అర్జున్‌దాస్, అన్నాబెన్ జంటగా నటించిన చిత్రం కాన్ సిటీ. కమెడియన్ యోగిబాబు, వీటీవీ గణేశ్ కీలక పాత్రల్లో కనిపించారు. హరీష్ దురైరాజ్ దర్శకత్వంతో పాటు నిర్మాతగా వ్యవహరించారు. ఈ ఏడాది జూన్ 26న తెలుగు, తమిళంలో రిలీజైంది. మనీ కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది.
తాజాగా ఈ సినిమా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నెల 24 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ చిత్రం తెలుగు, తమిళంతో పాటు కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా? అన్న డైలాగ్ ఎప్పుడో ఒకసారి వినే ఉంటారు. ఆ మాట నిజమైతే బాగుండు అనుకునేవాళ్లూ లేకపోలేదు.. దాదాపు అలాంటి కాన్సెప్ట్‌తో వచ్చిన చిత్రమే "కాన్ సిటీ". ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.


