శ్రీనివాస మంగాపురం.. క్రేజీ లవ్ సాంగ్ రిలీజ్ | Jayakrishna Srinivasa Mangapuram latest Movie song out now | Sakshi
Sakshi News home page

Srinivasa Mangapuram: శ్రీనివాస మంగాపురం.. క్రేజీ లవ్ సాంగ్ రిలీజ్

Jul 20 2026 2:51 PM | Updated on Jul 20 2026 3:08 PM

Jayakrishna Srinivasa Mangapuram latest Movie song out now

ఘట్టమనేని జయకృష్ణ హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ శ్రీనివాస మంగాపురం. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. జూలై 30న థియేటర్లలో సందడి చేయనుంది.

ఈ నేపథ్యంలోనే ప్రమోషన్లతో దూసుకెళ్తున్నారు మూవీ టీమ్. తాజాగా ఈ చిత్రంలోని ఓ క్రేజీ సాంగ్‌ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలోని రావే చెలియా అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ మూవీలో రషా తడానీ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ పాటకు నాగ్ అర్జున్ రెడ్డి లిరిక్స్ అందించారు. ఈ సాంగ్‌ను కపిల్ కపిలన్ ఆలపించగా.. జీవీ ప్రకాశ్ కుమార్ కంపోజ్ చేశారు.

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement