నేరుగా ఓటీటీలోకి మృణాల్ థ్రిల్లర్ సినిమా | Mrunal Thakur Pooja Meri Jaan Movie OTT Release | Sakshi
Sakshi News home page

Mrunal Thakur OTT: నాలుగేళ్లకు మోక్షం.. ఎట్టకేలకు ఓటీటీలోకి మూవీ

Jul 21 2026 11:09 AM | Updated on Jul 21 2026 11:16 AM

Mrunal Thakur Pooja Meri Jaan Movie OTT Release

ప్రతి భాషలోనూ ప్రతి ఏడాది వందలకొద్ది సినిమాలని తీస్తుంటారు. అయితే వీటిలో నుంచి థియేటర్లలోకి కొన్ని వస్తుంటాయి. మరికొన్ని మాత్రం ల్యాబ్‌ల్లోనే మగ్గుతుంటాయి. చిన్న నటీనటులు చేసిన మూవీస్ విషయంలో ఇలా జరిగితే ఏదోలే అనుకోవచ్చు. కొన్నిసార్లు స్టార్స్ చేసిన చిత్రాలకు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. అలాంటిదే మృణాల్ ఠాకుర్ విషయంలో జరిగింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

మృణాల్ ఠాకుర్ ప్రధాన పాత్రలో నటించిన హిందీ సినిమా 'పూజా మేరీ జాన్'. హ్యుమా ఖురేషీ కీలక పాత్ర చేసింది. అప్పుడెప్పుడో 2022లోనే మూవీ సిద్ధం చేసినప్పటికీ థియేటర్లలో రిలీజ్ మాత్రం అవ్వలేదు. తొలుత దీని హక్కుల్ని హాట్‌స్టార్ దక్కించుకుంది. కానీ జియో సంస్థతో విలీనం కావడం లాంటివి జరగడంతో ఈ ప్రాజెక్ట్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

మళ్లీ ఇన్నాళ్లకు 'పూజా మేరీ జాన్' సినిమా సంగతి బయటకొచ్చింది. దీని డిజిటల్ హక్కుల్ని జీ5 ఓటీటీ సంస్థ దక్కించుకుంది. తాజాగా రిలీజ్ చేసిన వీడియోతో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. చూస్తుంటే దీనిని నేరుగా స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చే అవకాశముంది. కానీ తేదీ అయితే ప్రకటించలేదు. నవజ్యోత్ గులాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాని థ్రిల్లర్ స్టోరీతో తెరకెక్కించారు.

'పూజా మేరీ జాన్' విషయానికొస్తే.. పూజా అనే సాధారణ అమ్మాయి జీవితంలోకి ఒక అపరిచిత వ్యక్తి ఎంట్రీ ఇస్తాడు. అతను పూజాను పిచ్చిగా ప్రేమిస్తూ, ఆమె ప్రతి కదలికను గమనిస్తూ ఉంటాడు. పూజాని ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, ఇంటర్నెట్ ద్వారా తీవ్రంగా భయభ్రాంతులకు గురిచేస్తుంటాడు. ఈ డిజిటల్ వేధింపుల వల్ల పూజ జీవితం ఎలా నరకంగా మారింది? ఆ అజ్ఞాత వ్యక్తి నుండి తనని తాను కాపాడుకోవడానికి ఏం చేసిందనేది? స్టోరీలా అనిపిస్తుంది.

(ఇదీ చదవండి: జీ5 ఓటీటీలోకి ఏకంగా 60 సినిమాలు.. తెలుగు నుంచి తొమ్మిది)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement