Photo Credit: Twitter
మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ క్రీడలో విషాదం చోటుచేసుకుంది. బ్రెజిల్‌కు చెందిన ఫ్లైవెయిట్ యూఎఫ్‌సీ ఫైటర్ అలన్ నాసిమెంటో (34) గుండెపోటుతో కన్నుమూశాడు. సోమవారం ఉదయం నిద్రలోనే అలన్ నాసిమెంటో తుదిశ్వాస విడిచినట్లు యూఎఫ్‌సీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. 2021లో యూఎఫ్‌సీ ఫైటర్‌గా కెరీర్ ప్రారంభించిన నాసిమెంటో రికార్డు ఆక్టాగన్ ఫైట్ విభాగంలో 4-2గా ఉంది.
జూన్‌లో తన చివరి యూఎఫ్‌సీ ఫైట్‌లో పాల్గొన్న నాసిమెంటోకు సోమవారం ఉదయం నిద్రలోనే గుండె పోటు వచ్చింది. దీంతో అతడి కుటుంబసభ్యులు సమాచారం ఇవ్వడంతో అత్యవసర సిబ్బంది నాసిమెంటో ఇంటికి వచ్చి సీపీఆర్ చేశారు. కానీ అప్పటికే అతడి ప్రాణం పోయినట్లు తెలుస్తోంది. ఇక ప్రొఫెషనల్ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) కెరీర్‌లో ఫైటర్‌గా 22 విజయాలు, ఏడు పరాజయాలు చవిచూశాడు.
కోచ్ డియెగో లిమా వద్ద శిక్షణ పొందుతూ, నాసిమెంటో..మాజీ యూఎఫ్‌సీ లైట్‌వెయిట్ ఛాంపియన్ చార్లెస్ ఒలివెరా, యూఎఫ్‌సీ లైట్‌వెయిట్ ఎల్వెస్ బ్రెనర్‌తో సహా పలువురు అగ్రశ్రేణి బ్రెజిలియన్ ఫైటర్లతో తలపడ్డాడు. మరోవైపు యూఎఫ్‌సీ కూడా అలన్ నాసిమెంటో చేసిన ఎంఎంఏ ఫైటర్‌గా సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగ ప్రకటన విడుదల చేసింది. అలన్ నాసిమెంటో ఒక నైపుణ్యం ఉన్న పోటీదారుడు, పరిపూర్ణ ఎంఎంఏ ఫైటర్ అని కొనియాడింది.
This morning, Monday, August 3rd, our beloved flyweight fighter, Allan Nascimento, was found unresponsive after suffering an apparent heart attack in his sleep. Despite the efforts of the responding medical team, he was pronounced deceased at the scene.
Our thoughts and deepest… pic.twitter.com/vlaBaBOyJr— UFC (@ufc) August 3, 2026


