రూ. 6 కోట్ల వరకు ముట్టజెప్పారని సమాచారం. విలన్ రోల్ పోషించిన బాబీ డియోల్‌కు రూ. 5 నుంచి 10 కోట్ల మధ్య అందుకున్నట్లు తెలుస్తోంది.
అలాగే ఈ మూవీతో ప్రకాష్ రాజ్ రూ. 5 కోట్లు సంపాదించగా.. ప్రియమణి, గౌతమ్ వాసుదేవ్ మీనన్‌లకు చెరో రూ. 3 కోట్లు చెల్లించారని టాక్. ఈ మూవీ కోసం నరైన్ రూ. 2.5 కోట్లు అందుకున్నట్లు చెబుతున్నారు. మమితా బైజు రెమ్యునరేషన్ దాదాపు రూ. 60 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు ఉందని తెలుస్తోంది. అయితే ఈ పారితోషికాలపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు.


