విజయవాడ : ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్త బృందాలు ఆదివారం అమ్మవారి సన్నిధికి చేరుకుని భక్తిశ్రద్ధలతో సారె సమర్పించారు.
ఉదయం 6 నుంచే ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి.
ఆలయ ప్రాంగణంలో భక్తులు సెల్‌ఫోన్లతో ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ హడావుడి చేశారు.
సెల్‌ఫోన్ వినియోగం నిషేధం ఉన్నా ఆ దిశగా ఆలయ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ


