80.90ల్లో పిల్లల్ని ఎంతగానో అలరించిన చాలా యానిమేటెడ్ పాత్రల్ని రీసెంట్ టైంలో లైవ్ యాక్షన్ సినిమాలుగా తీస్తున్నారు. హౌ టూ ట్రెయిన్ యువర్ డ్రాగన్, డోరా, మోగ్లీ లాంటివి ఇలానే వచ్చాయి. ప్రేక్షకుల్ని అలరించాయి. ఇదే దారిలో వచ్చిన మరో మూవీ 'హీ మ్యాన్ మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్'. గత నెలలో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ఓ మాదిరిగా ఆకట్టుకుంది. ఇప్పుడిది ఓటీటీలోకి వచ్చేసింది.
(ఇదీ చదవండి: రూ.251 ఫోన్ స్కామ్ గుర్తుందా? ఈ కాన్సెప్ట్‌తో ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ తెలుగు సిరీస్)
ట్రావిస్ నైట్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ కథతో తెరకెక్కించారు. ప్రస్తుతం ఇది అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో హీరో పాత్రకు తెలుగులో హీరో నిఖిల్ డబ్బింగ్ చెప్పాడు. డంకన్‌కు రావు రమేశ్, విలన్ పాత్రకు ఆదిత్య మీనన్ గాత్రమందించారు.
'హీ మ్యాన్ మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్' విషయానికొస్తే.. విశ్వాన్ని శాసించాలనే కోరికలున్న స్కెలిటార్ అనే రాక్షసుడు.. అద్భుత శక్తులున్న ఓ ఆయుధం కోసం ఎటర్నియా గ్రహంపై దాడి చేస్తాడు. దీంతో ఆ సామ్రాజ్యం చెల్లాచెదురవుతుంది. రాజు, రాణి.. ఆ ఆయుధాన్ని పిల్లాడిగా ఉన్న తన కొడుకు ఆడమ్‌కి ఇచ్చి భూమిపైకి పంపేస్తారు. కానీ ఆ ఆయుధం పిల్లాడి దగ్గర నుంచి మిస్ అవుతుంది. భూమిపై పెరిగి పెద్దవాడైన ఆడమ్.. ఎలాగైనా సరే తన గ్రహానికి వెళ్లాలని అనుకుంటూ ఉంటాడు. ఓ సందర్భంగా తన దగ్గర నుంచి మిస్ అయిన ఆయుధం ఆచూకీ లభిస్తుంది. కానీ దాన్ని పొందే క్రమంలో ఇతడిపై ఓ వింత జంతువు దాడి చేస్తుంది.
ఈ జంతువు నుంచి తప్పించుకున్న ఆడమ్.. తన చిన్నప్పటి ఫ్రెండ్, సేనాధిపతి కూతురు తీలా సాయంతో తిరిగి తన గ్రహానికి చేరుకుంటాడు. కానీ అప్పటికే ఆ గ్రహం మొత్తం నాశనమైపోయింటుంది. తన తల్లిదండ్రులతో పాటు మరికొందరు.. స్కెలిటార్ దగ్గర బందీగా ఉంటారు. వీళ్లని రక్షించేందుకు ఆడమ్ రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలోనే ఆడమ్ తన శక్తిని తిరిగి ఎలా పొందగలిగాడు. హీ-మ్యాన్ ఎలా అయ్యాడు? చివరకు శత్రువులని మట్టుబెట్టాడా లేదా అనేది మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)


