సూపర్ హిట్ సినిమా ‘ఖడ్గం’ మళ్లీ విడుదల కానుంది. శ్రీకాంత్, రవితేజ, ప్రకాశ్‌రాజ్, శివాజీ రాజా, సోనాలీ బెంద్రే, సంగీత ముఖ్య తారలుగా నటించిన సినిమా ‘ఖడ్గం’. కృష్ణవంశీ దర్శకత్వంలో సుంకర మధుమురళి నిర్మించిన ఈ సినిమా 2002 నవంబరు 29న విడుదలై, భారీ విజయం సాధించింది. దేశభక్తి ప్రధానంగా రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 15న రీ రిలీజ్ కానుంది.
దేవరపల్లి రేవంత్ సమర్పణలో విష్ణు మొలకల నక్షత్ర నిర్మాతగా, కృష్ణ వడిగేపల్లి, కాకర్లమూడి రామకృష్ణ సహ–నిర్మాతలుగా ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘‘దేశభక్తి, భావోద్వేగం, ప్రేమ, వినోదం... ఇలా అన్ని అంశాల మేళవింపుతో ‘ఖడ్గం’ సినిమా రూపొందింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం అందించారు’’ అని యూనిట్ పేర్కొంది.


