‘ఎయిర్‌పోర్ట్‌ సిటీ’లపై రూ. 20 వేల కోట్ల పెట్టుబడులు | Adani Rs 20000 Crore Investment Airport City Projects India | Sakshi
Sakshi News home page

‘ఎయిర్‌పోర్ట్‌ సిటీ’లపై రూ. 20 వేల కోట్ల పెట్టుబడులు

Jun 26 2026 7:34 AM | Updated on Jun 26 2026 11:05 AM

Adani Rs 20000 Crore Investment Airport City Projects India

న్యూఢిల్లీ: భారీ స్థాయిలో చేపడుతున్న ఎయిర్‌పోర్ట్‌ సిటీ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులపై అదానీ ఎయిర్‌పోర్ట్‌ (ఏఏసీఎల్‌) తొలి దశలో రూ. 20,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్‌ చేయనుంది. ఇందులో అత్యధికంగా 70 శాతాన్ని ముంబై, నవీ ముంబైలో పెట్టుబడులు పెట్టనుంది. ఈ ప్రాంతంలో కంపెనీ చేతిలో దాదాపు 440 ఎకరాల స్థలం ఉంది.

ఏఏసీఎల్‌ అయిదు రాష్ట్రాల్లో ఆరు విమానాశ్రయాలవ్యాప్తంగా 655 ఎకరాల్లో సిటీ ప్రాజెక్టులను చేపడుతోంది. మెట్రో, పట్టణ ప్రాంత రవాణా నెట్‌వర్క్‌లతో విమానాశ్రయాలను అనుసంధానం చేసేలా వీటిలో హోటళ్లు, ఆఫీసులు, రిటైల్, ఎంటర్‌టైన్‌మెంట్, కన్వెన్షన్‌ సెంటర్లు మొదలైనవి ఏర్పాటవుతాయి. ముంబై, నవీ ముంబై, అహ్మదాబాద్, లక్నో, జైపూర్, గౌహతి ఎయిర్‌పోర్టులు ఈ జాబితాలో ఉన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement