హోటల్‌ గదిలో బ్యూటీషియన్‌ ఆత్మహత్య | Tragic End In Visakhapatnam, Young Woman Found Dead In Hotel Room, Police Probe Underway | Sakshi
Sakshi News home page

హోటల్‌ గదిలో బ్యూటీషియన్‌ ఆత్మహత్య

Aug 3 2026 7:55 AM | Updated on Aug 3 2026 9:53 AM

Young Woman Ends Life In Visakhapatanam

విశాఖపట్నం: ప్రియుడి మృతిని తట్టుకోలేక తీవ్ర మనోవేదనకు గురైన ఓ యువతి హోటల్‌ గదిలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం పీఎం పాలెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాల మేరకు.. బొబ్బిలికి చెందిన షేక్‌ రషీదా బేగం (26) గాజువాకలో బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది. ఆమెకు సన్నిహితుడైన లింగాల వెంకట గణేష్‌ ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. ఆ ఘటన తర్వాత రషీదా బేగం తీవ్ర మనోవేదనలో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. 

శనివారం ఆమె క్రికెట్‌ స్టేడియానికి ఎదురుగా ఉన్న హోటల్‌లో ఒక గది అద్దెకు తీసుకుంది. ఆదివారం మధ్యాహ్నం వరకు ఆమె బయటకు రాలేదు. హోటల్‌ సిబ్బంది పలుమార్లు ఫోన్‌ చేసినా స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గది తలుపులు తెరిచి పరిశీలించగా, రషీదా బేగం స్కార్ఫ్‌తో ఉరివేసుకుని మృతి చెందినట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై ఎస్‌ఐ డి.రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement