మిల్కీ బ్యూటీ ఎయిర్‌పోర్ట్‌ లుక్‌ | Tamannaah Bhatia Bold Airport Look Goes Viral, Sparks Social Media Buzz, Watch Video Inside | Sakshi
Sakshi News home page

మిల్కీ బ్యూటీ ఎయిర్‌పోర్ట్‌ లుక్‌

Jul 25 2026 7:49 AM | Updated on Jul 25 2026 9:07 AM

tamanna airport look Photos

మానవ జీవితంలో ప్రచారం ఒక భాగమైపోయిందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ ఉత్పత్తులు విక్రయించాలన్నా, కొనాలన్నా ప్రచారం ముఖ్య భూమిక పోషిస్తోంది. సినిమా రంగంలోనూ ఇది అత్యంత ప్రాధాన్యతగా మారింది. ముఖ్యంగా నటీనటులు తమదైన స్టైల్‌లో పబ్లిసిటీ చేసుకోవడంలో ముందుంటున్నారు. 

అలా ప్రచారానికి కాదేది అనర్హం అన్న విధంగా ప్రవర్తిస్తూ పాపులారిటీ పొందుతున్నారు. అలా తరచూ వార్తల్లో నిలిచే నటి తమన్నా. అన్ని రకాల పాత్రలను పోషించే సత్తా ఉన్న ఈమె ఐటెం సాంగ్‌ గర్ల్‌ గానే ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఇందుకు నటి తమన్నా శారీరక సంపద ఒక కారణం కావచ్చు. అందుకే ఈమెను అభిమానులు మిల్కీ బ్యూటీ అని పిలుచుకుంటారు. బాలీవుడ్‌లో నటిగా రంగ ప్రవేశం చేసినా, ఆ తర్వాత తెలుగు, తమిళం భాషల్లో  అత్యధికంగా చిత్రాలు చేసి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగారు. 

 

 

ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుసగా చిత్రాలు చేస్తున్న ఈ బ్యూటీ ఆ మధ్య నటుడు విజయ్‌ వర్మతో ప్రేమలో పడి, అందులో విఫలం కావడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. కాగా హీరోయిన్లు సాధారణంగా పార్టీల్లో, ఇతర సినిమా కార్యక్రమాల్లో గ్లామరస్‌ దుస్తులు ధరించి పాల్గొంటుంటారు. నటి తమన్నా మాత్రం పబ్లిక్‌ ప్రదేశాల్లోనూ కుర్రకారును కవి్వంచే విధంగా డ్రస్‌ వేసుకుని తిరుగుతుండడం విశేషం. తాజాగా ఈమె టైట్‌ దుస్తులు ధరించి ఎయిర్‌పోర్టులో వెళుతున్న దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఇది ఎక్కడ జరిగిందో కానీ నెటిజన్లు మాత్రం ఇదో రకం పబ్లిసిటీ స్టంట్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. 
 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement