సరిగ్గా పదేళ్ల క్రితం 'ఫ్రీడమ్ 251' పేరుతో ఓ స్కామ్ జరిగింది గుర్తుందా? రూ.251కే స్మార్ట్ ఫోన్ ఇస్తామని చెప్పి నోయిడాకు చెందిన కంపెనీ ప్రకటించుకుంది. జనాలు కూడా దీని కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు. డబ్బులు కూడా కట్టారు కానీ తర్వాత ఇదో పెద్ద స్కామ్ అని తేలింది. ఇప్పుడీ కాన్సెప్ట్‌తో తెలుగులో ఓ వెబ్ సిరీస్ రానుందని ప్రకటించారు. ఈ మేరకు స్ట్రీమింగ్ డేట్ కూడా ప్రకటించారు.
(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి మృణాల్ ఠాకుర్ థ్రిల్లర్ సినిమా)
'ఆజాదీ 501' పేరుతో తీసిన ఈ సిరీస్.. ఆహా ఓటీటీలో ఈ నెల 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అంటే వచ్చే బుధవారం నుంచి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో తీసిన ఈ సిరీస్‌కి శివతేజ దర్శకుడు. పోస్టర్, ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే ఇందులో పేరున్న నటీనటులు అయితే ఎవరూ నటించలేదు. మరి ఇది ఏ మేరకు ప్రేక్షకుల్ని మెప్పిస్తుందో చూడాలి?
ఇకపోతే ఈ వారం ఓటీటీల్లోకి చెప్పుకోదగ్గ తెలుగు సినిమాలేం రావట్లేదు. ఉన్నంతలో పల్లిచట్టంబి, కాన్ సిటీ అనే డబ్బింగ్ మూవీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటికి తోడుగా ముసాఫిర్ కేఫ్, ఆదర్శ్ బాలవిద్యాలయ లాంటి డబ్బింగ్ సిరీస్‌లు ఈ వీకెండ్ అందుబాటులోకి రాబోతున్నాయి.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)


