దళపతి విజయ్ సీఎం అయ్యాక రిలీజవుతోన్న మొదటి సినిమా 'జన నాయగన్'. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ మూవీ.. ఎట్టకేలకు ఇవాళ థియేటర్లలో విడుదలైంది. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. దాదాపు ఏడు నెలల గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ థియేటర్లకు క్యూ కట్టారు.
ఈ సందర్భంగా థియేటర్లలో ఆసక్తికర సన్నివేశం కనిపించిది. ఇప్పటి వరకు దళపతి విజయ్ అని పడిన టైటిల్ కార్డు.. ఇప్పుడు గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ థియేటర్లలో కనువిందు చేసింది. సీఎం విజయ్ అని స్క్రీన్‌మీద కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అది కూడా విజయ్ సీఎం అయ్యాక అసెంబ్లీలో ఆయన చేసిన సంజ్ఞతో ఈ టైటిల్‌కార్డు వేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. అల్లు అర్జున్ స్టైల్లో గడ్డం కింద చేయి పెట్టి డీఎంకేను విజయ్ ఎద్దేవా చేస్తూ ఓ సైగ చేశారు. ఆ స్టిల్ నెట్టింట తెగ వైరల్ కాగా.. ఇప్పుడదే థియేటర్‌లో కనిపించడంతో ఆ వీడియోలు అభిమానులు నెట్టింట షేర్ చేస్తున్నారు.
#JanaNayagan
Santhosa Padratha illa varuththa Padratha theriyala 🥺 any way love you na @actorvijay 🫂 forever ♾️ ni maddum than 🫀 pic.twitter.com/MvZJC0yEqf— Sai Jegadheesh (@saijegadheeshh) July 23, 2026


