పూజా హెగ్డే.. మళ్లీ పిలుపొచ్చింది! | Pooja Hegde In Talks Allu Arjun And Raviteja Movies | Sakshi
Sakshi News home page

Pooja Hegde: అటు అల్లు అర్జున్.. ఇటు రవితేజ?

Jul 22 2026 3:20 PM | Updated on Jul 22 2026 3:31 PM

Pooja Hegde In Talks Allu Arjun And Raviteja Movies

ఆరేడేళ్ల క్రితం తెలుగులో పలు హిట్ సినిమాలు చేసిన పూజా హెగ్డే.. తర్వాత వరస డిజాస్టర్ల దెబ్బకు పూర్తిగా టాలీవుడ్‌లో కనిపించకుండా పోయింది. ఈమె నటించిన 'జన నాయగన్' రిలీజ్‌కి సిద్ధమైంది. కానీ ఇందులో ఈమె సీన్స్ పెద్దగా ఉండవని దర్శకుడు హెచ్.వినోద్ తేల్చేశాడు. మరోవైపు ఈమె 'శ్రీశ్రీ' అనే తెలుగు సినిమా చేస్తోంది గానీ ఇందులో దుల్కర్ హీరో. అయితే ఇప్పుడు ఈమెని వెతుక్కుంటూ మరో రెండు తెలుగు మూవీస్ వెళ్లాయట.

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న ఫేమస్ యూట్యూబర్.. ఏడాదికి రూ.600 కోట్ల సంపాదన)

'రాకా' సినిమాతో బిజీగా ఉన్న అ‍ల్లు అర్జున్.. మరోవైపు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలోనూ నటించబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా త్వరలోనే షూటింగ్ మొదలయ్యే అవకాశముంది. ఈ మూవీలో హీరోయిన్‌గా పూజా హెగ్డేని అనుకుంటున్నారట. గతంలో బన్నీ-పూజా కలిసి దువ్వాడ జగన్నాథం, అల వైకుంఠపురములో చిత్రాల్లో నటించారు. అప్పట్లో సక్సెస్ అందుకున్నారు గానీ ఇప్పుడు పూజా ఫామ్ ఏమంత గొప్పగా లేదు. మరి ఈమెని ఓకే చేస్తారా లేదా అనేది చూడాలి?

మరోవైపు రవితేజ సరసన కూడా పూజా హెగ్డే ఛాన్స్ కొట్టినట్లు కనిపిస్తుంది. రవితేజ-శ్రీ విష్ణు హీరోలుగా ఓ మల్టీస్టారర్ చేస్తున్నారు. హసిత్ గోలి దర్శకుడు. ఈ ప్రాజెక్ట్ కోసం పూజాని ఓ హీరోయిన్‌గా అనుకుంటున్నారట. ఒకవేళ ఇది నిజమైతే కష్టకాలంలో ఈ బ్యూటీకి బంపర్ ఆఫర్ దొరికినట్లే. ఈ రెండు చిత్రాలు గనక సెట్ అయి, ఇవి హిట్ అయితే గనక పూజా మళ్లీ తెలుగులో బిజీ అయ్యే ఛాన్స్ ఉంటుంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement