శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు మరో భారీ షాక్ తగిలే అవకాశముంది. ఇప్పటికే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా శ్రీలంక టూర్‌కు దూరం కాగా.. ఇప్పుడు యువ బ్యాటర్ సాయి సుదర్శన్ అందుబాటుపై కూడా సందేహాలు నెలకొన్నాయి.
స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్ సందర్భంగా సుదర్శన్ కాలి బొటనవేలికి గాయమైంది. సుదర్శన్ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కోలుకుంటున్నాడు. శ్రీలంకతో సిరీస్ సమయానికి సుదర్శన్ పూర్తిగా కోలుకుంటాడని భావించిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ.. భారత జట్టులో అతడికి చోటు కల్పించింది.
అయితే సిరీస్‌కు ముందు అతడు తన ఫిట్‌నెస్ నిరూపించుకోవాలని సెలక్టర్లు కండీషన్ పెట్టారు. కానీ సుదర్శన్ పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి మరి కొంత సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ టెస్టు సిరీస్ కోసం శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు మంగళవారం శ్రీలంకకు పయనం కానుంది.
కానీ సుదర్శన్ మాత్రం భారత జట్టుతో కలిసి శ్రీలంకకు వెళ్లడం లేదని రేవ్‌స్పోర్ట్స్ తమ కథనంలో పేర్కొంది. సీవోఈ నుంచి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లభించిన తర్వాతే అతడు కొలంబోలోని జట్టుతో కలిసే అవకాశం ఉందని రేవ్‌స్పోర్ట్స్ వెల్లడించింది. సుదర్శన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో తిరిగి బ్యాటింగ్ ప్రారంభించాడు.
త్వరలోనే అతడికి ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో అతడు పాసైతేనే శ్రీలంక విమానం ఎక్కుతాడు. ఒకవేళ అతడు సిరీస్‌కు దూరమైతే తుది జట్టులో కర్ణాటక ఆటగాడు దేవ్‌దత్త్ పడిక్కల్‌కు అవకాశం దక్కనుంది. ఇక ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది. అంతకంటే ముందు స్ధానిక జట్టుతో మూడు రోజుల వార్మాప్ మ్యాచ్‌లో భారత్ తలపడనుంది.
చదవండి: టీమిండియాను కాపాడిన వరుణుడు.. లేదంటే?


