Photo Credit: BCCI Twitter
శ్రీలంకతో జరగనున్న టెస్టు సిరీస్‌లో తానేంటో నిరూపించుకోవాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు వికెట్‌కీపర్ రిషబ్ పంత్. ఈ నేపథ్యంలోనే భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కనుసన్నల్లో రాంచీలో ప్రత్యేక పాఠాలు నేర్చుకుంటున్నాడు. ఈ సిరీస్ పంత్‌కు చాలా కీలకమని చెప్పొచ్చు. ఒక ఎండ్‌లో ధ్రువ్ జురెల్ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వేళ లంక పర్యటనలో పంత్ రాణించాల్సిన అసవరముంది.
అంతేకాదు మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌లో పంత్ కీలకం కానున్నాడు. స్పిన్నర్లకు బాగా అనుకూలించే లంక పిచ్‌లపై రాణించాలని పంత్ ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ధోని సూచనలు తీసుకునేందుకు పంత్ రాంచీ వెళ్లాడు. తాజాగా ధోని సలహాలు, సూచనలు తీసుకుంటున్న ఫొటోలను పంత్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ ఫొటోల్లో ధోని, పంత్‌తో పాటు మాజీ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ కూడా ఉన్నాడు.
ట్రెయినింగ్‌లో భాగంగా స్పిన్నర్లను ఎలా ఎదుర్కోవాలి, వికెట్‌కీపింగ్ కండిషన్లు ఎలా ఉంటాయన్న దానిపై పంత్ ధోని నుంచి సలహాలు తీసుకున్నాడు. ఇక ధోని స్పిన్ బౌలింగ్‌ను అర్థం చేసుకోవడంలో మంచి నేర్పరి. ఇన్నేళ్ల తన అనుభవంలో ఉపఖండపు పిచ్‌లపై వికెట్ కీపింగ్ కండిషన్‌ను కూడా అంచనా వేయడంలో ధోని దిట్ట.
మరి లంక పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో ధోని ఇచ్చిన సలహాలతో పంత్ చెలరేగుతాడేమో చూడాలి. ఇటీవలే వైట్‌బాల్ క్రికెట్‌లోనూ తిరిగి రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న పంత్ మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌ను కలిసి సలహాలు అందుకున్న సంగతి తెలిసిందే. ఇక శ్రీలంక గడ్డపై టీమిండియా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. తొలి టెస్టు గాలే వేదికగా ఆగస్టు 15 నుంచి 19 వరకు, రెండో టెస్టు కొలంబో వేదికగా ఆగస్టు 23 నుంచి 27 వరకు జరగనున్నాయి.
శ్రీలంకతో టెస్టులకు భారత జట్టు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్) కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్*, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, మానవ్ సుతార్, అకీబ్ నబీ, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ క్రిష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాంశ్ జైన్.
MS Dhoni sharing his experience with Rishabh Pant.💛 pic.twitter.com/uuvEOKfgT7
— Cricket Central (@CricketCentrl) July 31, 2026
Rishabh Pant taking a ride in Ranchi with Thala 🤩#Cricket #Dhoni
pic.twitter.com/YtbFlCawol— CREX (@Crex_live) August 2, 2026


