బ్రెజిల్‌లో విషాదం: హెలికాప్టర్ కూలి నలుగురు మృతి! | Tragedy In Rio, Helicopter Crash Kills Pilot And Three Colombian Women During Family Trip | Sakshi
Sakshi News home page

బ్రెజిల్‌లో విషాదం: హెలికాప్టర్ కూలి నలుగురు మృతి!

Aug 9 2026 9:31 AM | Updated on Aug 9 2026 11:39 AM

Tragedy in Brazil Four dead in helicopter crash

రియో డి జెనెరో: బ్రెజిల్‌లోని రియో డి జెనీరోలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని స్థానిక కొలంబియన్ కాన్సులేట్ తెలిపింది. మృతులలో ఒక పైలట్‌తో పాటు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కొలంబియన్ మహిళలు ఉన్నారు. వీరు నగరంలోని విస్టా చినెసా సమీపంలో గల టిజుకా నేషనల్ పార్కు వద్ద విహారయాత్ర చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

15 ఏళ్ల బాలిక పుట్టినరోజు వేడుకల కోసం వచ్చిన ఈ కుటుంబంలోని ఆరుగురిలో, హెలికాప్టర్ సామర్థ్యం పరిమితంగా ఉండటంతో ముగ్గురు మాత్రమే ప్రయాణించి మృత్యువాత పడ్డారు. ప్రమాద ఘటనపై రియో డి జెనీరో మేయర్ ఎడ్వర్డో కావలియర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నగరంలో పర్యాటక ఆకర్షణగా మారిన హెలికాప్టర్ విహారయాత్రల భద్రతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

కొత్త భద్రతా ప్రమాణాలను అమలు చేసే వరకు ఈ విమాన సేవలను ఒకటి లేదా రెండు వారాల పాటు నిలిపివేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ చేపట్టాలని బ్రెజిల్ నేషనల్ సివిల్ ఏవియేషన్ ఏజెన్సీని కోరినట్లు ఆయన తెలిపారు. గతంలో జూన్ 14న రిక్రియో డోస్ బాండీరాంటెస్ శివారులో రెండు హెలికాప్టర్లు గాలిలో ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందారు.

ఇది కూడా చదవండి: క్షేమంగానే మొజ్తాబా ఖమేనీ?.. వీడియో హల్‌చల్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement