breaking news
India vs Sri lanka
-
ఫైనల్లో శ్రీలంకను మట్టికరిపించిన భారత్.. మరోసారి స్వర్ణం!
ఆసియా క్రీడలు- 2026 మహిళల టీ20 టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. జపాన్ వేదికగా మంగళవారం జరిగిన ఫైనల్లో శ్రీలంకను 147 పరుగుల తేడాతో మట్టికరిపించిన హర్మన్‌ప్రీత్ సేన మరోసారి చాంపియన్‌గా అవతరించింది. వరుసగా రెండోసారి సగర్వంగా పసిడి పతకాన్ని ముద్దాడింది.ఫైనల్ వరకు ఇలాజపాన్ వేదికగా ఆసియా క్రీడల్లో నేరుగా క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టిన భారత మహిళల జట్టు.. జపాన్ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి సెమీస్‌కు చేరింది. సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్‌ను 114 పరుగుల తేడాతో చిత్తు చేసి టైటిల్ పోరుకు రెండోసారి అర్హత సాధించింది.స్మృతి, షఫాలి ధనాధన్‌ఈ క్రమంలో కరోగి స్పోర్ట్స్ వేదికగా శ్రీలంకతో మంగళవారం నాటి స్వర్ణ పతక పోరులో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు షఫాలి వర్మ, స్మృతి మంధాన అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. షఫాలి 29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు బాది 48 పరుగులు సాధించింది.Smriti Mandhana brings up a fluent 50* off just 30 balls to put India firmly in control of the Gold Medal match! 🥇Watch Sri Lanka vs India, in the Women's Cricket Final at the 20th Asian Games Aichi-Nagoya, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.… pic.twitter.com/NsZ6db9Ciu— Sony Sports Network (@SonySportsNetwk) September 22, 2026రిచా మెరుపులుమరోవైపు.. స్మృతి 30 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకుని జోరు కొనసాగించింది. మొత్తంగా 45 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 5 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 79 పరుగులు రాబట్టింది. ఇక వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (17 బంతుల్లో 19) నిరాశపరచగా.. వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడింది.𝐑𝐈𝐂𝐇𝐀 𝐆𝐇𝐎𝐒𝐇 𝐓𝐔𝐑𝐍𝐒 𝐔𝐏 𝐓𝐇𝐄 𝐏𝐎𝐖𝐄𝐑! 💥Big hits in the final overs as she provides the perfect finish to India’s innings against Sri Lanka! 🔥Watch Sri Lanka vs India, in the Women's Cricket Final at the 20th Asian Games Aichi-Nagoya, LIVE NOW on Sony… pic.twitter.com/l6WJHKCwEL— Sony Sports Network (@SonySportsNetwk) September 22, 2026కేవలం 22 బంతుల్లోనే రిచా 6 ఫోర్లు, 3 సిక్సర్లు బాది 49 పరుగులతో అజేయంగా నిలిచింది. ఆఖర్లో భారతి ఫుల్మలి ఏడు బంతుల్లో ఏడు పరుగులతో రిచాకు తోడుగా నిలిచింది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో భారత మహిళా జట్టు కేవలం మూడు వికెట్ల నష్టానికి ఏకంగా 216 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.నిప్పులు చెరిగిన భారత బౌలర్లు217 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ఆరంభంలోనే ఓపెనర్ ఇమేషా దులాని (3), వన్‌డౌన్ బ్యాటర్ హన్సిని పెరీరా (0)ల వికెట్లు తీసి షఫాలి వర్మ శుభారంభం అందించగా.. ఆ తర్వాత దీప్తి శర్మ విజృంభించింది.కెప్టెన్ చమరి ఆటపట్టు (29) రూపంలో కీలక వికెట్ దక్కించుకున్న దీప్తి.. కవిశా దిల్హరి (11), సుగందిక కుమారి (3)ని కూడా అవుట్ చేసింది. ఇక కడప అమ్మాయి శ్రీచరణి హన్సిమ కరుణరత్నె (1), కావ్యా కవింది (2) రూపంలో రెండు వికెట్ల దక్కించుకోగా.. హర్షిత సమరవిక్రమ (0), కౌశాని నూత్యాంగన (14) వికెట్లను శ్రేయాంక పాటిల్ దక్కించుకుంది.ఈ క్రమంలో 15.4 ఓవర్లలో కేవలం 69 పరుగులకే శ్రీలంక ఆలౌట్ అయింది. ఫలితంగా.. భారత్ 147 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి.. స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.మళ్లీ అదే పునరావృతం.. గోల్డ్ గెలిచిన భారత్2023 ఆసియా క్రీడల ఫైనల్లోనూ భారత్- శ్రీలంక తలపడ్డాయి. ఈ క్రమంలో హర్మన్ సారథ్యంలోని టీమిండియా లంకపై 19 పరుగుల తేడాతో గెలిచి గోల్డ్ మెడల్ గెలుచుకుంది. తాజాగా మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేసింది.చదవండి: భారత ఓపెనర్ వరల్డ్ రికార్డుజపాన్తో మ్యాచ్‌లో టీమిండియా చెత్త రికార్డు -
IND vs SL: ఓపెనర్ వరల్డ్ రికార్డు.. ఫైనల్లో భారత్ భారీ స్కోరు
భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో పదకొండు వేల పరుగుల మైలురాయిని చేరిన తొలి క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు సాధించింది. ఆసియా క్రీడలు-2026 టీ20 టోర్నమెంట్లో భాగంగా శ్రీలంకతో పసిడి పతక పోరు సందర్భంగా.. స్మృతి ఈ ఘనత సాధించింది.ఓపెనర్లు ధనాధన్జపాన్లోని నిశిన్ వేదికగా కరోగి స్పోర్ట్స్ పార్కులో మంగళవారం నాటి ఫైనల్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో భారత ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలి వర్మ శుభారంభం అందించారు. స్మృతి దూకుడుగా మొదలుపెట్టగా.. కాస్త సమయం తీసుకున్న షఫాలి ఆ తర్వాత వేగం అందుకుంది.ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 60 బంతుల్లో 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, తొమ్మిదో ఓవర్లో చముది ప్రబోద బౌలింగ్‌లో కావ్యా కవిందికి క్యాచ్ ఇచ్చి షఫాలీ తొలి వికెట్‌గా వెనుదిరగగా.. స్మృతి మాత్రం జోరు కొనసాగించింది. ప్రబోద బౌలింగ్‌లో రెండో బంతికి సింగిల్ తీసి యాభై పరుగుల మార్కును అందుకుంది.37వ అర్ధ శతకం కాగా అంతర్జాతీయ టీ20 క్రికెట్లో స్మృతికి ఇది 37వ అర్ధ శతకం కావడం విశేషం. కేవలం 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. దురదృష్టవశాత్తూ సెంచరీ మార్కు అందుకోలేకపోయింది. సుగందిక కుమారి బౌలింగ్‌లో కవిశా దిల్హరికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది.Smriti Mandhana brings up a fluent 50* off just 30 balls to put India firmly in control of the Gold Medal match! 🥇Watch Sri Lanka vs India, in the Women's Cricket Final at the 20th Asian Games Aichi-Nagoya, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.… pic.twitter.com/NsZ6db9Ciu— Sony Sports Network (@SonySportsNetwk) September 22, 2026భారత్ భారీ స్కోరుఈ మ్యాచ్‌లో మొత్తంగా 45 బంతులు ఎదుర్కొన్న స్మృతి ఐదు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 79 పరుగులు చేసింది. ఇక మిగిలిన వారిలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (17 బంతుల్లో 19) నిరాశపరచగా.. వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ ఆకాశమే హద్దుగా చెలరేగింది.కేవలం 22 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 49 పరుగులతో అజేయంగా నిలిచింది రిచా. ఇక భారతి ఫుల్మలి ఏడు బంతుల్లో 7 పరుగులతో రిచాకు తోడుగా నిలవగా.. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో భారత్ కేవలం మూడు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో సుగందిక కుమారి, కవిశా దిల్హరి, చముది ప్రబోద తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.చదవండి: చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా.. -
టీమిండియా ప్రపంచ రికార్డు
భారత మహిళల క్రికెట్ జట్టు మరో ప్రపంచ రికార్డు సమం చేసింది. మహిళల టీ20 అంతర్జాతీయాల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జట్టుగా ఇంగ్లండ్ సరసన నిలిచింది. ఏషియన్ గేమ్స్ 2026లో భాగంగా శ్రీలంకతో ఇవాళ జరుగుతున్న స్వర్ణ పతక మ్యాచ్‌లో ఈ ఘనత సాధించింది.ఈ మ్యాచ్‌లో భారత్ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల సంఖ్య 233కు చేరింది. ప్రస్తుతం ఇంగ్లండ్ కూడా అన్నే మ్యాచ్‌లతో భారత్ సరసన ఉంది. ఈ జాబితాలో భారత్, ఇంగ్లండ్ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా (213), వెస్టిండీస్ (206), పాకిస్తాన్ (205), న్యూజిలాండ్ (204) ఉన్నాయి.2006లో మొదలైన ప్రయాణంమహిళల టీ20ల్లో భారత్ ప్రయాణం 2006లో ప్రారంభమైంది. ఇప్పటివరకు ఆడిన 233 మ్యాచ్‌ల్లో 130 విజయాలు, 95 పరాజయాలు నమోదు చేసింది. ఒక మ్యాచ్ టై కాగా, ఆరు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.మ్యాచ్ విషయానికొస్తే.. స్వర్ణ పతక మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తుంది. 16 ఓవర్లు ముగిసే సమయానికి జట్టు స్కోర్ 157-2గా ఉంది. షఫాలీ వర్మ (48), హర్మన్‌ప్రీత్ (19) ఔట్ కాగా.. స్మృతి మంధన (79), రిచా ఘోష్ (10) క్రీజ్‌లో ఉన్నారు. ఇదీ చదవండి: చరిత్ర సృష్టించి టీమిండియా ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా -
Asian Games Final: టీమిండియాదే గోల్డ్ మెడల్.. ఫైనల్లో శ్రీలంక చిత్తు
ఏషియన్ గేమ్స్ మహిళల క్రికెట్ పోటీల విజేతగా భారత్ నిలిచింది. మంగళవారం జరిగిన ఫైనల్లో శ్రీలంకను 147 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్.. వరుసగా రెండో సారి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ తుది పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం భారీ లక్ష్య చేధనలో శ్రీలంక 69 పరుగులకే కుప్పకూలింది.తొమ్మిదో వికెట్ డౌన్శ్రీలంక తొమ్మిదో వికెట్ కోల్పోయింది. మిథాలి అయోధ్య(0) రనౌటైంది. భారత్ విజయానికి ఒక్క వికెట్ దూరంలో నిలిచింది.ఎనిమిదో వికెట్ కోల్పోయిన శ్రీలంక13.1వ ఓవర్: దీప్తి బౌలింగ్‌లో ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగిన సుగందిక (3).మిథాలి అయోధ్య క్రీజులోకి రాగా.. కౌశాని 9 పరుగులతో ఉంది. స్కోరు: 63-8ఏడో వికెట్ కోల్పోయిన శ్రీలంక10.2వ ఓవర్: శ్రీచరణి బౌలింగ్‌లో కావ్యా కవింది (2) రిచాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. సుగందిక కుమారి క్రీజులోకి వచ్చింది. స్కోరు: 54-7. కౌశాని ఒక పరుగుతో ఉండగా.. సుగందిక రెండు పరుగులు చేసింది.ఆరో వికెట్ కోల్పోయిన శ్రీలంక9.1వ ఓవర్: దీప్తి శర్మ బౌలింగ్‌లో కవిశా దిల్హరి (11) క్యాచౌట్ అయింది. శ్రీలంక స్కోరు: 49-6. కౌశాని సున్నా పరుగులతో ఉంది.ఐదో వికెట్ కోల్పోయిన శ్రీలంక8.4వ ఓవర్: శ్రీచరణి బౌలింగ్‌లో హన్సిమా కరుణరత్నె (1) భారతికి క్యాచ్ ఇచ్చి అవుటైంది. కౌశాని నూత్యాంగన క్రీజులోకి వచ్చింది. స్కోరు: 49-5 (9).నాలుగో వికెట్ కోల్పోయిన శ్రీలంక7.3వ ఓవర్: శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది. శ్రియాంక పాటిల్ బౌలింగ్‌లో హర్షితా డకౌటైంది. హన్సిమా క్రీజులోకి వచ్చింది. 7.3 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 44/4మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక6.5వ ఓవర్: దీప్తి శర్మ బౌలింగ్ భారతికి క్యాచ్ ఇచ్చి మూడో వికెట్‌గా వెనుదిరిగిన కెప్టెన్ చమరి ఆటపట్టు (21 బంతుల్లో 29). హర్షిత సమరవిక్రమ క్రీజులోకి రాగా.. కవిశా ఆరు పరుగులతో ఉంది. స్కోరు: 43-3.పవర్ ప్లేలో శ్రీలంక స్కోరు: 41-2👉విజయానికి 84 బంతుల్లో 176 పరుగులు కావాలి👉ఆటపట్టు 27, కవివా ఆరు పరుగులతో క్రీజులో ఉన్నారు.రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక👉4.2వ ఓవర్: షఫాలి వర్మ బౌలింగ్‌లో హన్సిని పెరీరా భారతి ఫుల్మలికి క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగింది. కవిశా దిల్హరి క్రీజులోకి వచ్చింది. ఐదు ఓవర్లలో లంక స్కోరు: 31-2. ఓపెనర్ ఆటపట్టు 22 పరుగులతో ఉంది.తొలి వికెట్ కోల్పోయిన లంక👉2.5వ ఓవర్: షఫాలి వర్మ బౌలింగ్‌లో ఇమేషా దులాని స్టంపౌట్ (3). హన్సిని పెరీరా క్రీజులోకి వచ్చింది. శ్రీలంక స్కోరు: 22-1 (3)భారత్ భారీ స్కోరుఓపెనర్లు స్మృతి మంధాన (45 బంతుల్లో 79), షఫాలి వర్మ (29 బంతుల్లో 48) భారీ స్కోరుకు పునాది వేయగా.. వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. కేవలం 22 బంతుల్లోనే ఆరు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 49 పరుగులతో అజేయంగా నిలిచింది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో భారత్ కేవలం మూడు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో సుగందిక కుమారి, కవిశా దిల్హరి, చముది ప్రబోద తలా ఒక వికెట్ పడగొట్టారు.పందొమ్మిది ఓవర్లలో భారత్ స్కోరు: 191-3👉సుగందిక పొదుపుగా బౌలింగ్ చేయడంతో పందొమ్మిదో ఓవర్లో భారత్ తొమ్మిది పరుగులే చేయగలిగింది. రిచా 32, భారతి 7 పరుగులతో ఉన్నారు.పద్దెనిమిది ఓవర్లలో భారత్ స్కోరు: 182-3👉కావ్యా కవింది బౌలింగ్‌లో మూడో బంతికి ఫోర్, నాలుగో బంతికి సిక్సర్ బాదిన రిచా👉భారతి ఒకటి, రిచా 15 బంతుల్లో 30 పరుగులతో ఉన్నారు.పదిహేడు ఓవర్లలో భారత్ స్కోరు: 163-3అయ్యో స్మృతి👉16.5వ ఓవర్: సుగందిక కుమారి బౌలింగ్‌లో కవిశాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన స్మృతి మంధాన. మొత్తం 45 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 79 పరుగులు చేసిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. సెంచరీ దిశగా పయనిస్తున్న వేళ దురదృష్టవశాత్తూ అవుటైంది. భారతిక్రీజులోకి రాగా.. రిచా 15 పరుగులతో ఉంది.పదహారు ఓవర్లలో భారత్ స్కోరు: 157-2👉ప్రబోద బౌలింగ్‌లో రెండు, మూడో బంతికి రిచా ఫోర్లు బాదగా.. ఆఖరి బంతికి స్మృతి సిక్సర్ బాదింది.👉స్మృతి 44 బంతుల్లో 79, రిచా 6 బంతుల్లో 10 పరుగులతో ఉన్నారు.పదిహేను ఓవర్లలో భారత్ స్కోరు: 142-2👉రిచా 5, స్మృతి 73 పరుగులతో ఉన్నారు.రెండో వికెట్ కోల్పోయిన భారత్👉14.4వ ఓవర్: కవిశా దిల్హరి బౌలింగ్‌లో ఆటపట్టుకు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్‌గా వెనుదిరిగిన హర్మన్ (17 బంతుల్లో 19). రిచా ఘోష్ క్రీజులోకి వచ్చింది.పద్నాలుగు ఓవర్లలో భారత్ స్కోరు: 136-1👉కావ్యా కవింది బౌలింగ్‌లో నాలుగో బంతికి సిక్సర్ బాదిన స్మృతి👉ఆరో బంతికి ఫోర్ బాదిన హర్మన్👉స్మృతి 72, హర్మన్ 15 పరుగులతో ఉన్నారు.పదమూడు ఓవర్లలో భారత్ స్కోరు: 123-1👉కవిశా బౌలింగ్‌లో తొలి బంతికి హర్మన్ ఫోర్ బాదగా.. ఆఖరి బంతికి స్మృతి బంతిని బౌండరీ దాటించింది.👉స్మృతి 65, హర్మన్ 10 పరుగులతో ఉన్నారు.పన్నెండు ఓవర్లలో భారత్ స్కోరు: 112-1👉ప్రబోద పొదుపుగా బౌలింగ్ చేయగా.. స్మృతి 37 బంతుల్లో 60, హర్మన్ 4 పరుగులతో ఉన్నారు.పదకొండు ఓవర్లలో భారత్ స్కోరు: 107-1👉ఆటపట్టు బౌలింగ్‌లో మూడో బంతికి ఫోర్ బాదిన స్మృతి👉హర్మన్ 2, స్మ1తి 57 పరుగులతో ఉన్నారు.పది ఓవర్లలో భారత్ స్కోరు: 99-1తొలి వికెట్ డౌన్👉9.6వ ఓవర్: ప్రబోద బౌలింగ్‌లో కావ్యాకుక్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన షఫాలి (29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు: 48 రన్స్). హర్మన్ క్రీజులోకి రాగా.. స్మృతి 51 పరుగులతో ఉంది.మంధాన అర్ధ శతకం👉9.2వ ఓవర్: ప్రబోద బౌలింగ్‌లో సింగిల్ తీసి అర్ధ శతకం (30 బంతుల్లో) పూర్తి చేసుకున్న స్మృతి మంధాన. ఆమెకు అంతర్జాతీయ టీ20 కెరీర్లో ఇది 37వ ఫిఫ్టీ.తొమ్మిది ఓవర్లలో భారత్ స్కోరు: 95-0👉కవిశా దిల్హరి బౌలింగ్ చేయగా.. నాలుగో బంతికి సిక్సర్ బాదిన షఫాలి👉స్మృతి 49, షఫాలి 46 పరుగులతో ఉన్నారు.ఎనిమిది ఓవర్లలో భారత్ స్కోరు: 88-0👉చముది ప్రబోద బౌలింగ్‌లో ఐదో బంతికి సిక్సర్ బాదిన స్మృతి👉షఫాలి 21 బంతుల్లో 39, స్మృతి 27 బంతుల్లో 48 పరుగులతో ఉన్నారు.ఏడు ఓవర్లలో భారత్ స్కోరు: 77-0👉కవిశా దిల్హరి బౌలింగ్‌లో మూడో బంతికి ఫోర్ బాదిన షఫాలి👉స్మృతి 23 బంతుల్లో 40, షఫాలి 19 బంతుల్లో 37 పరుగులతో ఉన్నారు.పవర్ ప్లేలో భారత్ స్కోరు (6 ఓవర్లు): 67-0👉కావ్యా కవింది బౌలింగ్‌లో తొలి బంతికే ఫోర్ బాదిన షఫాలి👉అనంతరం కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన కావ్యా👉స్మృతి 21 బంతుల్లో 38, షఫాలి 15 బంతుల్లో 29 పరుగులతో ఉన్నారు.ఐదు ఓవర్లలో భారత్ స్కోరు: 59-0👉చమరి ఆటపట్టు బౌలింగ్ తొలి బంతికే ఎల్బీడబ్ల్యూ గండం తప్పించుకున్న షఫాలి. అనంతరం రెండు, మూడో బంతుల్లో సిక్సర్లు బాదిన షఫాలి.👉తానేం తక్కువ కాదంటూ ఆరో బంతికి సిక్స్ కొట్టిన స్మృతి👉స్మతి 36, షఫాలి 23 పరుగులతో ఉన్నారు.నాలుగు ఓవర్లలో భారత్ స్కోరు: 40-0👉మిథాలి అయోధ్య బౌలింగ్‌లో తొలి బంతికే షఫాలి ఫోర్ బాదగా.. మూడో బంతికి బౌండరీ బాదిన స్మతి, నాలుగో బంతికి సిక్స్ కొట్టింది. స్మృతి 17 బంతుల్లో 30, షఫాలి 10 పరుగులతో ఉన్నారు.మూడు ఓవర్లలో భారత్ స్కోరు: 25-0👉సుగందిక బౌలింగ్‌లో మూడు, నాలుగు బంతుల్లో సిక్సర్లు బాదిన స్మృతి. స్మృతి 13 బంతుల్లో 20, షఫాలి ఐదు బంతుల్లో ఐదు పరుగులతో ఉన్నారు.రెండు ఓవర్లలో భారత్ స్కోరు: 12-0👉మిథాలి అయోధ్య పొదుపుగా బౌలింగ్ చేయడంతో ఈ ఓవర్లో కేవలం మూడు పరుగులే వచ్చాయి. స్మృతి 8, షఫాలి 4 పరుగులతో ఉన్నారు. తొలి ఓవర్లో భారత్ స్కోరు: 9-0👉సుగందిక కుమారి తొలి ఓవర్ వేయగా.. స్మృతి మంధాన 8 (4,4), షఫాలి వర్మ ఒక పరుగుతో ఉన్నారు. తుదిజట్లుభారత మహిళల జట్టుస్మృతి మంధాన, షఫాలీ వర్మ, గుణాలన్ కమలిని, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), భారతి ఫుల్మలి, దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్, శ్రీచరణి, నందిని శర్మ, క్రాంతి గౌడ్.శ్రీలంక మహిళల జట్టుఇమేషా దులాని, చమరి ఆటపట్టు (కెప్టెన్), హన్సిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, కవిశా దిల్హరి, హన్సిమా కరుణరత్నె, కౌశాని నూత్యాంగన (వికెట్ కీపర్), మిథాలి అయోధ్య, కావ్యా కవింది, చముది ప్రబోద, సుగందిక కుమారి. -
తొలి స్వర్ణంపై గురి
నిషిన్: ఆసియా క్రీడల్లో తొలి రెండు రోజులు రజత, కాంస్యాలకే పరిమితమైన భారత్‌కు మంగళవారం తొలి స్వర్ణం గెలుచుకునే చాన్స్ ఉంది. మహిళల క్రికెట్లో స్వర్ణపతకం కోసం జరిగే ఫైనల్ పోరులో నేడు శ్రీలంకతో భారత్ తలపడనుంది. గత ఆసియా క్రీడల ఫైనల్లోనూ శ్రీలంకనే ఓడించి హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఇటీవల ఫామ్ ప్రకారం చూస్తే టీమిండియాదే పైచేయిగా కనిపిస్తోంది. ఇటీవలే ఆసియా కప్ ఫైనల్లో కూడా లంకను చిత్తు చేసి విజేతగా నిలిచిన భారత్... అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. ఆసియా క్రీడల్లో రెండు టీమ్‌లూ ప్రత్యర్థులపై అలవోక విజయాలతో ఫైనల్‌కు చేరాయి. ఓపెనర్లుగా చెలరేగుతున్న షఫాలీ వర్మ, స్మృతి మంధానలను నిలువరించడం లంకకు సాధ్యం కాకపోవచ్చు. మిడిలార్డర్లో హర్మన్ తదితరులు కొంత తడబడుతున్నా... రిచా ఘోష్ దూకుడు భారత్‌కు సానుకూలాంశం. బౌలింగ్‌లో శ్రీచరణి ఒంటి చేత్తో మ్యాచ్‌లను గెలిపిస్తోంది. క్రాంతి, నందని, దీప్తి శర్మ కూడా బ్యాటర్లపై ఆధిపత్యం ప్రదర్శించగలరు. మరోవైపు లంక ఆశలన్నీ కెపె్టన్ చమరి అటపట్టుపైనే ఉన్నాయి. ఆమె బాగా ఆడితేనే జట్టుకు విజయావకాశాలు ఉన్నాయి. పాక్‌తో జరిగిన సెమీఫైనల్లో ఆడిన తరహాలోనే ఆమె నుంచి జట్టు మరో మంచి ప్రదర్శనను ఆశిస్తోంది. హర్షిత, కవీషా దిల్హారీ, సుగంధిక ఇతర కీలక ప్లేయర్లు. భారత్‌తో ఆడిన గత 7 మ్యాచ్‌లలోనూ శ్రీలంక ఓడింది. అయితే ఈ మ్యాచ్‌కు కూడా వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. అదే జరిగి మ్యాచ్ రద్దయితే మాత్రం మెరుగైన సీడింగ్ ఉన్న జట్టు (భారత్) విజేతగా ఖరారవుతుంది. -
IND: జపాన్, లంక, ఆసీస్‌తో.. రేపు రెండు టీ20లు, ఒక ‘టెస్టు’!
భారత క్రికెట్ అభిమానులకు మంగళవారం (సెప్టెంబరు 22) పండుగే!.. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు మ్యాచ్‌లకు రేపు షెడ్యూల్ ఖరారైంది. ఆసియా క్రీడలు-2026 మహిళల టీ20 టోర్నీ ఫైనల్లో భాగంగా భారత్ శ్రీలంకతో తలపడేందుకు సిద్ధమైంది.ఈ పసిడి పతక పోరులో హర్మన్ సేన- చమరి ఆటపట్టు బృందం అమీతుమీ తేల్చుకుంటాయి. మరోవైపు.. చారిత్రక మ్యాచ్‌లో టీమిండియా (పురుషుల జట్టు) జపాన్‌తో తొలిసారి టీ20 మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది.మరో మ్యాచ్‌లో భారత్-‘ఎ’ జట్టు ఆస్ట్రేలియా- ‘ఎ’ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్‌లో భాగంగా మంగళవారమే తొలి మ్యాచ్ మొదలుపెట్టనుంది. ఈ నేపథ్యంలో భారత జట్లకు సంబంధించిన మూడు మ్యాచ్‌ల వేదికలు, షెడ్యూల్, టైమింగ్స్, జట్లు, ప్రత్యక్ష ప్రసారం వివరాలు తెలుసుకుందామా?!ఆసియా క్రీడలు- 2026 మహిళల ఫైనల్- భారత్ వర్సెస్ శ్రీలంకవేదిక: నిశిన్, కరోగి స్పోర్ట్స్ పార్కు, జపాన్మ్యాచ్ ఆరంభ సమయం: ఉదయం 10.30 నిమిషాలకు ప్రారంభంలైవ్ స్ట్రీమింగ్: సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్, సోనీలివ్భారత జట్టుస్మృతి మంధాన, షఫాలీ వర్మ, గుణాలన్ కమలిని, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), రిచా ఘోష్(వికెట్ కీపర్), భారతీ ఫుల్మాలి, దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్, శ్రీ చరణి, నందినీ శర్మ, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్.శ్రీలంక జట్టుఇమేషా దులానీ, చమరి ఆటపట్టు (కెప్టెన్), హాసిని పెరెరా, హర్షిత సమరవిక్రమ, కవిషా దిల్హరి, హన్సిమా కరుణరత్నే, కౌషని నుత్యాంగన(వికెట్ కీపర్), మిథాలీ అయోధ్య, కావ్య కవింది, చాముది ప్రభోద, సుగందిక కుమారి, రష్మిక సెవ్వాంది, నిమషా మేపగే, సంజన కవింది, అనుష్క సంజీవని.టీమిండియా వర్సెస్ జపాన్వేదిక: సనో అంతర్జాతీయ క్రికెట్ మైదానం, జపాన్భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30 నిమిషాలకు మ్యాచ్ ఆరంభంప్రత్యక్ష ప్రసారం: స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ (టీవీ), ఫ్యాన్‌కోడ్ యాప్, వెబ్సైట్ (డిజిటల్).టీమిండియాశ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివం దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయి, రవి బిష్ణోయి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ, యశ్ ఠాకూర్, విప్రాజ్ నిగమ్.జపాన్కెండెల్ కడోవాకీ ఫ్లెమింగ్ (కెప్టెన్), చార్లీ హరా హింజే, బెంజమిన్ ఇటో-డేవిస్, కొయి కుబోటా, వటారు మియాచి, రియో సకురనో-థామస్, అలెక్స్ శిరాయి-పాట్మోర్, షోమా సుగయా-స్లేటర్, డెక్లాన్ సుజుకి, ఇబ్రహీం తకహషి, మకొటో తానియమా, లచ్లాన్ యమామొటో, అలెస్టెర్ కడోవాకీ-ఫ్లెమింగ్, జేక్ కుసుడ-నైర్, సుయోషి తకడా.భారత్- ‘ఎ’ వర్సెస్ ఆస్ట్రేలియా- ‘ఎ’ అనధికారిక తొలి టెస్టువేదిక: పుదుచ్చేరి క్రికెట్ అసోసియేషన సిచెమ్ గ్రౌండ్, పుదుచ్చేరి, ఇండియాభారత కాలమానం ప్రకారం ఉదయం 9.30 నిమిషాలకు మ్యాచ్ ఆరంభంజియోహాట్స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారంభారత్- ‘ఎ’ జట్టుఅమన్ మోఖడే, ఆయుశ్ పాండే, దేవదత్ పడిక్కల్ (కెప్టెన్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), యశ్ రాథోడ్, షేక్ రషీద్, కుమార్ కుశాగ్ర (వికెట్ కీపర్), షామ్స్ ములాని, తనుష్ కొటియాన్, తుషార్ దేశ్‌పాండే, అన్షుల్ కాంబోజ్, ప్రఫుల్ హింగే, నారాయణన్ జగదీశన్ (వికెట్ కీపర్), నచికేత్ భూటే, వి వైశాక్* (ఫిట్నెస్ ఆధారంగా).ఆస్ట్రేలియా- ‘ఎ’ జట్టుబ్రెండన్ డాగెట్, జాక్ ఎడ్వర్డ్స్, పీటర్ హ్యాండ్స్కోంబ్, సామ్ హార్పర్, లియామ్ హాచర్, కాంప్‌బెల్ కెల్లావే, సామ్ కొన్‌స్టాస్, నాథన్ మెక్‌స్వీనీ, టాడ్ మర్ఫీ, ఫెర్గూస్ ఓ నీల్, జోష్ ఫిలిప్, జై రిచర్డ్సన్, కోరే రొచిసియోలి, జేసన్ సంఘా, లియామ్ స్కాట్.చదవండి: ప్రభుత్వం ఇచ్చిన భూమిలో టీమిండియా స్టార్ రూ. 7 కోట్ల బంగ్లా! -
టీమిండియాను గడగడలాడించిన ప్లేయర్‌కు ప్రతిష్టాత్మక అవార్డు
ఇటీవల జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో టీమిండియాను గడగడలాడించిన శ్రీలంక మిడిలార్డర్ బ్యాటర్ సోనల్ దినుషాకు ప్రతిష్టాత్మక ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ (ఆగస్ట్) అవార్డు లభించింది. ఇంగ్లండ్ పేసర్ ఓల్లీ రాబిన్సన్, బంగ్లాదేశ్ సంచలన పేసర్ హసన్ మహముద్ పోటీపడినప్పటికీ.. దినుషానే ఈ అవార్డు వరించింది.వీరు ముగ్గురు ఆగస్ట్ నెలలో టెస్ట్ క్రికెట్లో విశేషంగా రాణించారు. దినుషా భారత్‌తో ఆడిన 4 ఇన్నింగ్స్‌ల్లో 140 సగటున ఏకంగా 420 పరుగులు (3 శతకాలు, ఓ హాఫ్ సెంచరీ) సాధించగా.. పాకిస్తాన్‌తో జరిగిన తొలి రెండు టెస్ట్‌ల్లో రాబిన్సన్ 16 వికెట్లు తీశాడు. హసన్ మహముద్ ఆసీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో 9 వికెట్లతో చెలరేగి, ఆసీస్ గడ్డపై బంగ్లాదేశ్‌కు చారిత్రక విజయాన్నందించాడు.మహిళల విషయానికొస్తే.. ఆగస్ట్ నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును ఐల్ ఆఫ్ మ్యాన్ క్రికెటర్ లూసీ బార్నెట్కు లభించింది. థాయ్‌లాండ్ స్పిన్నర్ సులీపోర్న్ లావోమీ, వికెట్‌కీపర్-బ్యాటర్ నన్నపట్ కొంచరోయెంకై నుంచి పోటీ ఎదుర్కొన్న 19 ఏళ్ల బార్నెట్ ఈ అవార్డు దక్కించుకుంది. ఆగస్ట్ నెలలో బార్నెట్ విశేషంగా రాణించింది. నాలుగు ఇన్నింగ్స్‌ల్లోనే 257 పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు ఎంపికైంది.ఇదీ చదవండి: విండీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన పాక్ ప్లేయర్ -
నక్వీ అందుకు అభ్యంతరం చెప్పలేదు: బీసీసీఐ
మహిళల ఆసియా కప్-2026 ట్రోఫీ నిరాకరణ అంశం గురించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా స్పందించింది. ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) అధ్యక్షుడు, పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖా మంత్రి మోసిన్ నక్వీ చేతుల మీదుగా బహుమతి అందుకోమని ముందుగానే బోర్డుకు సమాచారం ఇచ్చినట్లు తెలిపింది.నక్వీ అందుకు అభ్యంతరం చెప్పలేదుఈ విషయం గురించి బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకునే విషయం గురించి మేము ముందుగానే చర్చించుకున్నాము. అతడే ట్రోఫీ ఇస్తానని పట్టుబడితే తీసుకోవద్దనే నిర్ణయానికి వచ్చాము. జట్టుకు ఇదే విషయాన్ని తెలియజేశాము.ఇది బోర్డు సామూహిక నిర్ణయం. ఇందుకు నక్వీ కూడా అభ్యంతరం చెప్పలేదు. అందుకే వేదిక దగ్గరకు వచ్చి ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు’’ అని తెలిపారు. కాగా మహిళల ఆసియా టీ20 కప్-2026 టోర్నీలో భారత జట్టు చాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.అపుడు కూడా ఇలాగేదుబాయ్ వేదికగా ఆదివారం ముగిసిన ఫైనల్లో శ్రీలంకను 72 పరుగుల తేడాతో చిత్తు చేసి హర్మన్ సేన టైటిల్ గెలుచుకుంది. అయితే, భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గతేడాది ఆసియా కప్ గెలిచినప్పటికీ భారత పురుషుల క్రికెట్ జట్టు నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించింది.తాజాగా 2026లో చాంపియన్‌గా నిలిచిన భారత మహిళా జట్టు సైతం అదే బాటలో నడిచింది. అయితే, ఈసారి తాము ముందుగానే నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోమని బీసీసీఐ ఏసీసీకి సమాచారం ఇచ్చింది. అయినప్పటికీ నక్వీ తానే స్వయంగా బహుమతి ప్రదానం చేస్తానని వేదిక వద్దకు రాగా.. భారత జట్టు కిందే ఉండిపోగా.. రన్నరప్ శ్రీలంకకు చెక్ ఇచ్చి నక్వీ వెళ్లిపోయాడు.ట్రోఫీ ఇంకా చేతికి రాలేదుఇదిలా ఉంటే.. పురుషుల జట్టుకు రావాల్సిన ఆసియా కప్ ట్రోఫీ ఇంకా బీసీసీఐ చేతికి అందనేలేదు. తాజాగా మహిళల ట్రోఫీ కూడా ఎప్పుడు చేతికి వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. ఏసీసీతో సంప్రదించి త్వరలోనే రెండు ట్రోఫీలు దేశానికి చేరేలా చూస్తామని వెల్లడించారు. కాగా టీమిండియా గతేడాది ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించగా.. నక్వీ తనతో పాటే ట్రోఫీని ఎత్తుకెళ్లాడనే ప్రచారం జరిగింది. దీంతో తాజాగా మహిళల ఫైనల్ ముగిసిన తర్వాత నక్వీ స్టేడియంలోకి రాగా..‘ట్రోఫీ చోర్’ అంటూ టీమిండియా అభిమానులు నినాదాలు చేశారు. చదవండి: బాబర్ ఆజం సంచలన నిర్ణయం! -
టీమిండియాకు ఊహించని షాక్
మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్లో శ్రీలంకపై ఘన విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకున్న టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. వికెట్ తీసిన అనంతరం దూకుడుగా సంబురాలు చేసుకున్నందుకు స్టార్ పేసర్ క్రాంతి గౌడ్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది. మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానాతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ కేటాయించింది.పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆదివారం శ్రీలంకతో జరిగిన ఫైనల్లో క్రాంతి గౌడ్ తొలి ఓవర్లోనే ఇమేషా దులానిని క్లీన్ బౌల్డ్ చేసింది. వికెట్ తీసిన ఆనందంలో ఆమె దూకుడుగా సంబరాలు చేసుకుంది. ఈ సందర్భంగా క్రాంతి ప్రదర్శించిన హావభావాలపై ఐసీసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చర్య ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని లెవల్-1 నిబంధనను ఉల్లంఘన కిందికి వస్తుందని తెలిపింది.వికెట్ తీసిన తర్వాత అతడిని లేదా ఆమెను అవమానించేలా, లేదా దూకుడుగా స్పందించేలా ప్రేరేపించే భాష, చర్యలు లేదా హావభావాలు చేయడాన్ని నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు. దీంతో ఐసీసీ క్రాంతి గౌడ్‌పై చర్యలు తీసుకుంది. 24 నెలల వ్యవధిలో ఆమెకు ఇది తొలి తప్పిదం కావడంతో జరిమానాతో పాటు ఒక డీమెరిట్ పాయింట్‌తో సరిపెట్టారు.తనపై వచ్చిన అభియోగాన్ని క్రాంతి అంగీకరించడంతో ప్రత్యేకంగా ఫార్మల్ హియరింగ్ నిర్వహించాల్సిన అవసరం రాలేదని ఐసీసీ వెల్లడించింది. కాగా, నిన్న జరిగిన ఫైనల్లో భారత్ శ్రీలంకపై 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. ఇదీ చదవండి: పాకిస్తాన్‌కు మరో భారీ షాక్ -
‘సంతోషంగా ఉంది.. వాళ్లకు ట్రోఫీ అందుకునే అర్హత లేదు’
ఊహించిందే జరిగింది.. మహిళల ఆసియా టీ20 కప్-2026 టోర్నీ విజేతగా నిలిచిన భారత జట్టు.. ఆసియా క్రికెట్ మండలి అధ్యక్షుడు, పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖా మంత్రి మోసిన్ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించింది.గతేడాది పురుషుల జట్టు మాదిరిగానే ట్రోఫీ లేకుండానే సంబరాలు చేసుకుంది హర్మన్ సేన. ఫలితంగా.. ముందే సమాచారం ఇచ్చినప్పటికీ చాంపియన్‌కు తానే ట్రోఫీ ప్రదానం చేస్తానని పట్టుబట్టిన నక్వీకి భంగపాటు ఎదురైంది. ‘ట్రోఫీ దొంగ’ అంటూఅతడి చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేందుకు భారత జట్టు నిరాకరించగా.. స్టేడియంలో ఉన్నవాళ్లు ‘ట్రోఫీ దొంగ’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. మరోవైపు.. రన్నరప్ శ్రీలంక మాత్రం నక్వీ చేతుల మీదుగా చెక్ అందుకుంది.ఈ నేపథ్యంలో నక్వీ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తుండగా.. పాకిస్తాన్ అభిమానులు మాత్రం అతడిని ప్రశంసిస్తూ అతి చేయడం కెమెరా కంటికి చిక్కింది. కాగా దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్-2026 ఫైనల్లో భారత జట్టు శ్రీలంకను 72 పరుగుల తేడాతో మట్టికరిపించింది.పాత కథ పునరావృతం కాకుండా..తద్వారా ఎనిమిదోసారి ఆసియా కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. అయితే, భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గతేడాది ఆసియా కప్‌లో భారత పురుషుల జట్టు చాంపియన్‌గా నిలిచినప్పటికీ.. నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించింది.దీంతో నక్వీ ట్రోఫీని తనతోపాటే తీసుకువెళ్లడం సహా.. తన అనుమతి లేకుండా భారత్‌కు ట్రోఫీని అందజేయవద్దనే ఆదేశాలు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ ముందుగానే ఆసియా క్రికెట్ మండలికి సమాచారం ఇచ్చింది. తమ జట్టు ఆసియా కప్ ఫైనల్లో విజేతగా నిలిస్తే నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోదని తేల్చి చెప్పింది.అయినప్పటికీ నక్వీ మొండిగా ముందుకు వెళ్లి.. చేదు అనుభవం ఎదుర్కొన్నాడు. దీంతో దుబాయ్ స్టేడియం వీడి కారులో నక్వీ తిరిగి వెళ్తున్న వేళ కొంతమంది పాక్ అభిమానులు అతడిని చుట్టుముట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.సంతోషంగా ఉంది. వాళ్లకు ట్రోఫీ అందుకునే అర్హత లేదు‘మంచి పని చేశారు సర్. మిమ్మల్ని చూస్తే సంతోషంగా ఉంది. వాళ్లకు ట్రోఫీ అందుకునే అర్హత లేదు’ అంటూ ఓ అభిమాని మాట్లాడటం రికార్డు అయింది. ఈ నేపథ్యంలో టీమిండియా అభిమానులు పాక్ ఫ్యాన్స్, నక్వీ తీరుపై మరోసారి విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు.55 పరుగులకే ఆలౌట్ అయిన వాళ్లకే ఆ అర్హత ఉంది‘‘అవును.. టోర్నీ ఆసాంతం ఒక్క ఓటమి కూడా లేకుండా చాంపియన్‌గా నిలిచిన హర్మన్‌సేనకు.. ఇలాంటి వ్యక్తి చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేందుకు అర్హత ఎందుకు ఉంటుంది?.. భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్ అయిన పాక్ మహిళా జట్టుకు మాత్రమే ఆ అర్హత ఉంది. నక్వీ, పాక్ జట్టు.. వారికి వారే తగినవారు. శునకానందం పొందండి’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.కాగా గ్రూప్ దశలో భారత జట్టుతో తలపడ్డ పాకిస్తాన్ 18.1 ఓవర్లలో కేవలం 55 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన హర్మన్‌సేన 8.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి పని పూర్తి చేసింది. ఇక సెమీ ఫైనల్లో భారత్ బంగ్లాపై గెలిచి టైటిల్ పోరుకు అర్హత సాధించగా.. శ్రీలంక చేతిలో ఓడి పాకిస్తాన్ ఇంటిబాట పట్టింది. దుబాయ్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో శ్రీలంకపై గెలిచి భారత్ విజేతగా అవతరించింది.చదవండి: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మHumiliation for Mohsin Naqvi 🔥😂“Good job, sir. We are happy with you. They don’t deserve the trophy,” a Pakistani fan tells Mohsin Naqvi. pic.twitter.com/6OSfKSNtzV— Anamika (@TheRubric_Medic) September 14, 2026 -
వద్దన్నా వినడే.. ఇదేం బుద్ధి?
ఆసియా కప్ ట్రోఫీ బహూకరణ విషయంలో మరోసారి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆసియా క్రికెట్ మండలి అధ్యక్షుడు (ఏసీసీ), పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖా మంత్రి మోసిన్ నక్వీ వైఖరి కారణంగా భారత జట్టు ట్రోఫీ లేకుండానే సంబరాలు చేసుకోవాల్సి వచ్చింది.ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరణకాగా గతేడాది పురుషుల ఆసియా కప్ టీ20 టోర్నీలో టీమిండియా ఫైనల్లో పాక్‌ను ఓడించి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత జట్టు నక్వీ నుంచి ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించింది. ఈ క్రమంలో నక్వీ ట్రోఫీని తనతో పాటే తీసుకువెళ్లగా.. సూర్యకుమార్ సేన రిక్తహస్తాలతో తిరిగి వచ్చింది.ఇప్పటికీ ట్రోఫీ భారత్ చేతికి రాలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా మహిళల ఆసియా కప్ టీ20 టోర్నీలోనూ భారత జట్టు చాంపియన్‌గా నిలిచింది. దుబాయ్ వేదికగా ఫైనల్లో శ్రీలంకను 72 పరుగుల తేడాతో చిత్తు చేసిన టీమిండియా రికార్డు స్థాయిలో ఎనిమిదో సారి టైటిల్ గెలిచింది. అయితే, ట్రోఫీ అందించే విషయంలో నక్వీ మొండిపట్టుదల కారణంగా హర్మన్‌సేన విషయంలో పాత కథే పునరావృతమైంది.𝗧𝗛𝗘 𝗪𝗜𝗖𝗞𝗘𝗧. 𝗧𝗛𝗘 𝗥𝗢𝗔𝗥. 𝗧𝗛𝗘 𝗖𝗥𝗢𝗪𝗡! 👑8 titles. One unstoppable dynasty 💙 #SonySportsNetwork #SonyLIV #NotAGentlemansGame #DPWorldWomensAsiaCup2026 pic.twitter.com/NG3DRF52Xd— Sony Sports Network (@SonySportsNetwk) September 13, 2026ముందుగానే సమాచారంనిజానికి గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ట్రోఫీ బహూకరణ అంశం గురించి ముందుగానే ఏసీసీకి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయం గురించి బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ..‘‘పురుషుల ఆసియా కప్ మాదిరే ఈసారి కూడా ట్రోఫీ అందుకునే విషయంలో మా వైఖరి గురించి ముందుగానే స్పష్టంగా చెప్పాము. ఇప్పటికీ గతేడాది ట్రోఫీ ఇంకా మా చేతికి రాలేదు. అయినా సరే కొంతమంది విదేశీ వ్యక్తుల చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేందుకు ఈసారి కూడా సుముఖంగా లేమని చెప్పేశాము.ఆయన చేతుల మీదుగా అయితే ఓకేఒకవేళ ఏసీసీ డిప్యూటీ చైర్పర్సన్ ట్రోఫీని ఖలీద్ అల్ జరూనీ ప్రదానం చేస్తే తీసుకుంటామని చెప్పాము. కానీ మా అభ్యర్థనను తిరస్కరించారు. కాబట్టి ట్రోఫీని ఆ వ్యక్తి (నక్వీ) చేతుల మీదుగా తీసుకోవద్దమని మేము నిర్ణయించుకున్నాము’’ అని సైకియా తెలిపాడు.‘‘ఏదేమైనా ట్రోఫీ చేతికి రానంత మాత్రాన మా జట్టు సాధించిన విజయం వృథాగా పోదు. దేశం మొత్తాన్ని గర్వపడేలా చేసిన అమ్మాయిలకు అభినందనలు. ఏదో ఒకరోజు రెండు ట్రోఫీలు మన చేతికి వస్తాయి’’ అని సైకియా పేర్కొన్నాడు.వద్దన్నా వినడు.. ఇదేం బుద్ధి?బీసీసీఐ ముందుగానే ఏసీసీకి సమాచారం ఇచ్చినప్పటికీ మోసిన్ నక్వీ ట్రోఫీ తానే ఇస్తానని గట్టిగా నిర్ణయించుకున్నట్లు పాక్ మీడియా జియో న్యూస్ వెల్లడించింది. ఏదేమైనా ట్రోఫీ చాంపియన్ చేతికి అందుతుందని.. ఈ విషయంలో ఏసీసీ సుముఖంగానే ఉందని పేర్కొంది.కాగా నక్వీ తీరుపై టీమిండియా అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ‘‘ముందుగా చెప్పినా వినకుండా మొండిపట్టు పట్టడం దేనికి?.. ఇదేం బుద్ధి?.. కావాలనే భారత్‌కు ట్రోఫీలు రాకుండా అల్ప సంతోషం పొందడం పాక్ మంత్రికి అలవాటై పోయింది’’ అని సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. 🚨 NO TROPHY FROM MOHSIN NAQVI! 🇮🇳India Women chose not to collect the Asia Cup trophy from Pakistan’s Mohsin Naqvi.Smriti Mandhana simply turned around and headed back to the dugout! 🔥WELL DONE GIRLS! 🙌 pic.twitter.com/XwnW5eW8nW— The Khel India (@TheKhelIndia) September 14, 2026 -
Asia Cup 2026 Final: చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్
భారత యువ క్రికెటర్ షఫాలీ వర్మ చరిత్ర సృష్టించింది. ఆసియా కప్ మహిళల టోర్నమెంట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన ప్లేయర్‌గా నిలిచింది. దుబాయ్ వేదికగా శ్రీలంకతో ఆదివారం నాటి ఆసియా టీ20 కప్-2026 ఫైనల్ సందర్భంగా 22 ఏళ్ల షఫాలీ వర్మ ఈ ఘనత సాధించింది.శ్రీలంతో టైటిల్ పోరులో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆది నుంచే దూకుడుగా ఆడిన ఓపెనర్ షఫాలీ వర్మ 24 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకుంది. అయితే, భారత ఇన్నింగ్స్‌లో చముడి ప్రబోద బౌలింగ్‌లో పదమూడో ఓవర్ ఐదో బంతికి.. చమరి ఆటపట్టుకు క్యాచ్ ఇవ్వడంతో షఫాలీ అవుటైంది.షఫాలీతో పాటు స్మృతి కూడామొత్తంగా 39 బంతులు ఎదుర్కొన్న షఫాలీ వర్మ 68 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తొలి వికెట్‌గా వెనుదిరిగింది. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ఇక మరో ఓపెనర్ స్మృతి మంధాన కూడా హాఫ్ సెంచరీ (39 బంతుల్లో 59) సాధించింది.భారత్ స్కోరు ఎంతంటే?మిగిలిన వారిలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 14 పరుగులు చేయగా.. వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ 17 పరుగులు చేసింది. ఆఖర్లో కమలిని 5 బంతుల్లో 15 పరుగులతో అజేయంగా నిలిచింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయిన భారత్.. 183 పరుగులు చేసింది.శ్రీలంక బౌలర్లలో మిథాలి అయోధ్య, కెప్టెన్ చమరి ఆటపట్టు, చముడి ప్రబోద తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.మహిళల ఆసియా టీ20 కప్ టోర్నీలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు👉షఫాలీ వర్మ- 24 బంతుల్లో- దుబాయ్ వేదికగా 2026లో శ్రీలంక మీద👉స్మృతి మంధాన- 25 బంతుల్లో- సెల్హైట్ వేదికగా 2022లో శ్రీలంక మీద👉రిచా ఘోష్- 26 బంతుల్లో- దంబుల్లా వేదికగా 2024లో యూఏఈ మీద👉షఫాలీ వర్మ- 26 బంతుల్లో- దంబుల్లా వేదికగా 2024లో నేపాల్ మీద👉షఫాలీ వర్మ- 26 బంతుల్లో- దుబాయ్ వేదికగా 2026లో థాయ్‌లాండ్ మీద.చదవండి: అదరగొట్టిన బుమ్రా.. అరుదైన ఘనతShafali Verma is accelerating and we're just getting started! 🔥Watch #INDvSL in the Final of the #DPWorldWomensAsiaCup2026, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #NotAGentlemansGame pic.twitter.com/u0js1RtZWo— Sony Sports Network (@SonySportsNetwk) September 13, 2026 -
Asia Cup 2026 Final: షఫాలీ, స్మృతి ఫిఫ్టీలు.. కమలిని మెరుపులు
దుబాయ్ వేదికగా మహిళల ఆసియా టీ20 కప్ -2026 టోర్నమెంట్ ఫైనల్లో భారత్ టాస్ గెలిచింది. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్.. శ్రీలంకను బౌలింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు స్మృతి మంధాన (39 బంతుల్లో 59), షఫాలీ వర్మ (39 బంతుల్లో 68) అర్ధ శతకాలతో అలరించారు. మిగిలిన వారిలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 14, రిచా ఘోష్ 17 పరుగులు చేయగా.. ఆఖర్లో కమలిని మెరుపులు (5 బంతుల్లో 15 నాటౌట్) మెరిపించింది. ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో మిథాలి అయోధ్య, కెప్టెన్ చమరి ఆటపట్టు, చముడి ప్రబోద తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.UPDATES👉నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసిన భారత్👉పందొమ్మిది ఓవర్లలో భారత్ స్కోరు: 167-5👉18.5వ ఓవర్: మిథాలి బౌలింగ్‌లో భారతి ఫుల్మలి బంతిని ఎదుర్కోగా.. సింగిల్ తీసే క్రమంలో దీప్తి (5) రనౌట్ అయింది. దీంతో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. కమలిని క్రీజులోకి వచ్చింది. భారతి ఒక పరుగుతో ఉంది.నాలుగో వికెట్ కోల్పోయిన భారత్👉18.4వ ఓవర్: మిథాలి అయోధ్య బౌలింగ్‌లో సబ్‌స్టిట్యూట్ కావ్యా కవిందికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన హర్మన్ (14). భారతి ఫుల్మలి క్రీజులోకి రాగా.. దీప్తి 5 పరుగులతో ఉంది. స్కోరు: 166-4👉పద్దెనిమిది ఓవర్లలో భారత్ స్కోరు: 163-3దీప్తి 2, హర్మన్ 14 పరుగులతో ఉన్నారు.👉మూడో వికెట్ కోల్పోయిన భారత్17.1వ ఓవర్: ఆటపట్టు బౌలింగ్‌లో కవిశా దిల్హరికి క్యాచ్ ఇచ్చిన రిచా ఘోష్ (17). దీప్తి శర్మ క్రీజులోకి వచ్చింది.👉పదిహేడు ఓవర్లలో భారత్ స్కోరు: 160-2రిచా 17, హర్మన్ 13 పరుగులతో ఉన్నారు. 👉పదహారు ఓవర్లలో భారత్ స్కోరు: 147-2రిచా 5, హర్మన్ 12 పరుగులతో ఉన్నారు.👉పదిహేను ఓవర్లలో భారత్ స్కోరు: 140-2రిచా 3, హర్మన్ 7 పరుగులతో ఉన్నారు.రెండో వికెట్ కోల్పోయిన భారత్13.4వ ఓవర్: చమరి ఆటపట్టు బౌలింగ్‌లో హర్మన్ పరుగు తీసే క్రమంలో స్మృతితో సమన్వయ లోపం కారణంగా స్మృతి రనౌట్ (39 బంతుల్లో 59) అయింది. రిచా ఘోష్ క్రీజులోకి రాగా.. హర్మన్ 3 పరుగులతో ఉంది. 14 ఓవర్లలో స్కోరు: 134-2.👉షఫాలీ వర్మ అవుట్12.5వ ఓవర్: చముడి ప్రబోద బౌలింగ్‌లో చమరి ఆటపట్టుకు క్యాచ్ ఇచ్చిన షఫాలీ (68) తొలి వికెట్‌గా వెనుదిరిగింది. స్కోరు: 130-1 (13). హర్మన్‌ప్రీత్ కౌర్ క్రీజులోకి రాగా.. స్మృతి 58 పరుగులతో ఉంది.👉పన్నెండు ఓవర్లలో భారత్ స్కోరు: 121-0షఫాలీ 67, స్మృతి 51 పరుగులతో ఉన్నారు.👉పదకొండు ఓవర్లలో భారత్ స్కోరు: 113-0👉స్మృతి హాఫ్ సెంచరీషఫాలీ 61 పరుగులతో ఉండగా.. స్మృతి మంధాన 35 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకుంది.👉పది ఓవర్లలో భారత్ స్కోరు: 98-0స్మృతి 38, షఫాలీ 59 పరుగులతో ఉన్నారు.తొమ్మిది ఓవర్లలో భారత్ స్కోరు: 91-0👉స్మృతి 32, షఫాలీ 58 పరుగులతో ఉన్నారు.👉24 బంతుల్లోనే షఫాలీ అర్ధ శతకం.. అంతర్జాతీయ టీ20 కెరీర్లో ఆమెకు ఇది 21వ హాఫ్ సెంచరీ.👉ఎనిమిది ఓవర్లలో భారత్ స్కోరు: 78-0షఫాలీ 25 బంతుల్లో 53, స్మృతి మంధాన 23 బంతుల్లో 24 పరుగులతో ఉన్నారు.👉ఏడు ఓవర్లలో భారత్ స్కోరు: 69-0షఫాలీ 48, స్మృతి 21 పరుగులతో ఉన్నారు.👉పవర్ ప్లేలో భారత్ స్కోరు: 57-0 (6 ఓవర్లు)షఫాలీ 19 బంతుల్లో 38 పరుగులతో జోరు మీదుండగా.. స్మృతి 17 బంతుల్లో 19 పరుగులు చేసింది.👉ఐదు ఓవర్లలో భారత్ స్కోరు: 56-0షఫాలీ 37, స్మృతి 19 పరుగులతో ఉన్నారు.👉నాలుగు ఓవర్లలో భారత్ స్కోరు: 35-0షఫాలీ 18, స్మృతి 17 పరుగులతో ఉన్నారు.నిలకడగా ఆడుతున్న ఓపెనర్లు👉మూడు ఓవర్లలో భారత్ స్కోరు: 29-0👉రెండు ఓవర్లలో భారత్ స్కోరు: 18-0తొలి ఓవర్లో ఐదు పరుగులేమిథాలి అయోధ్య పొదుపుగా బౌలింగ్ చేయడంతో భారత్ తొలి ఓవర్లో ఐదు పరుగులే చేసింది. ఓపెనర్లలో స్మృతి మంధాన తొలి బంతికే ఫోర్ బాది ఖాతా తెరవగా.. షఫాలీ సున్నా పరుగులతో ఉంది.తుదిజట్టులో మార్పుటైటిల్ పోరు కోసం తమ తుదిజట్టులో ఒక మార్పు చేసినట్లు హర్మన్ టాస్ సందర్భంగా వెల్లడించింది. ప్రతికా రావల్‌కు విశ్రాంతినిచ్చామన్న హర్మన్.. యువ ప్లేయర్ కమలినిని ఆడిస్తున్నట్లు తెలిపింది. కాగా ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల క్రికెట్ జట్టు ఇప్పటి వరకు ఏడుసార్లు చాంపియన్‌గా నిలిచింది. మరోవైపు.. గత ఆసియా కప్ ఫైనల్లో టీమిండియాను ఓడించి విజేతగా నిలిచిన శ్రీలంక.. ఈసారి కూడా అదే ఫలితం పునరావృతం చేయాలని భావిస్తోంది. అయితే, గత ఎడిషన్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని హర్మన్ సేన పట్టుదలగా ఉంది. దీంతో ఈ పోటీ మరింత రసవత్తరంగా మారింది.తుదిజట్లుభారత మహిళల జట్టుస్మృతి మంధాన, షఫాలీ వర్మ, గుణలన్ కమిలిని, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), భారతి ఫుల్మలి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, ప్రేమా రావత్, శ్రీచరణి, క్రాంతి గౌడ్, నందిని శర్మ.శ్రీలంక మహిళల జట్టుచమరి ఆటపట్టు (కెప్టెన్), ఇమేషా దులాని, విష్మి గుణరత్నె, హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, కవిశా దిల్హరి, నీలాక్షిక సిల్వ, కౌశిని నుత్యాంగన (వికెట్ కీపర్), సుగందిక కుమారి, చముడి ప్రబోద, మిథాలి అయోధ్య.చదవండి: అఫ్గాన్‌తో తొలి టీ20.. తుదిజట్టులో వైభవ్‌కు దక్కని చోటు -
అతడు అందగాడు, మంచివాడు: ఇంగ్లండ్ దిగ్గజం
టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం జాఫ్రీ బాయ్‌కాట్ ప్రశంసలు కురిపించాడు. జడ్డూ అందగాడు.. అదే విధంగా మంచివాడు అంటూ కొనియాడాడు. ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్రౌండర్లలో జడ్డూకు తప్పక స్థానం ఉంటుందని పేర్కొన్నాడు.రవీంద్ర జడేజా ఇటీవల శ్రీలంక పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో రెండు టెస్టులు ఆడాడు. మొత్తంగా ఎనిమిది వికెట్లు పడగొట్టి.. భారత్ 1-0తో సిరీస్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, జడ్డూ బౌలింగ్‌లో పస తగ్గిందనే విమర్శలు వచ్చాయి.నా అభిమాన క్రికెట్ నువ్వేఈ నేపథ్యంలో జడ్డూ గురించి ప్రస్తావన రాగా.. జాఫ్రీ బాయ్‌కాట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టిక్ టు క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘జడేజా కళాత్మకంగా బౌలింగ్ చేస్తాడు. అత్యద్భుతంగా ఫీల్డింగ్ చేస్తాడు. బ్యాటింగ్ కూడా చేయగలడు.అతడు అందగాడు. అతడి గురించి ఇంకా ఎన్నెన్నో విషయాలు చెప్పవచ్చు. ఇటీవలే తొలిసారిగా అతడిని ప్రత్యక్షంగా కలిశాను. గతేడాది ఇండియాకు వెళ్లినప్పుడు అతడితో మాట్లాడాను.‘నా అభిమాన క్రికెట్ నువ్వే’ అని చెప్పాను. అందుకు అతడు.. ‘అసలు ఆ అవకాశమే లేదు’ అని నవ్వేశాడు. నేను మాత్రం నువ్వే నా ఫేవరెట్ అని మరోసారి చెప్పాను. అతడు ఎంతో అందగాడు. మంచివాడు. కేవలం క్రికెటర్ కాదు.. అత్యుత్తమ ఆల్‌రౌండ్ క్రికెటర్’’ అని బాయ్‌కాట్ జడ్డూను ఆకాశానికెత్తాడు. పోటీతత్వం ఎక్కువఅదే విధంగా.. ‘‘అతడు ఎల్లప్పుడూ ఎనర్జీతో కనిపిస్తాడు. ఒత్తిడిలోనూ నవ్వులు చిందించగలడు. కఠిన సమయాల్లో జట్టును ఒడ్డుకు చేరుస్తాడు. అతడిలో పోటీతత్వం ఎక్కువ’’ అని జడ్డూను బాయ్‌కాట్ ప్రశంసించాడు. కాగా 2009లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన జడేజా ఇప్పటికి 91 టెస్టులు, 210 వన్డేలు, 74 టీ20లు ఆడాడు.ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఖాతాలో టెస్టుల్లో 4160, వన్డేల్లో 2905, టీ20లలో 515 పరుగులు ఉన్నాయి. అదే విధంగా.. ఈ లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ టెస్టుల్లో 356, వన్డేల్లో 232, టీ20లలో 54 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా 2024లో టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత జడ్డూ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.చదవండి: ‘రిటైర్మెంట్ వరకు అతడే టీమిండియా కెప్టెన్’ -
అతడి బౌలింగ్‌లో పసలేదు.. ఇలా అయితే కష్టమే: గవాస్కర్
కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో భారత అరంగేట్ర స్పిన్నర్ సారాంశ్ జైన్ ఆశించిన స్దాయిలో రాణించలేకపోయాడు. కుల్దీప్ యాదవ్ స్ధానంలో జట్టులోకి వచ్చిన ఈ ఆఫ్ స్పిన్నర్ తన పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు."తొలి మ్యాచ్ ఆడుతున్న ఆందోళన, ఒత్తిడి సారాంశ్‌లో స్పష్టంగా కనిపించాయి. శ్రమించి బౌలింగ్ ప్రయత్నించినప్పటికీ, అతడు ప్రభావం చూపలేకపోయాడు. అంతర్జాతీయ స్థాయి బ్యాటర్లను ఇబ్బంది పెట్టేంత వైవిధ్యం అతడి బౌలింగ్‌లో లేదు.బ్యాటర్లను బోల్తా కొట్టించే డ్రిఫ్ట్ లేదా ఫ్లైట్ డెలివరీలను అతడు వేయలేకపోయాడు. పూర్తిగా పిచ్ నుంచి లభించే సహకారంపైనే ఆధారపడటంతో లంక బ్యాటర్లు అతడి బౌలింగ్‌ను సులువుగా ఎదుర్కొన్నారు" అని గవాస్కర్ ‘మిడ్-డే’లోని తన కాలమ్‌లో రాసుకొచ్చారు.కాగా ఐదు రోజుల పాటు సాగిన ఈ మ్యాచ్ చివరకు డ్రాగా ముగిసింది. ఐదో రోజు ఆటలో శ్రీలంకను ఆలౌట్ చేయలేక భారత బౌలర్లు చేతులెత్తేశారు. లంక యువ ఆటగాడు సోనాల్ దినుష విరోచిత పోరాటంతో భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. టెయిలాండర్లతో కలసి మ్యాచ్‌ను డ్రాగా ముగించడంలో కీలక పాత్ర పోషించాడు.చదవండి: గంభీర్ సంచలన నిర్ణయం.. డేంజర్లో శ్రేయస్ అయ్యర్ ప్లేస్! -
పడిక్కల్, సుతార్‌కు నిరాశ.. ప్రసిద్ధ్ తన్నుకుపోయాడు..!
శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత ఆటగాళ్లు దేవ్‌దత్ పడిక్కల్, మానవ్ సుతార్ విశేషంగా రాణించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో పడిక్కల్ 3 ఇన్నింగ్స్‌ల్లో 109.33 సగటున, 2 సెంచరీల సాయంతో 328 పరుగులు చేయగా.. సుతార్ ఏకంగా 108.2 ఓవర్లు వేసి 16 వికెట్లు పడగొట్టాడు.ఈ స్థాయిలో సత్తా చాటినా వీరిద్దరికి ఓ విషయంలో నిరాశ మిగిలింది. టీమిండియా మేనేజ్మెంట్ ఇటీవల ప్రవేశ పెట్టిన 'ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్' అవార్డు వీరిలో ఎవరికీ దక్కలేదు. ఆశ్చర్యకరంగా ఈ అవార్డును ప్రసిద్ద్ కృష్ణ ఎగరేసుకుపోయాడు.Prasidh Krishna won the Impact Player of the series vs Sri Lanka ❤️- Prasidh bowled his heart out for the country. pic.twitter.com/GpPUUkyrNC— Johns. (@CricCrazyJohns) August 28, 2026ఈ సిరీస్‌లో ప్రసిద్ద్ సుతార్ స్థాయిలో వికెట్లు తీయలేనప్పటికీ.. కీలక సమయాల్లో వికెట్లు తీసి ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ అవార్డుకు గణాంకాల కంటే పరిస్థితులకు తగ్గట్టు బౌలింగ్ చేయడం, బ్యాటర్లపై నిరంతరం ఒత్తిడి తీసుకురావడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ విషయాన్ని ప్రసిద్ద్‌కు అవార్డును ప్రధానం చేసిన టీమిండియా పనితీరు విశ్లేషకుడు హరి ప్రసాద్ మోహన్ చెప్పకనే చెప్పాడు. 'ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్' అవార్డును టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో అనధికారంగా అందజేస్తారు. ఈ సిరీస్‌లో ప్రసిద్ద్ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 24,57 సగటున 7 వికెట్లు పడగొట్టాడు. రెండు టెస్టుల్లో ప్రసిద్ద్ మరో పేసర్ సిరాజ్ కంటే అధికంగా శ్రమించాడు. ఈ సిరీస్ మొత్తంలోనూ ప్రసిద్ద్ సిరాజ్ కంటే ఎక్కువ ఓవర్లు వేశాడు.కాగా, శ్రీలంకతో సిరీస్‌లో సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచిన పడిక్కల్‌కు అధికరిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచిన సుతార్‌కు ఎలాంటి అవార్డు లభించినప్పటికీ అందరి మన్ననలు అందుకున్నాడు. పడిక్కల్, సుతార్, ప్రసిద్ద్లతో పాటు ప్రతి ఒక్క ప్లేయర్ తలో చేయి వేయడంతో భారత్ శ్రీలంక గడ్డపై రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. రెండో టెస్ట్‌లో శ్రీలంక బ్యాటర్ సోనల్ దినుషా అనూహ్యంగా ప్రతిఘటించడంతో ఆ మ్యాచ్ డ్రా అయ్యింది. చదవండి: చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్.. 18 ఏళ్ల తర్వాత -
అలాంటి ప్లేయర్ ఉండడం టీమిండియా అదృష్టం: పీటర్సన్
శ్రీలంకతో ముగిసిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా యువ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. సాయి సుదర్శన్ స్ధానంలో జట్టులోకి వచ్చిన పడిక్కల్.. తన సంచలన బ్యాటింగ్‌తో సెలక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. రెండు మ్యాచ్‌లలోనూ సెంచరీలు సాధించి మూడో నంబర్‌కు తానే సరైనోడని నిరూపించుకున్నాడు. ఈ కర్ణాటక బ్యాటర్ మొత్తంగా 328 పరుగులు చేసి ప్లేయర్‌గా ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. ఈ క్రమంలో పడిక్కల్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ప్రశంసల వర్షం కురిపించాడు."పడిక్కల్ ఒక అద్భుతమైన ఆటగాడు. ముఖ్యంగా అతడి బ్యాటింగ్ శైలి చూడటానికి ఎంతో బాగుంది. పడిక్కల్ లాంటి ఆటగాడు ఆటగాడు జట్టులో ఉండడం భారత్ అదృష్టం. మూడో స్ధానానికి అతడే సరైన ప్లేయర్" అని పీటర్సన్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చాడు. మరోవైపు భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా కూడా పడిక్కల్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు.‘‘పడిక్కల్ లాంటి ఆటగాళ్లు చాలా అరుదుగా ఉంటారు. అతడు స్పిన్ బాగా ఆడుతున్నాడు. పేస్ బౌలర్లను కూడా సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లో అతడు భారత్‌కు కీలకంగా మారనున్నాడు" అని జడేజా సోనీ స్పోర్ట్స్ డిబేట్లో పేర్కొన్నాడు. కాగా ఈ భారత్ తమ తదుపరి టెస్టు సిరీస్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. అనంతరం డిసెంబర్లో స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది.చదవండి: ఒక్క తప్పు కూడా చేయలేదు.. అతడొక అద్భుతం: అశ్విన్ -
ఒక్క తప్పు కూడా చేయలేదు.. అతడొక అద్భుతం: అశ్విన్
కొలంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య రెండో టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. ఓటమి ఖాయమనుకున్న చోట శ్రీలంక యువ బ్యాటర్ సోనల్ దినూషా అద్భుతం చేశాడు. దాదాపు 100 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి తన జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడు. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ తన విరోచిత పోరాటంతో మ్యాచ్‌ను డ్రాగా ముగించాడు. ఈ నేపథ్యంలో సోనల్ దినూషాపై భారత దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించాడు."కొలంబో టెస్టులో నిజానికి భారత్ గెలవాల్సింది. పరీక్షల్లో 'అవుట్ ఆఫ్ సిలబస్' ప్రశ్నలా.. దినూషా భారత జట్టుకు కొరకరాని కొయ్యగా మారాడు. 'ఎవరీ కొత్త ఆటగాడు?' అని అందరూ ఆశ్చర్యపోయేలా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. డ్రా అయినప్పటికి ఇది శ్రీలంకకు ఒక విజయం లాంటిదే. నాలుగు రోజులకే ముగుస్తుందనుకున్న మ్యాచ్‌ను ఆఖరి రోజు చివరి సెషన్ వరకు తీసుకొచ్చారు. వారికి ప్రస్తుతం కేవలం ఇద్దరు మంచి స్పిన్నర్ల అవసరముంది. ఈ సమస్య తీరితే శ్రీలంక తమ పూర్వవైభవాన్ని తిరిగి పొందే అవకాశముంది" అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.అదేవిధంగా సోనల్ బ్యాటింగ్ స్కిల్స్‌ను కూడా అశ్విన్ మాట్లాడాడు. ఈ మ్యాచ్‌లో దినూషా ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌లు చూశాను. కఠినమైన పిచ్‌లపై కూడా అతడు అద్భుతంగా ఆడాడు. ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయలేదు. పడిక్కల్ కంటే బాగా ఆడాడు. పడిక్కల్ ఎక్కువగా బ్యాక్‌ఫుట్‌పై షాట్లు ఆడతాడు. కానీ అతడు మరీ ఎక్కువగా వెనక్కి వెళ్లడం వల్ల బౌల్డ్ అయ్యాడు. కానీ ఈ లంక కుర్రాడు ఒక్క బంతికి కూడా ఇబ్బంది పడలేదు. బంతి లెంగ్త్‌ను ముందే అంచనా వేస్తున్నాడు. భారత స్పిన్నర్లను అతడు ఆడిన స్వీప్ షాట్లు గురుంచి ఎంత చెప్పుకొన్న తక్కువే అని ఈ సీఎస్కే లెజెండరీ స్పిన్నర్ కొనియాడాడు. -
చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్.. 18 ఏళ్ల తర్వాత
కొలంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్టు డ్రా ముగిసిన సంగతి తెలిసిందే. ఫాలో- ఆన్‌లో ఆతిథ్య జట్టును ఆలౌట్ చేసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా ప్రయత్నించినప్పటికి.. యువ బ్యాటర్ సోనల్ దినుష అద్భుతంగా పోరాటం కారణంగా డ్రాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఐదో రోజు ఆట ప్రారంభానికి శ్రీలంక చేతిలో కేవలం 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో శ్రీలంకను త్వరగా ఆలౌట్ చేసి భారత్ మ్యాచ్‌ను ముగిస్తుందని అంతా భావించారు. కానీ ఆఖరి రోజు ఆటలో కథ తారుమారైంది. దినుషతో పాటు టెయిలాండర్లు క్రీజులో పాతుకుపోయారు. భారత బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు.టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఎన్ని ప్రయోగాలు చేసినా ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్‌ను ముగించలేకపోయాడు. ఆఖరికి గిల్ కూడా రంగంలోకి దిగి బౌలింగ్ చేశాడు. చివరి వికెట్ పడగొట్టేందుకు పార్ట్-టైమ్ స్పిన్నర్‌గా మారిన గిల్.. 2 ఓవర్లు బౌలింగ్ చేసి 8 పరుగులు ఇచ్చాడు. వికెట్ ఏమీ తీయనప్పటికీ గిల్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.గత 18 ఏళ్లలో శ్రీలంక గడ్డపై బౌలింగ్ చేసిన తొలి భారత టెస్టు కెప్టెన్‌గా గిల్ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు 2008 లంక టూర్లో అప్పటి భారత కెప్టెన్ అనిల్ కుంబ్లే బౌలింగ్ చేశాడు. తాజా మ్యాచ్‌తో కుంబ్లే సరసన శుబ్‌మన్ చేరాడు.చదవండి: ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. ఆట బాయ్‌కట్ చేస్తామంటూ పాక్ బెదరింపులు! -
250 ఓవర్లు ఫీల్డింగ్ చేశాం.. వారు నిజంగా అద్భుతం: గిల్
కొలంబో వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక జట్టు అద్భుతం చేసింది. ఓటమి ఖాయమనుకున్న వేళ లంక బ్యాటర్లు విరోచితంగా పోరాడి మ్యాచ్‌ను డ్రా ముగించారు. ముఖ్యంగా శ్రీలంక యువ బ్యాటర్ సోనల్ దినుష అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. నాలుగో రోజు ఆటలో బ్యాటింగ్‌కు వచ్చిన దినుష.. దాదాపు 100 ఓవర్ల పాటు క్రీజులో ఉండి తన జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ అతడు సెంచరీలతో సత్తాచాటాడు. ఇక ఈ కీలక మ్యాచ్ డ్రా కావడంపై భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ స్పందించాడు. "ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు మేము మా శాయశక్తులా ప్రయత్నించాము. వరుసగా మూడు రోజుల పాటు దాదాపు 250 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేశాము. అయినప్పటికి వారు అద్భుతంగా ఆడారు. కచ్చితంగా శ్రీలంక బ్యాటర్లకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. అదేవిధంగా వారికి కొంచెం అదృష్టం కూడా కలిసి వచ్చింది. మేము అక్కడ ఇంకా కొత్త ప్రయోగించాల్సింది ఏమి లేదు. అన్ని రకాల ప్రయత్నాలు చేశాం. ఈ సిరీస్‌లో మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రత్యర్ధి జట్టు నుంచి మేము చాలా విషయాలు నేర్చుకున్నాం. ఒత్తిడిలో శ్రీలంక పుంజుకున్న తీరు నిజంగా ఒక అద్భుతం. లంచ్, టీ విరామ సమయంలో కూడా మేము దీని గురించే చర్చించాం. ఇక దేవ్‌దత్త్ పడిక్కల్ అద్భుతంగా ఆడాడు.కేఎల్ రాహుల్ మరోసారి తన క్లాస్ చూపించాడు. మరోవైపు మానవ్ సుతార్ గురుంచి ఎంత చెప్పుకొన్న తక్కువే. ప్రతీ మ్యాచ్‌లోనూ అతడు నిలకడగా రాణిస్తున్నాడు. బ్యాటర్ల మైండ్‌సెట్‌ను ముందుగానే పసిగట్టి అందుకు తగ్గట్టు బౌలింగ్ చేస్తున్నాడు. అతడు కచ్చితంగా సుదీర్ఘ కాలం పాటు భారత జట్టులో కొనసాగుతాడు. ఈ మ్యాచ్‌లో మా పేస్ బౌలర్లు కూడా తీవ్రంగా శ్రమించారు" అని గిల్ పేర్కొన్నాడు.అదేవిధంగా డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు గురుంచి గిల్ మాట్లడుతూ.. "మేము నవంబర్‌లో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్తున్నాం. అక్కడ మ్యాచ్‌లను గెలిచేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తాం. ఆ తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఆడనున్నాం. ఈ రెండు సిరీస్‌లలోనూ గెలిచి ఫైనల్స్‌కు చేరుకుంటామన్న నమ్మకం ఉందని" చెప్పుకొచ్చాడు.చదవండి: WTC 2025-27: డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో టీమిండియాకు బిగ్ షాక్ -
డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో టీమిండియాకు బిగ్ షాక్
శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలనుకున్న భారత జట్టుకు నిరాశే ఎదురైంది. కొలంబో వేదికగా జరిగిన రెండో టెస్టును టీమిండియా డ్రా ముగించింది. ఐదో రోజు ఆటలో శ్రీలంక బ్యాటర్లు అద్భుతమైన పోరాటం కనబరిచారు. నాలుగో రోజే శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు.. చివరి రోజున మిగిలిన 4 వికెట్లు సాధించి ఆలౌట్ చేయలేకపోయారు.యువ ఆటగాడు సోనల్ దినుష (264 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 133 నాటౌట్), లంక టెయిలాండర్ల పోరాటం ముందు మన బౌలర్లు తేలిపోయారు. దీంతో శ్రీలంక 429/9 స్కోరు వద్ద ఉన్నప్పుడు మ్యాచ్‌ను డ్రాగా ముగించారు. అయితే ఈ ఫలితం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) సైకిల్లో టీమిండియా ఫైనల్ ఆశలపై ప్రభావం చూపింది.ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచి ఉంటే డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో నాలుగో స్ధానానికి చేరుకునేది. కానీ ఇప్పుడు డ్రా కావడంతో ఐదో స్ధానానికే పరిమితమైంది. అంతేకాకుండా విజయాల శాతం 53.33 నుంచి 51.52కి పడిపోయింది. ప్రస్తుత సైకిల్లో గిల్ సేన ఇప్పటివరకు ఆడిన 11 టెస్టుల్లో ఐదు విజయాలు, రెండు డ్రాలు చేసింది. మరో నాలుగు మ్యాచ్‌లలో ఓటమి పాలైంది. పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా (80), దక్షిణాఫ్రికా (75), న్యూజిలాండ్ (72.22), బంగ్లాదేశ్ (55.56) జట్లు భారత్ కంటే ముందున్నాయి.భారత్ ఫైనల్‌కు చేరాలంటే?ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో టీమిండియా ఇంకా 7 టెస్టులు ఆడనుంది. ఇందుకు న్యూజిలాండ్‌తో 2, ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లలో తలపడనుంది. భారత జట్టు ఫైనల్‌కు చేరాలంటే.. ఈ ఏడు మ్యాచ్‌లలో ఐదింట అయినా గెలుపొందాలి. అంతేకాకుండా ఇతర జట్ల ఫలితాలపైన కూడా ఆధారపడాల్సి ఉంటుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో కివీస్ పర్యటనకు భారత జట్టు వెళ్లనుంది.చదవండి: IND vs SL: 90 బంతులు.. 12 పరుగులు! నీ ఓపికకు ఓ దండం సామీ? -
90 బంతులు.. 12 పరుగులు! నీ ఓపికకు ఓ దండం సామీ?
కొలంబో వేదికగా భారత్‌తో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక పేస్ బౌలర్ లాహిరు కుమార బ్యాట్‌తో అద్భుతమైన పోరాట పటిమ కనబరిచాడు. ఈ మ్యాచ్‌ను శ్రీలంక డ్రా చేసుకోవడంలో కుమారది కీలక పాత్ర. ఫాలో ఆన్‌లో ఆతిథ్య జట్టును త్వరగా ఆలౌట్ చేయాలని భావించిన భారత జట్టు ఆశలపై అతడు నీళ్లు జల్లాడు. పదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కుమార.. అసాధారణ డిఫెన్స్‌తో టీమిండియా బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు. భారత స్పిన్నర్లను అలోవకగా ఆడుతూ క్రీజులో పాతుకుపోయాడు. అప్పటికే టీమిండియాకు కొరకరాని కొయ్యగా మారిన సునాల్ దినుషతో కలిసి లహిరు తమ జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడు. ఏకంగా 90 బంతులు ఎదుర్కొన్న కుమార కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. చివరికి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో జైశ్వాల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ క్రమంలో నెటిజన్లు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒక టెయిలెండర్ అయి ఉండి భారత బౌలింగ్‌ను ఎదుర్కొంటూ ఆ తరహా బ్యాటింగ్ చేయడం నిజంగా గ్రేట్ అని కొనియాడుతున్నారు. కాగా ఫాలో ఆన్‌లో శ్రీలంక బ్యాటర్లు విరోచిత పోరాటం కనబరిచారు. ముఖ్యంగా యువ ఆటగాడు సోనల్ దినుష(133 నాటౌట్) అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ శతక్కొట్టి భారత్‌కు కీలక విజయాన్ని దూరం చేశాడు.అతడికి సపోర్ట్‌గా లంక టెయిలాండర్లు కూడా నిలిచారు. దీంతో లంక తమ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 429 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ డ్రా ముగిసినప్పటికి, రెండు టెస్టుల సిరీస్‌ను 1-0 తేడాతో భారత్ సొంతం చేసుకుంది.సంక్షిప్త స్కోర్లు..భారత తొలి ఇన్నింగ్స్ – 503/9 డిక్లేర్శ్రీలంక రెండో ఇన్నింగ్స్ – 290 ఆలౌట్శ్రీలంక రెండో ఇన్నింగ్స్ – 429/9 డిక్లేర్చదవండి: IND vs SL: డ్రా ముగిసిన కొలంబో టెస్టు.. సిరీస్ భారత్‌దే -
IND vs SL: డ్రా ముగిసిన కొలంబో టెస్టు.. సిరీస్ భారత్‌దే
కొలంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ ఫాలో ఆన్‌లో శ్రీలంక బ్యాటర్లు అద్భుతం చేశారు. 229/6తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంకను భారత బౌలర్లు ఆలౌట్ చేయలేకపోయారు. నాలుగో రోజే శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు పడగొట్టిన మన బౌలర్లు.. చివరి రోజున మిగిలిన 4 వికెట్లు తీయలేకపోయారు.లంక బ్యాటర్ సోనల్ దినూష (133 నాటౌట్) అజేయ సెంచరీతో టీమిండియాకు గెలుపును దూరం చేశాడు. అసాధారణ బ్యాటింగ్‌తో క్రీజులో పాతుకుపోయిన అతడి వికెట్ కోసం భారత్ చేసిన ప్రయోగాలన్నీ విఫలమయ్యాయి. అతడితో పాటు టెయిలాండర్లు లహిరు కుమార (90 బంతుల్లో 12), కేశర నువాంత (150 బంతుల్లో 46), అషిథా ఫెర్నాండో (24 బంతుల్లో 0 నాటౌట్) వీరోచిత పోరాటం కనబరిచారు.తొమ్మిదో వికెట్‌గా కుమార అవుట్ కావడంతో శ్రీలంకను భారత్ త్వరగా ఆలౌట్ చేసి బ్యాటింగ్‌కు వస్తుందని అంతా భావించారు. కానీ పదకొండో నంబర్ బ్యాటర్ ఫెర్నాండో కూడా తన జిడ్డు బ్యాటింగ్‌తో విసుగు తెప్పించాడు. అతడి వికెట్ కోసం ఆఖరికి కెప్టెన్ శుబ్‌మన్ గిల్, యశస్వి జైశ్వాల్, ధ్రువ్ జురెల్ కూడా బౌలింగ్ చేశారు.అయినా చివరి వికెట్‌ను పడగొట్టలేకపోయారు. దీంతో మరో 18 ఓవర్ల ఆట మిగిలి ఉండగానే ఇరు జట్లూ డ్రాకు అంగీకరించాయి. అప్పటికే శ్రీలంక 216 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఒకవేళ భారత్ బ్యాటింగ్‌కు దిగినా ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.బెడిసి కొట్టిన టీమిండియా ప్లాన్ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 503/9 వద్ద డిక్లేర్ చేసింది. భారత బ్యాటర్లలో దేవ్‌దత్త్ పడిక్కల్(117), ధ్రువ్ జురెల్(115) సెంచరీలతో సత్తాచాటగా.. గిల్(50), పంత్(63) అర్ధ శతకాలతో రాణించారు. అనంతరం శ్రీలంక తమ మొదటి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్‌లో కూడా సోనల్ దినుష(103) సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు పసిందు సూరియబండార(80) కూడా రాణించాడు.మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 213 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ క్రమంలో సునాయస విజయం సాధించవచ్చనే నమ్మకంతో భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ లంక జట్టుకు ఫాలో-ఆన్‌కు ఆహ్వానించాడు. గిల్ తీసుకున్న ఈ నిర్ణయం బెడిసికొట్టిందనే చెప్పాలి. ఫాలో ఆన్‌లో శ్రీలంక అద్భుతమైన పోరాటం కనబరిచి మ్యాచ్‌ను డ్రా ముగించింది.సంక్షిప్త స్కోర్లు..భారత తొలి ఇన్నింగ్స్ – 503/9 డిక్లేర్శ్రీలంక రెండో ఇన్నింగ్స్ – 290 ఆలౌట్శ్రీలంక రెండో ఇన్నింగ్స్ – 429/9 డిక్లేర్చదవండి: చరిత్ర సృష్టించిన వరుస సెంచరీల వీరుడు సొనాల్ దినుష -
వరుస సెంచరీలు!.. చరిత్ర సృష్టించిన సొనాల్ దినుష
శ్రీలంకతో రెండో టెస్టులో టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఐదో ఆరోజు ఆటలో లంకను త్వరగా అవుట్ చేయాలన్న భారత జట్టు ఆశలపై సొనాల్ దినుష నీళ్లు చల్లాడు. వరుసగా రెండో ఇన్నింగ్స్‌లో శతక్కొట్టి శ్రీలంకకు ఊపిరిలూదాడు.ఈ క్రమంలోనే సొనాల్ దినుష సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో టీమిండియాపై ఇంత వరకు ఏ ఆసియా క్రికెటర్‌కూ సాధ్యంకాని ఓ అరుదైన ఘనత సాధించాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-26లో భాగంగా రెండు మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా శ్రీలంకకు వెళ్లింది.శతక్కొట్టిన దినుషగాలె వేదికగా తొలి టెస్టులో టీమిండియా ఆతిథ్య లంకను 165 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో లంక ప్రదర్శన ఎలా ఉన్నప్పటికీ ఆల్‌రౌండర్ దినుష మాత్రం అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో సరిగ్గా శతకం సాధించిన ఈ 25 ఏళ్ల లెఫ్టాండర్ బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో 84 పరుగులు చేశాడు.ఇక కొలంబో వేదికగా రెండో టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 503-9 వద్ద తమ మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం శ్రీలంకను 290 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో భారత్‌కు 213 పరుగుల ఆధిక్యం లభించగా శ్రీలంకను ఫాలో ఆన్ ఆడమని చెప్పింది.వరుసగా రెండో సెంచరీఇదిలా ఉంటే.. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగుల స్కోరు చేయడంలో సొనాల్ దినుషదే కీలక పాత్ర. ఏడో స్థానంలో వచ్చిన అతడు 162 బంతులు ఎదుర్కొని 103 పరుగులు సాధించాడు. ఇక ఫాలో ఆన్‌లో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో లంక తేలిగ్గానే తలవొంచుతుందని భావించిన టీమిండియా దినుష ఊహించని షాకిచ్చాడు.తొలి ఆసియా బ్యాటర్‌గా..ఆఖరిదైన గురువారం రోజు ఆటలో ఏడు పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మొదలుపెట్టిన దినుష.. అనూహ్య రీతిలో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ బ్రేక్ తర్వాత తొలి బంతికే రెండు పరుగులు తీసి వంద పరుగుల మార్కు అందుకున్న అతడు.. జిడ్డు బ్యాటింగ్‌తో భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు.ఇక ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లోనూ శతక్కొట్టిన సొనాల్ దినుష.. టీమిండియాతో టెస్టుల్లో ఆడిన తొలి నాలుగు ఇన్నింగ్స్‌లో వరుసగా ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ఏకైక ఆసియా బ్యాటర్‌గా నిలిచాడు. గాలె టెస్టులో 100, 84.. కొలంబోలో 103, 100* స్కోర్లు సాధించి ఈ అరుదైన ఘనత అందుకున్నాడు.చదవండి: భారత జట్టు ప్రకటన.. సెహ్వాగ్ కుమారుడికి చోటు -
సచిన్ మాదిరే: శ్రీలంక ప్లేయర్‌పై బీసీసీఐ ఉపాధ్యక్షుడి ప్రశంసలు
శ్రీలంక ఆటగాడు సొనాల్ దినుషపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షడు రాజీవ్ శుక్లా ప్రశంసలు కురిపించాడు. సొనాల్ అత్యద్భుతమైన ఆటగాడని.. అతడి ఆట టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్‌ను గుర్తుకుతెస్తోందని కొనియాడాడు.కాగా టీమిండియా ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా ఆతిథ్య జట్టుతో రెండు మ్యాచ్‌లు ఆడుతోంది. ఈ క్రమంలో గాలెలో జరిగిన తొలి టెస్టులో భారత్ లంకను 165 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది.దినుష అద్భుత ప్రదర్శనఅయితే, ఈ మ్యాచ్‌లో శ్రీలంక యువ ఆల్‌రౌండర్ సొనాల్ దినుష మాత్రం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో సరిగ్గా సెంచరీ (100) చేసి అవుటైన ఈ 25 ఏళ్ల ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో 84 పరుగులతో ఆకట్టుకున్నాడు.ఇక కొలంబో వేదికగా ఆదివారం మొదలైన రెండో టెస్టులోనూ సొనాల్ దినుష అద్భుత ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 163 బంతులు ఎదుర్కొన్న సొనాల్ దినుష.. 103 పరుగులు సాధించాడు. ఇందులో 8 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. పసిందు సూరియబండారా (80)తో కలిసి దినుష జట్టును ఆదుకున్నాడు.పసిందుతో కలిసి..అయితే, మొదటి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 290 పరుగులకే ఆలౌట్ కావడంతో.. భారత్‌కు 213 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దీంతో టీమిండియా శ్రీలంకను ఫాలో ఆన్ ఆడేందుకు ఆహ్వానించింది. ఈ క్రమంలో పసిందు సూరియబండారా (92), కమిందు మెండిస్ (55) పట్టుదలగా నిలబడ్డారు. దీంతో బుధవారం నాటి నాలుగోరోజు ఆటలో లంక 16 పరుగుల స్వల్ప ఆధిక్యంలో నిలిచింది.ఇక నాలుగో రోజు ఆట పూర్తయ్యేసరికి దినుష ఏడు పరుగులు చేశాడు. అయితే, కీలకమైన గురువారం నాటి ఆఖరి రోజు ఆటలో మాత్రం దినుష భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి భోజన విరామ సమయానికి ముందే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ పరిణామాల క్రమంలో రాజీవ్ శుక్లా సొనాల్ దినుషపై ప్రశంసలు కురిపించాడు.సొనాల్ అత్యద్భుతమైన ఆటగాడు‘‘శ్రీలంకకు చెందిన సొనాల్ అత్యద్భుతమైన ఆటగాడు. టెండుల్కర్లా అనిపిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో టెస్టుల్లో గొప్ప ఆటగాడిగా ఎదగగల సత్తా అతడికి ఉంది’’ అని రాజీవ్ శుక్లా ఎక్స్ వేదికగా కొనియాడాడు. అయితే, నెటిజన్ల నుంచి ఇందుకు మిశ్రమ స్పందన వస్తోంది. దిగ్గజ సచిన్‌తో అప్‌కమింగ్ ప్లేయర్‌ను ఎలా పోలుస్తారని పలువురు రాజీవ్ శుక్లాను విమర్శిస్తున్నారు.కాగా గతేడాది దినుష బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటికి ఐదు మ్యాచ్‌లలో కలిపి 500కు పైగా పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. సచిన్ టెండుల్కర్ తన రెండున్నర దశాబ్దాల కెరీర్లో 200 టెస్టులు ఆడి.. 15,921 పరుగులు చేసి అత్యధిక పరుగుల వీరుడిగా చెక్కు చెదరని రికార్డు సొంతం చేసుకున్నాడు. అత్యధికంగా 51 టెస్టు సెంచరీలతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.చదవండి: IND vs AUS: భారత జట్టు ప్రకటన.. సెహ్వాగ్, ద్రవిడ్ కుమారులకు చోటు -
IND vs SL: భారత్-శ్రీలంక రెండో టెస్టు డ్రా
IND vs SL 2nd Test Day 5: కొలంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్టు డ్రా ముగిసింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0 తేడాతో భారత్ సొంతం చేసుకుంది. ఫాలో ఆన్‌లో శ్రీలంక బ్యాటర్లు అద్భుతమైన పోరాట పటిమ కనబరిచారు. 229/6తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక.. తమ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 429 పరుగులు చేసింది. సోనల్ దినూష (133 నాటౌట్) అజేయ సెంచరీతో టీమిండియాకు గెలుపును దూరం చేశాడు. శ్రీలంక తొమ్మిదో వికెట్ డౌన్ఎట్టకేలకు శ్రీలంక తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 90 బంతులు ఆడి 12 పరుగులు చేసిన కుమార.. జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. శ్రీలంక ప్రస్తుతం 190 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.శతక్కొట్టిన దినుష133.1: సిరాజ్ బౌలింగ్‌లో రెండు పరుగులు తీసి సెంచరీ పూర్తి చేసుకున్న దినుష. 196 బంతుల్లో వంద మార్కుల అందుకున్న ఆల్‌రౌండర్. ఈ సిరీస్‌లో మూడో సెంచరీ పూర్తి చేసుకున్న 25 ఏళ్ల దినుష. లంక స్కోరు: 385-8. 172 పరుగుల ఆధిక్యం.పోరాడుతున్న శ్రీలంక.. సెంచరీకి చేరువలో దినుషకొలంబో టెస్టులో శ్రీలంక డ్రా దిశగా పోరాడుతోంది. ఆఖరి రోజు టీ బ్రేక్ సమయానికి శ్రీలంక తమ రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు కోల్పోయి 383 పరుగులు చేసింది. లంక ప్రస్తుతం 170 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. సోనల్ దినుష(195 బంతుల్లో 6 ఫోర్లుతో 98) సెంచరీకి చేరువలో ఉన్నాడు.150 పరుగుల ఆధిక్యంలో శ్రీలంకలాహిరు కుమార 1, దినుష 83 పరుగులతో ఉన్నారు. లంక స్కోరు: 363-8.ఎనిమిదో వికెట్ కోల్పోయిన శ్రీలంక116.3 వ ఓవర్: రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ధ్రువ్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చి ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగిన ప్రబాత్ జయసూరియ. లాహిరు కుమార క్రీజులోకి వచ్చాడు. లంక స్కోరు: 355-8 (117). దినుష 76 పరుగులతో ఉన్నాడు. శ్రీలంక ఆధిక్యం 142 పరుగులు.140 పరుగుల ఆధిక్యంలో శ్రీలంకదినుష 76, ప్రబాత్ సున్నా పరుగులతో ఉన్నారు. స్కోరు: 353/7 (115).శ్రీలంక స్కోరు: 341-7 (110)దినుష 65, ప్రబాత్ సున్నా పరుగులతో ఉన్నారు. ఆధిక్యం 128 పరుగులు.ఏడో వికెట్ కోల్పోయిన శ్రీలంకటీమిండియా రెండో సెషన్‌ను ఘనంగా ఆరంభించింది. భోజన విరామం తర్వాత మానవ్ సుతార్ అటాకింగ్‌కు వచ్చి.. నాలుగో బంతికే కేశారా నువాంతను పెవిలియన్‌కు పంపాడు. జురెల్‌కు క్యాచ్ ఇచ్చి 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నువాంత వెనుదిరిగాడు. దీంతో లంక ఏడో వికెట్ కోల్పోయింది. స్కోరు: 330-7 (105). ప్రబాత్ జయసూరియ క్రీజులోకి రాగా.. దినుష 56 పరుగులతో ఉన్నాడు. లంక ఆధిక్యం 118 పరుగులు.తొలి సెషన్లో శ్రీలంక ఆధిపత్యంకీలకమైన ఐదో రోజు ఆటలో తొలి సెషన్లో భారత బౌలర్లు తేలిపోయారు. సొనాల్ దినుష, కేశారా నువాంత జోడీని విడదీసేందకు ఆపసోపాలు పడ్డారు. ఈ క్రమంలో దినుష అర్ధ శతకం (55*) పూర్తి చేసుకోగా.. నువాంత (46*) హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు.భోజన విరామ సమయానికి శ్రీలంక 104 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 329 పరుగులు సాధించింది. తద్వారా 116 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.నొప్పితో విలవిల్లాడిన నువాంత103.2వ ఓవర్: రవీంద్ర జడేజా వేసిన బంతి నువాంత కాలికి తగిలింది. దీంతో నొప్పితో విలవిల్లాడగా ఫిజియో వచ్చి పరిశీలించాడు. అయితే, వెంటనే నువాంత మళ్లీ బ్యాటింగ్ మొదలుపెట్టాడు. జడ్డూ ఎల్బీడబ్ల్యూకు అప్పీలు చేయగా.. అంపైర్ నుంచి ప్రతికూల ఫలితమే వచ్చింది.115 పరుగుల ఆధిక్యంలో శ్రీలంకవికెట్లు తీయలైక భారత బౌలర్ల పాట్లు.. శ్రీలంక స్కోరు: 328-6. నువాంత 46, దినుష 54 పరుగులతో ఉన్నారు.శ్రీలంక స్కోరు: 320-6 (99)దినుష 52, నువాంత 41 పరుగులతో ఉన్నారు. శ్రీలంక ఆధిక్యం 107 పరుగులు.దినుష హాఫ్ సెంచరీ99 బంతులలో యాభై పరుగులు పూర్తి చేసుకున్న దినుష. నువాంత 39 పరుగులతో ఉండగా.. లంకస్కోరు: 315-6. 102 పరుగుల ఆధిక్యంలో శ్రీలంక.శ్రీలంక స్కోరు: 306-6 (94)93 పరుగుల ఆధిక్యంలో శ్రీలంక. దినుష 42, నువాంత 37 పరుగులతో ఉన్నారు.89 పరుగుల ఆధిక్యంలో శ్రీలంకదినుష 39, నువాంత 37 పరుగులతో ఉన్నారు. స్కోరు: 302-6 (91).డ్రింక్స్ బ్రేక్ సమయానికి శ్రీలంక స్కోరు: 284-6దినుష 34, నువాంత 28 పరుగులతో ఉన్నారు. శ్రీలంక ఆధిక్యం 71 పరుగులకు చేరుకుంది. చేతిలో ఇంకా నాలుగు వికెట్లు ఉన్నాయి.శ్రీలంక స్కోరు: 276-6 (86)50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన దినుష, నువాంత. దినుష 29, నువాంత 27 పరుగులతో ఉన్నారు. 63 పరుగుల ఆధిక్యంలో శ్రీలంకనిలకడగా ఆడుతున్న దినుష, నువాంతదినుష 22, నువాంత 20 పరుగులతో ఉన్నారు. స్కోరు: 262-6 (84). 49 పరుగుల ఆధిక్యంలో శ్రీలంక. Ravindra Jadeja gets one to turn sharply as #TeamIndia hunt for wickets. 😮💨 Watch #SLvIND, 2nd Test, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/cMB2L0A3Ro— Sony Sports Network (@SonySportsNetwk) August 27, 202644 పరుగుల ఆధిక్యంలో లంకదినుష 21, నువాంత 17 పరుగులతో ఉన్నారు.35 పరుగుల ఆధిక్యంలో లంకసొనాల్ దినుష 13, నువాంత 16 పరుగులతో ఉన్నారు. లంక స్కోరు: 248/6 (78)శ్రీలంక ఓవర్‌నైట్ స్కోరు: 229-6సొనాల్ దినుష ఏడు, కేశారా నువాంత మూడు పరుగులతో అజేయంగా నిలిచారు.స్వల్ప ఆధిక్యంలో లంకఫాలో ఆన్ ఆడుతున్న శ్రీలంక బుధవారం ఆట పూర్తయ్యేసరికి 72.4 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. తద్వారా 16 పరుగుల స్వల్ప ఆధిక్యంలోకి వెళ్లింది. పసిందు సూరియబండారా (92), కమిందు మెండిస్ (55) రాణించడంతో ఎట్టకేలకు లంక ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకోగలిగింది.సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్లో ఆదివారం మొదలైన ఈ మ్యాచ్‌లో భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 503-9 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకే కుప్పకూలడంతో టీమిండియా ఆతిథ్య లంకను ఫాలో ఆన్ ఆడమని చెప్పింది. కాగా వర్షం వల్ల బుధవారం నాటి నాలుగో రోజు ఆటను ముందుగానే ముగించాల్సి వచ్చింది. క్లీన్‌స్వీప్‌పై గురిఇదిలా ఉంటే.. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గాలెలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా శ్రీలంకను 165 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఇదే జోరులో రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసేందుకు భారత్ సిద్ధమైంది.తుదిజట్లుభారత్యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, సారాంశ్ జైన్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణశ్రీలంకలాహిరు ఉదార, కమిల్ మిశారా, పసిందు సూరియబండారా, కమిందు మెండిస్, ధనంజయ డి సిల్వ (కెప్టెన్), సొనాల్ దినుష, నిరోషన్ డిక్వెల్లా (వికెట్ కీపర్), కేశారా నువాంత, ప్రబాత్ జయసూరియ, లాహిరు కుమార, అసిత ఫెర్నాండో.చదవండి: IND vs SL: ఫాలో ఆన్ ఆడి గెలిచిన జట్లు ఇవే! -
IND vs SL: ఎట్టకేలకు ఆధిక్యంలోకి శ్రీలంక!
టీమిండియాతో రెండో టెస్టులో ఫాలో ఆన్ ఆడుతున్న శ్రీలంక ఎట్టకేలకు ఆధిక్యంలోకి వచ్చింది. పసిందు సూరియబండారా అద్భుత ఆట తీరుతో లంక పరువును కాపాడాడు. కాగా కొలంబో వేదికగా శ్రీలంక- భారత్ మధ్య నిర్ణయాత్మక రెండో టెస్టు ఆదివారం మొదలైన సంగతి తెలిసిందే.సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగి.. 503-9 వద్ద తమ మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దేవదత్ పడిక్కల్ (117), ధ్రువ్ జురెల్ (115 నాటౌట్) శతకాల వల్ల భారత్ భారీ స్కోరు సాధించగలిగింది.290 రుగులకే ఆలౌట్అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక బుధవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా.. తొలి ఇన్నింగ్స్‌లో 290 రుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్ల దాటికి లంక టాపార్డర్ కుదేలు కాగా.. నాలుగో స్థానంలో వచ్చిన పసిందు సూరియబండారా (80) జట్టును ఆదుకున్నాడు. ఇక ఆల్‌రౌండర్ సొనాల్ దినుష శతకం (103)తో చెలరేగాడు. దీంతో లంక దాదాపు మూడు వందల పరుగులకు చేరువకాగలిగింది.ఫాలో ఆన్భారత బౌలర్లలో మానవ్ సుతార్, ప్రసిద్ కృష్ణ చెరో మూడు వికెట్లు కూల్చగా.. అరంగేట్ర ఆటగాడు సారాంశ్ రెండు, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇక లంకను 290 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 213 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దీంతో ఫాలో ఆన్‌లో భాగంగా వెంటనే శ్రీలంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.రాణించిన పసిందు, కమిందుఈ క్రమంలో బుధవారం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కాసేపటికే శ్రీలంక తమ ఓపెనర్ లాహిరు ఉదార (3) వికెట్ కోల్పోయింది. అయితే, మరో ఓపెనర్ కమిల్ మిశార (32)తో కలిసి వన్‌డౌన్ బ్యాటర్ పసిందు రెండో వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఆ తర్వాత కమిందు మెండిస్‌తో కలిసి మూడో వికెట్‌కు 115 పరుగులు జోడించాడు.ఈ క్రమంలో కమిందు అర్ధ శతకం (55) పూర్తి చేసుకున్న తర్వాత అవుట్ కాగా.. పసిందు సెంచరీ దిశగా పయనించాడు. అయితే, మానవ్ సుతార్ స్పిన్ మాయలో చిక్కుకుని.. 92 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. మిగతా వారిలో కెప్టెన్ ధనంజయ డి సిల్వ 23 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. వికెట్ కీపర్ బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లా (6) విఫలమయ్యాడు.ఎట్టకేలకు ఆధిక్యంలోకి లంకఅయితే, వర్షం వల్ల ముందుగానే ఆటను నిలిపివేశారు. మొత్తానికి నాలుగో రోజు ఆట పూర్తయ్యే సమయానికి శ్రీలంక ఆరు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. తద్వారా 16 పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించింది. సెంచరీ వీరుడు సొనాల్ దినుష ఏడు, కేశారా నువాంత మూడు పరుగులతో అజేయంగా నిలిచారు.భారత బౌలర్లలో మానవ్ సుతార్ రెండు వికెట్లు తీయగా.. ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, సారాంశ్ జైన్, రవీంద్ర జడేజా తలా ఒక వికెట్ పడగొట్టారు. ఆటకు గురువారమే చివరి రోజు. అయితే, బుధవారం వర్షం వల్ల ముందుగానే ఆటను నిలిపివేసిన క్రమంలో గురువారం ఉదయం 9.45 నిమిషాలకే మ్యాచ్ ఆరంభమవుతుంది. ఇదిలా ఉంటే.. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే గాలెలో టీమిండియా గెలుపొందింది. కొలంబోలోనూ భారత్ గెలుపు దాదాపు ఖాయమైంది. అయితే, వర్షం ముప్పు కారణంగా గురువారం వీలైనంత త్వరగా లంకను ఆలౌట్ చేసి.. విజయం సాధించాలని టీమిండియా పట్టుదలగా ఉంది.చదవండి: IND vs SL: ఫాలో ఆన్ ఆడి గెలిచిన జట్లు ఇవే! -
వైభవ్, జైస్వాల్‌పై కఠిన చర్యలు తీసుకోండి: భారత మాజీ క్రికెటర్
టీమిండియా యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వీళ్లిద్దరు హద్దు మీరుతున్నారన్నాడు. కాబట్టి వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC), భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి విజ్ఞప్తి చేశాడు.కాగా ఇటీవల భారత్-‘ఎ’ జట్టు శ్రీలంకలో పర్యటించిన సంగతి తెలిసిందే. ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా శ్రీలంక-‘ఎ’తో కీలక మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో భారత్ ఓడిపోయింది. ఆ సమయంలో వైభవ్ సూర్యవంశీ క్రీజును వీడుతుండగా.. లంక ప్లేయర్ విశేన్ హలంబగే.. ‘మ్యాచ్ అయిపోయింది. ఇంటికి వెళ్లు’ అని కవ్వించినట్లు తెలిసింది.ఇందుకు వైభవ్ ధీటుగా బదులిచ్చాడు. సహనం కోల్పోయిన ఈ పదిహేనేళ్ల పిల్లాడు లంక ప్లేయర్‌పైకి దూసుకువెళ్లి విశేన్‌ను వెనక్కి నెట్టాడు. అతడూ వైభవ్‌నూ తోసేయగా.. మిగతా లంక ఆటగాళ్లు జోక్యం చేసుకుని ఇద్దరినీ విడదీశారు. అయితే, ఇది అనధికారిక మ్యాచ్ కాబట్టి ఐసీసీ పెద్దగా చర్యలు తీసుకోలేదని సమాచారం.ఇక తాజాగా టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ శ్రీలంకతో రెండో టెస్టు సందర్భంగా అసితా ఫెర్నాండోతో గొడవపడ్డాడు. జైసూను అవుట్ చేసిన తర్వాత అసితా ఏదో అనడంతో.. అతడిపైకి దూసుకెళ్లి హెల్మెట్‌తో డ్యాష్ ఇచ్చాడు. అతడూ జైసూ పైపైకి వెళ్లాడు. దీంతో ఐసీసీ జైస్వాల్, అసితాలకు జరిమానా వేయడంతో పాటు వారి ఖాతాలో డీమెరిట్ పాయింట్ జత చేసింది.ఈ పరిణామాల నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ తనదైన శైలిలో స్పందించాడు. ‘‘ప్రియమైన ఐసీసీ, బీసీసీఐ.. ఇటీవల ఇండియా-ఎ టూర్ సందర్భంగా వైభవ్.. ఇప్పుడు జైస్వాల్.. వీళ్లిద్దరు హద్దు మీరి ప్రవర్తించారు. వీరిని ఇలాగే కొనసాగిస్తే కష్టం. మళ్లీ అవే తప్పులు పునరావృతం చేస్తారు.క్రీడా స్ఫూర్తికి ముఖ్యంగా వాళ్లిద్దరి భవిష్యత్తుకు ఇది ఎంత మాత్రం మంచి కాదు’’ అని ఎక్స్ వేదికగా మంజ్రేకర్ ఐసీసీ, బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. అయితే, నెటిజన్లు మాత్రం మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది మంజ్రేకర్‌కు మద్దతు పలుకుతూ ఉంటే.. మరికొందరు మాత్రం ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లే రెచ్చగొట్టారని.. అందుకు వైభవ్, జైసూ కేవలం స్పందించారంటూ వారిని సమర్థిస్తున్నారు.చదవండి: IND vs SL: ఫాలో ఆన్ ఆడి గెలిచిన జట్లు ఇవే! -
IND vs SL: ‘ఫాలో ఆన్’ ఆడి గెలిచిన జట్లు ఇవే!
కొలంబోలో టీమిండియాతో రెండో టెస్టులో శ్రీలంక గెలవాలంటే అద్భుతం జరగాలి. ఇప్పటికే తొలి ఇన్నింగ్స్‌లో పూర్తిగా వెనుకబడ్డ ఆతిథ్య జట్టు.. ఫాలో ఆన్ ఆడుతోంది. శ్రీలంక ఆశలన్నీ పసిందు సూరియబండారా, సొనాల్ దినుషలపైనే ఉన్నాయి.అయితే, భారత బౌలర్లు విజృంభిస్తే మాత్రం శ్రీలంకకు భారీ ఓటమి తప్పదు. రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక మెరుగైన ఆరంభం అందుకున్నప్పటికీ టీమిండియానే శాసించే స్థితిలో ఉంది. ఈ మ్యాచ్‌లోనూ గిల్ సేన గెలవడం దాదాపు లాంఛనమే!.. ఇదిలా ఉంటే.. టెస్టు మ్యాచ్‌లో ఫాలో ఆడి మరీ గెలిచిన జట్లు ఏవో తెలుసా? ఈ జాబితాలో టీమిండియా కూడా ఉందండోయ్!! (శ్రీలంకను ఫాలో ఆన్ ఆడిస్తున్న టీమిండియా)ఆసీస్‌పై ఇంగ్లండ్ గెలుపుహేమాహేమీలు ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య 1894లో తొలిసారి టెస్టు మ్యాచ్ జరిగింది. సిడ్నీలో జరిగిన ఈ పోరులో ఆసీస్ 586 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. జార్జ్ జిఫేన్ సెంచరీ, సిడ్ గ్రెగరీ డబుల్ సెంచరీ కారణంగా ఈ స్కోరు సాధ్యమైంది.ఇందుకు ప్రతిగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులే చేయడంతో.. కంగారూలు ఇంగ్లిష్ జట్టును ఫాలో ఆన్ ఆడించారు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి.. 437 పరుగులు సాధించింది. తద్వారా ఆసీస్‌కు 177 పరుగుల లక్ష్యం విధించగా.. ఆతిథ్య జట్టు చేతులెత్తేసింది. దీంతో ఇంగ్లండ్ జయభేరి మోగించింది.మరోసారి అదే ఫలితంలీడ్స్ వేదికగా 1981లో ఇంగ్లండ్ ఆస్ట్రేలియాతో తలపడింది. ఈ మ్యాచ్‌లో పర్యాటక ఆసీస్ తొలుత బ్యాటింగ్‌కు దిగి.. 401-9 వద్ద మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. జాన్ డైసన్ సెంచరీతో అలరించాడు.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 174 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆసీస్ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి ఇంగ్లండ్‌ను ఫాలో ఆన్ ఆడించింది. రెండో ఇన్నింగ్స్‌లో దిగ్గజ ఇయాన్ బోతమ్ సంచలన రీతిలో శతక్కొట్టడంతో ఇంగ్లండ్ 356 పరుగులు సాధించింది.ఈ క్రమంలో 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. ఛేదనలో తడబడింది. ఫలితంగా ఇంగ్లండ్ 18 పరుగుల తేడాతో కంగారూలపై విజయం సాధించింది.ఈసారీ బాధిత జట్టు ఆస్ట్రేలియానే.. గెలుపు మనదేకోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌కు భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. 2001లో జరిగిన ఈ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 445 పరుగులు సాధించింది.అయితే, బ్యాటర్ల వైఫల్యం కారణంగా టీమిండియా 171 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారీ ఆధిక్యం సంపాదించిన ఆసీస్.. టీమిండియాను తక్కువగా అంచనా వేసి ఫాలో ఆన్ ఆడించింది.రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం భారత్ తడబడలేదు. వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ కలిసి అద్భుతం చేశారు. ద్రవిడ్ భారీ శతకం (180) సాధించగా.. లక్ష్మణ్ (281) తృటిలో ట్రిపుల్ సెంచరీ మిస్ అయ్యాడు. వీరిద్దరి విజృంభణ కారణంగా టీమిండియా ఆసీస్‌కు 384 పరుగుల లక్ష్యం విధించింది.అయితే, ఈసారి భారత బౌలర్లు విజృంభించడంతో ఆసీస్ 212 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా టీమిండియా 171 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.ఇంగ్లండ్‌కు షాకిచ్చిన న్యూజిలాండ్వెల్లింగ్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్‌కు దిగింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ ఎనిమిది వికెట్ల నష్టానికి 435 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. జో రూట్ (153 నాటౌట్), హ్యారీ బ్రూక్ (186) శతకాలతో చెలరేగారు.అనంతరం బ్యాటింగ్ మొదలుపెట్టిన న్యూజిలాండ్ 209 పరుగులకే కుప్పకూలింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ కివీస్‌ను ఫాలో ఆన్ ఆడించగా.. రెండో ఇన్నింగ్స్‌లో 483 పరుగులు సాధించింది. కేన్ విలియమ్సన్ సెంచరీ (132)తో ఆకట్టుకోగా.. టామ్ లాథమ్ (83), డెవాన్ కాన్వే (61), డారిల్ మిచెల్ (54), టామ్ బ్లండెల్ (90) అర్ధ శతకాలతో రాణించారు. ఈ క్రమంలో 258 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 256 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా ఒక్క పరుగు తేడాతో గెలిచిన కివీస్.. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను డ్రా చేసింది. చదవండి: చరిత్ర సృష్టించిన శ్రీలంక ఆల్‌రౌండర్ -
గాయపడ్డ సిరాజ్!
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ గాయపడ్డాడు. శ్రీలంకతో రెండో టెస్టు నాలుగో రోజు ఆట సందర్భంగా క్యాచ్ అందుకునే క్రమంలో ఈ హైదరాబాదీ అదుపుతప్పి కిందపడ్డాడు. కాగా కొలంబో వేదికగా శ్రీలంక- భారత్ మధ్య ఆదివారం రెండో టెస్టు మొదలైన సంగతి తెలిసిందే.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 503-9 వద్ద మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం బుధవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా శ్రీలంకను 290 పరుగులకు ఆలౌట్ చేసిన.. టీమిండియా ఫాలో ఆన్ ఆడిస్తోంది.పసిందు క్యాచ్ అందుకునేందుకు..ఈ క్రమంలో లంక రెండో ఇన్నింగ్స్ పదకొండో ఓవర్లో భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ బంతితో రంగంలోకి దిగాడు. అతడి బౌలింగ్‌లో శ్రీలంక వన్‌డౌన్ బ్యాటర్ పసిందు సూరియబండారా షాట్ ఆడగా.. క్యాచ్ పట్టేందుకు సిరాజ్ డీప్ మిడ్ వికెట్ పొజిషన్ నుంచి పరిగెత్తుకు వచ్చి డైవ్ కొట్టాడు.మైదానం వీడి.. ఈ క్రమంలో బంతిని అందుకున్నప్పటికీ.. అది సిరాజ్ చేజారింది. అదుపు తప్పి కిందపడ్డ సిరాజ్ తీవ్రంగా గాయపడ్డాడు. పక్కటెముకల వద్ద చేయి పెట్టుకుని నొప్పితో విలవిల్లాడాడు. హుటాహుటిన ఫిజియో వచ్చి పరిశీలించాడు. అయితే, నొప్పి తగ్గకపోవడంతో సిరాజ్‌ను మైదానం నుంచి బయటకు తీసుకువెళ్లాడు. తిరిగి వచ్చిన సిరాజ్భోజన విరామం తర్వాత కూడా సిరాజ్ ఫీల్డ్‌కు రాలేదు. దీంతో సిరాజ్ గాయంపై అభిమానులు ఆందోళనలో మునిగిపోయారు. అయితే, కాసేపటి తర్వాత అతడు మైదానానికి వచ్చి చురుకుగా ఫీల్డింగ్ చేయడంతో ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు. ఇదిలా ఉంటే.. లంచ్ బ్రేక్ సమయానికి శ్రీలంక రెండు వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది.చదవండి: చరిత్ర సృష్టించిన శ్రీలంక ఆల్‌రౌండర్! -
IND vs SL: చరిత్ర సృష్టించిన శ్రీలంక ఆల్‌రౌండర్
టీమిండియాతో టెస్టుల్లో శ్రీలంక ప్రదర్శన ఎలా ఉన్నా.. ఆ జట్టు ఆల్‌రౌండర్ సొనాల్ దినుష మాత్రం అదరగొడుతున్నాడు. గాలె వేదికగా తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మిగతా బ్యాటర్లంతా విఫలమైన చోట సొనాల్ దినుష సెంచరీ (100)తో మెరిశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ 84 పరుగులతో ఆకట్టుకున్నాడు.భారత్ భారీ స్కోరుఅదే విధంగా.. భారత్‌తో రెండో టెస్టులోనూ సొనాల్ దినుష అద్భుత ప్రదర్శన కనబరిచాడు. కొలంబో వేదికగా టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి... 503-9 వద్ద తమ మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక టాపార్డర్‌ను భారత బౌలర్లు కుప్పకూల్చారు. ఓపెనర్లు లాహిరు ఉదార (1), కమిల్ మిశారా (19)లను ప్రసిద్ కృష్ణ పెవిలియన్‌కు పంపగా.. వన్‌డౌన్‌లో వచ్చిన ప్రభాత్ జయసూరియ (2)ను మానవ్ సుతార్ అవుట్ చేశాడు.పసిందు పోరాటంఇలా జట్టు కష్టాల్లో కూరుకుపోగా పసిందు సూరియబండారా (80), కమిందు మెండిస్ (32) కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. వీళ్లిద్దరు అవుటైన తర్వాత శ్రీలంక నామమాత్రపు స్కోరుకే ఆలౌట్ అవుతుందని భావించగా.. సొనాల్ దినుష నేనున్నానంటూ మరోసారి ఆపన్నహస్తం అందించాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఈ ఆల్‌రౌండర్ శతక్కొట్టాడు.సెంచరీ చేశాడు.. కానీమొత్తంగా 162 బంతులు ఎదుర్కొన్న సొనాల్ దినుష.. 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 103 పరుగులు సాధించాడు. పసిందుతో కలిసి 34, కేశారా నువాంతతో కలిసి 57, లాహిరు కుమారతో కలిసి 58 పరుగులు జోడించి.. జట్టు పరువును కాపాడగలిగాడు. అయితే, ఫాలో ఆన్ గండం నుంచి మాత్రం తప్పించలేకపోయాడు. కొలంబోలో నాలుగో రోజు ఆటలో భాగంగా భారత స్పిన్నర్ సారాంశ్ జైన్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి సొనాల్ దినుష పదో వికెట్‌గా వెనుదిరిగాడు.సరికొత్త చరిత్ర అయితే, తన అద్భుతమైన ఆట తీరుతో 25 ఏళ్ల సొనాల్ దినుష శ్రీలంక తరఫున సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీమిండియాతో టెస్టుల్లో బ్యాటింగ్ ఆర్డర్లో ఆరు లేదంటే అంతకంటే దిగువ స్థానంలో వచ్చి అత్యధిక సెంచరీలు బాదిన తొలి లంక ఆటగాడిగా రికార్డు సాధించాడు. గాలె, కొలంబో టెస్టుల్లో శతకాలు బాది ఈ ఘనత సాధించాడు. కాగా దినుష గతేడాది జూన్‌లో అరంగేట్రం చేశాడు. ఇదిలా ఉంటే.. లంకను 290 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్.. తొలి ఇన్నింగ్స్‌లో 213 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఈ క్రమంలో లంకను ఫాలో ఆన్ ఆడిస్తోంది. కాగా గాలె టెస్టులో శ్రీలంక టీమిండియా చేతిలో 165 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే.టీమిండియాతో టెస్టుల్లో ఆరు లేదంటే అంతకంటే దిగువ స్థానంలో వచ్చి అత్యధిక సెంచరీలు బాదిన శ్రీలంక క్రికెటర్లుసొనాల్ దినుష- 2 శతకాలుదినేశ్ చండిమాల్-1 శతకంతిలక్రత్నె దిల్షాన్-1 శతకంప్రసన్న జయవర్దనె-1 శతకంఅర్జున రణతుంగ-1 శతకంతిలాన్ సమరవీర-1 శతకంహషాన్ తిలకరత్నె-1 శతకం.A STAR IN THE MAKING! ⭐ Against all odds, Sonal Dinusha stood tall with a brilliant century to keep Sri Lanka’s hopes alive. 💪 Watch #SLvIND, 2nd Test, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/YoMY8T0h3I— Sony Sports Network (@SonySportsNetwk) August 26, 2026చదవండి: టెస్టు క్రికెట్లో ఫాలో ఆన్ అంటే? -
శ్రీలంక ఆలౌట్.. ఫాలో ఆన్ ఆడిస్తున్న టీమిండియా
టీమిండియాతో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 290 పరుగులకు ఆలౌట్ అయింది. పసిందు సూరియబండారా భారీ అర్ధ శతకం (80)తో రాణించగా.. సొనాల్ దినుష శతక్కొట్టాడు. ఏడో స్థానంలో వచ్చిన దినుష 162 బంతులు ఎదుర్కొని 103 పరుగులు సాధించాడు. అయితే, మిగతా వారంతా విఫలం కావడంతో శ్రీలంకకు ఫాలో ఆన్ గండం తప్పలేదు.కాగా కొలంబో వేదికగా శ్రీలంక- భారత్ మధ్య ఆదివారం రెండో టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దేవదత్ పడిక్కల్ (117) శతక్కొట్టగా.. ధ్రువ్ జురెల్ అజేయ శతకం (115) సాధించాడు. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (63), కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (50) హాఫ్ సెంచరీలతో అలరించగా.. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 45 పరుగులతో రాణించాడు.ఫలితంగా సోమవారం నాటి రెండో రోజు ఆటలో భారత్ 503-9 పరుగుల భారీ స్కోరు వద్ద తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. లంక బౌలర్లలో అసిత ఫెర్నాండో నాలుగు వికెట్లతో చెలరేగగా.. ప్రభాత్ జయసూరియ, కేశారా నువాంత చెరో రెండు వికెట్లు తీశారు. లాహిరు కుమారకు ఒక వికెట్ దక్కింది.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లంక రెండో ఆటలో రెండు వికెట్ల నష్టానికి కేవలం ఎనిమిది పరుగులే చేసింది. ఈ క్రమంలో 8/2 ఓవర్ నైట్ స్కోరుతో మంగళవారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టిన శ్రీలంకకు పసిందు ఊపిరిలూదాడు. మొత్తంగా 133 బంతుల్లో 80 పరుగులు సాధించాడు. అయితే, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో బౌల్డ్ కావడంతో అతడి ఇన్నింగ్స్‌కు తెరపడింది.మిగతా వారిలో కమిందు మెండిస్ (32) ఓ మోస్తరుగా రాణించగా.. కెప్టెన్ ధనంజయ డి సిల్వ (8), వికెట్ కీపర్ బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లా (0) పూర్తిగా విఫలమయ్యారు. ఇలాంటి దశలో సొనాల్ దినుష పట్టుదలగా నిలబడ్డాడు. ఫలితంగా మూడో రోజు ఆట ముగిసే సరికి శ్రీలంక ఎనిమిది వికెట్ల నష్టానికి 265 పరుగులు చేయగలిగింది.ఇక బుధవారం నాటి నాలుగో రోజు ఆటను 265/8తో మొదలుపెట్టగా.. సారాంశ్ జైన్ లాహిరు కుమార (12)ను వెనక్కి పంపాడు. అప్పటికే సెంచరీ పూర్తి చేసుకున్న దినుషను సైతం సారాంశ్ పెవిలియన్‌కు పంపడంతో లంక ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో ప్రసిద్ కృష్ణ, మానవ్ సుతార్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. సారాంశ్ జైన్‌కు రెండు, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజాలకు తలా ఒక వికెట్ దక్కాయి. ఫాలో ఆన్ అంటే?టెస్టు క్రికెట్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు.. సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు కంటే తొలి ఇన్నింగ్స్‌లో కనీసం 200 లేదా అంతకంటే ఎక్కువ ఆధిక్యంలో ఉంటే.. ఫాలో ఆన్ ఆడిస్తుంది. అంటే.. సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు ఆలౌట్ కాగానే మళ్లీ బ్యాటింగ్ చేయమని కోరుతుంది. మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (MCC)లోని 14.1.1 నిబంధన ప్రకారం తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యంలో ఉన్న జట్టుకు ఈ హక్కు లభిస్తుంది. భారత్- శ్రీలంక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. లంకను 290 పరుగులకు ఆలౌట్ చేసింది. తద్వారా తొలి ఇన్నింగ్స్‌లో 213 పరుగుల ఆధిక్యం సాధించింది. కాబట్టి ఫాలో ఆన్ ఆడిస్తోంది. అసలే ఈ మ్యాచ్‌కు వాన ముప్పు ఉంది. మరోవైపు ఆట ఇప్పటికే నాలుగో రోజుకు చేరుకుంది. దీంతో టీమిండియా ఫాలో ఆన్‌కు మొగ్గుచూపింది. కాగా తొలి టెస్టులో భారత్ 165 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను చిత్తు చేసిన సంగతి తెలిసిందే.చదవండి: భువీ విజృంభణ -
వర్షం వల్ల ముందుగానే ముగిసిన నాలుగో రోజు ఆట
Sri Lanka Vs India 2nd Test Match, Day 4: కొలంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య నాలుగో రోజు ఆట ముగిసింది. లంకను 290 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్.. తొలి ఇన్నింగ్స్‌లో 213 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఈ క్రమంలో లంకను ఫాలో ఆన్ ఆడిస్తోంది.ఈ క్రమంలో బుధవారం నాటి ఆట పూ ర్తయ్యే సరికి శ్రీలంక ఆరు వికెట్లు నష్టపోయి 229 పరుగులు చేసింది. తద్వారా 16 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది. వాన వల్ల ముందుగానే ఆటను నిలిపివేశారు.ఆధిక్యంలోకి శ్రీలంకవర్షం వల్ల ఆట నిలిపివేసే సమయానికి శ్రీలంక ఆరు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసి.. 16 పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించింది. కేశారా నువాంత 3, సొనాల్ దినుష 7 పరుగులతో ఉన్నారు.డిక్వెల్లా (5) ఔట్నిరోషన్ డిక్వెల్లా (5) రూపంలో లంక ఆరో వికెట్ కోల్పోయింది. సోనల్ దినూష (2)క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం లంక ఐదు పరుగుల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది.ఐదో వికెట్ డౌన్92 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పసిందు సూరియబండారా ఔట్ కావడంతో లంక 212 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. మానవ్ సుతార్ బౌలింగ్‌లో పసిందు స్టంప్ ఔట్‌గా వెనుదిరిగాడు.నాలుగో వికెట్ డౌన్23 పరుగులు చేసిన కెప్టెన్ ధనంజయ మానవ్ సుతార్ బౌలింగ్‌లో వెనుదిరగడంతో లంక 209 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.టీ విరామం అనంతరం ఆట తిరిగి మొదలైంది. ఫాలో ఆన్ ఆడుతున్న శ్రీలంక 200 పరుగుల మార్క్ దాటింది. ప్రస్తుతం లంక 3 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. క్రీజులో సూరియబండారా (91), కెప్టెన్ ధనంజయ డిసిల్వా (17) పరుగులతో ఆడుతున్నారు.టీ విరామంఫాలోఆన్ ఆడుతున్న శ్రీలంక టీ విరామ సమయానికి 56 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. పసిందు సూరియబండారా (90), కెప్టెన్ ధనంజయ డిసిల్వా (14) పరుగులతో ఆడుతున్నారు. లంక మరో 14 పరుగుల వెనుకంజలో ఉంది. భారత బౌలర్లలో ప్రసిధ్, సిరాజ్, మానవ్ సుతార్ తలా ఒక వికెట్ తీశారు.మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక43.1వ ఓవర్: ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన కమిందు మెండిస్ (55). కెప్టెన్ ధనంజయ డి సిల్వ క్రీజులోకి రాగా.. పసిందు 83 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 178-3 (43.2). ఇంకా 35 పరుగులు వెనుకబడి ఉన్న లంక.కమిందు హాఫ్ సెంచరీప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో సిక్సర్ బాది కమిందు మెండిస్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం కమిందు 54, సూరియబండార 68 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. జట్టు స్కోర్ 162-2గా ఉంది. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు శ్రీలంక ఇంకా 51 పరుగులు వెనుకపడి ఉంది. నిలకడగా ఆడుతున్న సూరియబండార, కమిందు63 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన తర్వాత శ్రీలంక ఇన్నింగ్స్ కోలుకుంది. పసిందు సూరియబండార (63), కమిందు మెండిస్ (43) నిలకడగా ఆడుతున్నారు. ప్రస్తుతం జట్టు స్కోర్ 150-2గా ఉంది. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఆ జట్టు ఇంకా 63 పరుగులు వెనుకపడి ఉంది. రెండో ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచరీ చేసిన సూరియబండారపసిందు సూరియబండార రెండో ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచరీతో మెరిశాడు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో బౌండరీ బాది ఈ మార్కును దాటాడు. 31 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 112-2గా ఉంది. సూరియబండారకు జతగా కమిందు మెండిస్ (21) క్రీజ్‌లో ఉన్నాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు శ్రీలంక ఇంకా 101 పరుగులు వెనుకపడి ఉంది. లంచ్ బ్రేక్.. 130 పరుగుల వెనుకంజలో శ్రీలంకనాలుగో రోజు లంచ్ విరామం సమయానికి శ్రీలంక ఫాలో ఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఆ జట్టు ఇంకా 130 పరుగులు వెనుకపడి ఉంది. కమిందు మెండిస్ (10), పసిందు సూరియబండార (35) క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక14.5వ ఓవర్: రవీంద్ర జడేజా బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయిన కమిల్ మిశారా (32). అంపైర్ ఎల్బీడబ్ల్యూ ఇవ్వగా కమిల్ రివ్యూకు వెళ్లాడు. అయితే, అక్కడా ప్రతికూల ఫలితమే రావడంతో అతడు నిరాశగా పెవిలియన్ చేరాడు. పసిందుతో కలిసి కమిల్ మిశారా 58 పరుగుల మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పాడు. మిశారా స్థానంలో కమిందు మెండిస్ క్రీజులోకి రాగా.. పసిందు 28 పరుగులతో ఉన్నాడు. లంక స్కోరు: 63-2.ఫాలో ఆన్.. తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంకఫాలో ఆన్ ఆడుతున్న శ్రీలంక ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో సరాన్ష్ జైన్‌కు క్యాచ్ ఇచ్చి ఉదారా (3) ఔటాయ్యడు. పసిందు క్రీజులోకి వచ్చాడు.ఫాలో ఆన్ ఆడనున్న శ్రీలంకదినుషా సెంచరీతో పోరాడినప్పటికీ శ్రీలంకను ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించలేకపోయాడు. 213 పరుగులు వెనుకపడి ఉన్న శ్రీలంక రెండో ఇన్నింగ్స్ కొనసాగించనుంది. దినుషా సెంచరీ.. శ్రీలంక ఆలౌట్శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 290 పరుగుల వద్ద ముగిసింది. సెంచరీ హీరో దినుషా (103) చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. దినుషా సరాన్ష్ జైన్ బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.తొమ్మిదో వికెట్ కోల్పోయిన శ్రీలంక86.5వ ఓవర్- 288 పరుగుల వద్ద శ్రీలంక తొమ్మిదో వికెట్ కోల్పోయింది. సరాన్ష్ జైన్ బౌలింగ్‌లో జురెల్‌కు క్యాచ్ ఇచ్చి లహీరు కుమార (12) ఔటయ్యాడు. సెంచరీ పూర్తి చేసిన దినుషాఓవర్నైట్ బ్యాటర్ సోనల్ దినుషా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో బౌండరీతో మూడంకెల మార్కును దాటాడు. దినుషాకు ఇది వరసగా రెండో సెంచరీ. ఈ సిరీస్ తొలి టెస్ట్‌లోనూ అతడు సెంచరీ చేశాడు. నాలుగో రోజు మొదలైన ఆటఓవర్నైట్ స్కోర్ (శ్రీలంక తొలి ఇన్నింగ్స్) 265-8 వద్ద నాలుగో రోజు ఆట మొదలైంది. దినుష (85), లహీరు కుమార (8) ఇన్నింగ్స్‌లు కొనసాగిస్తున్నారు.భారీ ఆధిక్యంలో భారత్మూడో రోజు నిలిచే సమయానికి శ్రీలంక 83.4 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 265 పరుగులు సాధించింది. సొనాల్ దినుష 85 పరుగులు, లాహిరు కుమార 8 పరుగులతో అజేయంగా నిలిచారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కంటే శ్రీలంక ఇంకా 238 పరుగులు వెనుకబడి ఉంది. లంక ఇన్నింగ్స్‌లో పసిందు సూరియబండార (80) అర్ద సెంచరీతో రాణించగా.. భారత్ తరఫున ప్రసిద్ద్, సుతార్ తలో 3 వికెట్లు తీశారు.పడిక్కల్, జురెల్ సెంచరీలుఅంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 503 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. పడిక్కల్ (117), ధ్రువ్ జురెల్ (115 నాటౌట్) శతకాలతో విజృంభించగా.. గిల్ (50), పంత్ (63) అర్ధసెంచరీలతో రాణించారు.చదవండి: శాసించేది మనమే! -
అతడు తీవ్రంగా గాయపడ్డాడు: టీమిండియా కోచ్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ గురించి భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కీలక అప్డేట్ అందించాడు. పంత్ భుజానికి తీవ్రమైన గాయమైందని తెలిపాడు. అందుకే మూడో రోజు ఆటలో అతడు మైదానంలో దిగలేదని తెలిపాడు.కాగా రెండు టెస్టులు ఆడేందుకు టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గాలెలో జరిగిన తొలి టెస్టులో భారత్ 165 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించింది. ఈ క్రమంలో ఆదివారం ఇరుజట్ల మధ్య కొలంబోలో రెండో టెస్టు మొదలైంది. తొలిరోజు ఆట సందర్భంగా మూడు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గాయపడ్డ పంత్.. మధ్యలోనే మైదానం వీడాడు. లాహిరు కుమార వేసిన బంతిని తప్పుగా అంచనా వేసి షాట్ ఆడేందుకు ప్రయత్నించగా.. పంత్ మణికట్టుకు గాయమైంది.అయితే, సోమవారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా పునరాగమనం చేసి అర్ధ శతకం (63)తో మెరిశాడు. తద్వారా టీమిండియా భారీ స్కోరు (503-9 డిక్లేర్డ్) సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, మంగళవారం నాటి మూడో రోజు ఆటలో మాత్రం పంత్ కనిపించలేదు.పంత్‌కు బదులు ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు. ఈ నేపథ్యంలో ఆట పూర్తైన అనంతరం మీడియాతో మాట్లాడిన మోర్నీ మోర్కెల్ పంత్ గురించి అప్డేట్ ఇచ్చాడు. ‘‘పంత్ భుజానికి తీవ్రమైన గాయమైంది. ఈరోజు రాత్రంతా అతడు వైద్యుల పర్యవేక్షణలో ఉంటాడు.నిజానికి పంత్ జట్టుకు ఎంతో అవసరం. వికెట్ కీపర్‌గా అతడికి అద్భుతమైన నైపుణ్యాలు ఉన్నాయి. వికెట్ల వెనుక నుంచి అతడు ఆటను బాగా అర్థం చేసుకుంటాడు’’ అని మోర్నీ మోర్కెల్ తెలిపాడు. తద్వారా నాలుగో రోజు కూడా పంత్ అందుబాటులో ఉండకపోవచ్చని సంకేతాలు ఇచ్చాడు.ఇదిలా ఉంటే.. మంగళవారం ఆట పూర్తయ్యేసరికి శ్రీలంక ఎనిమిది వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ కంటే ఇంకా 238 పరుగులు వెనుకబడి ఉంది. పసిందు సూరియబండారా అర్ధ శతకం(80)తో రాణించగా.. సొనాల్ దినుష (85 నాటౌట్) సెంచరీపై కన్నేశాడు. భారత బౌలర్లలో ప్రసిద్ కృష్ణ, మానవ్ సుతార్ మూడేసి వికెట్లు కూల్చగా.. మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా చెరో వికెట్ దక్కించుకున్నారు. -
మెరిసిన పసిందు, దినుష.. ఇంకా వెనుకబడే ఉన్న శ్రీలంక
టీమిండియాతో రెండో టెస్టు మూడో రోజు ఆటలో శ్రీలంక పోరాట పటిమ కనబరిచింది. కొలంబోలో 8/2 ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం ఆట మొదలుపెట్టింది ఆతిథ్య జట్టు. కాసేటికే ఓపెనర్ కమిల్ మిశారా (19) వెనుదిరిగినప్పటికీ.. నాలుగో నంబర్ బ్యాటర్ పసిందు సూరియబండారా పట్టుదలగా నిలబడ్డాడు.మెరిసిన పసిందుభారత బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతూ.. కమిందు మెండిస్‌తో కలిసి ఐదో వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. మొత్తంగా 133 బంతులు ఎదుర్కొన్న పసిందు తొమ్మిది ఫోర్ల సాయంతో 80 పరుగులు సాధించాడు. అయితే, సెంచరీ దిశగా పయనిస్తున్న వేళ రవీంద్ర జడేజా అద్భుత బంతితో పసిందును బౌల్డ్ చేశాడు. దీంతో టీమిండియాకు మంచి బ్రేక్ లభించింది.మిగిలిన వారిలో కమిందు మెండిస్ (32) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ ధనంజయ డి సిల్వ (8) విఫలమయ్యాడు. వికెట్ కీపర్ బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లా డకౌట్ అయి నిరాశపరచగా.. ఈసారి సొనాల్ దినుష బాధ్యత తీసుకున్నాడు. అతడికి తోడుగా కేశారా నువాంత (74 బంతుల్లో 18) నిలబడ్డాడు.దినుష పోరాటంమంగళవారం ఆట ముగిసే సమయానికి దినుష 137 బంతుల్లో 85 పరుగులతో అజేయంగా నిలవగా.. అతడికి తోడుగా లాహిరు కుమార (8*) నిలిచాడు. వర్షం వల్ల భోజన విరామం తర్వాత ఆటకు అంతరాయం కలిగింది. ఆ తర్వాత చాలా సేపు ఆట కొనసాగగా.. మూడో సెషన్‌ను మధ్యాహ్నం 3.45 నుంచి సాయంత్రం 5.45 నిమిషాల వరకు నిర్వహించాలని భావించారు. అయితే, మరోసారి వర్షం వల్ల అంతరాయం కలగడంతో దాదాపు ఇరవై ఎనిమిది నిమిషాలకు ముందుగానే ఆటను నిలిపివేశారు. అప్పటికి శ్రీలంక ఎనిమిది వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కంటే.. ఇంకా 238 పరుగులు వెనుబడి ఉంది. ఓవరాల్‌గా భారత బౌలర్లలో ప్రసిద్ కృష్ణ, మానవ్ సుతార్ చెరో మూడు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. కాగా రెండో రోజు ఆటలో భారత్ తొమ్మిది వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద తమ మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.చదవండి: టెక్నిక్ లేకుండా ఆడతాడు.. పంత్‌కు అదొక్కటే ప్లస్! -
IND vs SL: ‘టెక్నిక్ లేకుండా ఆడతాడు.. అదొక్కటే ప్లస్’
శ్రీలంకతో రెండో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మంచి ప్రదర్శన కనబరిచాడు. గాయంతో తొలి రోజు ఆట మధ్యలోనే వెనుదిరిగినప్పటికీ.. రెండో రోజు రీఎంట్రీ ఇచ్చి అనూహ్య రీతిలో రాణించాడు.హాఫ్ సెంచరీకొలంబోలో సోమవారం నాటి ఆట సందర్భంగా 89 బంతులు ఎదుర్కొన్న పంత్.. 63 పరుగులు సాధించాడు. అతడి హాఫ్ సెంచరీలో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. అయితే, భోజన విరామం తర్వాత లంక స్పిన్నర్ కేశారా నువాంత వేసిన తొలి బంతికే.. లాహిరు ఉదారకు క్యాచ్ ఇచ్చి పంత్ వెనుదిరిగాడు. కానీ పంత్ కాస్త డిఫెన్సివ్‌గా ఆడి ఉంటే అవుటయ్యేవాడు కాదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.టెక్నిక్ లేకుండా ఆడతాడు.. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ పంత్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. పంత్ దగ్గర పెద్దగా టెక్నిక్ లేదని.. కేవలం భయం లేకుండా దూకుడుగా ఆడటం వల్లే అతడికి గుర్తింపు వస్తోందన్నాడు. అయినా టెక్నిక్‌తో ఎవరికీ పనిలేదని.. అతడి ఖాతాలో జమైన పరుగులు మాత్రమే అందరూ చూస్తారని పేర్కొన్నాడు.ఈ మేరకు సోనీ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘పంత్ ఫియర్లెస్ ఆటగాడు. తను ఆడే విధానానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాడు. అతడికి టెక్నిక్‌తో సంబంధం లేదు. సాధారణంగా.. చాలా మంది బ్యాటర్లు కొన్ని షాట్లను తప్పకుండా మిస్ చేస్తారు. అలాంటి షాట్లను కూడా పంత్ ఆడతాడు.ఎందుకంటే అతడు ఎల్లవేళలా అందరికీ భిన్నంగా ఉంటాడు. గాలెలో జరిగిన తొలి టెస్టులో.. తాజాగా కొలంబోలో అతడు అవుటైన తీరును చూస్తే మనకు ఈ విషయం అర్థమవుతుంది. ఈసారి అతడు కవర్ మీదుగా బంతిని తరలించే ప్రయత్నం చేశాడు.అదొక్కటే ప్లస్నిజానికి బంతికి అతడు దూరంగా ఉన్నాడు. కానీ ప్రయత్నం మాత్రం మానలేదు. కాబట్టి టెక్నికల్‌గా పంత్ గొప్ప ఆటగాడేమీ కాదు. అయినా ఎవరికీ ఇక్కడ టెక్నిక్‌తో పనిలేదు. అతడు మ్యాచ్‌లో ప్రభావం చూపుతున్నాడా? లేదా?.. పరుగులు రాబడుతున్నాడా లేదా? అనేదే ముఖ్యం’’ అని భారత మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ అభిప్రాయపడ్డాడు.పంత్‌లా ఇంకెవరూ ఉండరుఅయితే, టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ సబా కరీం మాత్రం పంత్ ఆట తీరును ప్రశంసించాడు. ‘టెస్టుల్లో షాట్లు ఆడే విషయంలో అతడిని ఓ బాధ్యతారహిత ప్లేయర్‌గా చూస్తారు. అయినా సరే అతడు తగ్గడు. యాజమాన్యం కూడా అతడిని దూకుడుగానే ఆడమని ప్రోత్సహిస్తూ ఉందనిపిస్తోంది.అయితే, కఠిన పరిస్థితుల్లో.. జట్టు కష్టాల్లో ఉన్న వేళ మాత్రం అతడు పట్టుదలగా నిలబడతాడు. ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించగల సత్తా అతడికి ఉంది. పంత్ ఒక అరుదైన బ్యాటర్. అంతర్జాతీయ క్రికెట్లో ఏ ఆటగాడు కూడా అతడి దరిదాపుల్లోకి కూడా రాలేడు’’ అని సబా కరీం పేర్కొన్నాడు. కాగా శ్రీలంకతో తొలి టెస్టులోనూ పంత్ హాఫ్ సెంచరీ (66) సాధించాడు.ఇదిలా ఉంటే.. శ్రీలంకతో రెండు టెస్టులు ఆడేందుకు టీమిండియా అక్కడికి వెళ్లింది. గాలెలో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య జట్టును 165 పరుగుల తేడాతో మట్టికరిపించింది. కొలంబో వేదికగా రెండో టెస్టులో తొమ్మిది వికెట్ల నష్టానికి 503 పరుగుల భారీ స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది టీమిండియా.చదవండి: టీమిండియా తప్పుల్ని పడిక్కల్ ఎత్తి చూపాడు! -
జట్టు నుంచి తీసేస్తామన్నారు.. జ్వరంతోనే ఆటోలో వెళ్లా: సిరాజ్
మహ్మద్ సిరాజ్.. ప్రస్తుతం భారత జట్టులో కీలక బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో ఈ హైదరాబాదీ అద్భుతాలు చేస్తున్నాడు. సంచలన స్వింగ్, నిలకడైన వేగంతో ప్రత్యర్ది బ్యాటర్లను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. అయితే ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్న సిరాజ్.. తన ప్రారంభ రోజుల్లో పడిన కష్టాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నాడు. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నప్పటికి తప్పనిసరి పరిస్థితుల్లో అండర్-23 జట్టు తరపున ప్రాక్టీస్‌కు హాజరయ్యానని సిరాజ్ చెప్పుకొచ్చాడు.అండర్-23 జట్టుకు సెలక్ట్ అయినప్పుడు చాలా సంతోషపడ్డా. అయితే టోర్నీకి ముందు నేను డెంగ్యూ జ్వరం బారిన పడ్డాడు. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాను. గ్లూకోజ్ లెవల్స్ పడిపోయాయి. దీంతో రెండు రోజుల పాటు ప్రాక్టీస్‌కు వెళ్లలేదు. ప్రాక్టీస్‌కు రాకపోతే జట్టు నుంచి తొలగిస్తామని మేనేజ్మెంట్ హెచ్చరించింది. అప్పటికే నా ఆరోగ్య పరిస్థితి దారుణంగా ఉంది. శరీరంలో ఏమాత్రం శక్తి లేదు. కంటిన్యూగా సెలైన్లు ఎక్కుతునే ఉన్నాయి. సరైన టైమ్‌లో వచ్చారు కాబట్టి సరిపోయింది, లేదంటే ప్రాణాలకే ప్రమాదం జరిగేది అని డాక్టర్లు చెప్పారు. కానీ జట్టులో చోటు కోల్పోతానే భయంతో ఉదయం ఐదు గంటలకే మా నాన్నను నిద్రలేపి పరిస్థితి వివరించాను.వెంటనే మా నాన్న ఇలాంటి పరిస్థితుల్లో నీవు ఆడగలవా అని ప్రశ్నించారు. పర్వాలేదు నేను మేనెజ్చేసుకుంటా అని చెప్పా. దీంతో మా నాన్నే నన్ను స్వయంగా ఆటోలో ప్రాక్టీస్‌కు తీసుకెళ్లారు. ప్రాక్టీస్ ముగిసిన తర్వాత ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోగా, రిపోర్టుల్లో డెంగ్యూ లక్షణాలు ఏవీ లేవని తేలింది" అని సిరాజ్ సోనీ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.చదవండి: 'బాబర్ ఆజం 250 రన్స్ చేయాలి'.. పాక్ జట్టును ఎగతాళి చేసిన బ్రాడ్ -
IND vs SL: టీమిండియా తప్పుల్ని పడిక్కల్ ఎత్తి చూపాడు!
శ్రీలంక గడ్డ మీద టీమిండియా క్రికెటర్ దేవదత్ పడిక్కల్ సత్తా చాటుతున్నాడు. తొలి టెస్టులో భారీ శతకం (167)తో అలరించిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. రెండో టెస్టులోనూ సెంచరీ (117)తో కదం తొక్కాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ సంజయ్ మంజ్రేకర్ పడిక్కల్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.NRIలా మారిపోయారుఅదే సమయంలో పెద్ద పెద్ద స్టార్లుగా పేరు తెచ్చుకున్న భారత బ్యాటర్లు మాత్రం ప్రస్తుతం ‘ప్రవాస భారతీయుల్లా’ మారిపోయారని మంజ్రేకర్ చురకలు అంటించాడు. దేశీయ పిచ్‌లపై ఆడటమే వారు మర్చిపోయారని.. అలాంటి వారికి పడిక్కల్ కనువిప్పు కలిగించాడని పేర్కొన్నాడు. దేశవాళీ క్రికెట్ ఆడితేనే ఎవరైనా మంచి ఫలితాలు రాబట్టగలరని చెప్పుకొచ్చాడు.టీమిండియా తప్పుల్ని ఎత్తి చూపాడుఈ మేరకు సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ షోలో మాట్లాడుతూ.. ‘‘గత కొన్నేళ్లుగా టీమిండియా యాజమాన్యం చేస్తున్న తప్పులను పడిక్కల్ తన ఆట తీరుతో ఎత్తి చూపాడు. కొంతమంది మన బిగ్ స్టార్లు ఇప్పుడు NRIలుగా మారిపోయారు. భారత పిచ్‌లపై కంటే కూడా వాళ్లు విదేశాల్లోనే ఎక్కువ మ్యాచ్‌లు ఆడుతున్నారు.ఎక్కడైతే తాము పుట్టి పెరిగామో.. ఎక్కడ ఆట నేర్చుకుని.. ఈ స్థాయికి ఎదిగామో వారు మర్చిపోయారు. దేశవాళీ క్రికెట్‌ను పూర్తిగా పక్కన పెట్టారు. ఐదారేళ్లుగా విదేశాల్లోనే ఎక్కువగా ఆడుతూ.. ఉపఖండ పిచ్‌లపై ఎలా ఆడాలో మనోళ్లు మర్చిపోయారు’’ అని మంజ్రేకర్ ఘాటు విమర్శలు చేశాడు.కివీస్‌తో సిరీస్‌లో ఆడి ఉంటే..కాగా పడిక్కల్ దేశీ క్రికెట్లో కర్ణాటక తరఫున ఆడుతూ రోజురోజుకీ తన ప్రదర్శన మెరుగుపరుచుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే శ్రీలంకలో కూడా స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై అతడు అదరగొడుతున్నాడని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. సీనియర్లు మాత్రం స్పిన్‌ను ఎదుర్కోవడంలో తడబడుతున్నారని చురకలు అంటించాడు.అదే విధంగా.. గతేడాది టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్టుల్లో 3-0తో వైట్‌వాష్ అవడాన్ని మంజ్రేకర్ ఈ సందర్భంగా ప్రస్తావించాడు. ఒకవేళ నాటి జట్టుకు పడిక్కల్‌ను ఎంపిక చేసి ఉంటే భారత జట్టుకు ఈ దుస్థితి పట్టేదికాదని అభిప్రాయపడ్డాడు. ఏదేమైనా టెస్టుల్లో మూడో స్థానానికి పడిక్కల్ సరిగ్గా సరిపోతాడని పేర్కొన్నాడు.న్యూజిలాండ్ గడ్డ మీద ఎలా ఆడతాడో!అయితే, శ్రీలంకలో రాణిస్తున్నప్పటికీ న్యూజిలాండ్ గడ్డ మీద పడిక్కల్ ఆడే విధానాన్ని బట్టే.. జట్టులో అతడి స్థానం ఏమిటనేది తేలుతుందని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు. కాగా శ్రీలంక పర్యటనలో పడిక్కల్ ఇప్పటికే 328 పరుగులు సాధించి.. ఈ సిరీస్‌లో ఇరుజట్లలో కలిపి టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.కాగా టీమిండియా స్వదేశంలో కివీస్‌తో పాటు సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లోనూ 0-2తో వైట్‌వాష్‌కు గురైన సంగతి తెలిసిందే. ఫలితంగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. శ్రీలంకను వైట్‌వాష్ చేయడంతో పాటు తదుపరి న్యూజిలాండ్ పర్యటనలో రాణిస్తేనే టీమిండియా ఫైనల్ ఆశలు సజీవంగా ఉంటాయి. చదవండి: ఆసియా కప్ కోసం పాకిస్తాన్ మాస్టర్ ప్లాన్! -
సిరాజ్ రెచ్చగొట్టాడు.. ప్రసిద్ద్ పని కానిచ్చేశాడు..!
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ మైండ్ గేమ్‌తో ప్రత్యర్థి బ్యాటర్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. లంక ఓపెనర్ కమిల్ మిషారాను మాటలతో రెచ్చగొట్టి, అతడి సహనాన్ని పరీక్షించడంలో సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లో ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో మిషారా అనవసరమైన షాట్ ఆడి వికెట్ కోల్పోయాడు.సిరాజ్ మాటలకు మిషారా స్పందనశ్రీలంక ఇన్నింగ్స్‌లో తొమ్మిదో ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. సిరాజ్ వేసిన బంతి ఆఫ్‌స్టంప్ వెలుపల పడి బ్యాటర్‌కు దూరంగా వెళ్లింది. మిషారా దాన్ని వదిలేశాడు.అయితే అదే ఓవర్లో వరుసగా రెండోసారి బంతిని వదిలేయడంతో సిరాజ్ మిషారాతో కొన్ని మాటలు మాట్లాడాడు. బంతిని వదిలేయకుండా షాట్ ఆడేలా అతడిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. మిషారా మాత్రం తొలుత చిరునవ్వుతోనే స్పందించాడు.అయితే సిరాజ్ మాటలు మిషారా ఆలోచనల్లో ప్రభావం చూపినట్లు తర్వాతి పరిణామాలను బట్టి కనిపించింది.pic.twitter.com/k5k0eJI6vy— crictalk (@crictalk7) August 25, 2026ప్రసిద్ద్ పని కానిచ్చేశాడు..!సిరాజ్ ఓవర్ తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ బంతిని అందుకున్నాడు. అతను పైకి లేపిన బంతిని మిషారా ఎదుర్కొన్నాడు. వాస్తవానికి ఆ బంతిని వదిలేయడం సురక్షితమైన నిర్ణయం. కానీ మిషారా డిఫెన్సివ్ షాట్ ఆడే ప్రయత్నంలో బంతిని బ్యాట్‌తో తాకించాడు. ఫలితంగా భారత జట్టుకు కీలక వికెట్ లభించింది. ఈ తంతు పరిశీలిస్తే సిరాజ్ ముందు ఓవర్లో చేసిన స్లెడ్జింగ్ వర్కౌటైనట్లు కనిపించింది.Prasidh Krishna loves striking early! 🔥🎯#PrasidhKrishna #SLvsINDpic.twitter.com/gzd7dSWZuJ— OneCricket (@OneCricketApp) August 25, 2026మ్యాచ్ విషయానికొస్తే.. రెండో రోజు తొలి సెషన్ సమయానికి శ్రీలంక 3 వికెట్లు కోల్పోయి 87 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. పసిందు సూరియబండార (41), కమిందు మెండిస్ (19) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 503 పరుగుల భారీ స్కోరు చేసింది. చదవండి: జురేల్ జిగేల్... -
WTC పట్టికలో బిగ్ ట్విస్ట్, శ్రీలంకపై గెలిస్తే భారత్ ప్లేస్ ఇదే
-
SL Vs IND: ముగిసిన మూడో రోజు ఆట.. లంక స్కోరెంతంటే?
Sri Lanka Vs India 2nd Test Match, Day 3: కొలంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య రెండో టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. మంగళవారం ఆట పూర్తయ్యే సరికి దినుష 137 బంతుల్లో 85 పరుగులతో అజేయంగా నిలవగా.. అతడికి తోడుగా లాహిరు కుమార 8 పరుగులతో ఉన్నాడు. ఇక మరోసారి వర్షం వల్ల అంతరాయం కలగడంతో ముందుగానే ఆటను నిలిపివేశారు. అప్పటికి శ్రీలంక ఎనిమిది వికెట్ల నష్టానికి 265 పరుగులు సాధించింది. తద్వారా మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ కంటే.. ఇంకా 238 పరుగులు వెనుబడే ఉంది.ముగిసిన ఆట.. భారీ ఆధిక్యంలో భారత్మరోసారి ఆటకు అంతరాయంవర్షం వల్ల ఆట నిలిచే సమయానికి శ్రీలంక 83.4 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 265 పరుగులు సాధించింది. సొనాల్ దినుష 85 పరుగులు, లాహిరు కుమార 8 పరుగులతో అజేయంగా నిలిచారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కంటే శ్రీలంక ఇంకా 238 పరుగులు వెనుకబడి ఉంది.దినూష దూకుడుసోనాల్ దినూష (80) సెంచరీ దిశగా సాగుతున్నాడు. ప్రస్తుతం లంక 8 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. కుమారా 7 పరుగులతో అతడికి సహకరిస్తున్నాడు. లంక మరో 245 పరుగులు వెనుకబడి ఉంది.ఎనిమిదో వికెట్ డౌన్18 పరుగులు చేసిన కెషారా నువంతా మానవ్ సుతార్ బౌలింగ్‌లో సారాంశ్ జైన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో లంక 230 పరుగుల వద్ద 8వ వికెట్ కోల్పోయింది. టీ విరామం తర్వాత మొదలైన ఆటటీ విరామం తర్వాత ఆట మొదలైంది. 66 ఓవర్లు ముగిసేసరికి లంక 7 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. దినూష (58), కెషారా (13) పరుగులతో ఆడుతున్నారు.టీ విరామం..టీ విరామ సమయానికి శ్రీలంక 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. సోనాల్ దినూష (52) అజేయ అర్ధసెంచరీ సాధించగా, కెషారా నువంతా 13 పరుగులతో అతడికి సహకరిస్తున్నాడు. లంక మరో 287 పరుగులు వెనుకబడి ఉంది. ఏడో వికెట్ కోల్పోయిన శ్రీలంక45.3వ ఓవర్: సిరాజ్ బౌలింగ్‌లో ధ్రువ్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చిన డిక్వెల్లా (0). లంక స్కోరు 173-7. దినుష 22 పరుగులతో ఉన్నాడు. భారత్ కంటే 330 పరుగుల వెనుకంజలో శ్రీలంక. ఆరో వికెట్ కోల్పోయిన శ్రీలంక44.6వ ఓవర్: రవీంద్ర జడేజా బౌలింగ్‌లో పసిందు సూరియబండారా బౌల్డ్. 80 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆరో వికెట్‌గా వెనుదిరిగిన పసిందు. నిరోషన్ డిక్వెల్లా క్రీజులోకి రాగా.. దినుష 21 పరుగులతో ఉన్నాడు. లంక స్కోరు: 171-6 (45). టీమిండియా కంటే 332 పరుగుల వెనుకంజలో లంక.భారీ వెనుకంజలో శ్రీలంక137 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన శ్రీలంక భారీ వెనుకంజలో కొనసాగుతోంది. ఆ జట్టు ఇంకా భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు 340 పరుగులు వెనుకపడి ఉంది. రెండో సెషన్ సమయానికి (42 ఓవర్లు) శ్రీలంక స్కోర్ 163-5గా ఉంది. సోనల్ దినుషా (17), పసిందు సూరియబండార (77) క్రీజ్‌లో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన శ్రీలంక34.5వ ఓవర్: మానవ్ సుతార్ బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటైన ధనంజయ (8). లంక స్కోరు: 137/5 (34.5). సొనాల్ దినుష క్రీజులోకి రాగా.. పసిందు 68 పరుగులతో ఉన్నాడు.నిలకడగా ఆడుతున్న ధనంజయ, పసిందుధనంజయ 8, పసిందు 68 పరుగులతో ఉన్నారు.తిరిగి మొదలైన ఆట1.10 PM- 3.25 PM మధ్య రెండో సెషన్3.45 PM- 5.42 PM మధ్య మూడో సెషన్ నిర్వహణవర్షం వల్ల ఆటకు అంతరాయంవాన వల్ల లంచ్ బ్రేక్ తర్వాత ఆటకు కాసేపు అంతరాయం కలిగింది. అయితే, 12.30 తర్వాత వర్షం తగ్గుముఖం పట్టింది కానీ.. అవుట్‌ఫీల్డ్ చిత్తడిగా ఉండటం వల్ల ఆట సాగలేదు.లంచ్ విరామం సమయానికి శ్రీలంక స్కోర్ ఎంతంటే..?మూడో రోజు లంచ్ విరామం సమయానికి శ్రీలంక స్కోర్ నాలుగు వికెట్ల నష్టానికి 130 పరుగులుగా ఉంది. పసిందు సూరియబండార (65) అర్ద సెంచరీ పూర్తి చేసుకోగా.. కెప్టెన్ ధనంజయ డిసిల్వ (4) అతడికి జతగా క్రీజ్‌లో ఉన్నాడు. ప్రసిద్ద్ కృష్ణ 3 వికెట్లు తీయగా.. సుతార్‌కు ఓ వికెట్ దక్కింది. నాలుగో వికెట్ కోల్పోయిన శ్రీలంక122 పరుగుల వద్ద శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి కమిందు మెండిస్ (2) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక35 పరుగుల వద్ద శ్రీలంక మూడో వికెట్ కోల్పోయింది. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో జురెల్‌కు క్యాచ్ ఇచ్చి కమిల్ మిషారా (19) ఔటయ్యాడు. మూడో రోజు మొదలైన ఆట8 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన శ్రీలంక మూడో రోజు ఆటను దూకుడుగా ప్రారంభించింది. ఈ రోజు తొలి ఓవర్లోనే ఆ జట్టు రెండు బౌండరీలు సహా 12 పరుగులు రాబట్టింది. ప్రసిద్ద్ కృష్ణ వేసిన ఈ ఓవర్లో కమిల్ మిషారా రెండు బౌండరీలు బాదాడు.ప్రస్తుతం శ్రీలంక స్కోర్ 20-2గా ఉంది. మిషారా 14, పసిందు సూరియబండార 3 పరుగులతో ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నారు. 495 పరుగుల వెనుకంజలో శ్రీలంకకొలంబో వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి శ్రీలంక 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది. కమిల్ మిషారా 5 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మానవ్ సుతార్, ప్రసిధ్ క్రిష్ణలు చెరో వికెట్ తీశారు. ప్రస్తుతం లంక 495 పరుగుల వెనుకబడి ఉంది.అంతకముందు మానవ్ సుతార్ బౌలింగ్‌లో ప్రబాత్ జయసూరియ (2) ఎల్బీగా వెనుదిరగడంతో లంక రెండో వికెట్ కోల్పోయింది. ఇక భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. పడిక్కల్, ధ్రువ్ జురెల్ శతకాలతో విజృంభించగా; గిల్, పంత్ అర్ధసెంచరీలతో రాణించారు. చదవండి: సిరాజ్ రెచ్చగొట్టాడు.. ప్రసిద్ద్ పని కానిచ్చేశాడు..! -
IND VS SL: టీమిండియాకు బ్యాడ్ న్యూస్
టీమిండియాకు చేదు వార్త. కొలొంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు ఆటకు వర్షం ప్రధాన అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే రెండో రోజు మ్యాచ్‌కు పలుమార్లు వర్షం, మేఘావృత వాతావరణం అంతరాయం కలిగించింది.మంగళవారం ఉదయం కొలంబోలో ఆకాశం మేఘావృతంగా ఉండటంతో పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. ఉష్ణోగ్రత సుమారు 31 డిగ్రీల సెల్సియస్‌గా ఉండనుండగా, ఉదయం వర్షం పడే అవకాశం 82 శాతంగా ఉంది. మధ్యాహ్నం కూడా వర్ష సూచనలు కొనసాగనున్నాయి. ఆ సమయంలో వర్షం పడే అవకాశం 56 శాతంగా అంచనా వేశారు.సాయంత్రం పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. వర్షం పడే అవకాశం 86 శాతంగా ఉండటంతో పాటు మేఘావృతం 98 శాతం, తేమ 79 శాతం వరకు ఉండొచ్చని అంచనాలు చెబుతున్నాయి.జురెల్ శతకంతో భారత్ భారీ స్కోరుమ్యాచ్ విషయానికొస్తే భారత్ పూర్తి ఆధిపత్యంలో ఉంది. రెండో రోజు ధ్రువ్ జురెల్ అద్భుత శతకంతో భారత్ 503/9 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. జురెల్ 171 బంతుల్లో 9 ఫోర్లతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.రిషభ్ పంత్ 63 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా, జురెల్‌తో కలిసి ఏడో వికెట్‌కు 112 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి 8/2తో రెండో రోజు ఆటను ముగించింది.ప్రస్తుతం శ్రీలంక 495 పరుగుల భారీ లోటుతో ఉంది. భారత్ ఇప్పటికే మ్యాచ్‌పై పట్టు సాధించిన నేపథ్యంలో మూడో రోజు వర్షం ఎంత మేరకు ఆటను ప్రభావితం చేస్తుందన్నది కీలకంగా మారింది.పడిక్కల్ శతకంవన్డౌన్ బ్యాటర్ పడిక్కల్ వరుసగా రెండో టెస్ట్‌లోనూ సెంచరీ చేశాడు. తొలి టెస్ట్‌లో భారీ శతకం చేసిన అతడు.. రెండో మ్యాచ్ తొలి రోజే సెంచరీ (117) పూర్తి చేశాడు. జురెల్, పడిక్కల్ సెంచరీలతో కదంతొక్కగా.. పంత్‌తో పాటు కెప్టెన్ గిల్ (50) కూడా అర్ద సెంచరీతో రాణించాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (45), రవీంద్ర జడేజా (43) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు.ఆధిక్యంలో భారత్‌కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటిస్తున్న భారత్ తొలి టెస్ట్‌లో విజయం సాధించి 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. -
యశస్వి జైశ్వాల్ సంచలన క్యాచ్.. బిత్తర పోయిన లంక్ బ్యాటర్
కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 503/9 వద్ద డిక్లేర్ చేసింది. భారత బ్యాటర్లలో దేవ్‌దత్త్ పడిక్కల్(117), ధ్రువ్ జురెల్(115) సెంచరీలతో కదం తొక్కగా.. రిషబ్ పంత్(63), యశస్వి జైశ్వాల్(45), శుబ్‌మన్ గిల్(50), రవీంద్ర జడేజా(43) రాణించారు.అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన శ్రీలంక కేవలం 8 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. లహిరు ఉదారను ప్రసిద్ద్ కృష్ణ పెవిలియన్‌కు పంపగా. నైట్ వాచ్మెన్ ప్రభాత్ జయసూర్య(2)ను మానవ్ సుతార్ పెవిలియన్‌కు పంపాడు.జైశ్వాల్ సూపర్ క్యాచ్కాగా రెండో రోజు ఆట ముగిస్తుందున్న సమయంలో భారత స్టార్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ అద్భుత క్యాచ్‌తో మెరిశాడు. లంక తొలి ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన ప్రసిద్ద్ కృష్ణ.. ఉదారకు బ్యాక్ ఆఫ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని ఉదార డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని థర్డ్ స్లిప్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న జైశ్వాల్.. ఎడమవైపు డైవ్ చేస్తూ సంచలన క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో లంక బ్యాటర్ బిత్తర పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.a masterclass in fielding, executed with breathtaking grace by Yashasvi Jaiswal 🚨 pic.twitter.com/neTfMmYHpF— َ (@pipnook) August 24, 2026 -
ధ్రువ్ జురెల్ సెంచరీ.. దెబ్బకు ధోని ఆల్‌టైమ్ రికార్డ్ బ్రేక్
కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ సెంచరీతో మెరిశాడు. ఏడో స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చిన జురుల్.. 171 బంతుల్లో తన రెండో టెస్టు సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ యూపీ క్రికెటర్ 106 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి.ఈ క్రమంలో జురెల్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. శ్రీలంక గడ్డపై టెస్టు క్రికెట్లో ఏడో స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత్ ప్లేయర్‌గా జురెల్ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పేరిట ఉండేది.2010లో ఇదే కొలంబో మైదానంలో ధోని ఏడో స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చి 76 పరుగులు సాధించాడు. తాజా మ్యాచ్‌లో 77 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ధోని రికార్డును జురుల్ బ్రేక్ చేశాడు. అదేవిధంగా శ్రీలంకలో ఏడో స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చి టెస్టు సెంచరీ సాధించిన రెండో భారత బ్యాటర్‌గా ధ్రువ్ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు 2017లో హార్దిక్ పాండ్యా నంబర్ 7 పొజిషన్లో బ్యాటింగ్‌కు వచ్చి టెస్టు సెంచరీ సాధించాడు.చదవండి: IND vs SL: శ్రీలంక ప్లేయర్‌తో గొడవ.. జైశ్వాల్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ -
‘టీమిండియా నుంచి వాళ్లను కూరలో కరివేపాకులా తీసేసారు’
టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో విఫలమైనప్పటికీ.. వైట్‌బాల్ క్రికెట్లో మాత్రం గంభీర్‌ను పెద్దగా తప్పుపట్టాల్సిన పనిలేదన్నాడు. అయితే, వైట్‌బాల్ క్రికెట్లో కొంతమంది పేరు మోసిన ఆటగాళ్లను కూడా కూరలో కరివేపాకులా తీసేసారంటూ.. గంభీర్ బృందం తీరును విమర్శించాడు.కాగా టీమిండియా ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసులో ఉండాలంటే లంకతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో వైట్వాషష్ చేయాల్సిందే. ఈ క్రమంలో తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్.. రెండో టెస్టులోనూ విజయంపై కన్నేసింది.ఇదిలా ఉంటే.. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3-0, సౌతాఫ్రికా చేతిలో 2-0తో వైట్‌వాష్ కావడం వల్లే టీమిండియా డబ్ల్యూటీసీ ప్రయాణం కఠినంగా మారింది. ఈ నేపథ్యంలో గంభీర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. టెస్టు కోచ్‌గా అతడిని తొలగించాలనే అప్పట్లోనే డిమాండ్లు పెరిగాయి.ఇక ఇటీవల టీమిండియా అనూహ్య రీతిలో ఐర్లాండ్ గడ్డ మీద ఆతిథ్య జట్టు చేతిలో కనీవినీ ఎరుగని రీతిలో 2-0తో టీ20 సిరీస్‌లో క్లీన్‌స్వీప్ అయింది. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో 4-0తో వైట్‌వాష్ అయిన భారత జట్టు.. వన్డే సిరీస్‌ను 1-2తో కోల్పోయింది. దీంతో వైట్‌బాల్ కోచ్‌గానూ గంభీర్ పనికిరాడనే విమర్శలు వచ్చాయి.కాగా భారత్‌కు టీ20 ప్రపంచకప్-2026 టైటిల్ అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై యాజమాన్యం వేటువేసిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీ తర్వాత టీమిండియా తొలిసారిగా ఐర్లాండ్ పర్యటనకు వెళ్లగా.. సూర్యను కెప్టెన్‌గా తప్పించడమే కాకుండా జట్టులోనే స్థానం లేకుండా చేశారు. అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు అప్పగించారు.మరోవైపు.. మహ్మద్ షమీ కూడా చాన్నాళ్లుగా పునరాగమనం కోసం ఎదురుచూస్తున్నా సెలక్టర్లు కరుణించడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ స్పందించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ..‘‘కొంతమంది ఆటగాళ్లను మరీ కూరలో కరివేపాకులా తీసేసారు. వాళ్లను ఇంకాస్త మంచిగా చూసుకోవాల్సింది. సూర్య విషయంలో ఇదే జరిగింది. వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత అతడిపై నిర్దాక్షిణ్యంగా వేటువేశారు.ఇక సూర్య మాదిరే మరో ప్లేయర్ షమీ కూడా ఉన్నాడు. వీరి విషయంలో మేనేజ్మెంట్ వ్యవహారశైలి ఇంకాస్త మెరుగ్గా ఉంటే బాగుండేది. ఇవి తప్ప వైట్‌బాల్ క్రికెట్లో గంభీర్‌ను తప్పుబట్టడానికి పెద్దగా ఏమీ లేదు’’ అని వసీం జాఫర్ పేర్కొన్నాడు.అదే విధంగా.. ‘‘టెస్టుల్లో మాత్రం సొంతగడ్డపై న్యూజిలాండ్, సౌతాఫ్రికా చేతిలో టీమిండియా వైట్‌వాష్ కావడం సాధారణ విషయం కాదు. ఈ మచ్చ గంభీర్ కెరీర్‌పై ఎప్పటికీ ఉండిపోతుంది. అతడితో పాటు కెప్టెన్, ఆటగాళ్లు కూడా ఈ భారాన్ని మోయాల్సి ఉంటుంది.విదేశీ జట్లకు టీమిండియాను వారి స్వదేశంలో ఓడించడం అంత సులువు కాదు. అలాంటిది ఏకంగా రెండు వైట్‌వాష్‌లు. ఒకవేళ మనం ఆ సిరీస్ గెలిచి ఉంటే.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఇప్పుడు అగ్రస్థానంలో ఉండేవాళ్లము. టెస్టు కోచ్‌గా గంభీర్ ఇంకా మెరుగుపడాలి. అతడొక్కడే కాదు.. జట్టు కూడా మారాలి. అయితే, కొన్నిసార్లు సెలక్షన్ విషయంలో తప్పిదాల వల్ల కూడా మూల్యం చెల్లించాల్సి వస్తుంది’’ అని వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. కాగా గంభీర్ మార్గదర్శనంలో టీమిండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (వన్డే)-2025, టీ20 ప్రపంచకప్-2026 టైటిళ్లు గెలిచింది. అయితే, డబ్ల్యూటీసీ 2025 ఫైనల్‌కు మాత్రం చేరలేకపోయింది. -
శ్రీలంక ప్లేయర్‌తో గొడవ.. జైశ్వాల్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ
కొలంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టులో గొడవపడ్డ యశస్వి జైశ్వాల్, అషిథా ఫెర్నాండోలకు భారీ షాక్ తగిలింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) వారిద్దరి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించింది.జరిమానా పాటు ఇద్దరికి చెరో డిమెరిట్ పాయింట్‌ను కూడా ఐసీసీ కేటాయించింది. ఆటగాళ్లిద్దరూ తమ తప్పును అంగీకరించడంతో ఎటువంటి అధికారిక విచారణ లేకుండానే మ్యాచ్ రెఫరీ ఆండీ పైక్రాఫ్ట్ శిక్షను ఖరారు చేశారు. కాగా గడిచిన 24 నెలల్లో వారిపై ఎలాంటి క్రమశిక్షణా రికార్డు లేకపోవడంతో జైశ్వాల్- అసిథాలు సస్పెన్షన్ నుంచి తప్పించుకున్నారు. కానీ ఈ డిమెరిట్ పాయింట్లు రెండు ఏళ్ల పాటు వారి రికార్డులో కొనసాగుతాయి.ఏమి జరిగిందంటే?ఈ రెండో తొలి రోజు ఆటలో జైశ్వాల్ 53 బంతుల్లో 45 పరుగులు చేసి మంచి టచ్‌లో కనిపించాడు. అయితే అసిథా ఫెర్నాండో వేసిన 17వ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాదిన తర్వాత.. అదే ఓవర్ ఆఖరి బంతికి జైస్వాల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ క్రమంలో ఫెర్నాండో కాస్త దూకుడుగా సెల్రబేషన్స్ చేసుకున్నాడు. ఈ శ్రీలంక స్పీడ్ స్టార్ జైశ్వాల్‌ను ఉద్దేశించి ఏదో అన్నాడు. దీంతో పెవిలియన్‌కు వెళ్తున్న జైస్వాల్ వెనక్కి తిరిగి బౌలర్ వైపు దూసుకొచ్చాడు. ఇద్దరూ ఒకరికొకరు దగ్గరగా వచ్చి తీవ్ర వాగ్వాదానికి దిగారు. అంపైర్లు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దమణుగింది.చదవండి: మీకేం తెలుసు?: హర్షా భోగ్లేకు ఇచ్చిపడేసిన యశస్వి జైస్వాల్ -
గిల్‌క్రిస్ట్‌ను అధిగమించిన పంత్
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ మరోసారి తన దూకుడు బ్యాటింగ్‌తో రికార్డులు సృష్టించాడు. రెండో రోజు ఆటలో సిక్సర్ బాదిన పంత్.. ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ను అధిగమించి టెస్టు క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు.రెండో రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే సరాన్ష్ జైన్ వికెట్ కోల్పోవడంతో పంత్ మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చాడు. అంతకుముందు తొలి రోజు అతడు మణికట్టు గాయంతో మూడు పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే రెండో రోజు జట్టు అవసరాల దృష్ట్యా తిరిగి క్రీజులోకి వచ్చి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.ఈ క్రమంలో పంత్ కొట్టిన సిక్సర్ టెస్టుల్లో అతడి ఖాతాలో 101వ సిక్సర్‌గా నమోదైంది. దీంతో 100 సిక్సర్లతో ఉన్న గిల్‌క్రిస్ట్‌ను పంత్ వెనక్కి నెట్టాడు. టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ఇప్పుడు పంత్ ఒంటరిగా మూడో స్థానంలో ఉన్నాడు.టెస్టుల్లో అత్యధిక సిక్సర్లుబెన్ స్టోక్స్ – 138బ్రెండన్ మెకల్లమ్ – 107రిషబ్ పంత్ – 102ఆడమ్ గిల్‌క్రిస్ట్ – 100ధోనినీ అధిగమించిన పంత్ఇదే ఇన్నింగ్స్‌లో పంత్ మరో అరుదైన ఘనత కూడా సాధించాడు. విదేశాల్లో లేదా తటస్థ వేదికల్లో భారత వికెట్ కీపర్‌గా అత్యధిక టెస్టు పరుగులు సాధించిన ఆటగాడిగా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని అధిగమించాడు.ఈ ఇన్నింగ్స్‌లో 30 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పంత్ విదేశీ/తటస్థ టెస్టు పరుగుల సంఖ్య 2,501కు చేరింది. దీంతో 2,496 పరుగులతో ఉన్న ధోనిని వెనక్కి నెట్టి ఈ జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు.విదేశీ/తటస్థ టెస్టుల్లో భారత వికెట్ కీపర్ల అత్యధిక పరుగులురిషబ్ పంత్- 2,501 (41.68)ఎంఎస్ ధోని- 2,496 (32.84)ఫరూఖ్ ఇంజినీర్ - 1,209 (32.67)సయ్యద్ కిర్మాణి- 1,109 (21.74)కిరణ్ మోరే- 901 (29.06)మ్యాచ్ విషయానికొస్తే.. రెండో రోజు లంచ్ సమయానికి పంత్ (88 బంతుల్లో 63; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), జురెల్ (107 బంతుల్లో 59; 5 ఫోర్లు) ఇద్దరూ అర్ద సెంచరీలు పూర్తి చేసుకొని ఇన్నింగ్స్‌లు కొనసాగిస్తున్నారు. భారత్ స్కోర్ 419-6గా ఉంది. తొలి రోజు ఆటలో వన్‌డౌన్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్ (117) సూపర్ సెంచరీ చేశాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (50) అర్ద సెంచరీతో రాణించగా.. యశస్వి జైస్వాల్ (45), రవీంద్ర జడేజా (43) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. కేఎల్ రాహుల్ (18) ఒక్కడే తక్కువ స్కోర్‌కు ఔటై నిరాశపరిచాడు. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ తొలి టెస్ట్ నెగ్గి 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. -
మీకేం తెలుసు?.. హద్దు మీరితే బాగోదు: జైస్వాల్ ఫైర్
ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లేకు టీమిండియా స్టార్ యశస్వి జైస్వాల్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. విషయం గురించి పూర్తిగా తెలుసుకోకుండా తీర్పులు ఇచ్చేయడం సరికాదని మండిపడ్డాడు. ఎవరైనా సరే హద్దులు మీరితే.. వారికి తాను తప్పకుండా బుద్ధి చెప్తానని స్పష్టం చేశాడు. అసలు జరిగింది ఏమిటంటే..కాగా టీమిండియా- శ్రీలంక మధ్య రెండో టెస్టు తొలి రోజు ఆట సందర్భంగా జైస్వాల్- అసిత ఫెర్నాండో మధ్య ఆదివారం వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. భారత్ ఇన్నింగ్స్‌లో అసిత.. 17వ ఓవర్ వేయగా.. రెండు, నాలుగు, ఐదో బంతులకు జైస్వాల్ ఫోర్లు బాదాడు. ఆ తర్వాతి బంతికి క్లీన్‌బౌల్డ్ అయిపోయాడు.కొట్టుకోవడమే మిగిలిందిఈ క్రమంలో జైస్వాల్ మైదానం వీడుతుండగా.. ప్రతీకారం తీర్చుకున్నా అన్నట్లుగా అసిత ఏదో అన్నాడు. ఇందుకు ఘాటుగా బదులిచ్చిన జైసూ.. అతడి మీదకు వెళ్లాడు. అసిత కళ్లల్లోకి కళ్లు పెట్టి కోపంగా చూసిన జైస్వాల్.. హెల్మెట్‌తో అతడిని నెట్టివేసే ప్రయత్నం చేశాడు. పరిస్థితి సీరియస్‌గా మారుతోందని గ్రహించిన లంక కెప్టెన్ ధనంజయ డి సిల్వ వచ్చి ఇద్దరినీ విడదీసే ప్రయత్నం చేశాడు.ఆటలో సహజమేఈ ఘటనపై ఇరుజట్ల కోచ్‌లు స్పందిస్తూ.. టెస్టు మ్యాచ్‌లో ఆటగాళ్ల మధ్య ఇలాంటి ఘటనలు సహజమేనని.. గేమ్‌ప్లాన్‌లో భాగంగానే కొన్నిసార్లు బౌలర్లు ఇలా రెచ్చగొడతారంటూ తేలికగా తీసిపడేశారు. ఇక ఈ విషయంపై హర్షా భోగ్లే క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. ‘అవుటైన తర్వాత జైస్వాల్ వెళ్లిపోతున్న సమయంలో అతడిని ఎవరో ఏదో అన్నారు.జైస్వాల్ ఏమీ అనకుండా వెళ్లాల్సిందినిజానికి బౌలర్లు సెండాఫ్ ఇవ్వడం నా దృష్టిలో అంత గొప్పేమీ కాదు. బౌలర్‌గా బ్యాటర్‌ను అవుట్ చేశామంటే అక్కడితో మీ పని పూర్తైనట్లు. అంతేగానీ.. ఇలాంటి చర్యలు అవసరం లేదు. ఏదేమైనా ఇలాంటి పరిస్థితిలో బ్యాటర్ ఎదుటివాళ్ల మాటల్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోవడమే మంచిది. కానీ జైస్వాల్ తిరిగి వచ్చాడు.వాళ్లు ఏమన్నారో జైస్వాల్‌కు మాత్రమే తెలుసు. బౌలర్ అలా అనకుండా ఉండాల్సింది. కానీ జైస్వాల్ నేరుగా అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటే బాగుండేది’’ అని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను క్రిక్‌బజ్ ఇన్‌స్టాలో షేర్ చేయగా.. జైస్వాల్ స్పందించాడు.మీకేం తెలుసు?.. తెలియకుండానే జడ్జిమెంట్లా?‘‘సదరు ఆటగాడు ఏమన్నాడో మీకు తెలియకుంటే.. ఇలాంటి తీర్పులు ఇవ్వడం ఆపండి. ఎవరైనా హద్దులు మీరి ప్రవర్తిస్తే.. భారత్ తిరిగి పోరాడుతుందని.. వాళ్లకు గట్టిగానే బదులు ఇస్తుందని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని జైస్వాల్ కామెంట్ సెక్షన్లో తన అభిప్రాయాన్ని పంచుకుంటూ.. హర్షా భోగ్లేకు కౌంటర్ ఇచ్చాడు.ఇదిలా ఉంటే.. రెండో టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది భారత్. సోమవారం నాటి రెండో రోజు ఆటలో భోజన విరామ సమయానికి 112 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 419 పరుగులు సాధించింది. రిషభ్ పంత్ 63, ధ్రువ్ జురెల్ 59 పరుగులతో ఉన్నారు.చదవండి: IND vs SL: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్ -
రిషబ్ పంత్ భారీ సిక్సర్.. దెబ్బకు స్టేడియం బయటకు బంతి
కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలి రోజు ఆటలో మణికట్టు గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన పంత్.. పూర్తి ఫిట్నెస్ సాధించి రెండో రోజు బ్యాటింగ్‌కు వచ్చాడు. రెండో రోజు ఆటలో కూడా శ్రీలంక బౌలర్లు పంత్‌ను టార్గెట్ చేస్తూ షార్ట్ పిచ్ బంతులను సంధించారు. తొలుత కాస్త ఆచితూచి ఆడిన పంత్.. క్రీజులో నిలదొక్కున్నాక లంక బౌలర్లను ఉతికారేశాడు. లహిరు కుమార బౌలింగ్‌లో పంత్ కొట్టిన భారీ సిక్సర్ తన ఇన్నింగ్స్ మొత్తానికే హైలెట్‌గా నిలిచే అవకాశముంది. భారత ఇన్నింగ్స్ 90వ ఓవర్లో కుమార.. ఐదో బంతిని పంత్‌కు షార్ట్ పిచ్ డెలివరీగా సంధించాడు. ఈసారి మాత్రం పంత్ సరైన సమాధనమిచ్చాడు. ఆ డెలివరీని పంత్ 'ఫైన్ లెగ్' మీదుగా భారీ సిక్సర్‌గా మలిచాడు. పంత్ దెబ్బకు బంతి స్టేడియం బయటకు వెళ్లిపడింది. దీంతో అంపైర్ కొత్త బంతిని తీసుకొచ్చాడు. కాగా మొదటి రోజు కుమార బౌలింగ్‌లోనే పంత్ గాయపడ్డాడు. ఇప్పుడు ఈ సిక్సర్‌తో పంత్ ప్రతీకారం తీర్చుకున్నాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. పంత్ 63 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తోంది. సెకెండ్ డే లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి తమ తొలి ఇన్నింగ్స్‌లో 419 పరుగుల భారీ స్కోర్ సాధించింది. క్రీజులో పంత్‌తో పాటు ధ్రువ్ జురెల్(59) ఉన్నాడు.చదవండి: Kuldeep Yadav: ‘అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు’pic.twitter.com/b5a8pvxpcs— crictalk (@crictalk7) August 24, 2026 -
IND vs SL: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. విదేశీ, తటస్థ వేదికలపై భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన వికెట్ కీపర్ బ్యాటర్‌గా రికార్డు సాధించాడు. ఈ క్రమంలో దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు.విజయంతో మొదలుకాగా టీమిండియా ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా ఆతిథ్య జట్టుతో రెండు టెస్టులు ఆడుతోంది. తొలి టెస్టులో లంకపై 165 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన భారత్.. కొలంబో వేదికగా ఆదివారం రెండో టెస్టు మొదలుపెట్టింది.గాయపడిన పంత్సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు ఆట పూర్తయ్యేసరికి ఐదు వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. అయితే, ఆదివారం ఆట సందర్భంగా పంత్ గాయపడి.. మూడు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మైదానాన్ని వీడాడు.రీఎంట్రీ ఇచ్చి.. సరికొత్త చరిత్రఈ క్రమంలో సోమవారం నాటి రెండో ఆట మొదలైన కాసేపటికే నైట్‌వాచ్‌మన్ సారాంశ్ జైన్ (6) అవుట్ కాగా.. పంత్ రీఎంట్రీ ఇచ్చాడు. ధ్రువ్ జురెల్‌తో కలిసి నిలకడగా ఆడిన పంత్.. డ్రింక్స్ బ్రేక్ సమయానికి 50 బంతుల్లో 30 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో విదేశీ, తటస్థ వేదికలపై టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన వికెట్ కీపర్ బ్యాటర్‌గా పంత్ రికార్డు సృష్టించాడు.ఇదిలా ఉంటే.. సోమవారం నాటి రెండో రోజు ఆటలో భోజన విరామ సమయానికి.. టీమిండియా 112 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 419 పరుగులు సాధించింది. రిషభ్ పంత్ 63, ధ్రువ్ జురెల్ 59 పరుగులతో ఉన్నారు.And just like that, Rishabh Pant is back to his old tricks! 😏🔥Watch #SLvIND, 2nd Test, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/JLfk3vXwg0— Sony Sports Network (@SonySportsNetwk) August 24, 2026విదేశీ, తటస్థ వేదికలపై టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్లు వీరే1. రిషభ్ పంత్- 2501 పరుగులు (సగటు 41.68)2. మహేంద్ర సింగ్ ధోని- 2496 పరుగులు (సగటు 32.84)3. ఫారూఖ్ ఇంజనీర్- 1209 పరుగులు (సగటు 32.67)4. సయ్యద్ కీర్మాణి- 1109 పరుగులు (సగటు 21.74)5. కిరణ్ మోరే- 901 పరుగులు (సగటు 29.06).చదవండి: ఇమ్రాన్ ఖాన్ కోసం మాజీ సారథులు! -
IND vs SL: ‘అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు’
శ్రీలంకతో రెండో టెస్టు సందర్భంగా ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ జైన్ భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ముందుగా ఊహించినట్లుగానే చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో యాజమాన్యం అతడితో అరంగేట్రం చేయించింది. ఈ నేపథ్యంలో కుల్దీప్ను ఉద్దేశపూర్వకంగానే తప్పించారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ ఘాటుగా స్పందించాడు.అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదుకొలంబో టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడిన సితాన్షు కొటక్.. కుల్దీప్ యాదవ్ విషయంలో తమకు అబద్ధాలు చెప్పాల్సిన పనిలేదన్నాడు. అతడు అనారోగ్యంతో ఉన్నాడని.. అందుకే శ్రీలంకతో రెండో టెస్టు ఆడటం లేదని స్పష్టం చేశాడు. ఈ మేరకు.. ‘‘కుల్దీప్ యాదవ్ ఫిట్నెస్ గురించి మీరు అడిగిన ప్రశ్న అసంబద్ధమైనది.నిజంగానే జ్వరం వచ్చిందిగాలె నుంచి బయల్దేరినపుడే అతడు వైరల్ ఫీవర్‌తో ఉన్నాడు. నిజంగానే అతడికి జ్వరం వచ్చింది. జట్టుకు స్పిన్నర్ అవసరమైన వేళ.. అతడు ఆడలేని పరిస్థితిలో ఉంటే.. యాజమాన్యానికి అతడి గురించి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగానే అతడు ఆడగలిగే పరిస్థితిలో లేకుంటే.. సెలక్షన్‌కు ఎలా అందుబాటులో ఉండగలడు?పొద్దున బాలేడు.. సాయంత్రానికి కోలుకున్నాడుకుల్దీప్ విషయంలో మీరిలా ఆలోచించడం ఎంతమాత్రం సరికాదు. ఏదేమైనా అతడు త్వరగానే కోలుకున్నాడు. ఈరోజు సాయంత్రం (ఆదివారం) అతడిని నేరుగా కలిశాను. ప్రస్తుతం అతడు బాగానే ఉన్నాడు. ఉదయం మాత్రం మ్యాచ్ ఆడే పరిస్థితిలో లేడు.మరో విషయం.. తుదిజట్టులో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు లేదంటే ముగ్గురు స్పిన్నర్లను ఆడించాలనుకుంటే.. శ్రీలంక టాపార్డర్‌లో దాదాపు నలుగురు లెఫ్టాండర్లే ఉన్నారు. అలాంటపుడు ఆఫ్ స్పిన్నర్‌ను ఆడించడం సరైందే కదా’’ అని సితాన్షు కొటక్ పేర్కొన్నాడు. తద్వారా జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా కుల్దీప్ను తప్పించి.. సారాంశ్ జైన్‌ను ఆడిస్తున్నామని చెప్పకనే చెప్పాడు. ప్రయాణ బడలిక వల్లేఇదిలా ఉంటే.. కుల్దీప్ యాదవ్ గురించి బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే మాట్లాడుతూ.. ప్రయాణంలో అలసిపోయిన కారణంగానే అతడు రెండు రోజుల పాటు నెట్ సెషన్‌కు రాలేకపోయాడని తెలిపాడు. సితాన్షు కొటక్ మాత్రం వైరల్ ఫీవర్ అని చెప్పడం గమనార్హం. కాగా.. గాలెలో జరిగిన తొలి టెస్టులో భారత్ శ్రీలంకపై 165 పరుగుల తేడాతో గెలిచింది. ఇరుజట్ల మధ్య నిర్ణయాత్మక రెండో టెస్టు కొలంబోలో ఆదివారం మొదలైంది. ఇక తొలి టెస్టులో కుల్దీప్ యాదవ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 25 ఓవర్ల బౌలింగ్‌లో 103 పరుగులు ఇచ్చి కేవలం ఒకే వికెట్ తీశాడు.చదవండి: ఇమ్రాన్ ఖాన్ కోసం మాజీ కెప్టెన్లు! -
రెండో రోజు ముగిసిన ఆట.. రెండు వికెట్లు కోల్పోయిన లంక
Sri Lanka Vs India 2nd Test Match, Day 2: కొలంబో వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి శ్రీలంక 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది. కమిల్ మిషారా 5 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మానవ్ సుతార్, ప్రసిధ్ క్రిష్ణలు చెరో వికెట్ తీశారు. ప్రస్తుతం లంక 495 పరుగుల వెనుకబడి ఉంది.అంతకముందు మానవ్ సుతార్ బౌలింగ్‌లో ప్రబాత్ జయసూరియ (2) ఎల్బీగా వెనుదిరగడంతో లంక రెండో వికెట్ కోల్పోయింది. ఇక భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. పడిక్కల్, ధ్రువ్ జురెల్ శతకాలతో విజృంభించగా; గిల్, పంత్ అర్ధసెంచరీలతో రాణించారు. లంకకు ఆదిలోనే షాక్రెండో ఇన్నింగ్ ఆరంభించిన శ్రీలంకకు ఆదిలోనే షాక్ తగిలింది. ప్రసిధ్ క్రిష్ణ బౌలింగ్‌లో లాహిరు కుమారా (1) వెనుదిరగడంతో లంక రెండు పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం లంక వికెట్ నష్టానికి 8 పరుగులు చేసింది.భారత్ 503/9 డిక్లేర్కొలంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య రెండో టెస్టులో రెండో రోజు ఆట మొదలైంది. కాగా 300/5 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట మొదలుపెట్టిన భారత్.. తొమ్మిది వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. రెండోరోజు ఆటలో భాగంగా రిషభ్ పంత్ అర్ధ శతకం (63)తో మెరవగా.. ధ్రువ్ జురెల్ శతక్కొట్టాడు. మొత్తంగా 177 బంతుల్లో 115 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. ఇక తొలిరోజు ఆటలో పడిక్కల్ శతకం (117) సాధించగా.. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ (50) చేశాడు. కాగా శ్రీలంక బౌలర్లలో అసిత ఫెర్నాండో అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. ప్రభాత్ జయసూర్య, కుశారా నువాంత చెరో రెండు వికెట్లు పడగొట్టారు. లాహిరు కుమారకు ఒక వికెట్ దక్కింది. Updatesజురెల్ సెంచరీ.. భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్డ్తొమ్మిదో వికెట్ డౌన్136.1వ ఓవర్: ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయిన తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగిన సిరాజ్ (3). అతడి స్థానంలో ప్రసిద్ కృష్ణ క్రీజులోకి రాగా.. జురెల్ 106 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 489-8. ఆరు గంటల వరకు మ్యాచ్వాన తెరిపినివ్వడంతో.. తిరిగి సాయంత్రం 4.24 నిమిషాలకు మ్యాచ్ మొదలైంది. వర్షం వల్ల ఆటకు అంతరాయం కలగగా.. పరిస్థితిని బట్టి ఆరు గంటల వరకు మ్యాచ్ నిర్వహించనున్నారు.టీ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 475/8(131.2)వరుణుడు ఎంట్రీభారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టుకు వర్షం అంతరాయం కలిగింది. వర్షం కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి భారత్ 8 వికెట్లు కోల్పోయి 475 పరుగులు చేసింది.ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్458 పరుగుల వద్ద భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో నిరోషన్ డిక్వెల్లాకు క్యాచ్ ఇచ్చి మానవ్ సుతార్ (18) ఔటయ్యాడు. జురెల్ 79 పరుగుల వద్ద క్రీజ్‌లో ఉన్నాడు. ఏడో వికెట్ కోల్పోయిన భారత్112.1వ ఓవర్: భోజన విరామం తర్వాత తొలి బంతికే పంత్ అవుటయ్యాడు. కేశారా నువాంత బౌలింగ్‌లో లాహిరు కుమారకు క్యాచ్ ఇచ్చి 63 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు. దీంతో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది.పంత్ స్థానంలో ఆల్‌రౌండర్ మానవ్ సుతార్ క్రీజులోకి రాగా.. జురెల్ 59 పరుగులతో ఉన్నాడు. భారత్ స్కోరు: 419-7. లంచ్ విరామం సమయానికి భారత్ స్కోర్ 419-6రెండో రోజు లంచ్ విరామం సమయానికి భారత్ స్కోర్ 419-6గా ఉంది. రిషబ్ పంత్ 63, ధ్రువ్ జురెల్ 59 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. జురెల్ ఫిఫ్టిజురెల్ 97 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత్ స్కోర్ కూడా 400 మార్కు దాటింది. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పంత్రిషబ్ పంత్ 81 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో ధ్రువ్ జురెల్ (49) కూడా హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. 109 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 397-6గా ఉంది.డ్రింక్స్ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 354-6 (97)పంత్ 30, జురెల్ 27 పరుగులతో ఉన్నారు.నిలకడగా ఆడుతున్న జురెల్, పంత్రెండో రోజు ఆట ప్రారంభమయ్యాక రెండో ఓవర్లోనే సరాన్ష్ వికెట్ కోల్పోయాక భారత బ్యాటర్లు రిషబ్ పంత్ (19), ధ్రువ్ జురెల్ (26) నిలకడగా ఆడుతున్నారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 342-6గా ఉంది. ఆరో వికెట్ కోల్పోయిన భారత్‌రెండో రోజు ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే భారత్‌కు షాక్ తగిలింది. ఓవర్‌నైట్ బ్యాటర్ సరాన్ష్ జైన్ (6) అసిత ఫెర్నాండో బౌలింగ్‌లో కమిల్ మిషారాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 307-6గా ఉంది. ధ్రువ్ జురెల్‌కు (11) జతగా తొలి రోజు రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన రిషబ్ పంత్ (3) క్రీజ్‌లోకి వచ్చాడు.రెండో రోజు మొదలైన ఆటభారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ రెండో రోజు ఆట మొదలైంది. సరాన్ష్ జైన్ 4), ధ్రువ్ జురెల్ (7) క్రీజ్‌లోకి వచ్చారు. ఓవర్‌నైట్ స్కోర్ 300-5 వద్ద భారత్ ఆట మొదలుపెట్టింది. తుది జట్లు..భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, సరాన్ష్ జైన్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణశ్రీలంక (ప్లేయింగ్ XI): లాహిరు ఉదార, కమిల్ మిషార, పసిందు సూర్యబండార, కమిందు మెండిస్, ధనంజయ డి సిల్వా(కెప్టెన్), సోనాల్ దినుషా, నిరోషన్ డిక్వెల్లా(వికెట్ కీపర్), కేషారా నువంత, ప్రబాత్ జయసూర్య, లహిరు కుమార, అసిత ఫెర్నాండో -
జైస్వాల్-అసిత ఘటనపై భారత బ్యాటింగ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు
భారత్-శ్రీలంక మధ్య కొలంబో టెస్టు తొలి రోజు ఆటలో చోటుచేసుకున్న యశస్వి జైస్వాల్, శ్రీలంక పేసర్ అసిత ఫెర్నాండో మధ్య వాగ్వాదంపై భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ స్పందించాడు. జైస్వాల్ బౌలర్‌కు అంత దగ్గరగా వెళ్లడం సరైంది కాదని, అయితే టెస్టు క్రికెట్లో తీవ్ర పోటీ మధ్య ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు చోటుచేసుకుంటాయని ఆయన పేర్కొన్నాడు.తొలి రోజు ఉదయం సెషన్లో ఈ ఘటన జరిగింది. ఫెర్నాండో వేసిన ఓవర్లో జైస్వాల్ వరుసగా మూడు ఫోర్లు బాదాడు. అయితే అదే ఓవర్లో ఫెర్నాండో జైస్వాల్‌ను ఔట్ చేశాడు. అనంతరం శ్రీలంక ఆటగాళ్లతో కలిసి ఫెర్నాండో సంబరాలు చేసుకుంటూ జైస్వాల్‌కు సెండ్ఆఫ్ ఇచ్చినట్లు కనిపించింది.దీంతో ఆగ్రహించిన జైస్వాల్ వెనక్కి తిరిగి ఫెర్నాండో వైపు నడుచుకుంటూ వెళ్లాడు. ఇద్దరూ ఎదురెదురుగా వచ్చి తలలతో ఢీకొట్టుకున్నారు. వెంటనే శ్రీలంక ఆటగాళ్లు జోక్యం చేసుకుని ఇద్దరినీ విడదీశారు.ఈ ఘటనపై సితాన్షు కోటక్ మాట్లాడుతూ, “బౌలర్ ఏదో వ్యాఖ్య చేశాడని అనుకుంటున్నాను. అది ఉద్వేగభరిత పరిస్థితుల్లో జరిగింది. జైస్వాల్ అతడి దగ్గరకు అంతగా వెళ్లకూడదు. కానీ ఆ క్షణంలో అలా జరిగిపోయింది” అని చెప్పాడు.శ్రీలంక బౌలింగ్ కోచ్ రియాన్ వాన్ నీకెర్క్ కూడా ఇదే తరహాలో స్పందించాడు. టెస్టు క్రికెట్లో భారత్ వంటి జట్టుతో ఆడుతున్నప్పుడు బౌలర్లు ఎప్పుడూ పోరాట స్ఫూర్తితో ఉండాలని, ఆటలోని తీవ్రమైన భావోద్వేగాలే ఇలాంటి మాటల మార్పిడికి కారణమవుతాయని పేర్కొన్నాడు.“ఇది కఠినమైన టెస్టు క్రికెట్. భారత్ లాంటి జట్టుతో ఆడుతున్నప్పుడు వెనక్కి తగ్గి కేవలం బంతులు వేయడం సాధ్యం కాదు. ఎప్పుడూ సవాలు విసురుతూ, ఏదో ఒకటి సృష్టించేందుకు ప్రయత్నించాలి. మాటల తూటాలు కూడా ఆ భావోద్వేగాల నుంచి వచ్చినవే” అని వాన్ నీకెర్క్ తెలిపాడు.అయితే కోచ్‌ల మాదిరిగా మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ఈ ఘటనను తేలికగా తీసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఆటగాళ్లకు సెండ్ఆఫ్లు, అనుచిత ప్రవర్తనపై ఐసీసీ నిబంధనలు ఉన్నాయి. వీడియో ఫుటేజీ పరిశీలనలో జైస్వాల్, ఫెర్నాండో మధ్య అనుచిత వ్యవహారం జరిగినట్లు తేలితే ఇద్దరిపైనా లేదా సంబంధిత ఆటగాడిపైనా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే, కొలొంబో టెస్ట్ తొలి రోజు భారత బ్యాటర్లు పైచేయి సాధించారు. వన్ డౌన్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్ (117) వరుసగా రెండో టెస్ట్‌లో సెంచరీతో కదంతొక్కగా.. శుభ్‌మన్ గిల్ (50), యశస్వి జైస్వాల్ (45), రవీంద్ర జడేజా (43) రాణించారు. కేఎల్ రాహుల్ (18) నిరాశపర్చగా.. రిషబ్ పంత్ (3) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ స్కోర్ 300-5గా ఉంది. ధ్రువ్ జురెల్ (7), సరాన్ష్ జైన్ (4) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో భారత్ తొలి టెస్ట్ గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. చదవండి: జైస్వాల్, లంక బౌలర్ మధ్య వాగ్వాదం; కొట్టుకోవడమే తరువాయి! -
'రాహుల్ ఆ షాట్ ఆడుతాడని ఊహించలేదు'
కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో రాహుల్ కేవలం 18 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.భారత ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన లహిరు కుమార బౌలింగ్‌లో కాస్త నిర్లక్ష్యంగా షాట్ ఆడిన రాహుల్.. వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో రాహుల్ షాట్ సెలక్షన్‌పై భారత మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. "కేఎల్ రాహుల్ ఆ షాట్ ఆడుతాడని అస్సలు ఊహించలేదు. అదే ఓవర్లో అతడు పుల్ షాట్ ద్వారా ఫోర్ బాదాడు. బహుశా ఆ ఆత్మవిశ్వాసంతోనే తొందరపడి అనవసర షాట్ ఆడాడు. ఇది రాహుల్ బ్యాటింగ్ స్టైల్ కాదు. ఎందుకంటే ఆఫ్ వికెట్‌కు చాలా దూరంగా వెళ్తున్న బంతికి అలాంటి షాట్లు ఆడే అలవాటు రాహుల్‌కు లేదు. కేఎల్ అప్పటికే క్రీజులో సెటిలయ్యాడు. ఎప్పుడూ ఓపికగా క్రీజులో సమయం గడిపే అతడు ఈసారి తొందరపడి తన వికెట్ సమర్పించుకున్నాడు. పిచ్ కూడా బ్యాటింగ్‌కు అద్భుతంగా ఉంది. రాహుల్ ఎక్కవ సమయం పాటు క్రీజులో ఉండి ఉంటే బాగుండేది" అని సోనీ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రసాద్ పేర్కొన్నాడు.కాగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 300 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో దేవ్‌దత్త్ పడిక్కల్(117) అద్భుత సెంచరీతో సత్తా చాటాడు. అతడితో పాటు శుబ్‌మన్ గిల్(50), రవీంద్ర జడేజా(43), యశస్వి జైశ్వాల్(45) రాణించారు.చదవండి: టీమిండియాకు గుడ్ న్యూస్.. విధ్వంకర వీరుడి బ్యాటింగ్‌కు లైన్ క్లియర్ -
టీమిండియాకు గుడ్ న్యూస్.. విధ్వంకర వీరుడి బ్యాటింగ్‌కు లైన్ క్లియర్
కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆటలో టీమిండియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 300 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో దేవ్‌దత్త్ పడిక్కల్(117) అద్భుత సెంచరీతో సత్తా చాటాడు. ఇది అతడికి వరుసగా రెండో సెంచరీ కావడం గమనార్హం. అతడితో పాటు శుబ్‌మన్ గిల్(50), రవీంద్ర జడేజా(43), యశస్వి జైశ్వాల్(45) రాణించారు.టీమిండియాకు గుడ్ న్యూస్అయితే రెండో రోజు ఆటకు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. తొలి రోజు ఆటలో గాయపడ్డ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తిరిగి పూర్తి ఫిట్నెస్ సాధించాడు. ఈ విషయాన్ని భారత బ్యాటింగ్ సితాన్షు కోటక్ ధ్రువీకరించాడు. పంత్ పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడు. రెండో రోజు అతడు బ్యాటింగ్‌కు రానున్నాడు అని కోటక్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు.పంత్‌కు ఏమైందంటే?భారత ఇన్నింగ్స్ 57వ ఓవర్లో లంక పేసర్ లహిరు కుమార పంత్‌కు ఓ షార్ట్‌పిచ్ డెలివరీని సంధించాడు. ఆ బంతిని అతడు ఫుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి అతడి బ్యాట్‌కు మిస్స్ అయ్యి ఎడమ చేతి గ్లౌవ్పై తాకింది.దీంతో అతడు తీవ్రమైన నొప్పితో విలవిల్లాడు. వెంటనే ఫిజియో పరిగెత్తుకుంటూ వచ్చి చికిత్స అందించాడు. అయినప్పటికి అతడు నొప్పి తగ్గలేదు. దీంతో 3 పరుగుల వ్యక్తిగత స్కోర్ పంత్ రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడాల్సి వచ్చింది. కానీ అతడి గాయం తీవ్రమైనది కాకపోవడంతో టీమ్ మేనెజ్మెంట్ ఊపిరిపీల్చుకుంది. -
పడిక్కల్ సూపర్ సెంచరీ.. తొలి రోజు భారత్‌దే
కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులోనూ భారత బ్యాటర్లు సత్తాచాటారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. యువ బ్యాటర్ దేవ్‌దత్త్ పడిక్కల్(117) మరోసారి సెంచరీతో కదం తొక్కగా.. శుబ్‌మన్ గిల్(50), యశస్వి జైశ్వాల్(45), రవీంద్ర జడేజా(43) రాణించారు. ప్రస్తుతం క్రీజులో ద్రువ్ జురెల్(7), సారాన్ష్ జైన్(4) ఉన్నారు.శ్రీలంక బౌలర్లలో అసిథ ఫెర్నాండో మూడు వికెట్లు పడగొట్టగా.. లహిరు కుమారా, కేశర నువాంత తలా వికెట్ సాధించారు. కాగా ఈ మ్యాచ్‌లో భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ గాయపడ్డాడు.బ్యాటింగ్ చేస్తుండగా కుమార వేసిన బంతి పంత్ ఎడమ చేతి మణికట్టుకు బలంగా తాకింది. దీంతో తీవ్రమైన నొప్పితో పంత్ రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడాడు. పంత్ గాయం తీవ్రతపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్.. ప్రపంచంలోనే రెండో ప్లేయర్‌గా -
చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్.. ప్రపంచంలోనే రెండో ప్లేయర్‌గా
చేతేశ్వర్ పుజారా రిటైర్మెంట్ తర్వాత టెస్టుల్లో భారత జట్టుకు మూడో స్ధానం పెద్ద సమస్యగా మారిన సంగతి తెలిసిందే. సాయిసుదర్శన్, కరుణ్ నాయర్ వంటి ఆటగాళ్లను ప్రయోగించినప్పటికి పుజారా స్ధానాన్ని భర్తీ చేయలేకపోయాడు. అయితే ఎట్టకేలకు పుజారా వారుసుడు దొరికాడు. మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి అద్భుతాలు చేస్తున్నాడు. అతడే కర్ణాటక స్టార్ బ్యాటర్ దేవ్‌దత్త్ పడిక్కల్. దాదాపు మూడేళ్ల తర్వాత భారత టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన పడిక్కల్ శతకాల మోత మోగిస్తున్నాడు. గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో సెంచరీతో సత్తాచాటిన పడిక్కల్.. ఇప్పుడు కొలంబోలో కూడా అద్భుత శతకంతో కదం తొక్కాడు. 193 బంతుల్లో 12 ఫోర్లతో 117 పరుగులు చేశాడు.ఈ క్రమంలో పడిక్కల్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ చరిత్రలో ఒకే సిరీస్‌లో మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఒకటి కంటే ఎక్కువ సెంచరీలు చేసిన రెండో బ్యాటర్‌గా పడిక్కల్ నిలిచాడు. ఇంతకుమందు ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ మాత్రమే ఈ ఘనత సాధించాడు. ఇప్పుడు రూట్ సరసన పడిక్కల్ చేరాడు. అంతేకాకుండా విదేశీ గడ్డపై భారత జట్టు తరపున మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి వరుసగా సెంచరీలు చేయడం 2019 తర్వాత ఇదే తొలిసారి. చివరగా 2018-19 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో పుజారా వరుసగా రెండు సెంచరీలు చేశాడు. మళ్లీ ఇప్పుడు ఏడేళ్ల తర్వాత ఈ ఫీట్‌ను దేవ్‌దత్త్ నమోదు చేశాడు.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్.. ప్రపంచంలోనే రెండో ప్లేయర్‌గా -
SL Vs IND: దేవ్‌దత్త్ పడిక్కల్ సెంచరీ
టీమిండియా యువ బ్యాటర్ దేవ్‌దత్త్ పడిక్కల్ శ్రీలంక గడ్డపై ఇరగదీస్తున్నాడు. గాలే టెస్టులో భారీ శతకంతో కదం తొక్కిన పడిక్కల్.. ఇప్పుడు కొలంబో వేదికగా జరిగిన రెండో టెస్టులోనూ అద్భుత సెంచరీతో మెరిశాడు. ఈ కర్ణాటక బ్యాటర్ 168 బంతుల్లో తన రెండో టెస్టు సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఓపెనర్ కేఎల్ రాహుల్ అవుట్ కావడంతో పడిక్కల్ త్వరగా క్రీజులోకి వచ్చాడు.ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఓపెనర్ కేఎల్ రాహుల్ అవుట్ కావడంతో పడిక్కల్ త్వరగా క్రీజులోకి వచ్చాడు. యశస్వి జైశ్వాల్‌తో కలిసి పడిక్కల్ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు.జైశ్వాల్ అవుటైన తర్వాత కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో కూడా కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.ఓవరాల్‌గా 193 బంతులు ఎదుర్కొన్న పడిక్కల్.. 12 ఫోర్లతో 117 పరుగులు చేశాడు. కీలకమైన మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి అద్భుతంగా రాణిస్తున్న పడిక్కల్‌పై మాజీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 82 ఓవర్లు ముగిసే సరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. క్రీజులో జడేజా(43), జురెల్(6) ఉన్నారు.చదవండి: IND vs SL: టీమిండియాకు భారీ షాక్ -
టీమిండియాకు భారీ షాక్
కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ మణికట్టు గాయం కారణంగా తొలి ఇన్నింగ్స్‌లో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. గిల్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన పంత్ శ్రీలంక పేసర్లను ఎదుర్కోవడానికి కాస్త ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలో లంక ఫాస్ట్ బౌలర్ లహిరు కుమార వేసిన ఓ బంతిని పంత్ ఫుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ మిస్స్ అయ్యి అతడి ఎడమ చేతికి తాకింది. ఫలితంగా రిషబ్ తీవ్రమైన నొప్పితో విలవిల్లాడాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికి పంత్ నొప్పి తగ్గలేదు. దీంతో 3 పరుగులు చేసిన పంత్ ఫిజియో సాయంతో మైదానాన్ని వీడాడు.అతడి స్దానంలో రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చాడు. అయితే పంత్ గాయం తీవత్రపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో కూడా భారత బ్యాటర్లు సత్తాచాటుతున్నారు. 65 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. క్రీజులో పడిక్కల్(85), రవీంద్ర జడేజా(17) ఉన్నారు. అంతకుముందు గిల్(50) కూడా హాఫ్ సెంచరీ చేశాడు.చదవండి: Mitchell Starc: 771 వికెట్లు.. దెబ్బకు అశ్విన్, చమిందా వాస్ రికార్డ్‌లు బ్రేక్ -
చరిత్ర సృష్టించిన గిల్.. దశాబ్దంలో తొలి ఆటగాడు
భారత టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరో కీలక మైలురాయిని తాకాడు. టెస్ట్ క్రికెట్లో 3,000 పరుగులు పూర్తి చేశాడు. తద్వారా ఈ ఘనత సాధించిన 28వ భారత బ్యాటర్‌గా నిలిచాడు. కొలొంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో గిల్ ఈ ఘనత సాధించాడు.26 ఏళ్ల గిల్ తన 43వ మ్యాచ్ 77వ ఇన్నింగ్స్‌లో 3000 పరుగుల మార్కును తాకాడు. ఈ ఫార్మాట్లో గిల్ 43.53 సగటున, 8 సెంచరీలు, 11 అర్ద సెంచరీలు చేశాడు. అతడి అత్యుత్తమ స్కోర్ 269గా ఉంది.కపిల్ కంటే వారం ముందు..టెస్ట్‌ల్లో 3000 పరుగుల మైలురాయిని గిల్ 26 ఏళ్ల 349 రోజుల వయసులో అందుకున్నాడు. తద్వారా భారత్ తరఫున అత్యంత పిన్న వయసులో ఈ మైలురాయిని తాకిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (23 ఏళ్ల 228 రోజుల) అగ్రస్థానంలో ఉండగా.. వీరేంద్ర సెహ్వాగ్ (26 ఏళ్ల 157 రోజులు), దిలీప్ వెంగ్‌సర్కార్ (26 ఏళ్ల 263 రోజులు) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. గిల్.. భారత దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ (26 ఏళ్ల 356 రోజులు) కంటే వారం రోజుల ముందు ఈ మైలురాయిని తాకాడు.2020లో టెస్ట్ అరంగేట్రం చేసిన గిల్.. నాటి నుంచే నిలకడైన ప్రదర్శనలతో భారత టెస్ట్ జట్టులో కీలక బ్యాటర్‌గా ఎదిగాడు. ముఖ్యంగా 2025లో ఇంగ్లండ్ పర్యటనలో అతడి బ్యాటింగ్ అత్యంత ప్రభావవంతంగా నిలిచింది. ఆ సిరీస్‌లో గిల్ ఏకంగా 754 పరుగులు సాధించాడు. గిల్ వన్డేల్లోనూ ఇదివరకే 3000 పరుగులు పూర్తి చేశాడు.దశాబ్దంలో తొలి ఆటగాడుఈ మ్యాచ్‌లో గిల్ మరో అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ దశాబ్దంలో టెస్టులు, వన్డేలు రెండింటిలో కనీసం 3,000 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. గిల్ ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో 3,000 వన్డే పరుగులు పూర్తి చేశాడు. కేవలం 62 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని అందుకుని, వన్డే చరిత్రలో అత్యంత వేగంగా 3,000 పరుగులు సాధించిన ఆటగాళ్లలో రెండో స్థానంలో నిలిచాడు. మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ తొలి రోజు లంచ్ విరామం సమయానికి 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(45), కేఎల్ రాహుల్ (18) ఔట్ కాగా.. పడిక్కల్ (13), గిల్ (11) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ తొలి మ్యాచ్‌లో గెలిచిన విషయం తెలిసిందే. -
భారత్‌తో రెండో టెస్టు.. శ్రీలంక జట్టులోకి కొత్త బ్యాటర్
భారత్-శ్రీలంక మధ్య రెండో టెస్టు ఆదివారం నుంచి కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ (SSC) మైదానం వేదికగా ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో గెలిచి మంచి జోష్‌లో ఉన్న భారత్.. అదే జోరును కొలంబోలోనూ కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు గాలే టెస్టులో ఘోర ఓటమి చవిచూసిన శ్రీలంక తిరిగి పుంజుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో ప్రీమ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన లంక కెప్టెన్ ధనంజయ డి సిల్వా కీలక వ్యాఖ్యలు చేశాడు. రెండో టెస్టులో భారత్‌ను అడ్డుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని సిల్వా తెలిపాడు."బ్యాటింగ్‌లో భారీ స్కోర్ సాధించి, అనంతరం ప్రత్యర్ధి వికెట్ల తీయడమే మా ప్రధాన వ్యూహం. గాలే టెస్టులో భారత్ కూడా ఇదే చేసింది. తొలి రెండు రోజులూ బ్యాటింగ్ చేసి టీమిండియా 460 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్‌లో మేము కుడా బ్యాటింగ్ పరంగా మెరుగ్గా రాణించి, ప్రత్యర్థి జట్టు 20 వికెట్లు తీసేందుకు ప్రయత్నిస్తాం.తొలి మ్యాచ్‌లో ఓడిపోవడం నిరాశపరిచినా.. కొలంబోలో మాత్రం తొలి రోజు నుంచే పట్టు సాధించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకున్నాం. సీనియర్ ఆటగాళ్లు జట్టులో లేనప్పటికి, యంగ్ టాలెంట్ రూపంలో మాకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఇద్దరు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నాం.ఈ మ్యాచ్ ద్వారా కామిల్ మిషార టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు. గతకొంత కాలంగా అతడు అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇటీవల టీ20ల్లో సెంచరీ కూడా చేశాడు. అలాగే లెఫ్ట్ ఆర్మ్ పేసర్ విష్వ ఫెర్నాండోను జట్టులోకి తీసుకునే ఆలోచనలో ఉన్నామని" డిసిల్వా పేర్కొన్నాడు. -
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్!
కొలంబో వేదికగా శ్రీలంకతో రెండో టెస్టులో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి 2-0 తేడాతో సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని గిల్ సేన పట్టుదలతో ఉంది. మరోవైపు తొలి టెస్టులో ఓటమి పాలైన ఆతిథ్య శ్రీలంక.. కొలంబోలో గెలిచి సిరీస్ సమం చేయాలని వ్యూహాలు రచిస్తోంది.అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశముంది. అక్యూ వెదర్ రిపోర్ట్ ప్రకారం.. తొలి రోజు కొలంబోలో వర్షం కురిసేందుకు 60 శాతం అస్కారముంది. మ్యాచ్ జరిగే ఐదు రోజుల పాటు తేలికపాటి జల్లులు కురవనున్నట్లు పలు వాతావరణ నివేదికలు పేర్కొంటున్నాయి. కాగా తొలి టెస్టు జరిగిన గాలేలో కూడా ఆటకు వర్షం ఆటంకం కలిగించింది.పిచ్ రిపోర్ట్(అంచనా)ఇక కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ పిచ్ మొదటి రెండు రోజులు బ్యాటింగ్‌కు బాగా అనుకూలించే ఛాన్స్ ఉంది. మ్యాచ్ గడుస్తున్న కొద్దీ పిచ్ క్రమంగా పొడిగా మారి, మూడో రోజు నుంచి స్పిన్నర్లకు సహకరిస్తుంది.దీంతో నాలుగో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లను ఎదుర్కోవడం కాస్త కష్టమవుతోంది. అయితే కొలంబోలో వాతావరణ పరిస్థితుల కారణంగా ఫస్ట్ సెషన్లో కొత్త బంతితో పేసర్లు కొంతవరకు పట్టు సాధించవచ్చు.కాగా చారిత్రాత్మక సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ (SSC) మైదానంలో టీమిండియాకు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటివరకు ఈ వేదికలో తొమ్మిది టెస్టు మ్యాచ్‌లు ఆడిన భారత్.. మూడింట విజయం, రెండింట ఓటమి పాలైంది. మరో నాలుగు మ్యాచ్‌లను డ్రాగా ముగించింది.తుది జట్లు(అంచనా)భారత్: కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, శుభమన్ గిల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, మానవ్ సుతార్, సరాంశ్ జైన్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.శ్రీలంక: లాహిరు ఉదార, కమిల్ మిషార, పసిందు సూరియబండార, కమిందు మెండిస్, ధనంజయ డి సిల్వా, నిరోషన్ డిక్వెల్లా, సోనాల్ దినుషా, కేశర నువంత, ప్రబాత్ జయసూర్య, అసిత ఫెర్నాండో, లహిరు కుమార. -
ఇలా అయితే టెస్టు, వన్డేలను మర్చిపోవడమే: చమింద వాస్
టెస్టు క్రికెట్ భవిష్యత్తుపై శ్రీలంక పేస్ బౌలింగ్ దిగ్గజం చమింద వాస్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 లీగ్‌ల హవా పెరుగుతున్న నేపథ్యంలో సాంప్రదాయ ఫార్మాట్ ఉనికిని కాపాడుకోవడానికి అన్ని దేశాల క్రికెట్ బోర్డులు ముందుకు రావాలని ఈ మాజీ పేసర్ పిలుపునిచ్చాడు. గాలే వేదికగా భారత్‌తో జరిగిన తొలి టెస్టులో శ్రీలంక ఘోర ఓటమి అనంతరం వాస్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం."టెస్ట్ క్రికెట్ రోజురోజుకు ఆదరణ కోల్పోతుంది. ఈ సుదీర్ఘ ఫార్మాట్‌కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు మనం ఏదో ఒకటి చేయాలి. ఐసీసీ, అన్ని దేశాల క్రికెట్ బోర్డులు కలిసికట్టుగా పనిచేయకపోతే టెస్ట్ క్రికెట్ పూర్తిగా కనమరుగు అవుతోంది. కేవలం టెస్టు ఫార్మాటే కాదు వన్డే క్రికెట్ పరిస్థితి కూడా అంతే. ప్రతీ క్రికెటర్ మూడు ఫార్మాట్లలోనూ రాణించలేడు.టెస్టు క్రికెట్‌కు సరిపోయే ఆటగాళ్లను గుర్తించి, వారికి సరైన గైడెన్స్ ఇవ్వాలి. దేశవాళీ క్రికెట్లో నాలుగు రోజుల మ్యాచ్‌లను పెంచాలి" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.కాగా చమిందానే కాదు సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజ క్రికెటర్లు సైతం టెస్టు క్రికెట్ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా టెస్టు క్రికెట్ ఆదరణ పెంచేందుకు ఐసీసీ 2019లో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ పేరిట సరికొత్త టోర్నీని తీసుకొచ్చింది. అయినప్పటికి ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకురావడంతో సంప్రాదాయ క్రికెట్‌ను ఆదరించే వారి సంఖ్య తగ్గుతూ వస్తోంది.చదవండి: BAN vs AUS: స్టీవ్ స్మిత్ తొండాట.. వార్నింగ్ ఇచ్చిన అంపైర్ -
‘కుల్దీప్ను హెచ్చరించా.. అది మేనేజ్మెంట్ ఇష్టం’
శ్రీలంకతో తొలి టెస్టులో భారత చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సేవలను సరిగ్గా వాడుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. గాలె వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కుల్దీప్ మొత్తంగా 25 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అయితే, పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.సారాంశ్ జైన్ అరంగేట్రం!మొత్తంగా 103 పరుగులు ఇచ్చిన కుల్దీప్ యాదవ్.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ నేపథ్యంలో కొలంబోలో జరిగే నిర్ణయాత్మక రెండో టెస్టు నుంచి అతడిని తప్పిస్తాడనే ప్రచారం జరుగుతోంది. కుల్దీప్ స్థానంలో ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ జైన్ అరంగేట్రం చేస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో రెండో టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడిన టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ కుల్దీప్ గురించి స్పందించాడు. ‘‘టెస్టు మ్యాచ్‌లో ఐదుగురు బౌలర్లను ఆడించినపుడు ఎవరో ఒకరికి తక్కువ ఓవర్లు వస్తాయి. దీనర్థం ఆ బౌలర్ సరిగ్గా ఆడటం లేదని కాదు.కుల్దీప్ను హెచ్చరించానుఎవరిని ఎప్పుడు పంపాలనేది కెప్టెన్, మేనేజ్మెంట్ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. ఒక సమయంలో ఈ బౌలర్ వద్దు అని అనుకుంటే.. అతడిని పక్కనపెట్టి వేరే వాళ్లతో బౌలింగ్ చేయిస్తారు. నేను కుల్దీప్తో మాట్లాడాను. వికెట్లు తీయాలనే తొందరతో కాకుండా.. పొదుపుగా బౌలింగ్ చేయడంపై దృష్టి పెట్టమని, అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వమని చెప్పాను’’ అని గంభీర్ పేర్కొన్నాడు.ఐదుగురు ఉంటే మంచిదేఅదే విధంగా.. ఐదుగురు బౌలర్లను ఆడించడంపై స్పందిస్తూ.. ‘‘టస్టు మ్యాచ్‌లో వెయ్యి పరుగులు చేసినా.. ఆ స్కోరుతో గెలుస్తామనే గ్యారెంటీ ఉండదు. అయితే, అదే మ్యాచ్‌లో మనం 20 వికెట్లు కూల్చినట్లయితే గెలుస్తామనే నమ్మకమైనా వస్తుంది.ఫ్లాట్ పిచ్‌లపై మాత్రం బౌలర్లు మరింత ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. మా జట్టులో ఐదుగురు ప్రాపర్ బౌలర్లు ఉండటం సానుకూలాంశం. కాబట్టి పిచ్ పరిస్థితిని బట్టి పేసర్లు, స్పిన్నర్లను మారుస్తూ ఉంటాము. ఐదుగురు బౌలర్లు ఉన్నపుడు రక్షణాత్మక ధోరణిలో కాకుండా.. ప్రభావం చూపే విధంగా ఆడటం సాధ్యమవుతుంది’’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు. కాగా శ్రీలంక- భారత్ మధ్య ఆదివారం నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. ఇందుకు కొలంబో వేదిక.చదవండి: స్మిత్ తొండాట.. అంపైర్ వార్నింగ్! -
నేను ట్రోఫీలు గెలుస్తాను.. టెస్టుల్లో ఏం తక్కువైంది?: గంభీర్
టెస్టు ఫార్మాట్లో వైఫల్యాల నేపథ్యంలో వస్తున్న విమర్శలపై టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ స్పందించాడు. తాను ట్రోఫీలు గెలిచేందుకు మాత్రమే పని చేస్తానని స్పష్టం చేశాడు. తనకు ర్యాంకులు ముఖ్యం కాదని.. జట్టు సంధి దశలో ఉన్నపుడు ఒక్కోసారి ఆశించిన ఫలితాలు రావని పేర్కొన్నాడు.ఘోర పరాభవాలుకాగా గంభీర్ మార్గదర్శనంలో టీమిండియా వైట్‌బాల్ క్రికెట్లో మంచి ఫలితాలు సాధించినప్పటికీ.. టెస్టుల్లో మాత్రం ఇప్పటికే ఘోర పరాభవాలు చవిచూసింది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో తొట్టతొలిసారి 3-0తో వైట్‌వాష్ కావడం, పాతికేళ్ల తర్వాత తొలిసారి సొంతగడ్డపై సౌతాఫ్రికా చేతిలో 2-0తో క్లీన్‌స్వీప్ కావడం ఇందులో ముఖ్యమైనవి.అయితే, ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. ఏదేమైనా గంభీర్‌పై మాత్రం విమర్శలు ఆగటం లేదు. ఇక ఇటీవల స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో టెస్టు మ్యాచ్ గెలిచిన టీమిండియా.. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉంది. ఆతిథ్య జట్టుతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో గెలిచింది.ఫైనల్ రేసులో ఉండాలంటే.. అయితే, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో ఫైనల్ రేసులో ఉండాలంటే.. శ్రీలంకపై రెండో టెస్టు కూడా గెలవడంతో పాటు.. తర్వాత న్యూజిలాండ్ గడ్డమీదా సత్తా చాటాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో శ్రీలంకతో భారత్ రెండో టెస్టుకు ముందు రెవ్‌స్పోర్ట్స్‌తో మాట్లాడిన గంభీర్.. తనపై వస్తున్న విమర్శలపై స్పందించాడు.ట్రోఫీలు గెలవడమే నా లక్ష్యం‘‘ట్రోఫీలు గెలవడమే నా లక్ష్యం. వ్యూస్, లైక్స్ కోసం నేను పనిచేయను. నా అభిప్రాయంలో ర్యాంకింగ్స్ కూడా పెద్ద విశేషమేమీ కాదు. ప్రస్తుతం మా జట్టు సంధి దశలో ఉంది. యువ ఆటగాళ్లు వస్తున్నారు. ఈ విషయం కామెంట్రీ బాక్స్, మీడియా బాక్స్‌లో కూర్చున్న వాళ్లకు కూడా తెలుసు.ఆటలో గెలుపుఓటములు, ఎత్తుపళ్లాలు సహజం. ఇంగ్లండ్‌లో గతేడాది మేము మెరుగ్గా ఆడినాము. మా ఆటలో నిలకడ ఉంది. మేము సరైన దిశలోనే వెళ్తున్నాము’’ అని గంభీర్ అన్నాడు. అదే విధంగా.. టెస్టు సిరీస్‌లో కనీసం మూడు మ్యాచ్‌లు ఉంటే బాగుంటుందని గంభీర్ అభిప్రాయపడ్డాడు. తద్వారా తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన జట్టు.. మిగిలిన రెండింటిలో ఒక్కటి గెలిచి, ఒకటి డ్రా చేసుకున్నా బాగుంటుందన్నాడు. కాగా శ్రీలంక- భారత్ మధ్య ఆదివారం నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. ఇందుకు కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదిక. ఇదిలా ఉంటే.. గంభీర్ మార్గదర్శనంలో టీమిండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025, టీ20 ప్రపంచకప్-2026 టైటిళ్లు గెలిచింది. కానీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2025 ఫైనల్‌కు మాత్రం చేరలేకపోయింది.చదవండి: స్టార్క్ సరికొత్త చరిత్ర -
పడిక్కల్‌ను తప్పిస్తారా?: భారత మాజీ కెప్టెన్ ఫైర్
టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌ను ఉద్దేశించి భారత మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఘాటు విమర్శలు చేశాడు. శ్రీలంకలో గంభీర్‌కు పనీపాటా లేకుండా పోయిందని.. అతడు అక్కడ ఉండటం దండగేనన్నాడు. కాగా రెండు టెస్టులు ఆడేందుకు టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా గాలె వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ శ్రీలంకను 165 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. తద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసులో మరో ముందుడుగు వేసింది.బారీ శతకంతో విజయానికి పునాదిఇక టీమిండియా విజయంలో దేవదత్ పడిక్కల్ కీలక పాత్ర పోషించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ శతకం (167) సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ 44 విలువైన పరుగులు జతచేశాడు. కాగా సాయి సుదర్శన్ గాయపడటం వల్లే పడిక్కల్‌కు తుదిజట్టులో చోటు సాధ్యమైంది.ఇక సాయి సుదర్శన్‌కు హెడ్‌కోచ్ గౌతం గంభీర్ మద్దతు ఉందన్న సంగతి తెలిసిందే. గతంలో వరుస మ్యాచ్‌లలో విఫలమైనప్పటికీ సుదీర్ఘకాలం పాటు.. టెస్టుల్లో వన్‌డౌన్‌లో వచ్చేది సుదర్శన్ మాత్రమేనని గంభీర్ వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో పడిక్కల్ తాజా ప్రదర్శనను ఉదాహరిస్తూ క్రిష్ణమాచారి శ్రీకాంత్ గంభీర్‌పై విరుచుకుపడ్డాడు.పడిక్కల్‌ను రీప్లేస్ చేస్తారా?.. గంభీర్‌కు పనీపాటా లేదు!తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘మొదటి టెస్టులో పడిక్కల్ 200కు పైగా పరుగులు స్కోరు చేశాడు. అయినా సరే పడిక్కల్ స్థానంలో సుదర్శన్‌ను ఆడిస్తావా గంభీర్?.. అయినా గంభీర్‌కు శ్రీలంకలో పనేమీ లేదు.శ్రీలంక జట్టు అస్సలు బాలేదు. వాళ్లపై టీమిండియా తప్పకుండా గెలుస్తుంది. ఇక ఆ తర్వాత గంభీర్ ఎగిరి గంతేస్తాడు. శ్రీలంక, అఫ్గానిస్తాన్ జట్లపై విజయానికే అతడు సంతోషిస్తాడు. నేను గంభీర్‌ను ఘాటుగా విమర్శించాలనుకోవడం లేదు.గంభీర్ మంచి ప్లేయర్.. కానీనిజానికి అతడు మంచి క్రికెటర్. ఆటను చాలా బాగా అర్థం చేసుకుంటాడు. కానీ ఇతరులతో మాట్లాడేటపుడే కాస్త ఇబ్బంది. అందుకే ఆటగాడిగా ఆకట్టుకున్నా.. కోచ్‌గా మాత్రం అతడు ఇబ్బందిపడుతున్నట్లు అనిపిస్తుంది’’ అని చిక్కా అన్నాడు. కాగా ఇటీవల స్వదేశంలో అఫ్గాన్‌తో ఒక టెస్టు మ్యాచ్ ఆడిన టీమిండియా గెలుపుజెండా ఎగురవేసింది. అయితే, అంతకు ముందు సౌతాఫ్రికా చేతిలో సొంతడ్డపై 0-2తో భారత్ వైట్‌వాష్‌కు గురైంది. పాతికేళ్ల తర్వాత ఇంతటి ఘోర పరాభవం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే.. భారత్- శ్రీలంక మధ్య ఆదివారం రెండో టెస్టు మొదలుకానుండగా.. కొలంబో ఇందుకు వేదిక.చదవండి: ఆసీస్‌ను గడగడలాడించిన షోరిఫుల్ ఇస్లాం! -
IND vs SL: ప్రాక్టీస్ కూడా చేయలేదు.. రెండో టెస్టుకు డౌటే!
శ్రీలంకతో రెండో టెస్టు నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు గురించి చర్చ జరుగుతోంది. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తప్పించి.. అతడి స్థానంలో సారాంశ్ జైన్‌ను ఆడించాలని పలువురు మాజీ క్రికెటర్లు యాజమాన్యానికి సూచిస్తున్నారు. మ్యాచ్ వేదికైన కొలంబోలో ఆఫ్ స్పిన్నర్ అవసరం ఉంటుంది గనుక సారాంశ్‌ను ఆడించడమే ఉత్తమమని మహ్మద్ కైఫ్ వంటి మాజీ ప్లేయర్లు అభిప్రాయపడుతున్నారు.అతడొక మ్యాచ్ విన్నర్ఈ నేపథ్యంలో భారత స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే మాత్రం కుల్దీప్ యాదవ్‌కు అండగా నిలిచాడు. ‘అతడు చాలా చక్కగా బౌలింగ్ చేశాడు. గాలేలోని పరిస్థితుల నేపథ్యంలో అతడి బాధ్యతలు వేరేవి. నా దృష్టిలో అతడొక మ్యాచ్ విన్నర్. మా ప్రణాళికల్లో అతడు కీలకం. ఒక్క మ్యాచ్ ద్వారానే అతడి ప్రతిభను అంచనా వేయడం సరైంది కాదు’ అని పేర్కొన్నాడు. కాగా గాలే వేదికగా జరిగిన తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 25 ఓవర్లు వేసిన కుల్దీప్ యాదవ్... 103 పరుగులు సమర్పించుకొని ఒక్క వికెట్ మాత్రమే తీశాడు.అదరగొట్టిన మానవ్మరోవైపు.. కెరీర్లో రెండో టెస్టు మ్యాచ్ ఆడిన మానవ్ సుతార్ ఏకంగా 10 వికెట్లు పడగొట్టగా... సీనియర్ రవీంద్ర జడేజా పొదుపుగా బౌలింగ్ చేస్తూ 4 వికెట్లు తీశాడు. నిజానికి శ్రీలంక స్పిన్నర్లు కూడా బంతిని గింగిరాలు తిప్పిన చోట కుల్దీప్ యాదవ్ ప్రభావం చూపలేకపోవడం గమనార్హం. ఫలితంగా ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఆట తీరుపై విమర్శలు వస్తున్నాయి.ప్రాక్టీస్ కూడా చేయలేదు.. రెండో టెస్టుకు డౌటే!ఇదిలా ఉంటే.. రెండో టెస్టు కోసం భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కుల్దీప్ యాదవ్ మైదానానికి వచ్చినప్పటికీ.. ప్రాక్టీస్ చేయకుండానే వెనుదిరిగాడు. అటు బౌలింగ్ కానీ.. ఇటు బ్యాటింగ్ కానీ ప్రాక్టీస్ చేయలేదు. మరోవైపు.. సారాంశ్ జైన్ కొన్ని ఓవర్ల పాటు బౌలింగ్ ప్రాక్టీస్ చేవాడు. ఈ నేథ్యంలో బహుతులే మాత్రం.. కుల్దీప్ విశ్రాంతి తీసుకుంటున్నాడని.. అందుకే ప్రాక్టీస్ చేయలేదని తెలపడం విశేషం. ఏదైమైనా కుల్దీప్‌నకు కోచ్ అండగా నిలిచినప్పటికీ.. కొలంబో పిచ్ పరిస్థితుల కారణంగా అతడిపై వేటు తప్పదనే సంకేతాలు ఇచ్చినట్లు అయింది.అతడి ప్రణాళికలు స్పష్టంగా ఉంటాయిఇదిలా ఉంటే.. గాలె టస్టులో ఇక తొలి టెస్టులో 10 వికెట్ల ప్రదర్శన నమోదు చేసుకున్న యువ స్పిన్నర్ మానవ్ సుతార్‌పై బహుతులే ప్రశంసలు కురిపించాడు. ‘దేశవాళీల నుంచి సుతార్‌ను గమనిస్తున్నా. అతడు చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. విభిన్న పరిస్థితుల్లో ఎలా రాణించాలో సుతార్‌కు బాగా తెలుసు. ఎలాంటి పిచ్‌పై ఎలాంటి బంతులు వేసి ఫలితం రాబట్టాలి... ఏ బ్యాటర్‌కు ఎలాంటి ఫీల్డ్ ప్లేస్‌మెంట్‌తో బౌలింగ్ చేయాలి... ఇలా అతడి ప్రణాళికలు చాలా స్పష్టంగా ఉంటాయి. దీంతో అతడు జట్టుకు అదనపు బలంగా మారాడు’ సాయిరాజ్ బహుతులే వెల్లడించాడు. కాగా శ్రీలంక- టీమిండియా మధ్య ఆదివారం (ఆగష్టు 23) నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. ఇందుకు కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదిక. చదవండి: కెరీర్ విషయంలో అర్జున్ టెండుల్కర్ కీలక నిర్ణయం! -
భారత్‌తో రెండో టెస్టు.. శ్రీలంక జట్టులోకి ఇద్దరు స్టార్ ప్లేయర్లు
కొలంబో వేదికగా ఆదివారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టుకు ముందు శ్రీలంక క్రికెట్ బోర్డు తమ జట్టులో కీలక మార్పులు చేసింది. స్టార్ బ్యాటర్లు కుశాల్ మెండిస్, పాథుమ్ నిస్సాంక గాయాల కారణంగా రెండో టెస్టుకూ దూరమయ్యారు.మరోవైపు తొలి టెస్టులో కాన్కషన్ (తలకు దెబ్బతగలడం)కు గురైన వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ చండీమల్ సైతం రెండో టెస్టుకు అందుబాటులో లేడు. దీంతో యువ బ్యాటర్ కామిల్ మిషార, ఆల్‌రౌండర్లు సహన్ అరచ్చిగెలను జట్టులో లంక సెలక్టర్లు చేర్చారు. ఇప్పటికే శ్రీలంక తరపున పరిమిత ఓవర్ల క్రికెట్లో అరంగేట్రం చేసిన అరచ్చిగె.. కొలంబో టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్లో కూడా డెబ్యూ చేసే ఛాన్స్ ఉంది. 30 ఏళ్ల సహన్‌కు ఫస్ట్ క్రికెట్లో అద్భుతమైన రికార్డు ఉంది. అరచ్చిగె ఇప్పటివరకు 85 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 4365 పరుగులతో పాటు 63 వికెట్లు పడగొట్టాడు.మరోవైపు 25 ఏళ్ల కామిల్ మిషార కూడా ఇప్పటివకే లంక తరపున వన్డే, టీ20ల్లో అరంగేట్రం చేశాడు. టాపార్డర్‌లో దూకుడుగా ఆడడం అతడి స్పెషాలిటి. అతడు సైతం ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యుత్తమ గణంకాలు సాధించాడు. ఇప్పటివరకు 49 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన మిషార..3521 పరుగులు చేశాడు. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 187గా ఉంది. కాగా గాలే వేదికగా తొలి టెస్టులో శ్రీలంక 165 పరుగుల తేడాతో చిత్తు అయిన సంగతి తెలిసిందే.రెండో టెస్టుకు శ్రీలంక జట్టు: లహిరు ఉదార, కామిల్ మిషార, పసిందు సూరియబండార, కమిందు మెండిస్ (వైస్ కెప్టెన్), ధనంజయ డి సిల్వా (కెప్టెన్), సహన్ అరచ్చిగె, సోనాల్ దినూష, నిరోషన్ డిక్వెల్లా, కేశర నువంత, ప్రభాత్ జయసూర్య, మిలన్ రత్నాయకే, లహిరు కుమార, అసిత్ ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో.చదవండి: IND vs SL: శుబ్‌మన్ గిల్ కీలక నిర్ణయం -
IND vs SL: శుబ్‌మన్ గిల్ కీలక నిర్ణయం
గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించినప్పటికి కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మాత్రం పేలవ ఆట తీరుతో నిరాశపరిచాడు. గిల్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ (16, 8) శ్రీలంక లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లోనే అవుటై నిరాశపరిచాడు. ఈ క్రమంలో లెఫ్టార్మ్ స్పిన్ వీక్నెస్ను అధిగమించేందుకు గిల్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. రెండో టెస్టు కోసం ఇప్పటికే కొలంబో చేరుకున్న భారత జట్టు తమ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టింది. రాహుల్, కుల్దీప్ వంటి సీనియర్ క్రికెటర్లు విశ్రాంతి తీసుకున్నప్పటికి గిల్ మాత్రం నెట్స్‌లో చెమట్చోడ్చాడు. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో మానవ్ సుతార్, రవీంద్ర జడేజాతో పాటు స్థానిక లెఫ్టార్మ్ స్పిన్నర్ల బౌలింగ్‌ను గిల్ సుదీర్ఘంగా ఎదుర్కొన్నాడు. గిల్ తాజా నెట్ సెషన్‌కు సంబంధించిన వివరాలను భారత స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు.భారత స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే ఆ రోజు గిల్ నెట్ సెషన్‌కు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ, ఆ కుడిచేతి వాటం బ్యాటర్ కొలంబో పరిస్థితులకు అనుగుణంగా మారడానికి ప్రయత్నిస్తున్నాడని పేర్కొన్నారు."గిల్ బ్యాటింగ్ శైలి గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు స్వేచ్ఛగా పరుగులు సాధించే బ్యాటర్. పిచ్ స్వభావం, బౌన్స్ అంచనా వేస్తూ కొలంబో పరిస్థితులకు అలవాటు పడేందుకే కాస్త ఎక్కవ సమయం నెట్స్‌లో గడిపాడు. ఇందులో ఎలాంటి ప్రత్యేకమైన ప్రణాళికలేమీ లేవు" అని బహుతులే పేర్కొన్నాడు. కాగా ఇరు జట్ల మధ్య రెండో టెస్టు కొలంబో వేదికగా ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్.. కొలంబోలోనూ గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. -
ఇప్పుడే అతడిని స్పెషల్ ప్లేయర్ అనొద్దు: శ్రీలంక క్రికెట్ దిగ్గజం
మానవ్ సుతార్ రూపంలో టీమిండియాకు అద్భుతమైన స్పిన్నర్ దొరికాడు. తన అరంగేట్ర టెస్టులో అఫ్గానిస్తాన్‌పై అదరగొట్టిన సుతార్.. తాజాగా గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో కూడా అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. మానవ్ మొత్తంగా ఈ మ్యాచ్‌లో 10 వికెట్లు పడగొట్టి భారత్‌కు కీలక విజయాన్ని అందించాడు. ఈ నేపథ్యంలో సుతార్‌పై శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్ రస్సెల్ ఆర్నాల్డ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నప్పటికీ అప్పుడే మానవ్‌ను 'స్పెషల్' బౌలర్‌గా ముద్ర వేయలేమని ఆర్నాల్డ్ అభిప్రాయపడ్డాడు. కాగా దేశవాళీ క్రికెట్లో గత కొంత కాలంగా నిలకడగా రాణిస్తుండడంతో ఈ ఏడాది అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టుకు మానవ్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఆ మ్యాచ్‌లో 6 వికెట్లు పడగొట్టి తన ఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. ఇప్పటివరకు కేవలం రెండు టెస్టులు మాత్రమే ఆడిన మానవ్.. 17 వికెట్లు పడగొట్టాడు."మానవ్‌కు అద్భుతమైన టాలెంట్ ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ అతడి ఇప్పటివరకు ఆడింది కేవలం రెండు టెస్టులే. అవి కూడా స్పిన్‌కు అనుకూలించే ఉపఖండ పరిస్థితులే. కాబట్టి ఇప్పుడే అతడిని స్పెషలిస్ట్ స్పిన్నర్ అనడం కాస్త తొందరపాటే అవుతోంది. అతడు విదేశీ కండీషన్స్ తనను తాను నిరూపించుకోవాల్సి ఉంది. అతడు మంచి కంట్రోల్‌తో బౌలింగ్ చేస్తున్నాడు. బ్యాటర్ల మైండ్ సెట్‌ను ముందుగానే రీడ్ చేస్తున్నాడు. మంచి పిచ్‌లపై కూడా పరుగులను కట్టడి చేసే సత్తా అతడికి ఉంది. గతంలో విదేశీ పర్యటనల్లో అశ్విన్ కూడా తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేస్తూ ప్రత్యర్ధి బ్యాటర్లపై ఒత్తిడి పెంచే వాడు. మానవ్ సుతార్ కూడా విదేశీ కండీషన్స్‌లో మెరుగ్గా రాణిస్తాడని ఆశిస్తున్నా" అని సోనీ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుతార్ పేర్కొన్నాడు. -
పడిక్కల్ ఎందుకు బౌలింగ్ చేశాడు.. అతడిపై వేటు తప్పదు!
శ్రీలంక పర్యటనను టీమిండియా ఘనంగా ఆరంభించింది. గాలె వేదికగా తొలి టెస్టులో ఆతిథ్య జట్టును 165 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఇక ఇరుజట్ల మధ్య ఆగష్టు 23 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. ఇందుకు కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదిక.అతడి గురించే నా ఆందోళనఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు గురించి టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సోనీ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘నేను ఓ ఆటగాడి గురించి బాగా ఆందోళన చెందుతున్నా. అతడు మరెవరో కాదు కుల్దీప్ యాదవ్.పడిక్కల్ ఎందుకు బౌలింగ్ చేశాడు?శ్రీలంకతో రెండో టెస్టులో అతడు ఆడకపోవచ్చు. తన చేతికి బంతిని ఇస్తున్నారు. కానీ లాంగ్ స్పెల్స్‌కు అవకాశం ఇవ్వడం లేదు. నిజానికి తొలి టెస్టులో బ్యాటర్, పార్ట్ టైమ్ స్పిన్నర్ దేవదత్ పడిక్కల్ ఎందుకు బౌలింగ్ చేయాల్సి వచ్చింది?ఎందుకంటే.. జట్టులో సరైన ఆఫ్ స్పిన్నర్ లేడు. కాబట్టి రెండో టెస్టులో టీమిండియా.. కుల్దీప్ యాదవ్‌ను తప్పించి ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ జైన్‌కు పిలుపునివ్వవచ్చు. ఇద్దరు లెఫ్టాండర్ బ్యాటర్లు క్రీజులో ఉన్నపుడు ఆఫ్ స్పిన్నర్‌ను రంగంలోకి దింపితే ప్రయోజనకరంగా ఉంటుంది.సారాంశ్ అరంగేట్రం పక్కాకాబట్టి కుల్దీప్ యాదవ్‌ను కాదని యాజమాన్యం సారాంశ్ జైన్ వైపు మొగ్గుచూపుతుందనిపిస్తోంది. కొలంబోలో సారాంశ్ అరంగేట్రం దాదాపు ఖాయమైపోయినట్లే’’ అని పేర్కొన్నాడు. ఈ ఒక్కటి తప్ప తుదిజట్టులో మార్పులు ఉండబోవని కైఫ్ అభిప్రాయపడ్డాడు.కాగా గాలెలో జరిగిన తొలి టెస్టులో కుల్దీప్ యాదవ్ తొలి ఇన్నింగ్స్‌లో 14 ఓవర్ల బౌలింగ్‌లో 65 పరుగులు ఇచ్చి ఒకే ఒక్క వికెట్ తీశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 11 ఓవర్లు వేసి 38 పరుగులు ఇచ్చి.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. మరోవైపు.. పడిక్కల్ లంక రెండో ఇన్నింగ్స్‌లో ఒక ఓవర్ వేసి.. ఐదు పరుగులు ఇచ్చాడు. కుల్దీప్ యాదవ్‌కే రహానే మద్దతుఇదిలా ఉంటే.. టీమిండియా మాజీ క్రికెటర్ అజింక్య రహానే మాత్రం కైఫ్‌తో విభేదించాడు. ‘‘కొలంబోలో కూడా గాలె మాదిరి పిచ్ ఉంటే.. నేను కుల్దీప్ యాదవ్‌నే ఆడించాలని చెప్తాను. అతడు అత్యద్భుతమైన నైపుణ్యాలున్న బౌలర్. మ్యాచ్ విన్నర్ కూడా. సరైన సమయంలో వికెట్లు తీయగల సత్తా అతడికి ఉంది. చాన్నాళ్ల తర్వాత అతడిని తుదిజట్టులోకి తీసుకున్నారు. మరొక్క అవకాశం ఇస్తే బాగుంటుంది’’ అని రహానే పేర్కొన్నాడు. కాగా గాలె టెస్టులో టీమిండియా ఇద్దరు సీమర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. వీరిలో కుల్దీప్ స్పెషలిస్టు స్పిన్నర్ కాగా.. జడేజా, మానవ్ ఆల్‌రౌండర్లు.గాలె టెస్టులో ఆడిన భారత తుదిజట్టుయశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.చదవండి: ‘జడేజా పనైపోయింది.. అతడితో పోల్చవద్దు’ -
లంకతో రెండో టెస్టు.. స్టార్ ప్లేయర్‌పై వేటు..?
శ్రీలంకతో రెండో టెస్టుకు భారత జట్టు సిద్ధమవుతున్న వేళ తుది జట్టులో కీలక మార్పు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఆగస్టు 23 నుంచి కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్లో ప్రారంభం కానున్న రెండో టెస్టులో మధ్యప్రదేశ్ ఆల్‌రౌండర్ సరాన్ష్ జైన్‌కు అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.33 ఏళ్ల సరాన్ష్కు ఇటీవలే భారత టెస్టు జట్టులో చోటు దక్కింది. గాయం కారణంగా వాషింగ్టన్ సుందర్ రెండో టెస్టుకు అందుబాటులో లేకపోవడంతో అతడి స్థానంలో సరాన్ష్ను జట్టులోకి తీసుకున్నారు.సరాన్ష్ కుడిచేతి ఆఫ్స్పిన్నర్తో పాటు ఎడమచేతి వాటం బ్యాటర్. 2014లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన అతడు, దశాబ్దానికి పైగా దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణించాడు. ఫస్ట్‌క్లాస్ కెరీర్లో ఇప్పటివరకు 181 వికెట్లు, 2223 పరుగులు సాధించాడు.సరాన్ష్ తుది జట్టులోకి వస్తే ఎడమచేతి స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై వేటుకు అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. గాలేలో జరిగిన తొలి టెస్టులో కుల్దీప్ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాడు. 25 ఓవర్లు వేసి 103 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ మాత్రమే సాధించాడు.మరోవైపు తొలి టెస్టులో భారత్ 165 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. భారత స్పిన్నర్ మానవ్ సుతార్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 10 వికెట్లు పడగొట్టి జట్టు విజయానికి ప్రధాన కారణంగా నిలిచాడు.ఈ నేపథ్యంలో కొలంబోలో పరిస్థితులకు అనుగుణంగా స్పిన్ విభాగాన్ని మార్చాలని భారత జట్టు యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సరాన్ష్ జైన్‌కు తుది జట్టులో చోటు దక్కితే, దాదాపు 12 ఏళ్ల దేశవాళీ ప్రస్థానం తర్వాత అతడి భారత టెస్టు అరంగేట్రం సాకారం అవుతుంది. -
కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు
గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్ 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయానికి యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (167, 44 పరుగులు), సంచలన స్పిన్నర్ మానవ్ సుతార్ (10 వికెట్లు) ప్రదర్శనలు కీలకంగా నిలిచాయి. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ కూడా బ్యాట్‌తో తమ వంతు సహకారం అందించారు.అహంకారాన్ని చోటు లేదుమ్యాచ్ అనంతరం కేఎల్ రాహుల్ చేసిన వ్యాఖ్యలు భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లోని వాతావరణాన్ని మరోసారి చర్చలోకి తెచ్చాయి. సీనియారిటీ, అనుభవం పేరుతో అహంకారానికి చోటు లేదని, ప్రతి ఆటగాడు మరొకరి నుంచి నేర్చుకోవాల్సిందేనని రాహుల్ స్పష్టం చేశాడు."ఎవరినుంచైనా నేర్చుకోవడానికి సిగ్గు ఉండకూడదు"సీనియర్ ఆటగాడిగా ప్రతి క్రికెటర్ తన సహచరుడికి సహాయం చేయాల్సిన బాధ్యత ఉందని రాహుల్ చెప్పాడు. 20 టెస్టులు ఆడిన ఆటగాడైనా, 60-70 టెస్టులు ఆడిన సీనియర్ అయినా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడంలో ఎలాంటి సంకోచం ఉండకూడదని పేర్కొన్నాడు."ఎవరినుంచైనా నేర్చుకోవడంలో సిగ్గు లేదా అహంకారం ఉండకూడదు. డ్రెస్సింగ్ రూమ్ ఎప్పుడూ అందరికీ తెరిచే ఉంటుంది. ఆటగాళ్లు ఒకరి నుంచి మరొకరు నేర్చుకుంటూనే ఉంటారు"రాహుల్ చెప్పిన ఈ మాటలు భారత జట్టులో సీనియర్-జూనియర్ అనే గోడలు లేకుండా జ్ఞానాన్ని పంచుకునే సంస్కృతి ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.జైస్వాల్ నుంచి కూడా నేర్చుకుంటాను..తన కంటే తక్కువ అనుభవం ఉన్న ఆటగాళ్ల నుంచి కూడా తాను నేర్చుకుంటున్నానని రాహుల్ ప్రత్యేకంగా చెప్పాడు. ముఖ్యంగా యశస్వి జైస్వాల్‌తో బ్యాటింగ్‌లోని కొన్ని అంశాలపై చర్చిస్తానని వెల్లడించాడు.స్వీప్, రివర్స్ స్వీప్ వంటి షాట్ల విషయంలో జైస్వాల్ ఆలోచనా విధానం తనకంటే భిన్నంగా ఉంటుందని, అందుకే అతనితో మాట్లాడి అతని అభిప్రాయాలను తెలుసుకుంటానని తెలిపాడు.సుతార్‌పై ప్రశంసలు10 వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన మానవ్ సుతార్‌ను కూడా రాహుల్ ప్రశంసించాడు.సుతార్ ఒకే ప్రాంతంలో నిలకడగా బౌలింగ్ చేస్తూ, స్వల్ప మార్పులతో బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నాడని చెప్పాడు. బంతి ఎక్కువగా టర్న్ కాకపోయినా, అదే ప్రాంతంలో పదేపదే బౌలింగ్ చేయడం ద్వారా బ్యాటర్‌పై ఒత్తిడి పెంచుతున్నాడని వివరించాడు."బౌలర్ నుంచి ఎక్కువ మార్పు కనిపించకపోతే ఏదో ఒకటి చేయాలనే ఆలోచన బ్యాటర్లో మొదలవుతుంది. ఆ మానసిక స్థితిలోకి బ్యాటర్‌ను తీసుకెళ్లగలిగితే పోరులో బౌలర్‌దే పైచేయి" అని విశ్లేషించాడు.రాహుల్ వ్యాఖ్యలు కేవలం డ్రెస్సింగ్ రూమ్‌లోని వాతావరణంపై చేసిన సాధారణ వ్యాఖ్యలు కావు. భారత క్రికెట్లో అనుభవం కంటే నేర్చుకునే మనస్తత్వం, వ్యక్తిగత ప్రతిష్ఠ కంటే జట్టు ప్రయోజనం ముఖ్యమనే సందేశాన్ని ఇస్తున్నాయి.ప్రత్యేకంగా జైస్వాల్ వంటి యువ ఆటగాళ్ల నుంచి సీనియర్లు కూడా నేర్చుకుంటున్నారని రాహుల్ స్వయంగా చెప్పడం, భారత జట్టు కొత్త తరం వైపు మారుతున్న సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లో పరస్పర గౌరవానికి ఎంత ప్రాధాన్యం ఉందో చూపిస్తోంది. భారత జట్టు భవిష్యత్తుకు ఈ సంస్కృతి మరింత కీలకం కావచ్చు. -
ఓటమి బాధలో ఉన్న శ్రీలంకకు మరో భారీ షాక్
గాలే వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఘోర ఓటమిపాలైన శ్రీలంకకు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ చండీమాల్ గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు. గాలే టెస్టు నాలుగో రోజు ఆటలో ఫీల్డింగ్ చేస్తుండగా చండీమాల్ గాయపడ్డాడు. లెగ్-సైడ్ బౌండరీ వద్ద బంతిని ఆపే ప్రయత్నంలో అతడి తలకు, భుజానికి గాయమైంది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో దినేష్ బ్యాటింగ్‌కు రాలేదు. అతడి స్ధానంలో పసిందు సూరియబండార కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు. అయితే ఐసీసీ రూల్ ప్రకారం.. కంకషన్‌కు గురైన ఆటగాడు ఖచ్చితంగా 7 రోజుల పాటు మైదానానికి దూరంగా ఉండాలి. ఈ నిబంధన కారణంగానే కొలంబో వేదికగా ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టు మ్యాచ్‌కు చండీమాల్ అందుబాటులో లేడు. ఈ విషయాన్ని గ్యారీ కిర్‌స్టన్ ధ్రువీకరించాడు. "కొలంబో టెస్టుకు దినేష్ చండీమాల్ అందుబాటులో ఉండటం లేదు. కీలక ఆటగాళ్లు దూరం కావడం జట్టుకు ఎదురు దెబ్బగానే చెప్పాలి. అయితే ఇది యంగ్ ప్లేయర్లకు మంచి అవకాశం. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మంచి రికార్డు ఉన్న ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. వారిలో ఎవరో ఒకరికి తుది జట్టులో ఛాన్స్ ఇస్తామని" కిర్‌స్టన్ పేర్కొన్నాడు. మరోవైపు తొలి టెస్టుకు దూరమైన యువ ఓపెనర్ పాథుమ్ నిస్సాంక.. కొలంబో టెస్టులో కూడా ఆడేది అనుమానమే -
వారిద్దరే మా కొంపముంచారు: శ్రీలంక కెప్టెన్
గాలే వేదికగా టీమిండియాతో జరిగిన తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో శ్రీలంక ఓటమి పాలైంది. దీంతో డబ్ల్యూటీసీ 2025-27 ఫైనల్‌కు చేరే అవకాశాలను లంక మరింత సంక్లిష్టం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 462 పరుగుల భారీ స్కోర్ సాధించింది. దేవ్‌దత్త్ పడిక్కల్(167) సెంచరీతో సత్తాచాటగా.. కేఎల్ రాహుల్(82), ధ్రువ్ జురెల్(51) అర్ధ శతకాలతో రాణించారు. అనంతరం ఆతిథ్య జట్టు తమ మొదటి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌటైంది. సోనల్ దినుష(100) వీరోచిత సెంచరీతో మెరిశాడు. మానవ్ సుతార్ 4 వికెట్ల తీసి లంక జట్టును దెబ్బ తీశాడు. ఆ తర్వాత భారత్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో ధాటిగా ఆడే క్రమంలో 193 పరుగులకు ఆలౌటైంది. కానీ తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 178 పరుగుల ఆధిక్యాన్ని జోడించి శ్రీలంకకు 372 పరుగుల టార్గెట్‌ను టీమిండియా నిర్ధేశించింది. ఈ లక్ష్య చేధనలో శ్రీలంక 206 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో కూడా మానవ్ సుతార్ ఆరు వికెట్లతో ప్రత్యర్ధి జట్టు పతనాన్ని శాసించాడు. సుతార్ ఓవరాల్‌గా 10 వికెట్లు పడగొట్టి అందరిని ఆశ్చర్యపరిచాడు.ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం లంక కెప్టెన్ ధనంజయ డి సిల్వా స్పందించాడు. రాహుల్, పడిక్కల్ నెలకొల్పిన భాగస్వామ్యమే తమ ఓటమిని శాసించందని డి సిల్వా అభిప్రాయపడ్డాడు."రెండో రోజు ఆటలో మేము పుంజుకుని పోటీలోకి తిరిగిచ్చాం. గాలేలో నాలుగో ఇన్నింగ్స్ ఆడటం అంత సులభం కాదు. అయినప్పటికి మా కుర్రాళ్లు గట్టిగానే పోరాడారు. ఈ మ్యాచ్ నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నాం. అంతేకాకుండా మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా సోనల్ దినుష అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. అతడికి మంచి భవిష్యత్తు ఉంది. మొదటి మూడు రోజులు బ్యాటింగ్‌కు పిచ్ బాగా అనుకూలించింది. టీమిండియా టాస్ గెలిచి తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ సాధించడం వారికి కలిసివచ్చింది. కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్ మంచి భాగస్వామ్యం నెలకొల్పి మాపై ఒత్తిడి పెంచారు. అనంతరం మా బ్యాటింగ్‌లో రుసగా వికెట్లు కోల్పోయి ఆరంభంలోనే వెనుకబడిపోయాం. మిడిలార్డర్లో సోనల్, నిరోషన్ భాగస్వామ్యం నెలకొల్పినప్పటికి భారత్ స్కోర్ దగ్గరకు చేరుకోలేకపోయాం. రెండో మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సమం చేసేందుకు ప్రయత్నిస్తామని" పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో డిసిల్వా పేర్కొన్నాడు. -
కోహ్లి, రోహిత్‌ను వెనక్కి నెట్టిన గిల్
శ్రీలంకపై తొలి టెస్టులో భారత్‌కు 165 పరుగుల భారీ విజయాన్నందించిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన ఖాతాలో మరో అరుదైన రికార్డును వేసుకున్నాడు. తొలి 10 టెస్టుల్లో అత్యధిక విజయాలు (6) సాధించిన భారత కెప్టెన్ల జాబితాలో విరాట్ కోహ్లి (5), రోహిత్ శర్మ (5)ను వెనక్కు నెట్టి రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో ఎంఎస్ ధోని 7 విజయాలతో అగ్రస్థానంలో ఉండగా.. గిల్, సౌరవ్ గంగూలీ (6)తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు.గిల్ కెప్టెన్సీ ప్రయాణంశుభ్మన్ గిల్ 2025లో ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌తో భారత టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఆ సిరీస్‌లో భారత్ రెండు టెస్టులు గెలిచింది. అనంతరం వెస్టిండీస్‌పై 2-0 సిరీస్ విజయం, ఆతర్వాత ఆఫ్ఘనిస్తాన్పై ఏకైక టెస్టులో విజయం సాధించాడు. తాజాగా శ్రీలంకపై గాలే టెస్టులో విజయం సాధించడంతో అతని ఖాతాలో ఆరో విజయం చేరింది.గిల్ తాజా విజయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. భారత్‌కు ఇది 600వ టెస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా గిల్ చరిత్రలో తన పేరును ప్రత్యేకంగా లిఖించుకున్నాడు.ఈ గెలుపుతో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను కూడా మెరుగుపర్చుకుంది. తొలి టెస్టుకు ముందు భారత్ PCT 48.15%గా ఉండగా, శ్రీలంకపై విజయం తర్వాత అది 53.55%కి పెరిగింది. PCT శాతం పెరిగినప్పటికీ భారత్ ఐదో స్థానంలోనే కొనసాగుతోంది. నాలుగో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్‌తో భారత్‌కు ఇంకా గణనీయమైన తేడా ఉంది.ఈ సైకిల్లో భారత్ ఫైనల్ రేసులో నిలవాలంటే మిగిలిన 8 మ్యాచ్‌ల్లో భారీగా విజయాలు సాధించాల్సి ఉంటుంది. భారత్ తదుపరి శ్రీలంకతో మరో టెస్టు, న్యూజిలాండ్‌తో రెండు టెస్టులు, ఆస్ట్రేలియాతో స్వదేశంలో ఐదు టెస్టులు ఆడాల్సి ఉంది. ఇందులో కనీసం 6 టెస్టులు గెలిస్తే భారత్‌కు ఫైనల్ చేరే అవకాశాలు బలపడతాయి.ఆధిక్యంలోకి వెళ్లిన భారత్రెండు మ్యాచ్‌ల సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటిస్తున్న భారత్ తొలి టెస్ట్ విజయంతో సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్ట్ ఆగస్టు 23న కొలంబోలో ప్రారంభం కానుంది.చెలరేగిన పడిక్కల్, సుతార్లంకపై తొలి టెస్ట్ విజయంలో దేవదత్ పడిక్కల్, మానవ్ సుతార్ కీలకపాత్రలు పోషించారు. బ్యాటింగ్‌లో పడిక్కల్ (167, 44), బౌలింగ్‌లో సుతార్ (10 వికెట్లు) చెలరేగిపోయారు. సుతార్ రెండో ఇన్నింగ్స్‌లో (6-55) అద్భుతంగా బౌలింగ్ చేసి, 372 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకను 206 పరుగులకే ఆలౌట్ అయ్యేలా చేశాడు. -
1-600: టీమిండియా టెస్టు ప్రయాణంలో విజయాలు ఎన్ని?
భారత టెస్టు క్రికెట్లో చారిత్రక మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. శ్రీలంకతో గాలె వేదికగా జరిగిన తొలి టెస్టులో ఏకంగా 165 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా తమ 600వ టెస్టును భారత్ భారీ గెలుపుతో చిరస్మరణీయం చేసుకుంది.బౌలర్ల విజృంభణకాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సీజన్లో భాగంగా రెండు మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా శ్రీలంకకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శనివారం మొదలైన తొలి టెస్టు.. బుధవారం ఆఖరి రోజు ఆటతో ముగిసింది. ఈ మ్యాచ్‌లో భారత్ విధించిన 372 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక లంక చతికిలపడింది.భారత బౌలర్ల విజృంభణ కారణంగా లక్ష్య ఛేదనలో కేవలం 206 పరుగులే చేసి ఆలౌట్ అయింది. ఇక ఈ మ్యాచ్‌లో భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ మొత్తంగా పది వికెట్లు కూల్చి లంక బ్యాటింగ్ ఆర్డర్‌ను కుదేలు చేయగా.. సెంచరీ హీరో దేవదత్ పడిక్కల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.సెంచరీ హీరో పడిక్కల్భారత తొలి ఇన్నింగ్స్‌లో వన్‌డౌన్ బ్యాటర్ పడిక్కల్ భారీ శతకం (167) బాదాడు. ఫలితంగా టీమిండియా 462 పరుగులు చేయగలిగింది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులకే చాపచుట్టేసినా.. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని లంకకు 372 పరుగుల మేర భారీ టార్గెట్ నిర్దేశించగలిగింది.ఇదిలా ఉంటే.. 1932లో టీమిండియా తన టెస్టు ప్రయాణం మొదలుపెట్టింది. మొట్టమొదట ఇంగ్లండ్‌తో ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో మ్యాచ్ ఆడింది. ప్రస్తుతం 600 మైలురాయికి చేరుకుంది. మరి ఈ టీమిండియా ప్రయాణంలో వర్షం లేదా ఇతర కారణాల వల్ల రద్దైన మ్యాచ్‌లు పోనూ మొత్తం గెలుపులు, ఓటములు ఎన్నో తెలుసా?.. ప్రతి వంద మ్యాచ్‌ల మధ్య భారత జట్టు జర్నీ ఎలా సాగిందంటే..1-600 జర్నీ సాగిందిలా..1-100: 10 విజయాలు, 40 ఓటములు, 50 డ్రా101-200: 25 విజయాలు, 32 ఓటములు, 43 డ్రా201-300: 21 విజయాలు, 26 ఓటములు, ఒకటి టై, 52 డ్రా301-400: 32 విజయాలు, 31 ఓటములు, 37 డ్రా401-500: 42 విజయాలు, 28 ఓటములు. 30 డ్రా501-600: 57 విజయాలు, 31 ఓటములు, 2 డ్రా.మొత్తం: 187 విజయాలు, 188 ఓటములు, 1 టై, 214 డ్రా.చదవండి: నిన్ను ఐపీఎల్‌కు తీసుకెళ్తా: జైస్వాల్ -
ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన లంక కెప్టెన్!
శ్రీలంక క్రికెట్ జట్టుకు సొంత గడ్డపై ఘోర పరభావం ఎదురైంది. గాలే వేదికగా టీమిండియాతో జరిగిన తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో శ్రీలంక ఓటమి పాలైంది. 372 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక ఆతిథ్య జట్టు చతకిల పడింది. భారత స్పిన్నర్ మానవ్ సుతార్ (6 వికెట్లు) ధాటికి లక్ష్య చేధనలో శ్రీలంక 206 పరుగులకే కుప్పకూలింది. లంక ఇన్నింగ్స్‌లో కెప్టెన్ ధనంజయ డి సిల్వా (59), సోనల్ దినుష (84) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఓ వైపు వికెట్లు కోల్పోతున్నప్పటికి డిసిల్వా, దినుష ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ 5వ వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే ధనంజయను రవీంద్ర జడేజా అవుట్ చేయడంతో ఆ పార్టనర్షిప్కు తెరపడింది. ఆ తర్వాత లంక వికెట్ల పతనం మళ్లీ మొదలైంది. చివరి 4 వికెట్లను కేవలం 7 పరుగుల వ్యవధిలోనే కోల్పోయి లంక ఓటమి చవిచూసింది. అయితే ఈ మ్యాచ్‌లో లంక ఓడిపోయినప్పటికి.. కెప్టెన్ డిసిల్వా మాత్రం ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ చరిత్రలో శ్రీలంక తరపున అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు చేసిన బ్యాటర్‌గా ధనంజయ నిలిచాడు. అతడికి ఇది డబ్ల్యూటీసీలో 23వ హాఫ్ సెంచరీ. తద్వారా దినేష్ చండిమాల్, దిముత్ కరుణరత్నే(22)లను డిసిల్వా అధిగమించాడు.చదవండి: నిన్ను ఐపీఎల్‌కు తీసుకెళ్తా.. సిక్సర్లు కొట్టు: జైస్వాల్ -
నిన్ను ఐపీఎల్‌కు తీసుకెళ్తా.. సిక్సర్లు కొట్టు: జైస్వాల్
శ్రీలంకతో తొలి టెస్టు సందర్భంగా టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన చర్యతో వార్తల్లో నిలిచాడు. లంక వికెట్ కీపర్ బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లాను స్లెడ్జ్ చేసి.. అతడి ఏకాగ్రతను దెబ్బతీయడంలో జైసూ సఫలమయ్యాడు. టీమిండియా బ్యాటింగ్ చేస్తున్నపుడు డిక్వెల్లా స్టెడ్జింగ్‌కు పాల్పడగా.. ఐదో రోజు ఆటలో జైస్వాల్ ఈ మేరకు ప్రతీకారం తీర్చుకున్నాడు.అసలేం జరిగిందంటే.. గాలె టెస్టులో టీమిండియా విధించిన 372 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక ఆది నుంచే తడబడింది. ఈ క్రమంలో మంగళవారం నాటి నాలుగు రోజు ఆట ముగిసేసరికి నాలుగు వికెట్లు నష్టపోయి కేవలం 84 పరుగులే చేసింది.ధనంజయ, దినుష పోరాటంఅయితే, కెప్టెన్ ధనంజయ డి సిల్వ (59), సొనాల్ దినుష (84) కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బుధవారం లంచ్‌కు ముందు రవీంద్ర జడేజా ధనంజయను అవుట్ చేయగా.. అతడి స్థానంలో నిరోషన్ డిక్వెల్లా క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో జైస్వాల్ అతడిని స్లెడ్జ్ చేశాడు.లంక రెండో ఇన్నింగ్స్‌లో భారత పేసర్ ప్రసిద్ కృష్ణ 60వ ఓవర్లో బంతితో రంగంలోకి దిగగా.. ఐదో బాల్‌కు డిక్వెల్లా రెండు పరుగులు తీశాడు. అప్పుడు స్వ్కేర్ లెగ్ ఫీల్డింగ్ పొజిషన్లో ఉన్న జైస్వాల్.. డిక్వెల్లాను మాటల్లో పెట్టాడు. వారి మధ్య సంభాషణ సాగిందిలా..The art of on-field sledging, decoded! 🗣️🔥Ajay Jadeja breaks down Yashasvi Jaiswal’s hilarious yet effective mind games that led directly to a crucial breakthrough! 🎯Watch #SLvIND 2nd Test, starting 23rd August 9 AM onwards, LIVE on Sony Sports Network TV channels & Sony… pic.twitter.com/dpTjsar1Qz— Sony Sports Network (@SonySportsNetwk) August 19, 2026నిన్ను ఐపీఎల్‌కు తీసుకెళ్తా.. సిక్సర్లు కొట్టుజైస్వాల్: కమాన్ యార్.. తొలి ఇన్నింగ్స్‌లో బాగానే షాట్లు కొట్టావు కదా.. ఇప్పుడు కూడా అలాంటిదేదో కావాలి. కమాన్..డిక్వెల్లా: అవునా?జైస్వాల్: అవును. నువ్వు షాట్లు కొడుతుంటే చూడాలనుకుంటున్నాను. చేసి చూపించు మరి. డీప్ స్క్వేర్ లెగ్ దిశగా సిక్సర్ బాదు.డిక్వెల్లా: ఆ అవసరం ఇప్పుడు లేదు. నన్ను ఐపీఎల్‌కు తీసుకువెళ్లు. అక్కడ సిక్సర్లు బాదుతా.జైస్వాల్: కచ్చితంగా వంద శాతం తీసుకెళ్తా. ఇప్పుడైతే సిక్సర్ కొట్టు. నిన్ను ఐపీఎల్‌కు తీసుకెళ్తా.డిక్వెల్లా: ధన్యవాదాలు.ఇలా డిక్వెల్లా (10)ను జైస్వాల్ స్లెడ్జ్ చేయగా.. మరుసటి బంతికే అతడు వికెట్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా 165 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసి.. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. కాగా శ్రీలంకతో తొలి టెస్టులో జైస్వాల్ తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగులు చేసి.. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు.చదవండి: శ్రీలంకను మట్టికరిపించిన టీమిండియా -
రికార్డుల మోత మోగించిన సుతార్
శ్రీలంకపై తొలి టెస్టులో భారత్ 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడంలో యువ స్పిన్నర్ మానవ్ సుతార్ కీలక పాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్‌లో (6/55) ఒకే ఓవర్లో 3 వికెట్లు తీయడంతో పాటు మ్యాచ్ మొత్తంలో 10 వికెట్లు (10/131) పడగొట్టిన అతడు, పలు రికార్డులు బద్దలు కొట్టాడు.సుతార్ బద్దలు కొట్టిన రికార్డులు* 6/55: శ్రీలంక గడ్డపై శ్రీలంకపై భారత బౌలర్ సాధించిన అత్యుత్తమ టెస్టు ఇన్నింగ్స్ గణాంకాల్లో రెండో స్థానం. రవిచంద్రన్ అశ్విన్ 6/46తో ముందున్నాడు.* 10/131: శ్రీలంకలో ఒక టెస్టు మ్యాచ్‌లో భారత బౌలర్ సాధించిన అత్యుత్తమ మ్యాచ్ గణాంకాలు.* శ్రీలంకపై టెస్టుల్లో భారత బౌలర్ సాధించిన అత్యుత్తమ మ్యాచ్ గణాంకాల్లో నాలుగో స్థానం.* సుతార్ తన కెరీర్లో 2 టెస్ట్‌లు పూర్తయ్యేసరికి 17 వికెట్లు తీసుకున్నాడు. ఈ జాబితాలో నరేంద్ర హిర్వాణి 24 వికెట్లతో, అక్షర్ పటేల్ 18 వికెట్లతో మాత్రమే సుతార్ కంటే ముందున్నారు.* శ్రీలంకపై టెస్టుల్లో ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు.రెండు టెస్టుల్లోనే 17 వికెట్లు24 ఏళ్ల సుతార్ టెస్టు కెరీర్‌కు ఇది అద్భుతమైన ఆరంభం. ఈ ఏడాది ఆఫ్ఘనిస్తాన్పై అరంగేట్రం చేసిన అతను తొలి టెస్టులోనే ఆరు వికెట్ల ప్రదర్శన చేశాడు.ఇప్పుడు శ్రీలంకపై 10 వికెట్లతో తన సత్తా చాటాడు. దీంతో కేవలం రెండు టెస్టుల్లో 17 వికెట్లు సాధించాడు. అతని బౌలింగ్ సగటు 11.35గా ఉంది. ఇప్పటివరకు రెండు ఐదు వికెట్ల ప్రదర్శనలు, ఒక 10 వికెట్ల మ్యాచ్ ప్రదర్శన నమోదు చేశాడు.ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మాత్రం పడిక్కల్కుసుతార్ అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దేవదత్ పడిక్కల్‌కు దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో పడిక్కల్ 167 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో కీలకమైన 44 పరుగులు సాధించాడు. సాయి సుదర్శన్ గాయపడటంతో జట్టులోకి వచ్చిన పడిక్కల్ తనకు లభించిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు.తాజా విజయంతో భారత్ రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్టు ఆగస్టు 23న కొలంబోలో ప్రారంభం కానుంది. -
అతడొక అద్భుతం.. భారత క్రికెట్‌ను ఏలుతాడు: గిల్
గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో టీమిండియా వెళ్లింది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో భారత్ అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 462 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఫస్ట్ డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్(167 పరుగులు) అద్భుత సెంచరీతో కదం తొక్కాడు. అనంతరం బౌలింగ్‌లో భారత స్పిన్నర్లు మ్యాజిక్ చేశారు. ముఖ్యంగా యువ స్పిన్నర్ మానవ్ సుతార్ తన బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. 4 వికెట్ల తీసి లంక జట్టును దెబ్బ తీశాడు. ఫలితంగా ఆతిథ్య జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు 178 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులకు ఆలౌటైనప్పటికి.. తొలి ఇన్నింగ్స్ లభించిన ఆధిక్యాన్ని జోడించి శ్రీలంక ముందు 372 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. ఈ లక్ష్యాన్ని చేధించలేక శ్రీలంక 206 పరుగులకు కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో మానవ్ సుతార్ తన స్పిన్ మయాజాలాన్ని ప్రదర్శించాడు. ఈ రాజస్తాన్ స్పిన్నర్ 6 వికెట్లు పడగొట్టి ఆతిథ్య జట్టు పతనాన్ని శాసించాడు. ఈ నేపథ్యంలో మానవ్ సుతార్‌పై భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ప్రశంసల వర్షం కురిపించాడు."మానవ్ ఒక అద్భుతమైన స్పిన్నర్. భారత్ తరపున తొలి మ్యాచ్(అఫ్గానిస్తాన్)లోనే తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఈ మ్యాచ్‌లో కూడా అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. అతడికి మంచి భవిష్యత్తు ఉంది. అతడు కచ్చితంగా భారత జట్టుకు సుదీర్ఘకాలం ప్రాతినిథ్యం వహిస్తాడు. పడిక్కల్ గురుంచి ప్రత్యేకంగా చెప్పాలి. అతడు రెండు ఇన్నింగ్స్‌లలోనూ అత్యుత్తమంగా రాణించాడు. అతడి బ్యాటింగ్ చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం సెంచరీ చేయడమే కాకుండా, ఆ తర్వాత కూడా బాధ్యతాయుతంగా ఆడి జట్టును మంచి పొజిషేన్‌లో నిలిపాడు. రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లను అతడు ఎదుర్కొన్న తీరు, ఆధిపత్యం చెలాయించిన విధానం మ్యాచ్ మొత్తానికే హైలైట్ అని గిల్ పేర్కొన్నాడు.అదేవిధంగా రెండో ఇన్నింగ్స్‌లో వరుసగా వికెట్లు కోల్పోవడంపై గిల్ స్పందించాడు. "వాతావరణ పరిస్థితుల వల్ల 4వ, 5వ రోజుల్లో ఎన్ని ఓవర్ల ఆట సాధ్యమవుతుందో తెలియదు. అందుకు దూకుడుగా ఆడి ప్రత్యర్ది ముందు 400కు పైగా లక్ష్యాన్ని ఉంచాలని భావించాం. ఈ క్రమంలోనే వరుసగా వికెట్లు కోల్పోయాం. దీని గురుంచి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మేము అప్పటికే మ్యాచ్‌పై పట్టు సాధించాం. ఇక . 600వ చారిత్రక టెస్టులో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. డబ్ల్యూటీసీ రేసులో ప్రతీ గెలుపు మాకు కీలకమని" శుబ్‌మన్ వ్యాఖ్యనించాడు. -
టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు సజీవం
శ్రీలంకపై తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) పాయింట్ల పట్టికలో తమ పరిస్థితిని మెరుగుపరుచుకుంది. తొలి టెస్టుకు ముందు భారత్ PCT 48.15%గా ఉండగా, శ్రీలంకపై విజయం తర్వాత అది 53.55%కి పెరిగింది. PCT శాతం పెరిగినప్పటికీ భారత్ ఐదో స్థానంలోనే కొనసాగుతోంది. నాలుగో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్‌తో భారత్‌కు ఇంకా గణనీయమైన తేడా ఉంది.ఈ సైకిల్లో భారత్ ఫైనల్ రేసులో నిలవాలంటే మిగిలిన 8 మ్యాచ్‌ల్లో భారీగా విజయాలు సాధించాల్సి ఉంటుంది. భారత్ తదుపరి శ్రీలంకతో మరో టెస్టు, న్యూజిలాండ్‌తో రెండు టెస్టులు, ఆస్ట్రేలియాతో స్వదేశంలో ఐదు టెస్టులు ఆడాల్సి ఉంది. ఇందులో కనీసం 6 టెస్టులు గెలిస్తే భారత్‌కు ఫైనల్ చేరే అవకాశాలు బలపడతాయి. అది మాత్రమే సరిపోదు. పై స్థానాల్లో ఉన్న జట్లు కూడా పాయింట్లు కోల్పోవాలి. అప్పుడే భారత్ ఫైనల్‌కు చేరుకుంటుంది.ప్రస్తుతం ఆస్ట్రేలియా 77.78 శాతం PCTతో పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. దక్షిణాఫ్రికా (75), న్యూజిలాండ్ (72.22), బంగ్లాదేశ్ (66.67) భారత్ కంటే ముందు (వరుసగా రెండు నుంచి నాలుగు) స్థానాల్లో ఉన్నాయి.శ్రీలంక పరిస్థితి మరింత క్లిష్టంభారత్ చేతిలో ఓటమితో శ్రీలంక WTC ఫైనల్ అవకాశాలు మరింత దెబ్బతిన్నాయి. శ్రీలంకకు ఇంకా 7 టెస్టులు మిగిలి ఉన్నాయి. భారత్‌తో మరో టెస్టుతో పాటు న్యూజిలాండ్, పాకిస్తాన్లలో విదేశీ సిరీస్‌లు, దక్షిణాఫ్రికాతో స్వదేశీ సిరీస్ ఆడాల్సి ఉంది.ప్రస్తుతం ఆ జట్టు 33.33 శాతం PCTతో భారత్ తర్వాత ఆరో స్థానంలో ఉంది. ఇంగ్లండ్ (24.36), పాక్ (22.22), వెస్టిండీస్ (20.83) చివరి మూడు స్థానాల్లో ఉన్నాయి. కాగా, శ్రీలంకపై తొలి టెస్ట్ గెలుపుతో భారత్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్ట్ ఆగస్ట్ 23న కొలొంబోలో ప్రారంభం కానుంది. -
శ్రీలంకను మట్టికరిపించిన టీమిండియా.. ఘన విజయం
శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆతిథ్య జట్టును ఏకంగా 165 పరుగుల తేడాతో మట్టికరిపించింది. గాలెలో 372 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక.. 206 పరుగులకే ఆలౌట్ కావడంతో టీమిండియాకు భారీ విజయం సాధ్యమైంది. యువ స్పిన్నర్ మానవ్ సుతార్ ఆరు వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ గెలుపుతో టీమిండియా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. అదే విధంగా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) 2025-27 ఫైనల్ రేసులో కీలక ముందడుగు వేసింది. కాగా రెండు టెస్టులు ఆడేందుకు టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య గాలె స్టేడియంలో శనివారం తొలి టెస్టు మొదలైంది.పడిక్కల్ సెంచరీతో..టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ భారీ శతకం (167)తో చెలరేగగా.. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం శ్రీలంకను 284 పరుగులకే కట్టడి చేసింది.అయితే, రెండో ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్ హాఫ్ సెంచరీ (66)తో రాణించగా.. భారత్ 193 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో... తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం లభించిన కారణంగా శ్రీలంక ముందు 372 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది.ధనంజయ, దినుష పోరాటంఈ నేపథ్యంలో మంగళవారం నాటి నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక నాలుగు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. టాపార్డర్‌లో ఓపెనర్లు నిశాన్ మధుష్క (6), లాహిరు ఉదార (16)తో పాటు.. అనూహ్య రీతిలో అరంగేట్రం చేసిన వన్‌డౌన్ బ్యాటర్ పసిందు సూరియబండారా (0) పూర్తిగా విఫలమయ్యాడు.సీనియర్ బ్యాటర్ కమిందు మెండిస్ (2) కూడా చేతులెత్తేశాడు. ఇలాంటి తరుణంలో కెప్టెన్ ధనంజయ డి సిల్వ, తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో సొనాల్ దినుష పట్టుదలగా నిలబడ్డారు. బుధవారం నాటి ఐదో రోజు ఆటలో హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకుని భారత బౌలర్ల సహనాన్ని వీరిద్దరు పరీక్షించారు.జడ్డూ మ్యాజిక్ఈ క్రమంలో రవీంద్ర జడేజా ధనంజయ డి సిల్వ (59)ను అవుట్ చేసి బ్రేక్ ఇవ్వగా.. ప్రసిద్ కృష్ణ నిరోషన్ డిక్వెల్లా (10)ను అవుట్ చేశాడు. దీంతో భోజన విరామ సమయానికి శ్రీలంక ఆరు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.India needed a way through, and Ravindra Jadeja found it. 🤩 Watch #SLvIND, 1st Test | Day 5, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/tCm8qzqmBb— Sony Sports Network (@SonySportsNetwk) August 19, 2026ఆరేసిన మానవ్ సుతార్అయితే, లంచ్ తర్వాత కూడా సొనాల్ దినుష పట్టువీడకుండా క్రీజులో పాతుకుపోయాడు. సెంచరీ దిశగా పయనిస్తున్న వేళ మానవ్ సుతార్ అతడికి ఊహించని షాకిచ్చాడు. 76వ ఓవర్లో తొలి బంతిని లెగ్ స్టంప్ అవుట్‌సైడ్ దిశగా సంధించగా.. షాట్ ఆడే క్రమంలో దినుష (84) విఫలమయ్యాడు. ఈ క్రమంలో ధ్రువ్ జురెల్ క్యాచ్ అందుకోగా.. టీమిండియా సంబరాలు అంబరాన్నంటాయి.Manav Suthar cleaned up the tail in a flash! ⚡Three wickets in one over to put the finishing touches on a sensational bowling effort. Watch #SLvIND, 1st Test | Day 5, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV… pic.twitter.com/LwSc4NGRW2— Sony Sports Network (@SonySportsNetwk) August 19, 2026ఇక ఆ తర్వాత మరుసటి బంతికే మానవ్ సుతార్ ప్రభాత్ జయసూర్య (0)ను బౌల్డ్ చేశాడు. తర్వాతి ఓవర్లో లాహిరు కుమార (0)ను కూడా పెవిలియన్‌కు పంపాడు. ఇక 78వ ఓవర్లో నాలుగో బంతికి కేశారా నువాంత (20)ను కూడా బౌల్డ్ చేసిన మానవ్ సుతార్ తన ఆరో వికెట్‌తో టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు.ఇక తొలి ఇన్నింగ్స్‌లో మానవ్ సుతార్ నాలుగు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. తద్వారా ఈ మ్యాచ్‌లో మొత్తంగా పది వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్. ఇదిలా ఉంటే.. టీమిండియా తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో దేవదత్ పడిక్కల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. కాగా టెస్టుక్రికెట్లో భారత్‌కు ఇది 600వ మ్యాచ్ కావడం విశేషం.శ్రీలంక వర్సెస్ భారత్ తొలి టెస్టు👉వేదిక: గాలె ఇంటర్నేషనల్ స్టేడియం, గాలె.👉టాస్: టీమిండియా.. బ్యాటింగ్సంక్షిప్త స్కోర్లు👉భారత్: 462 &193👉శ్రీలంక: 284 &206👉ఫలితం: శ్రీలంకపై 165 పరుగుల తేడాతో భారత్ జయభేరి👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: దేవదత్ పడిక్కల్ (167 & 44).చదవండి: వివాదంలో రింకూ సింగ్! -
జిడ్డులా పాతుకుపోయాడు.. జడ్డూ సెలబ్రేషన్ వైరల్!
శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా గెలుపు దిశగా మరింత పట్టు బిగించింది. గాలెలో బుధవారం నాటి ఆఖరి రోజు ఆటలో భోజన విరామ సమయానికి విజయానికి నాలుగు వికెట్ల దూరంలో నిలిచింది. కాగా ఓవర్‌నైట్ స్కోరు 84/4తో బుధవారం ఆట మొదలుపెట్టిన శ్రీలంకకు.. కెప్టెన్ ధనంజయ డి సిల్వ, సొనాల్ దినుష జోడీ ఊపిరిలూదింది. భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతూ ధనంజయ, సొనాల్ దినుష అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నారు. వీరిద్దరి జోడీని విడదీసేందుకు టీమిండియా బౌలర్లు మంగళవారం నుంచి విఫలయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే.జిడ్డులా క్రీజులో పాతుకపోగా..ఈ క్రమంలో సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా ఎట్టకేలకు ఈ పని పూర్తి చేశాడు. ధనంజయ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత కూడా జిడ్డులా క్రీజులో పాతుకపోగా.. జడ్డూ 56వ ఓవర్లో రెండో బంతిని షాట్ ఆడేలా అతడిని ఊరించాడు. ఈ క్రమంలో బ్యాట్ టాప్ ఎడ్జ్‌ను తాకిన బంతి గాల్లోకి లేవగా.. షార్ట్ ఫైన్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న మానవ్ సుతార్ క్యాచ్ పట్టాడు.జడ్డూ వైల్డ్ సెలబ్రేషన్దీంతో ధనంజయ ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. మొత్తంగా 151 బంతులు ఎదుర్కొన్న అతడు 59 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. కాగా ధనంజయ, దినుష కలిసి ఐదో వికెట్‌కు 95 పరుగులు జోడించగా.. జడ్డూ ఎట్టకేలకు ఈ జంటను విడదీసి భారీ పార్ట్‌నర్‌షిప్‌ను బ్రేక్ చేశాడు. దీంతో టీమిండియా సంబరాలు అంబరాన్నంటాయి. జడ్డూ సైతం వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇదిలా ఉంటే.. లంచ్ బ్రేక్ సమయానికి దినుష 65, కేశారా నువాంత 8 పరుగులతో ఉన్నారు. లంక విజయానికి ఇంకా 197 పరుగులు కావాలి. కాగా తొలి ఇన్నింగ్స్‌లో 178 పరుగుల ఆధిక్యం సంపాదించిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా శ్రీలంకకు 372 పరుగుల మేర భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.చదవండి: ఇదేం గేమ్‌ప్లాన్?: టీమిండియాపై విమర్శలుIndia needed a way through, and Ravindra Jadeja found it. 🤩 Watch #SLvIND, 1st Test | Day 5, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/tCm8qzqmBb— Sony Sports Network (@SonySportsNetwk) August 19, 2026 -
ఇదేం గేమ్ ప్లాన్?: టీమిండియాపై విమర్శలు
టీమిండియా- శ్రీలంక మధ్య తొలి టెస్టు తుది అంకానికి చేరుకుంది. వర్షం వల్ల గనుక అంతరాయం కలగకుంటే.. ఆటకు చివరి రోజైన బుధవారం ఫలితం తేలే అవకాశం ఉంది. కాగా భారత్ ఈ మ్యాచ్‌లో గెలవాలంటే ఆఖరి రోజు వీలైనంత త్వరగా ఆరు వికెట్లు తీయాల్సి ఉంది.టార్గెట్ 372గాలె వేదికగా శనివారం మొదలైన ఈ టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు ఆలౌట్ అయిన గిల్ సేన.. శ్రీలంకను 284 పరుగులకు కట్టడి చేసింది.తద్వారా 178 పరుగుల భారీ ఆధిక్యంతో మంగళవారం నాడు నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్.. 193 పరుగులకు ఆలౌట్ అయింది. తద్వారా శ్రీలంకకు 372 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది. ఈ క్రమంలో మంగళవారం ఆట ముగిసే సరికి లంక నాలుగు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. ఆరంభంలో లంక త్వరత్వరగా వికెట్లు కోల్పోయినప్పటికీ.. కెప్టెన్ ధనంజయ డి సిల్వ, సొనాల్ దినుష పట్టుదలగా నిలబడి ఇన్నింగ్స్ చక్కదిద్దారు.వాన వల్ల అంతరాయం కలిగితే?ఈ నేపథ్యంలో మంగళవారం ఆట సందర్భంగా టీమిండియా నాయకత్వ బృందం అనుసరించిన వ్యూహాన్ని ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే విమర్శించాడు. వర్షం ముప్పు ఉన్న ఈ మ్యాచ్‌లో భారత్‌కు ఆఖరి రోజు లంకను ఆలౌట్ చేసే అవకాశాలు తక్కువని పేర్కొన్నాడు. టీమిండియాపై విమర్శలునిజానికి రెండో ఇన్నింగ్స్‌లో కాస్త వేగంగా ఆడటం లేదంటే.. ఇన్నింగ్స్ కాస్త ముందుగానే డిక్లేర్ చేసి ఉంటే బాగుండేదని హర్ష అభిప్రాయపడ్డాడు. ‘‘నాలుగో రోజు ఆటలో ఆఖరి నలభై నిమిషాల్లో టీమిండియా వైఖరి నాకెందుకో అంతుపట్టలేదు. బ్యాటర్లు చాలా సమయం తీసుకున్నారు. కానీ స్కోరు బోర్డు మీద కావాల్సినన్ని పరుగులు జమచేయలేకపోయారు.వాతావరణం అసలే బాగాలేదు. అలాంటపుడు ఇలా చేయడం ఎంతమాత్రం సరికాదు. గ్రౌండ్ సిబ్బంది కవర్లు కప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. అయినా కూడా టీమిండియా మాత్రం నెమ్మదిగా ఆడింది’’ అని హర్షా భోగ్లే భారత జట్టు ఆట తీరును తప్పుబట్టాడు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టాడు. కాగా బుధవారం నాటి ఆటలో ధనంజయ డి సిల్వ, సొనాల్ దినుష అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నారు. డ్రింక్స్ బ్రేక్ సమయానికి శ్రీలంక విజయానికి 234 పరుగుల దూరంలో నిలిచింది.చదవండి: శుభవార్త చెప్పిన గ్లెన్ మాక్స్వెల్ -
జురెల్ క్యాచ్‌పై వివాదం
భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు టీమిండియా ఆటగాడు ధ్రువ్ జురెల్ పట్టిన ఓ క్యాచ్ వివాదానికి దారితీసింది. శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో లహిరు ఉదారాను ఔట్ చేసేందుకు అతడు తీసుకున్న లో క్యాచ్‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.శ్రీలంక ఇన్నింగ్స్‌లో 22వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. భారత స్పిన్నర్ మానవ్ సుతార్ వేసిన బంతిని ఉదారా డిఫెన్స్ చేయబోయాడు. అయితే బంతి బ్యాట్ అంచుకు తగిలి గల్లీ దిశగా వెళ్లింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న జురెల్ అద్భుతంగా కిందకు డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు.Jurel takes a stunner - Suthar gets Lahiru Udara.Jurel takes it centimeters off the turf.Third umpire Raveendra Wimalasiri says he is satisfied that the fingers are under the ball.#SLvIND #TeamIndia #Galle #SriLanka #WTC27 #LahiruUdara #DhruvJurel #ManavSuthar pic.twitter.com/v8fjQf6P3h— lightningspeed (@lightningspeedk) August 18, 2026అయితే బంతి నేరుగా జురెల్ చేతిలో పడిందా..? లేక ముందుగా నేలను తాకిందా..? అనే అనుమానం తలెత్తింది. ఫీల్డ్ అంపైర్ క్యాచ్‌ను సమీక్ష కోసం థర్డ్ అంపైర్‌కు పంపాడు.రిప్లేలలో కూడా పరిస్థితి చాలా క్లిష్టంగా కనిపించింది. బంతి జురెల్ చేతుల్లోకి వెళ్లే సమయంలో నేలను తాకినట్లు కొందరికి అనిపించగా, మరికొందరు బంతి నేలను తాకకుండానే జురెల్ క్యాచ్ పూర్తి చేశాడని వాదించారు.చివరికి థర్డ్ అంపైర్ భారత్‌కు అనుకూలంగా నిర్ణయం ఇచ్చాడు. దీంతో లహిరు ఉదారా ఔట్‌గా వెనుదిరిగాడు.అంపైర్ నిర్ణయం వెలువడిన వెంటనే సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. కొంతమంది అభిమానులు జురెల్ క్యాచ్‌ను అద్భుతమైనదిగా అభివర్ణించగా, మరికొందరు బంతి నేలను తాకిందని పేర్కొంటూ థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని ప్రశ్నించారు.లంక టార్గెట్ 372తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులు చేసిన భారత్.. శ్రీలంకను 284 పరుగులకుఆలౌట్ చేసి 174 పరుగుల ఆధిక్యం సాధించింది.రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 193 పరుగులకు ఆలౌటైంది. దీంతో శ్రీలంక ముందు 372 పరుగుల విజయలక్ష్యం నిలిచింది.విజయానికి 6 వికెట్ల దూరంలో భారత్భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక గెలవాలంటే చివరి రోజు 288 పరుగులు చేయాలి. ఇది అంతా సులువుగా జరిగే పని కాదు. భారత్ మాత్రం మరో 6 వికెట్లు తీస్తే విజయం సొంతం చేసుకుంటుంది. అయితే చివరి రోజు భారత గెలుపుకు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో సోనల్ దినుష (25), కెప్టెన్ ధనంజయ డిసిల్వ (31) క్రీజ్‌లో ఉన్నారు. -
IND vs SL: చివరి రోజు.. ఆరు వికెట్లు తీయాలి!
శ్రీలంకతో గాలె టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. భారత బౌలర్ల విజృంభణతో లంక బ్యాటర్లు ఆరంభంలోనే పెవిలియన్‌కు వరుస కట్టారు. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక కేవలం 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోవడం బ్యాటర్ల వైఫల్యానికి నిదర్శనం.తొలి ఇన్నింగ్స్ ఇలాప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సీజన్లో భాగంగా టీమిండియా రెండు మ్యాచ్‌లు ఆడేందుకు శ్రీలంకకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గాలె స్టేడియంలో శనివారం తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగి.. తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు ఆలౌట్ అయింది.టాపార్డర్‌లో ఓపెనర్ కేఎల్ రాహుల్ అర్ధ శతకం (82) సాధించగా.. వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ భారీ సెంచరీతో కదం తొక్కాడు. మొత్తంగా 230 బంతులు ఎదుర్కొని 167 పరుగులు సాధించాడు. వీరితో పాటు ఆరో నంబర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ హాఫ్ సెంచరీ (51)తో రాణించాడు.లంకను కట్టడి చేసిన భారత బౌలర్లులంక బౌలర్లలో స్పిన్నర్లలో ప్రభాత్ జయసూర్య నాలుగు వికెట్లతో విజృంభించగా.. కేశారా నువాంత మూడు వికెట్లు పడగొట్టాడు. పేసర్ అసిత ఫెర్నాండో రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం శ్రీలంక బ్యాటింగ్‌కు దిగి 284 పరుగులకు ఆలౌట్ అయింది.భారత స్పిన్నర్లలో మానవ్ సుతార్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. రవీంద్ర జడేజా మూడు, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ దక్కించుకున్నారు. పేసర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ చెరో వికెట్ కూల్చారు. దీనిని బట్టి ఓవరాల్‌గా ఇరుజట్ల తొలి ఇన్నింగ్స్‌లో స్పిన్నర్ల హవా కొనసాగిందని చెప్పవచ్చు.అయితే, రెండో ఇన్నింగ్స్‌కు వచ్చే సరికి కథ మారిపోయింది. ఈసారి పిచ్ కాస్త పేస్ బౌలర్లకు అనుకూలించగా.. లంక పేసర్లు అసిత ఫెర్నాండో, లాహిరు కుమార టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌ను కుదేలు చేశారు. అసిత నాలుగు వికెట్లు తీయగా.. కుమార రెండు వికెట్లు దక్కించుకున్నాడు. ప్రభాత్ జయసూర్యకు మూడు వికెట్లు దక్కగా.. కేశారా ఒక వికెట్ తీశాడు.ఈసారి 193 పరుగులకే ఆలౌట్లంక బౌలర్ల విజృంభణ కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులకే కుప్పకూలింది. అయితే, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 178 పరుగులు కలుపుకొని.. శ్రీలంకకు 372 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.పేసర్ సిరాజ్ నిశాన్ మధుష్క (6)ను అవుట్ చేయగా భారత్ వికెట్ల ఖాతా తెరిచింది. స్పిన్నర్ మానవ్ సుతార్ పసిందు సూరియబండారా (0), లాహిరు ఉదార (16)లను పెవిలియన్‌కు పంపగా.. మరో పేసర్ ప్రసిద్ కృష్ణ కమిందు మెండిస్ (2)ను అవుట్ చేశాడు.పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన వేళ ఇలా లంక పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన వేళ కెప్టెన్ ధనంజయ డి సిల్వతో కలిసి సొనాల్ దినుష ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు. మంగళవారం నాటి నాలుగో రోజు ఆట ముగిసే సరికి ధనంజయ 31, దినుష 25 పరుగులతో క్రీజులో నిలిచారు. ఫలితంగా లంక ఆట పూర్తయ్యేసరికి 34 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేయగలిగింది. ఇక బుధవారం ఆటకు చివరి రోజు కాగా.. లంక విజయానికి 288 పరుగుల దూరంలో ఉండగా.. చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి. కాగా బుధవారం వీలైనంత త్వరగా భారత బౌలర్లు ధనంజయ, దినుష జోడీని విడదీయాల్సి ఉంటుంది. దినుష తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ (100) చేసిన సంగతి తెలిసిందే. చదవండి: టీమిండియాకు చేదువార్త! -
టీమిండియాకు బ్యాడ్‌న్యూస్!
శ్రీలంకతో తొలి టెస్టులో పట్టు బిగిస్తున్న టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో స్టార్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ గాయపడ్డాడు. నొప్పితో విలవిల్లాడుతూ మైదానం వీడాడు. అతడి స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ ఫీల్డింగ్‌కు వచ్చాడు.ఆరంభంలోనే చెలరేగిన బౌలర్లుకాగా గాలె వేదికగా మొదటి టెస్టులో టీమిండియా శ్రీలంకకు 372 పరుగుల లక్ష్యాన్ని విధించింది. ఈ క్రమంలో ఛేదనకు దిగిన ఆతిథ్య జట్టు.. 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ నిశాన్ మధుష్క (6)ను అవుట్ చేసి సిరాజ్ వికెట్ల వేటను ఆరంభించాడు.అనంతరం స్పిన్నర్ మానవ్ సుతార్ వన్‌డౌన్‌లో వచ్చిన పసిందు సూరియబండారాను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో అతడు గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ప్రసిద్ కృష్ణ కమిందు మెండిస్ (2)ను అవుట్ చేయగా.. సుతార్ బౌలింగ్‌లో లాహిరు ఉదార (16) నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు.నిలకడగా ధనంజయ, దినుషఈ క్రమంలో కెప్టెన్ ధనంజయ డి సిల్వకు తోడైన సొనాల్ దినుష నిలకడగా ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తున్నాడు. అయితే, లంక రెండో ఇన్నింగ్స్‌లో 28వ ఓవర్లో మానవ్ సుతార్ బంతితో రంగంలోకి దిగి.. ఫ్లైటెడ్ డెలివరీని సంధించాడు. బంతి బలంగా తాకడంతోదీంతో స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో దినుష బంతిని బలంగా బాదగా.. ఫీల్డర్ జురెల్ కాళ్లకు తాకింది. అతడు నొప్పితో విలవిల్లాడగా ఫిజియో వచ్చి పరిశీలించాడు. నొప్పి తగ్గకపోవడంతో ఫిజియో సాయంతో జురెల్ మైదానాన్ని వీడగా.. సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా సర్ఫరాజ్ ఖాన్ మైదానంలోకి వచ్చాడు. కాగా గాలె వేదికగా తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జురెల్ హాఫ్ సెంచరీ (51) చేశాడు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఏడు పరుగులే చేసి అవుటయ్యాడు.ఇదిలా ఉంటే.. మంగళవారం నాటి నాలుగో రోజు ఆట పూర్తయ్యేసరికి శ్రీలంక నాలుగు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. ధనంజయ 31, దినుష 25 పరుగులతో క్రీజులో నిలిచారు. లంక గెలవాలంటే ఆటకు చివరి రోజైన బుధవారం లంకకు 288 పరుగులు అవసరం. ఇక టీమిండియా గెలవాలంటే వీలైనంత త్వరగా ఆఖరి రోజు ఆరు వికెట్లు తీయాలి.చదవండి: IND vs SL: గాలెలో అత్యధిక పరుగుల లక్ష్య ఛేదన ఎంతో తెలుసా? -
IND vs SL: గాలెలో అత్యధిక లక్ష్య ఛేదన ఎంతో తెలుసా?
శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆతిథ్య జట్టుకు 372 పరుగుల మేర మంచి లక్ష్యాన్ని విధించింది. కాగా గాలె వేదికగా భారత్- శ్రీలంక మధ్య శనివారం తొలి టెస్టు మొదలైన సంగతి తెలిసిందే.లంకకు సులువేనా?టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం శ్రీలంకను 284 పరుగులకే కుప్పకూల్చింది. ఫలితంగా టీమిండియాకు 178 పరుగుల మేర భారీ ఆధిక్యం లభించింది.అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్.. మంగళవారం నాటి నాలుగో రోజు ఆట సందర్భంగా 193 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకొని శ్రీలంక ముందు 372 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్‌లో దేవదత్ పడిక్కల్ 44, రిషభ్ పంత్ 66 పరుగులతో రాణించడంతో ఈ మేర టార్గెట్ సాధ్యమైంది. మరి టెస్టుల్లో శ్రీలంక అత్యధిక లక్ష్య ఛేదన ఎంతో తెలుసా?టెస్టుల్లో శ్రీలంక ఛేదించిన అత్యధిక లక్ష్యం ఎంతంటే?కొలంబో వేదికగా 2017లో జింబాబ్వేతో జరిగిన టెస్టులో శ్రీలంక 388 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. అంతకుముందు 2006లో కొలంబోలోనే సౌతాఫ్రికా విధించిన 352 పరుగుల టార్గెట్‌ను పూర్తి చేసింది.గాలెలో ఇంత వరకు ఏ జట్టుకూ సాధ్యం కాలేదుఅయితే, గాలెలో మాత్రం ఇప్పటి వరకు ఏ జట్టు కూడా టెస్టుల్లో 350 పరుగుల లక్ష్యాన్ని ఛేదించకపోవడం గమనార్హం. చివరగా 2022లో పాకిస్తాన్ ఆరు వికెట్లు కోల్పోయి 342 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఒకవేళ శ్రీలంక గనుక ఇప్పుడు టీమిండియా విధించిన టార్గెట్ పూర్తి చేస్తే గాలెలో అదే రికార్డు ఛేజింగ్ అవుతుంది. అయితే, లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక 21 పరుగులకే మూడు వికెట్లు ల్పోయింది. దీనిని బట్టి ఛేజింగ్ దాదాపు అసాధ్యమే అని చెప్పవచ్చు. కాగా టీమిండియా- శ్రీలంక మధ్య తొలి టెస్టుకు బుధవారం (ఆగష్టు 19) ఆటకు చివరి రోజు.చదవండి: చరిత్ర సృష్టించిన పంత్ -
సచిన్‌ను దాటేసిన పడిక్కల్
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అరుదైన రికార్డులు సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్న అతడు.. రెండో ఇన్నింగ్స్‌లోనూ కీలకమైన 44 పరుగులు చేసి భారత్‌కు విలువైన ఆధిక్యాన్ని అందించాడు. దీంతో ఈ టెస్టులో అతడి మొత్తం పరుగుల సంఖ్య 211కు చేరింది.ఈ క్రమంలో శ్రీలంక గడ్డపై ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో పడిక్కల్ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్, శిఖర్ ధవన్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, సౌరవ్ గంగూలీ, సదగోపన్ రమేశ్, చటేశ్వర్ పుజారా వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టాడు.సెహ్వాగ్ రికార్డుకు 41 పరుగుల దూరంలోశ్రీలంకలో ఒక టెస్టులో భారత బ్యాటర్ అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇప్పటికీ వీరేంద్ర సెహ్వాగ్ పేరిటే ఉంది. 2008లో గాలేలో జరిగిన టెస్టులో సెహ్వాగ్ 201 నాటౌట్, 50 పరుగులతో మొత్తం 251 పరుగులు చేశాడు. ఇప్పుడు పడిక్కల్ 211 పరుగులతో రెండో స్థానంలో నిలిచి, సెహ్వాగ్ రికార్డుకు 41 పరుగుల దూరంలో నిలిచిపోయాడు.శ్రీలంకలో ఒక టెస్టులో భారత్ తరఫున అత్యధిక పరుగులు:1. వీరేంద్ర సెహ్వాగ్ – 251, గాలే, 20082. దేవదత్ పడిక్కల్ – 211*, గాలే, 20263. శిఖర్ ధావన్ – 204, గాలే, 20174. సచిన్ టెండూల్కర్ – 203, కొలంబో, 20105. సౌరవ్ గంగూలీ – 192, కొలంబో, 1997నంబర్-3లో 200+ పరుగులు చేసిన మూడో భారత బ్యాటర్ఈ టెస్టుతో పడిక్కల్ మరో అరుదైన జాబితాలోనూ చోటు సంపాదించాడు. భారత్ తరఫున టెస్టుల్లో నంబర్-3 స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 200కుపైగా పరుగులు చేసిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు.ఈ జాబితాలో రాహుల్ ద్రవిడ్ అగ్రస్థానంలో ఉన్నాడు. ద్రవిడ్ ఈ ఘనతను మూడు సార్లు సాధించాడు. 2004లో పాకిస్థాన్‌పై రావల్పిండిలో 270 పరుగులు, 2003లో ఆస్ట్రేలియాపై అడిలైడ్‌లో 233 పరుగులు, 2002లో ఇంగ్లండ్‌పై ఓవల్‌లో 217 పరుగులు చేశాడు.సంజయ్ మంజ్రేకర్ 1989లో లాహోర్‌లో పాకిస్థాన్‌పై 218 పరుగులు చేసి ద్రవిడ్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. తాజాగా పడిక్కల్ 211 పరుగులతో మూడో స్థానంలో నిలిచాడు.పుజారాకు దక్కని రికార్డుఆసక్తికరంగా, భారత టెస్టు జట్టులో నంబర్-3 స్థానానికి ఎన్నో ఏళ్లపాటు పర్యాయపదంగా నిలిచిన చటేశ్వర్ పుజారా మాత్రం ఈ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయాడు. 2019లో ఆస్ట్రేలియాపై సిడ్నీలో పుజారా 193 పరుగులు చేశాడు. దీంతో 200 పరుగుల మార్క్‌కు ఏడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.పడిక్కల్ మాత్రం తన ఐదో టెస్ట్ మ్యాచ్‌లోనే 200కుపైగా మ్యాచ్ పరుగులు సాధించి ఈ అరుదైన రికార్డును అందుకున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. పంత్ (66) అర్ద సెంచరీతో రాణించడంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో ఓ మోస్తరు స్కోర్ (193 ఆలౌట్) చేసి, శ్రీలంక ముందు 372 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ 462 పరుగులు చేసింది. -
మ్యాచ్ మధ్యలో అరంగేట్రం చేయనున్న శ్రీలంక ప్లేయర్
భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంకకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు సీనియర్ బ్యాటర్ దినేశ్ చండిమల్ గాయంతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో యువ బ్యాటర్ పసిందు సూరియబండారాను కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది.నాలుగో రోజు ఆటలో నాలుగో ఓవర్ ముగిసే సమయంలో చండిమల్ గాయపడ్డాడు. బౌండరీని అడ్డుకునే ప్రయత్నంలో డైవ్ చేసిన అతడు ప్రమాదకరంగా కిందపడటంతో కుడి భుజం, మెడ ప్రాంతంలో గాయమైంది. నొప్పితో అతడు మైదానంలోనే మెడను పట్టుకుని కొంతసేపు పడుకున్నాడు.వెంటనే జట్టు ఫిజియో, వైద్యుడు అతడిని పరీక్షించారు. అనంతరం స్కానింగ్ కోసం ఆసుపత్రికి తరలించారు. పరీక్షల్లో ఎలాంటి అంతర్గత గాయం కనిపించలేదని శ్రీలంక క్రికెట్ వెల్లడించింది. అయితే కంకషన్ కారణంగా మిగిలిన టెస్టుకు చండిమల్ అందుబాటులో ఉండడని తెలిపింది.సూరియబండారా అరంగేట్రంచండిమల్ స్థానంలో వచ్చిన 26 ఏళ్ల పసిందు సూరియబండారాకు ఇదే తొలి టెస్ట్ మ్యాచ్. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అతడికి మంచి రికార్డు ఉంది. 68 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 54.36 సగటుతో 14 సెంచరీలు సాధించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. పంత్ (66) అర్ద సెంచరీతో రాణించడంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో ఓ మోస్తరు స్కోర్ (193 ఆలౌట్) చేసి, శ్రీలంక ముందు 372 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.ఈ ఇన్నింగ్స్‌లో పంత్‌తో పాటు కేఎల్ రాహుల్ (35), దేవదత్ పడిక్కల్ (44) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. లంక బౌలర్లలో అశిత ఫెర్నాండో 4, ప్రభాత్ జయసూర్య 3, లహీరు కుమార 2, కేశర నువంత ఓ వికెట్ పడగొట్టారు.అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌటైంది. సోనల్ దినుష (100) అద్భుత సెంచరీతో కదంతొక్కడంతో ఆ జట్టు ఈమాత్రం స్కోరైనా చేయగలిగింది. దినుషకు నిరోషన్ డిక్వెల్లా (80) సహకరించాడు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ 4, రవీంద్ర జడేజా 3 వికెట్లతో సత్తా చాటారు.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ (167) సూపర్ సెంచరీతో కదంతొక్కగా.. కేఎల్ రాహుల్ (82), ధృవ్ జురెల్ (51) అర్ద సెంచరీలతో రాణించారు. లంక బౌలర్లలో జయసూర్య 4, నువంత 3, అశిత ఫెర్నాండో 2 వికెట్లు తీశారు. -
చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్
భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ టెస్ట్ క్రికెట్లో అరుదైన ఘనతలు సాధించాడు. ఈ ఫార్మాట్లో 100 సిక్సర్లు బాదిన తొలి భారత ఆటగాడిగా, ప్రపంచంలోనే అత్యంత వేగంగా (89 ఇన్నింగ్స్‌లు) ఈ ఘనత సాధించిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ నాలుగో రోజు పంత్ (రెండో ఇన్నింగ్స్‌లో) ఈ మైలురాళ్లను అందుకున్నాడు.గిల్‌క్రిస్ట్ రికార్డు బద్దలుపంత్కు ముందు టెస్ట్‌ల్లో అత్యంత వేగంగా 100 సిక్సర్లు పూర్తి చేసిన రికార్డు ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ పేరిట ఉండేది. గిల్‌క్రిస్ట్ 130 ఇన్నింగ్స్‌ల్లో 100 సిక్సర్లు పూర్తి చేశాడు.100 సిక్సర్లు పూర్తి చేసిన నాలుగో బ్యాటర్పంత్తో కలిపి టెస్ట్ క్రికెట్లో ఇప్పటివరకు నలుగురు బ్యాటర్లు మాత్రమే 100 సిక్సర్ల మార్క్‌ను అందుకున్నారు.బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్) – 138 సిక్సర్లుబ్రెండన్ మెకల్లమ్ (న్యూజిలాండ్) – 107 సిక్సర్లుఆడమ్ గిల్‌క్రిస్ట్ (ఆస్ట్రేలియా) – 100 సిక్సర్లురిషబ్ పంత్ (భారత్) – 100 సిక్సర్లుపంత్ ఫిఫ్టిఈ ఇన్నింగ్స్‌లో పంత్ 69 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 66 పరుగులు చేశాడు. పంత్ ఇన్నింగ్స్ కారణంగా భారత్ రెండో ఇన్నింగ్స్‌లో ఓ మోస్తరు స్కోర్ (193 ఆలౌట్) శ్రీలంక ముందు 372 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.భారత రెండో ఇన్నింగ్స్‌లో పంత్‌తో పాటు కేఎల్ రాహుల్ (35), దేవదత్ పడిక్కల్ (44) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. లంక బౌలర్లలో అశిత ఫెర్నాండో 4, ప్రభాత్ జయసూర్య 3, లహీరు కుమార 2, కేశర నువంత ఓ వికెట్ పడగొట్టారు.అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌటైంది. సోనల్ దినుష (100) అద్భుత సెంచరీతో కదంతొక్కడంతో ఆ జట్టు ఈమాత్రం స్కోరైనా చేయగలిగింది. దినుషకు నిరోషన్ డిక్వెల్లా (80) సహకరించాడు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ 4, రవీంద్ర జడేజా 3 వికెట్లతో సత్తా చాటారు.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ (167) సూపర్ సెంచరీతో కదంతొక్కగా.. కేఎల్ రాహుల్ (82), ధృవ్ జురెల్ (51) అర్ద సెంచరీలతో రాణించారు. లంక బౌలర్లలో జయసూర్య 4, నువంత 3, అశిత ఫెర్నాండో 2 వికెట్లు తీశారు. -
IND vs SL: భారత్ ఆలౌట్.. శ్రీలంక లక్ష్యం ఎంతంటే?
శ్రీలంకతో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు నామమాత్రంగా రాణించారు. ఫలితంగా టీమిండియా 193 పరుగులకే ఆలౌట్ అయింది. వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ 44 పరుగులతో రాణించగా.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ అర్ధ శతకం (66)తో ఆకట్టుకున్నాడు.శ్రీలంక లక్ష్యం ఎంతంటే?మిగిలిన వారిలో ఓపెనర్ కేఎల్ రాహుల్ ఫర్వాలేదనిపించాడు. అయితే, తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం లభించిన కారణంగా.. శ్రీలంక ముందు 372 పరుగుల లక్ష్యాన్ని విధించగలిగింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సీజన్లో భాగంగా టీమిండియా శ్రీలంకతో రెండు మ్యాచ్‌లు ఆడుతోంది.తొలి ఇన్నింగ్స్ ఇలాఈ క్రమంలో గాలె వేదికగా ఇరుజట్ల మధ్య శనివారం తొలి టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. దేవదత్ పడిక్కల్ భారీ శతకం (167) సాధించగా.. ఓపెనర్ కేఎల్ రాహుల్ (82), ధ్రువ్ జురెల్ (51) హాఫ్ సెంచరీలతో అలరించారు. మిగిలిన వారిలో యశస్వి జైస్వాల్ 32, రిషభ్ పంత్ 39 పరుగులతో ఫర్వాలేదనిపించారు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 462 పరుగులు చేసింది.భారీ ఆధిక్యంతో..అనంతరం బ్యాటింగ్ మొదలుపెట్టిన శ్రీలంక.. 284 పరుగులకు ఆలౌట్ అయింది. స్పిన్నర్లలో మానవ్ సుతార్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. రవీంద్ర జడేజా మూడు, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టారు. పేసర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ తలా ఒక వికెట్ కూల్చారు.భారత బౌలర్లు లంకను నామమాత్రపు స్కోరుకే పరిమితం చేయడంతో.. భారత్‌కు 178 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా.. మంగళవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా 193 పరుగులకు ఆలౌట్ అయింది.హాఫ్ సెంచరీతో అదరగొట్టిన పంత్ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ డకౌట్ కాగా.. కేఎల్ రాహుల్ 35 పరుగులు చేయగలిగాడు. పడిక్కల్ (44), పంత్ (66)రాణించగా.. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (8), ధ్రువ్ జురెల్ (7), రవీంద్ర జడేజా (9), మానవ్ సుతార్ (9), కుల్దీప్ యాదవ్ (5), ప్రసిద్ కృష్ణ (2) సింగిల్ డిజిట్ స్కోర్లు నమోదు చేశారు.Rishabh Pant walks back after a typically flamboyant half-century. 🚶➡️ Watch #SLvIND, 1st Test | Day 4, LIVE NOW on Sony Sports Network channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/uBBiHTvsS8— Sony Sports Network (@SonySportsNetwk) August 18, 2026శ్రీలంక బౌలర్లలో పేసర్ అసిత ఫెర్నాండో నాలుగు వికెట్లతో చెలరేగగా.. స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య మూడు వికెట్లు దక్కించుకున్నాడు. లాహిరు కుమార రెండు, కేశార నువాంత ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.చదవండి: బంగ్లాదేశ్ చేతిలో ఓటమి.. అతడిపై వేటు వేసిన సీఏ -
నీకసలు ఏమైంది?.. బలహీనత మరోసారి బయటపడింది!
శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ పూర్తిగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 16 పరుగులు చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. తాజాగా రెండో ఇన్నింగ్స్‌లోనూ నిరాశపరిచాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా గిల్ ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.రెండు టెస్టులు ఆడేందుకు టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గాలె వేదికగా ఇరుజట్ల మధ్య శనివారం తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. మొదటి ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు ఆలౌట్ అయింది.ఆ ముగ్గురూ రాణించారుఓపెనర్ కేఎల్ రాహుల్ (82), ఆరో నంబర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (51) అర్ధ శతకాలతో రాణించగా.. వన్‌డౌన్‌లో వచ్చిన దేవదత్ పడిక్కల్ భారీ సెంచరీ (167)తో ఆకట్టుకున్నాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో గిల్.. 28 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్ల సాయంతో కేవలం 16 పరుగులు చేశాడు.రెండుసార్లూ అతడి చేతిలోనే అవుట్లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో లాహిరు ఉదారకు క్యాచ్ ఇచ్చి గిల్ పెవిలియన్ చేరాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఈ నాలుగో నంబర్ బ్యాటర్.. 20 బంతులు ఎదుర్కొని కేవలం 8 పరుగులే చేయగలిగాడు. ఈసారి కూడా ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లోనే అవుటయ్యాడు. వికెట్ల ముందు దొరికిపోయి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.ఇలా అయితే కష్టమేఈ నేపథ్యంలో గిల్ ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. స్పిన్ బౌలింగ్‌లోనే రెండుసార్లు అతడు విఫలమయ్యాడని.. గిల్ బలహీనత మరోసారి బయటపడిందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా గిల్ స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంపై దృష్టి పెట్టకపోతే తిప్పలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కాగా గిల్ చివరగా జూన్‌లో స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో సెంచరీ (126) బాదాడు. ఇదిలా ఉంటే.. శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌట్ కాగా.. టీమిండియాకు మంచి ఆధిక్యం లభించింది. మంగళవారం నాటి నాలుగో రోజు ఆట సందర్భంగా లంచ్ బ్రేక్ సమయానికి భారత్.. నాలుగు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. -
భారత్‌కు భారీ ఆధిక్యం
గాలే: శ్రీలంకతో తొలి టెస్టులో భారత జట్టు విజయావకాశాన్ని సృష్టించుకుంది. అయితే మూడు రోజుల పాటు మ్యాచ్‌ను వెంటాడుతూ ప్రభావం చూపించిన వర్షం మరో రెండు రోజులు కూడా ఇబ్బంది పెట్టవచ్చు. గరిష్టంగా 196 ఓవర్లు పడే అవకాశం ఉండగా, రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ఎన్ని పరుగులు చేసి లక్ష్యాన్ని నిర్దేశిస్తుందనేది ఆసక్తికరం. మ్యాచ్ మూడో రోజు సోమవారం శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 79.4 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా భారత్‌కు 178 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. సోనాల్ దినుషా (168 బంతుల్లో 100; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించగా, నిరోషన్ డిక్వెలా (115 బంతుల్లో 80; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. ఒకదశలో లంక 90/5 వద్ద కష్టాల్లో ఉండగా వీరిద్దరు ఆరో వికెట్‌కు 36.1 ఓవర్లలో 146 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్‌కు 4, జడేజాకు 3 వికెట్లు దక్కాయి. భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 13 ఓవర్లు ఆడాల్సి ఉన్నా... వెలుతురులేమి వల్ల ఆట సాధ్యం కాలేదు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 460/9తో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ మరో 4 బంతులాడి తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు ఆలౌటైంది. భారీ భాగస్వామ్యం...తొలి సెషన్లోనే శ్రీలంకపై భారత్ సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శిస్తూ ఐదు వికెట్లతో దెబ్బ కొట్టింది. లంక ఇన్నింగ్స్‌లో రెండో బంతికే మదుషంక (0)ను అవుట్ చేసి సిరాజ్ శుభారంభం అందించాడు. సుతార్ తన తొలి బంతికే చండీమల్ (4)ను వెనక్కి పంపించాడు. కొద్దిసేపు క్రీజ్‌లో నిలిచిన ఉడారా (44 బంతుల్లో 27; 6 ఫోర్లు) వికెట్ కూడా సుతార్ ఖాతాలోకే చేరింది. ఆ తర్వాత కొద్దిసేపటికే కమిందు మెండిస్ (14)ను కుల్దీప్, ధనంజయ డిసిల్వా (21)లను జడేజా పెవిలియన్ పంపించి తామూ వికెట్ల ఖాతా తెరిచారు. భారత బౌలర్ల జోరు చూస్తూ లంక కుప్పకూలడానికి ఎంతోసేపు పట్టదనిపించింది. లంచ్ సమయానికి స్కోరు 99/5 కాగా, ఆ తర్వాత డిక్వెలా, దినుషా ద్వయం ఆతిథ్య జట్టును గట్టెక్కించింది. 20 పరుగుల వద్ద డిక్వెలా ఇచి్చన క్యాచ్‌ను స్లిప్‌ను రాహుల్ వదిలేయడం కూడా కలిసొచ్చింది. అనంతరం డిక్వెలా, దినుషా అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. టీ విరామానంతరం ఎట్టకేలకు ఈ జోడీని విడదీయడంలో భారత్ సఫలమైంది. ప్రసిధ్ బౌలింగ్‌లో డిక్వెలా వెనుదిరగ్గా, తక్కువ వ్యవధిలో లంక మరో రెండు వికెట్లు చేజార్చుకుంది. మరోవైపు పట్టుదలగా ఆడిన దినుషా 167 బంతుల్లో తన తొలి శతకాన్ని అందుకున్నాడు. అయితే అదే స్కోరు వద్ద దినుషా ఆట ముగియగా, మరో పది పరుగులకు లంక ఆలౌటైంది.స్కోరు వివరాలుభారత్ తొలి ఇన్నింగ్స్: 462; శ్రీలంక తొలి ఇన్నింగ్స్: మదుషంక (సి) పడిక్కల్ (బి) సిరాజ్ 0; ఉడారా (సి) జైస్వాల్ (బి) సుతార్ 27; చండీమల్ (సి) పంత్ (బి) సుతార్ 4; కమిందు (సి) గిల్ (బి) కుల్దీప్ 14; ధనంజయ (సి) రాహుల్ (బి) జడేజా 21; దినుషా (ఎల్బీ) (బి) జడేజా 100; డిక్వెలా (సి) పంత్ (బి) ప్రసిధ్ 80; నువాంతా (సి) గిల్ (బి) జడేజా 2; జయసూర్య (సి) జురేల్ (బి) సుతార్ 10; కుమార (స్టంప్డ్) పంత్ (బి) సుతార్ 10; ఫెర్నాండో (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (79.4 ఓవర్లలో ఆలౌట్) 284. వికెట్ల పతనం: 1–0, 2–27, 3–53, 4–59, 5–90, 6–236, 7–243, 8–274, 9–274, 10–284. బౌలింగ్: సిరాజ్ 9–3–29–1, ప్రసిధ్ 14–0–47–1, సుతార్ 21.4–1–76–4, కుల్దీప్ 14–0–65–1, జడేజా 21–5–57–3.350: జడేజా 350 వికెట్ల మైలురాయిని దాటాడు. భారత్ తరఫున కుంబ్లే, అశ్విన్, కపిల్, హర్భజన్ తర్వాత ఈ ఘనత సాధించిన ఐదో బౌలర్‌గా జడేజా నిలిచాడు. బోథమ్, కపిల్, వెటోరి తర్వాత టెస్టుల్లో 350కి పైగా వికెట్లు, 4 వేలకు పైగా పరుగులు చేసిన నాలుగో ఆల్‌రౌండర్‌గా జడేజా నిలవడం విశేషం. -
టీమిండియాపై వీరోచిత సెంచరీ.. ఎవరీ సోనల్ దినూష?
గాలే వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక యువ బ్యాటర్ సోనల్ దినూష అద్భుతమైన పోరాట పటిమ కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 90 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన దినుష తన వీరోచిత సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ఈ యంగ్ బ్యాటర్ డిక్వెల్లతో కలిసి 6వ వికెట్‌కు 146 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 25 ఏళ్ల దినుషకు ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ. ఈ క్రమంలో సోనాల్ దినూషకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.17 ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఎంట్రీ👉సోనాల్ దినూష కేవలం 17 ఏళ్లకే కొలంబో క్రికెట్ క్లబ్ తరఫున ఫస్ట్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. 2018లో అరంగేట్రం చేసిన అతడు ఇప్పటివరకు 68 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌లలో సోనాల్ 45.09 సగటుతో 3,698 పరుగులు చేశాడు. ఇందులో 11 సెంచరీలు, 19 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతేకాకుండా దినుష బంతితో కూడా మ్యాజిక్ చేయగలడు. లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా అతడు ఫస్ట్ క్రికెట్లో ఇప్పటివరకు 133 వికెట్లు పడగొట్టాడు.👉కొలంబో క్రికెట్ క్లబ్ తరఫున మేజర్ లీగ్ టోర్నీలో దినూష ఓ అరుదైన రికార్డును సాధించాడు. ఓపెనింగ్ బ్యాటర్‌గా, ఓపెనింగ్ బౌలర్‌గా బరిలోకి దిగి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అతడు అదరగొట్టాడు. మ్యాచ్ మొత్తంలో 11 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు.👉ఆతర్వాత సౌతాఫ్రికా వేదికగా జరిగిన అండర్ 19 ప్రపంచకప్-2026లో శ్రీలంక జట్టులో దినుష భాగమయ్యాడు. ఈ టోర్నీలో ఆల్‌రౌండర్‌గా తన సేవలను అందించాడు. లోయార్డర్‌లో వచ్చి మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడడం అతడి స్పెషాలిటీ.👉దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తుండడంతో గతేడాది జాన్‌లో శ్రీలంక జాతీయ జట్టు సెలక్టర్ల నుంచి దినూషకు పిలుపువచ్చింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌పై టెస్టు అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత వెస్టిండీస్ టూర్లో కూడా భాగమయ్యాడు. ఇప్పటివరకు కేవలం 4 టెస్టులు మాత్రమే ఆడిన దినుష.. 57.2 సగటుతో 286 పరుగులు చేశాడు. అదేవిధంగా 6 వికెట్లు సాధించాడు.👉సోనాల్ దినూష ప్రతిష్టాత్మక మహానామ కాలేజీలో విధ్యను అభ్యసించాడు. ఈ కాలేజీకి శ్రీలంక క్రికెట్ చరిత్రలో ఓ ప్రత్యేకమైన స్ధానముంది. ఈ కళశాలలో చదివిన చాలా మంది విద్యార్థులు శ్రీలంక జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.ప్రస్తుత లంక టెస్ట్ కెప్టెన్ ధనంజయ డి సిల్వా కూడా ఈ కాలేజీకి చెందినవాడే కావడం గమనార్హం. -
284 పరుగులకు శ్రీలంక ఆలౌట్.. భారత్‌కు భారీ ఆధిక్యం
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. తొలుత బ్యాటింగ్‌లో సత్తాచాటిన టీమిండియా.. అనంతరం బౌలింగ్‌లోనూ అదరగొట్టింది. భారత బౌలర్లు రాణించడంతో శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌటైంది. దీంతో గిల్ సేనకు తొలి జట్టులో 178 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. మూడో రోజు ఆటలో తమ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన శ్రీలంకకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ నిషాన్ ఫెర్నాండోను మొదటి ఓవర్లోనే పేసర్ సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత భారత స్నిన్నర్లు రంగంలోకి దిగారు. మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, జడేజాలతో కూడిన స్పిన్ త్రయం శ్రీలంక బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టారు. దీంతో ఆతిథ్య జట్టు కేవలం 90 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.సోనల్ అద్భుత సెంచరీఈ సమయంలో జట్టును యువ బ్యాటర్ సోనల్ దినూష, నిరోషన్ డిక్వెల్లా అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో ఆదుకున్నారు. దినుష 167 బంతుల్లో తన తొలి టెస్టు సెంచరీని పూర్తి చేసుకోగా.. డిక్వెల్లా 80 పరుగులు చేసి ఔటయ్యాడు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 146 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే డిక్వెల్లా ఔటయ్యాక లంక వికెట్ల పతనం మళ్లీ మొదలైంది. లోయార్డర్ బ్యాటర్లు ఎవరూ రాణించలేకపోయారు. దినుష(100) కూడా సరిగ్గా సెంచరీ చేసి ఔటయ్యాడు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా మూడు, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ తలా వికెట్ సాధించారు. కాగా ప్రతికూల వాతవారణం కారణంగా మూడో రోజు ఆట 13 ఓవర్ల ముందే ముగిసిపోయింది. మంగళవారం నాలుగో రోజు ఆట పదిహేను నిమిషాల ముందు ఆరంభం కానుంది. -
రవీంద్ర జడేజా అరుదైన రికార్డు.. కపిల్ దేవ్ సరసన
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆటలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. జడ్డూ తన టెస్ట్ కెరీర్లో 350వ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా టెస్టు క్రికెట్లో 4,000 వేల పరుగులతో పాటు 350 వికెట్లు సాధించిన నాలుగో ఆల్‌రౌండర్‌గా జడేజా నిలిచాడు. ఈ జాబితాలో అతడి కంటే ముందు కపిల్ దేవ్(5,248 రన్స్, 434 వికెట్లు), డానియల్ వెట్టోరి(4,531 రన్స్, 362 వికెట్లు), ఇయాన్ బోథమ్ (5,200, 383 వికెట్లు) వంటి దిగ్గజ క్రికెటర్లు ఉన్నారు. జడేజా ఇప్పటివరకు టెస్టుల్లో 4,108 పరుగులతో పాటు 350 వికెట్లు సాధించాడు. అదేవిధంగా టెస్టుల్లో 350 వికెట్ల ఘనతను అందుకున్న ఐదో భారత బౌలర్‌గా జడేజా నిలిచాడు. అనిల్ కుంబ్లే(619), రవిచంద్రన్ అశ్విన్(537), కపిల్ దేవ్(434), హార్బజన్ సింగ్(417) వంటి లెజెండరీ ప్లేయర్లు ఈ జాబితాలో ఉన్నారు. అలాగే టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌గా జడ్డూ భాయ్ కొనసాగుతున్నాడు. అత్యధిక వికెట్లు తీసిన ఎడమచేతి వాటం స్పిన్నర్లు వీరే433 - రంగన హెరాత్362 - డేనియల్ వెటోరి350* - రవీంద్ర జడేజా297 - డెరెక్ అండర్వుడ్271 - తైజుల్ ఇస్లాం -
IND vs SL: చరిత్ర సృష్టించిన శ్రీలంక జోడి
టీమిండియాతో తొలి టెస్టులో శ్రీలంక తిరిగి పుంజుకుంది. సోమవారం నాటి మూడో రోజు ఆట సందర్భంగా బ్యాటింగ్‌కు దిగిన లంక జట్టు.. 99 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఓపెనర్లలో నిశాన్ ఫెర్నాండో డకౌట్ కాగా.. లాహిరు ఉదార 27 పరుగులు చేయగలిగాడు. వన్‌డౌన్ బ్యాటర్ దినేశ్ చండిమాల్ (4), కమిందు మెండిస్ (14) విఫలం కాగా.. కెప్టెన్ ధనంజయ డి సిల్వ 21 పరుగులకే పెవిలియన్ చేరాడు.ఈ క్రమంలో 99 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన శ్రీలంకను ఆరో నంబర్ బ్యాటర్ సొనాల్ దినుష, వికెట్ కీపర్ బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లా కలిసి ఆదుకున్నారు. వీరిద్దరూ పట్టుదలగా నిలబడి భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారారు.అయితే, ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో రిషభ్ పంత్‌కు క్యాచ్ ఇవ్వడంతో డిక్విల్లా ఇన్నింగ్స్‌కు తెరపడింది. మొత్తంగా 115 బంతులు ఎదుర్కొన్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఏడు ఫోర్ల సాయంతో 80 పరుగులు సాధించాడు. సొనాల్ దినుషతో కలిసి ఆరో వికెట్‌కు 146 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.ఈ క్రమంలో సొంతగడ్డ మీద టీమిండియాతో టెస్టుల్లో ఆరో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా సొనాల్ దినుష- నిరోషన్ డిక్వెల్లా చరిత్ర సృష్టించారు. ఇంతకు ముందు ఈ రికార్డు ఏంజెలో మాథ్యూస్, కుశాల్ పెరీరా పేరిట ఉండేది. ఇదిలా ఉంటే.. దినుష సెంచరీ చేసి అవుటయ్యాడు.స్వదేశంలో భారత్‌తో టెస్టుల్లో ఆరో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన శ్రీలంక జోడీలు1. సొనాల్ దినుష- నిరోషన్ డిక్వెల్లా- 146 పరుగులు2. ఏంజెలో మాథ్యూస్- కుశాల్ పెరీరా- 135 పరుగులు3. దినేశ్ చండిమాల్- లాహిరు తిరిమన్నె- 125 పరుగులు4. మహేళ జయవర్దనె- హషాన్ తిలకరత్నె- 95 పరుగులు5. టీఎల్ దిల్షాన్- ప్రసన్న జయవర్దనె- 91 పరుగులు. -
టెస్ట్ క్రికెట్లో అరుదైన రికార్డు
శ్రీలంక వికెట్‌కీపర్ బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లా టెస్ట్ క్రికెట్లో అరుదైన రికార్డును కొనసాగిస్తున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో ఒక్క సెంచరీ కూడా లేకుండానే కెరీర్‌ను అప్రతిహతంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు 55 టెస్ట్‌లు ఆడిన అతడు.. 23 అర్ద సెంచరీల సాయంతో 2837 పరుగులు చేసి జట్టులో కొనసాగుతున్నాడు.ప్రస్తుతం భారత్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో (తొలి ఇన్నింగ్స్) డిక్వెల్లా మరోసారి సెంచరీకి చేరువలో ఔట్ కావడంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఏ స్పెషలిస్ట్ బ్యాటర్ ఇన్ని మ్యాచ్‌లు ఆడి సెంచరీ లేకుండా మనుగడ సాగించలేదు. డిక్వెల్లాకు మాత్రమే ఇది సాధ్యమైంది.సెంచరీ లేకుండానే టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఘనత దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ (3154) పేరిట ఉన్నప్పటికీ.. అతడు స్పెషలిస్ట్ బ్యాటర్ కాదు. అతడు తన అత్యుత్తమ లెగ్ స్పిన్ బౌలింగ్‌కు తోడుగా ఈ పరుగులు సాధించాడు. ఈ రికార్డుకు సంబంధించి వార్న్ తర్వాతి స్థానంలోనే డిక్వెల్లా కొనసాగుతున్నాడు.ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో సెంచరీ లేకుండానే టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా డిక్వెల్లా చలామణి అవుతున్నాడు. అతడి తర్వాతి స్థానంలో మిచెల్ స్టార్క్ (106 టెస్ట్‌ల్లో (2497) ఉన్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. డిక్వెల్లా సెంచరీ చేయకుండానే ఔటైనప్పటికీ శ్రీలంక పరువు కాపాడాడు. సోనల్ దినుషాతో (86 నాటౌట్) కలిసి ఆరో వికెట్‌కు 146 పరుగులు జోడించి తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. 90 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన శ్రీలంకను డిక్వెల్లా-దినుషా కలిసి ఆదుకున్నారు. వీరిద్దరూ ప్రతిఘటించడంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది.ప్రస్తుతం దినుషాకు జతగా ప్రభాత్ జయసూర్య (0) క్రీజ్‌లో ఉన్నాడు. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు శ్రీలంక ఇంకా 212 పరుగులు వెనుకపడి ఉంది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగుల భారీ స్కోర్ చేసింది. దేవదత్ పడిక్కల్ (167) భారీ శతకంతో సత్తా చాటాడు. కేఎల్ రాహుల్ (82), ధృవ్ జురెల్ (51) అర్ద సెంచరీలతో రాణించారు. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత్ శ్రీలంకలో పర్యటిస్తుంది. -
బాధపడొద్దు జడ్డూ.. ఇంకా చాలా టైమ్ ఉంది: సర్ఫరాజ్
గాలే వేదికగా భారత్-శ్రీలంక మధ్య తొలి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. 460/9 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా కేవలం అదనంగా రెండు పరుగులు మాత్రమే చేసి తమ ఇన్నింగ్స్‌ను ముగించింది. భారత బ్యాటర్లలో దేవ్‌దత్త్ పడిక్కల్(167) భారీ సెంచరీతో కదం తొక్కగా.. ధ్రువ్ జురెల్(51), కేఎల్ రాహుల్(82) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు.అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన శ్రీలంకకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. మూడో రోజు ఆట తొలి సెషన్లో మన స్పిన్నర్ల ధాటికి లంక టాపార్డర్ కుప్పకూలింది. ముఖ్యంగా మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్‌లను ఎదుర్కోనేందుకు లంక బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు.ఓపెనర్ నిషాన్ ఫెర్నాండోను మొదటి ఓవర్లోనే పేసర్ సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేయగా.. ఆ తర్వాత మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్‌లు రంగంలోకి దిగారు. లహిరు ఉదార, చండీమాల్ను అద్భుతమైన బంతులతో సుతార్ బోల్తా కొట్టించాడు. కుల్దీప్ కూడా కమిందు మెండీస్‌ను ఔట్ చేసి తన వికెట్ల ఖాతాను తెరిచాడు. కానీ మరో వెటరన్ స్పిన్నర్ రవీంద్ర జడేజాను మాత్రం 19వ ఓవర్ వరకు కెప్టెన్ గిల్ ఎటాక్‌లోకి తీసుకు రాలేదు.ఈ క్రమంలో జడేజాలో ఉత్సాహం నింపేందుకు సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ సర్ఫరాజ్ ఖాన్, వికెట్ కీపర్ రిషభ్ పంత్ తమదైన శైలిలో సరదా వ్యాఖ్యలు చేశారు. ఇంకా చాలా సమయం ఉంది జడ్డూ భాయ్.. వికెట్లు అందరికి దక్కుతాయి అని సర్ఫరాజ్ అన్నాడు. కాసేపటికే 20 ఓవర్ వేసేందుకు జడ్డూను కెప్టెన్ తీసుకొచ్చాడు. దీంతో ఇక చూసుకోండి.."జడ్డూ భాయ్ కత్తి తిప్పడం ఖాయం" అంటూ పంత్ ఆటపట్టించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా పంత్, సర్ఫరాజ్ అన్నట్లు జడ్డూ కాసేపటికే దనుంజయ డిసిల్వాను అవుట్ చేసి తొలి వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.90 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన శ్రీలంకను సోనల్ దినూష(62 నాటౌట్), నిరోషన్ డిక్వెల్లా(76) ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 134 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో 58 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది.𝐄𝐧𝐭𝐞𝐫𝐭𝐚𝐢𝐧𝐦𝐞𝐧𝐭. 𝐄𝐧𝐭𝐞𝐫𝐭𝐚𝐢𝐧𝐦𝐞𝐧𝐭. 𝐄𝐧𝐭𝐞𝐫𝐭𝐚𝐢𝐧𝐦𝐞𝐧𝐭.… Aur Rishabh Pant 𝐄𝐧𝐭𝐞𝐫𝐭𝐚𝐢𝐧𝐦𝐞𝐧𝐭 hai! 🍿 Watch #SLvIND, 1st Test, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/WTqAvJdvVM— Sony Sports Network (@SonySportsNetwk) August 17, 2026 -
IND vs SL: రెండంటే రెండే పరుగులు.. ఇదేం వ్యూహం?
గాలె వేదికగా శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్లు అదరగొట్టారు. ఆట మొదలైన తొలి రోజు నుంచే ప్రత్యర్థిపై ఆధిపత్యం కనబరిచారు. ఫలితంగా మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 462 పరుగులు చేయగలిగింది.పడిక్కల్ భారీ శతకంఇందులో వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్‌ది కీలక పాత్ర. ఈ కర్ణాటక స్టార్ మొత్తంగా 230 బంతులు ఎదుర్కొని 167 పరుగులు చేశాడు. ఇందులో 15 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఇక పడిక్కల్ భారీ శతకానికి తోడు.. ఓపెనర్ కేఎల్ రాహుల్ (82), ఆరో నంబర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ హాఫ్ సెంచరీ (51)లతో ఆకట్టుకున్నారు.వాన వల్ల అంతరాయంమిగిలిన వారిలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 32, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ 39, ఆల్‌రౌండర్ మానవ్ సుతార్ 24 పరుగులతో ఫర్వాలేదనిపించారు. ఇదిలా ఉంటే.. ఆదివారం నాటి రెండో రోజు ఆటకు పదే పదే వర్షం అంతరాయం కలిగించింది. ఈ క్రమంలో కేవలం 43 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కాగా.. రెండో రోజు ఆట పూర్తయ్యే సమయానికి భారత్ తొమ్మిది వికెట్ల నష్టానికి 460 పరుగులు చేసింది.ఇక సోమవారం నాటి మూడో రోజు ఆట సందర్భంగా ఓవర్‌నైట్ స్కోరుకు కేవలం మరో రెండు పరుగులు జతచేసి.. 462 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ టీమిండియా నాయకత్వ బృందం నిర్ణయాన్ని తప్పుబట్టాడు.ఎందుకిలా చేశారు?‘‘మూడో రోజు ఉదయం ఇద్దరు టెయిలెండర్లను బ్యాటింగ్‌కు పంపాల్సిన అవసరం ఏముంది? మీరు ఎందుకిలా చేశారు?’’ అని హెడ్‌కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ శుబ్‌మన్ గిల్లను ఎక్స్ వేదికగా దొడ్డ గణేశ్ ప్రశ్నించాడు. కాగా రెండో రోజు పటిష్ట స్థితిలో నిలిచిన టీమిండియా ఆట ముగిసే సమయానికి ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తుందని అంతా భావించారు.అయితే, మూడోరోజు ఆట ఆరంభంలో భారత టెయిలెండర్లు కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ బ్యాటింగ్‌కు వచ్చి.. తమ ఓవర్‌నైట్ స్కోరుకు తలా ఒక పరుగు చేశారు. కుల్దీప్ 13 పరుగులతో అజేయంగా నిలవగా.. ప్రసిద్ రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పదో వికెట్‌గా వెనుదిరిగాడు.బౌలర్లకు మరింత ఉపయోగకరంగా ఉండేదినిజానికి రెండో రోజే టీమిండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ఉంటే.. సోమవారం ఉదయమే లంక బ్యాటింగ్‌కు దిగేది. అప్పుడు పిచ్ పరిస్థితులను భారత బౌలర్లు మరింత సద్వినియోగం చేసుకునే వారని.. దొడ్డ గణేశ్ అభిప్రాయపడ్డాడు. టెయిలెండర్లతో సమయం వృథా చేయకుండా.. ముందుగానే డిక్లేర్ చేసి బాగుండేదని పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉంటే.. భోజన విరామ సమయానికి శ్రీలంక 28 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 99 పరుగులే చేసింది. భారత బౌలర్లలో సిరాజ్ ఒకటి.. మానవ్ సుతార్ రెండు, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా చెరో వికెట్ దక్కించుకున్నారు.చదవండి: పంత్ చేయలేనిది.. బట్లర్ చేశాడు.. సంతోషం -
ఒంటిచేత్తో గిల్ స్టన్నింగ్ క్యాచ్.. షాకైన ఫ్యాన్స్!
శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అద్భుత క్యాచ్‌తో మెరిశాడు. గాలె వేదికగా సోమవారం నాటి మూడో రోజు ఆట సందర్భంగా.. ఒంటిచేత్తో గాల్లోకి ఎగిరి బంతిని ఒడిసిపట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.462 ఆలౌట్ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా భారత్- శ్రీలంక మధ్య శనివారం తొలి టెస్టు మొదలైన సంగతి తెలిసిందే. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 462 పరుగులు చేసింది. మూడో రోజు 460/9 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట మొదలుపెట్టిన భారత్.. మరో రెండు పరుగులు జతచేసి ఆలౌట్ అయింది.అనంతరం శ్రీలంక బ్యాటింగ్‌కు దిగగా.. భారత బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. ఓపెనర్లలో నిశాన్ ఫెర్నాండోను మహ్మద్ సిరాజ్ డకౌట్ చేయగా.. లాహిరు ఉదార (27)నున మానవ్ సుతార్ పెవిలియన్‌కు పంపాడు. వన్‌డౌన్‌లో వచ్చిన దినేశ్ చండిమాల్ (4) వికెట్‌ను కూడా మానవ్ తన ఖాతాలో వేసుకున్నాడు.Left hand, full stretch, absolute stunner from Shubman Gill! 🥵 Watch #SLvIND, 1st Test, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/xe2ldGxkpJ— Sony Sports Network (@SonySportsNetwk) August 17, 2026ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ఇక కమిందు మెండిస్ నిలకడగా ఆడే ప్రయత్నం చేయగా.. గిల్ ఊహించని రీతిలో అతడిని పెవిలియన్‌కు పంపాడు. లంక ఇన్నింగ్స్‌లో 17వ ఓవర్లో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బంతితో రంగంలోకి దిగాడు. కుల్దీప్ వేసిన ఫుల్ లెంగ్త్ డెలివరీని మెండిస్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా ఎక్స్ ట్రా కవర్ మీదుగా షాట్ బాదాడు. ఇంతలో తన ఫీల్డింగ్ పొజిషన్ నుంచి ఎడమవైపునకు డైవ్ చేసిన గిల్.. ఒంటిచేత్తో బంతిని అందుకున్నాడు.షాక్‌లో మెండిస్, అభిమానులుఈ క్రమంలో అదుపు తప్పి నేల మీద పడిపోయినప్పటికీ బంతిని మాత్రం చేజారనివ్వలేదు గిల్. దీంతో కమిందు మెండిస్‌తో పాటు..స్టేడియంలో ఉన్న శ్రీలంక అభిమానులు సైతం నోరెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయారు. ఇదిలా ఉంటే.. సోమవారం నాటి మూడో రోజు ఆటలో భోజన విరామ సమయానికి శ్రీలంక.. 28 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది.లంక ఓపెనర్లలో నిశాన్ ఫెర్నాండో డకౌట్ కాగా.. లాహిరు ఉదార 27 పరుగులు చేశాడు. దినేశ్ చండిమాల్ (4) నిరాశపరచగా.. కమిందు మెండిస్ 14, కెప్టెన్ ధనంజయ డి సిల్వ 21 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో పేసర్ మహ్మద్ సిరాజ్ ఒక వికెట్ తీయగా.. స్పిన్నర్లలో మానవ్ సుతార్ రెండు, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా తలా ఒక వికెట్ పడగొట్టారు.చదవండి: పంత్ చేయలేనిది.. బట్లర్ సాధించాడు.. సంతోషంThat was a blinder from Shubman Gill to dismiss Kamindu Mendis.. 👏👏 #SLVIND pic.twitter.com/Dl9BrLSpJQ— Nibraz Ramzan (@nibraz88cricket) August 17, 2026 -
చెలరేగిన భారత బౌలర్లు.. శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు
శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. ఆది నుంచే వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టారు. ఫలితంగా భోజన విరామ సమయానికి శ్రీలంక సగం వికెట్లు కోల్పోయి కేవలం 99 పరుగులే చేయగలిగింది.కాగా గాలె వేదికగా 460/9 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టిన భారత్.. మరో రెండు పరుగులు జోడించి (462) ఆలౌట్ అయింది. అనంతరం శ్రీలంక బ్యాటింగ్‌కు దిగగా ఆది నుంచే భారత బౌలర్లు చుక్కలు చూపించారు. Early breakthrough for Team India! 💥Mohammed Siraj strikes with just the second ball.Watch #SLvIND, 1st Test | Day 3, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #SLvIND #MohammedSiraj #BeautifulGameOfTestCricket pic.twitter.com/zHSQOGD0jj— Sony Sports Network (@SonySportsNetwk) August 17, 2026సిరాజ్ మొదలు పెట్టగా..ఓపెనర్లలో నిశాన్ ఫెర్నాండోను పేసర్ మహ్మద్ సిరాజ్ డకౌట్ చేయగా.. లాహిరు ఉదార 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్పిన్నర్ మానవ్ సుతార్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.మానవ్ సుతార్‌కు రెండుఇక వన్‌డౌన్‌లో వచ్చిన దినేశ్ చండిమాల్ (4)ను స్వల్ప స్కోరుకే మానవ్ పెవిలియన్‌కు పంపాడు. కమిందు మెండిస్ (14) కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో ఇచ్చిన క్యాచ్‌ను కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అద్భుత రీతిలో ఒడిసిపట్టగా.. లంక నాలుగో వికెట్ కోల్పోయింది.Manav Suthar lures Chandimal into the edge, and Rishabh Pant makes no mistake behind the stumps! 🧤 Watch #SLvIND, 1st Test | Day 3, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #SLvIND #BeautifulGameOfTestCricket pic.twitter.com/Dsy7xz9Ciw— Sony Sports Network (@SonySportsNetwk) August 17, 2026ఇక కెప్టెన్ ధనంజయ డి సిల్వ (21) రవీంద్ర జడేజా బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌కు ఊహించని రీతిలో క్యాచ్ ఇచ్చి ఐదో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో సోమవారం లంచ్ బ్రేక్ సమయానికి శ్రీలంక 28 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 99 పరుగులే చేసింది. సొనాల్ దినుష 14, నిరోషన్ డెక్విల్లా 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కంటే లంక ఇంకా 363 పరుగులు వెనుకబడి ఉంది. ఇదిలా ఉంటే.. తొలి సెషన్లో భారత స్పిన్నర్లు మానవ్, కుల్దీప్, జడేజా కలిసి నాలుగు వికెట్లు పడగొట్టడం విశేషం.చదవండి: పంత్ చేయలేనిది.. బట్లర్ చేశాడు.. సంతోషం -
భారత్ పరుగుల జోరు
గాలె: శ్రీలంకతో తొలి టెస్టులో భారత్ జోరు కొనసాగుతోంది. తొలి రోజు ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని మంచి పునాది వేసుకున్న టీమిండియా... రెండో రోజు దాన్ని మరింత బలపరుచుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 288/2తో ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్... రెండో రోజు ఆట ముగిసే సమయానికి 116 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 460 పరుగులు చేసింది. వర్షం కారణంగా రెండో రోజు 43 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. సెంచరీ హీరో దేవదత్ పడిక్కల్ (230 బంతుల్లో 167; 15 ఫోర్లు, 1 సిక్స్) క్రితం రోజు స్కోరుకు మరో 36 పరుగులు జోడించి అవుట్ కాగా... ధ్రువ్ జురేల్ (68 బంతుల్లో 51; 4 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో మెరిశాడు. గాయం నుంచి కోలుకొని బ్యాటింగ్‌కు వచ్చిన కేఎల్ రాహుల్ (175 బంతుల్లో 82; 10 ఫోర్లు, 1 సిక్స్) మరో ఐదు పరుగులే చేశాడు. రిషభ్ పంత్ (39), మానవ్ సుతార్ (24) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. కుల్దీప్ యాదవ్ (12 బ్యాటింగ్), ప్రసిధ్ కృష్ణ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 4 వికెట్లు పడగొట్టగా... కుషారా నువాంతా 175 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుండగా... మూడో రోజు ఇక్కడ బ్యాటింగ్ మరింత కష్టం కానుంది. ఆదుకున్న జురేల్... భారీ వర్షం కారణంగా ఆదివారం రెండు సెషన్ల ఆట తుడిచిపెట్టుకుని పోయింది. మధ్యాహ్నం తర్వాత మైదానం ఆటకు అనుకూలంగా మారగా... తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు లంక మెరుగ్గా బౌలింగ్ చేసింది. పంత్ ఎక్కువసేపు నిలవలేకపోగా... కండరాలు పట్టేయడంతో తొలి రోజు మైదానాన్ని వీడిన రాహుల్ క్రీజులోకి వచ్చాడు. బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై అతడు అదనపు బౌన్స్‌కు దొరికిపోయాడు. 12 పరుగుల వ్యవధిలో వీరిద్దరూ వెనుదిరగగా... ఈ దశలో జురేల్ సంయమనం పాటించాడు. మరో ఎండ్‌లో పడిక్కల్ 150 పరుగుల మార్క్ దాటగా... జురేల్ వేగంగా ఆడాడు. భారీ ఇన్నింగ్స్ అనంతరం పడిక్కల్ స్టంపౌట్ కాగా... రవీంద్ర జడేజా (13) విఫలమయ్యాడు. అయినా వీలు చిక్కినప్పుడల్లా షాట్లు ఆడుతూ జురేల్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. మానవ్తో కలిసి ఏడో వికెట్‌కు 55 పరుగులు జోడించాడు. అర్ధశతకం అనంతరం ధనంజయ డిసిల్వా పట్టిన చక్కటి క్యాచ్‌కు జురేల్ పెవిలియన్ చేరాడు.స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (రనౌట్) 32; రాహుల్ (సి) ఫెర్నాండో (బి) కేషారా 82; పడిక్కల్ (స్టంప్డ్) డిక్వెల్లా (బి) ప్రభాత్ జయసూర్య 167; గిల్ (సి) లహిరు (బి) ప్రభాత్ జయసూర్య 16; పంత్ (సి) దినుషా (బి) కేషారా 39; జురేల్ (సి) ధనంజయ డిసిల్వా (బి) ప్రభాత్ జయసూర్య 51; జడేజా (ఎల్బీ) (బీ) కేషారా 13; మానవ్ సుతార్ (సి) లహిరు (బి) ప్రభాత్ జయసూర్య 24; సిరాజ్ (సి) ధనంజయ డిసిల్వా (బి) ఫెర్నాండో 11; కుల్దీప్ (బ్యాటింగ్) 12; ప్రసిధ్ (బ్యాటింగ్) 1; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (116 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి) 460. వికెట్ల పతనం: 1–47, 2–236, 3–307, 4–319, 5–357, 6–377, 7–432, 8–447, 9–447. బౌలింగ్: అషిత ఫెర్నాండో 17–1–61–1; లహిరు కుమార 13–1–76–0; కేషారా నువాంతా 39–1–175–3; ప్రభాత్ జయసూర్య 39–6–109–4; ధనంజయ డిసిల్వా 4–0–15–0; సోనల్ దినుషా 4–0–17–0. -
IND vs SL: ఒంటి చేత్తో క్యాచ్.. బిత్తర పోయిన భారత బ్యాటర్! వీడియో
గాలే వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో శ్రీలంక కెప్టెన్ ధనుంజయ డిసిల్వా సంచలన క్యాచ్‌తో మెరిశాడు. రెండో రోజు ఆటలో ధనుంజయ అద్భుతమైన క్యాచ్‌తో భారత వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్‌ను పెవిలియన్‌కు పంపాడు. భారత ఇన్నింగ్స్ 110వ ఓవర్లో స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య తొలి బంతిని.. జురెల్‌కు ఫ్లైటెడ్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని జురెల్ ఆన్-సైడ్ వైపు ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ టాప్ ఎడ్జ్ తీసుకుని ఫస్ట్ స్లిప్ దిశగా వెళ్లింది. ఈ సమయంలో ఫస్ట్ స్లిప్‌లో ఉన్న డిసిల్వా కుడివైపునకు డైవ్ చేస్తూ ఒంటి చేత్తో అసాధరణ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన ప్రతీ ఒక్కరు బిత్తర పోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. సూపర్ మేన్‌లా అందుకున్నాడని నెటిజన్లు అతడిని ప్రశంసిస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 460 పరుగుల భారీ స్కోర్ సాధించింది. క్రీజులో ప్రసిద్ద్ కృష్ణ(1), కుల్దీప్ యాదవ్(12) ఉన్నారు.భారత బ్యాటర్లలో దేవ్‌దత్త్ పడిక్కల్(167) భారీ సెంచరీతో కదం తొక్కగా.. ధ్రువ్ జురెల్(51), కేఎల్ రాహుల్(82) అర్ధ శతకాలతో రాణించారు. లంక బౌలర్లలో ప్రభాత్ జైసూర్య నాలుగు, నువాంత మూడు వికెట్లు సాధించారు.చదవండి: ఏంటి బ్రో.. కాస్త వెనక ముందు చూసుకోవాలి కాదా?BLINDER ALERT!🚨 No way Dhananjaya de Silva just pulled that off! 😮💨Watch #SLvIND 1st Test Day 2, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/EUDB6GJyja— Sony Sports Network (@SonySportsNetwk) August 16, 2026 -
'ఇక అతడి రీఎంట్రీ కష్టమే.. అందరూ మర్చిపోండి'
టీమిండియా యువ బ్యాటర్ సాయి సుదర్శన్ గాయం కారణంగా శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌కు తొలుత ఎంపిక చేసిన 15 మంది సభ్యుల భారత జట్టులో సెలక్టర్లు చోటు కల్పించారు. కానీ బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు ఫిట్నెస్ క్లియరన్స్ లభించకపోవడంతో అతడిని జట్టు నుంచి తప్పించారు. అయితే సాయి సుదర్శన్ అందుబాటులో లేకపోవడంతో మరో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ దేవ్‌దత్త్ పడిక్కల్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కింది. ఈ కర్ణాటక బ్యాటర్ దాదాపు రెండేళ్ల తర్వాత తనకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. గాలే వేదికగా జరుగుతన్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో పడిక్కల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. మూడో స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పడిక్కల్ 230 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 167 పరుగులు చేసి మేనెజ్మెంట్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ క్రిష్ణమచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పడిక్కల్ సత్తాచాటడంతో సుదుర్శన్కు తిరిగి భారత జట్టులో చోటు దక్కడం కష్టమే అని అతడు అభిప్రాయపడ్డాడు."భారత టెస్ట్ జట్టులో సాయి సుదర్శన్ స్ధానం ప్రమాదంలో పడింది. కీలకమైన మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పడిక్కల్ భారీ సెంచరీతో కదం తొక్కాడు. పడిక్కల్ తన రీ-ఎంట్రీని గ్రాండ్‌గా చాటుకున్నాడు. ఈ అద్భుత ప్రదర్శనతో టెస్టుల్లో మూడో స్థానాన్ని పడిక్కల్ దాదాపు ఖాయం చేసుకున్నట్లే. ఒకవేళ సాయిసుదర్శన్ ఫిట్నెస్ సాధించినా తిరిగి భారత జట్టులోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు. అద్భుత ఫామ్‌లో ఉన్న పడిక్కల్‌ను కూడా పక్కన పెట్టే సాహసం సెలక్టర్లు చేయలేరు. ఒకవేళ సుదర్శన్ రీఎంట్రీ ఇచ్చినా తుది జట్టులో చోటు దక్కడం మాత్రం కష్టమే" అని శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.సుదీర్ఘకాలం నంబర్-3 స్థానంలో రాణించిన ఛతేశ్వర్ పుజారా వైదొలిగిన తర్వాత ఆ స్థానంలో భారత్ పలు ప్రయోగాలు చేసింది. కొన్నాళ్ల పాటు శుబ్‌మన్ గిల్ ఆ స్థానంలో రాణించగా, ఆ తర్వాత కరుణ్ నాయర్ లాంటి ఆటగాళ్లను కూడా మేనేజ్మెంట్ పరిశీలించింది. కానీ ఇప్పుడు పడిక్కల్ రూపంలో టీమిండియాకు నంబర్-3 స్థానంలో సరైన ఆటగాడు దొరికినట్లయింది.చదవండి: IND vs SL: ముగిసిన రెండో రోజు ఆట.. భారీ స్కోర్ సాధించిన భారత్ -
ముగిసిన రెండో రోజు ఆట.. భారీ స్కోర్ సాధించిన భారత్
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 9 వికెట్ల నష్టానికి 460 పరుగుల భారీ స్కోర్ సాధించింది. వర్షం కారణంగా రెండో రోజు కేవలం 43 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఆట ఆరంభంలో పంత్(39) కాస్త దూకుడుగా ఆడినప్పటికి ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. కాగా తొలి రోజు ఆటలో కండరాల గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన కేఎల్ రాహుల్.. రెండో రోజు బ్యాటింగ్‌కు వచ్చాడు. కానీ అతడు ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయాడు. 82 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రాహుల్ పెవిలియన్‌కు చేరాడు. వరుస వికెట్లు పడుతున్నప్పటికి సెంచరీ హీరో దేవ్‌దత్త్ పడిక్కల్ మాత్రం తన ఏకాగ్రతను కోల్పోలేదు. ఆచితూచి ఆడుతూ ధ్రువ్ జురల్‌తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. అయితే 167 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పడిక్కల్ అనుహ్యంగా స్టంపౌటయ్యాడు. ఆ తర్వాత వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ జట్టును ఇన్నింగ్స్‌ను నడిపించే భాధ్యతను తీసుకున్నాడు. ఈ క్రమంలో జురెల్ 66 బంతుల్లో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను పూర్తి చేసుకున్నాడు. అయితే రెండో రోజు ఆట ఆఖరిలో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న జురెల్(51), మానవ్ సుత్తార్(24) వరుస ఓవర్లలో ఔటయ్యాడు.ప్రాక్టీస్ మ్యాచ్‌లో సిక్సర్లతో సత్తాచాటిన మహ్మద్ సిరాజ్.. గాలే టెస్ట్‌లో కూడా తన బ్యాట్‌కు పనిచెప్పే ప్రయత్నం చేశాడు. కానీ 15 బంతుల్లో ఒక సిక్సర్‌తో 11 పరుగులు చేసి సిరాజ్ ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో ప్రసిద్ద్ కృష్ణ(1), కుల్దీప్ యాదవ్(12) ఉన్నారు. శ్రీలంక బౌలర్లలో స్పిన్నర్ ప్రభాత్ జైసూర్య నాలుగు వికెట్లు పడగొట్టగా.. కేశర నువాంత 3 వికెట్లు సాధించాడు. -
లంక గడ్డపై 'పడిక్కల్' రికార్డుల మోత.. రాహుల్ ద్రవిడ్ సరసన!
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత యువ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్ భారీ సెంచరీతో కదం తొక్కాడు. కీలకమైన మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పడిక్కల్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఓ దశలో తన తొలి డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకునేలా కనిపించిన పడిక్కల్.. అనుహ్యంగా స్టంపౌటయ్యాడు.మొత్తంగా ఈ కర్ణాటక బ్యాటర్ 230 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 167 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో పడిక్కల్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. శ్రీలంకపై టెస్టుల్లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 150 ప్లస్ స్కోరు సాధించిన మూడో భారత బ్యాటర్‌గా పడిక్కల్ చరిత్ర సృష్టించాడు. గతంలో టీమిండియా దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్(177), ఛెతేశ్వర్ పుజారా (153 పరుగులు) మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు 150 కంటే ఎక్కువ పరుగులు చేశారు. ఇప్పుడు ఈ అరుదైన జాబితాలో పడిక్కల్ చేరాడు. అంతేకాకుండా స్వాతంత్య్ర దినోత్సవం రోజున టెస్టు సెంచరీ తొలి ప్లేయర్‌గా కూడా దేవ్ రికార్డులకెక్కాడు.అలాగే 21వ శతాబ్దంలో టీమిండియా తరపున మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి టెస్ట్ సెంచరీ బాదిన రెండో ప్లేయర్‌గా పడిక్కల్ రికార్డులెక్కాడు. పడిక్కల్ కంటే ముందు సౌరవ్ గంగూలీ మాత్రమే ఈ ఘనత సాధించాడు. సాయి సుదర్శన్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో వచ్చిన అవకాశాన్ని పడిక్కల్ అద్భుతంగా వినియోగించుకున్నాడు.చదవండి: అస్సలు ఊహించలేదు.. ఇది అత్యంత అవమానకరం: పాంటింగ్ -
పంత్ సిక్సర్ల రికార్డు
భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మరో అరుదైన రికార్డు సాధించాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదడంతో టెస్ట్ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో లెజండరీ ఆల్‌రౌండర్ జాక్ కలిస్‌ను (97 సిక్సర్లు) అధిగమించాడు.ఈ జాబితాలో బెన్ స్టోక్స్ (138), బ్రెండన్ మెక్కల్లమ్ (107), ఆడమ్ గిల్‌క్రిస్ట్ (100), టిమ్ సౌథీ (98), క్రిస్ గేల్ (98) పంత్ (98) కంటే ముందున్నారు.2024లో విమర్శలు.. 2025లో అద్భుతమైన పునరాగమనంటెస్ట్ క్రికెట్లో పంత్ దూకుడైన బ్యాటింగ్‌కు ఎప్పటినుంచో ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే 2024లో అతని ఆ దూకుడే ప్రతికూలంగా మారింది. ఆ ఏడాది 17 ఇన్నింగ్స్‌ల్లో 576 పరుగులు చేసిన పంత్ సగటు 36.00గా ఉంది.అయితే 2025లో పంత్ అద్భుతంగా పుంజుకున్నాడు. 13 ఇన్నింగ్స్‌ల్లో 629 పరుగులు, 48.38 సగటుతో రాణించాడు. 2026లోనూ అతను 81, 39 పరుగుల ఇన్నింగ్స్‌లతో ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం పంత్ 51 టెస్టుల్లో 3,596 పరుగులు, 43.32 సగటు, 73.91 స్ట్రైక్‌రేట్‌తో కొనసాగుతున్నాడు.అంతేకాదు.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా గడ్డలపై టెస్ట్ సెంచరీలు సాధించిన అరుదైన వికెట్ కీపర్లలో పంత్ ఒకడిగా చలామణి అవుతున్నాడు.జట్టులో స్థానం కోల్పోయే ప్రమాదం ఉందా..?పంత్ ఎంతటి మ్యాచ్ విన్నర్ అయినప్పటికీ, టెస్టుల్లో అతని దూకుడు బ్యాటింగ్‌పై అప్పుడప్పుడు విమర్శలు వస్తూనే ఉన్నాయి. టీమిండియాలో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో వరుసగా విఫలమైతే ఏ ఆటగాడికైనా జట్టులో స్థానం ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఉంది.పంత్ ఇప్పటికే భారత టెస్ట్ వైస్ కెప్టెన్సీని కోల్పోయాడు. ఒకవేళ భవిష్యత్తులో అతను టెస్ట్ జట్టులో చోటు కోల్పోతే, అతని స్థానాన్ని భర్తీ చేయడానికి ధృవ్ జురెల్ ప్రధాన ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాడు.అయితే ప్రస్తుతానికి పంత్ తన బ్యాటింగ్‌తోనే సమాధానం ఇస్తున్నాడు. టెస్ట్ క్రికెట్లో 100 సిక్సర్ల మైలురాయికి అతను కేవలం రెండు సిక్సర్ల దూరంలో ఉన్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. వర్షం కారణంగా రెండో రోజు ఆటలో దాదాపు రెండు సెషన్ల ఆట జరగలేదు. మూడో సెషన్లో ఆట ప్రారంభమైంది. ఓవర్‌నైట్ బ్యాటర్లు దేవదత్ పడిక్కల్ (167), రిషభ్ పంత్ (39)తో పాటు కేఎల్ రాహుల్ (82) ఔటయ్యారు. ధృవ్ జురెల్ (22), రవీంద్ర జడేజా (9) క్రీజ్‌లో ఉన్నారు. జట్టు స్కోర్ 372-5గా ఉంది. తొలి రోజు ఆటలో భారత్ యశస్వి జైస్వాల్ (32), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వికెట్లు కోల్పోయింది. లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య, కేశర నువంత తలో 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో కోసం భారత జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. -
చరిత్ర సృష్టించిన దేవ్‌దత్ పడిక్కల్.. తొలి భారత క్రికెటర్‌గా
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత యువ బ్యాటర్ దేవ్‌దత్త్ పడిక్కల్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 134 బంతుల్లో తన తొలి అంతర్జాతీయ సెంచరీ మార్క్‌ను పడిక్కల్ అందుకున్నాడు. ఈ క్రమంలో పడిక్కల్ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఆగస్టు 15 (స్వాతంత్య్ర దినోత్సవం) నాడు టెస్ట్ సెంచరీ సాధించిన తొలి భారత బ్యాటర్‌గా అతడు చరిత్ర సృష్టించాడు.పడిక్కల్ కంటే ముందు భారత తరపున ఏ బ్యాటర్ కూడా ఇండిపెండెన్స్ డే రోజు టెస్టుల్లో మూడంకెల స్కోర్‌ను అందుకోలేదు. గతంలో విరాట్ కోహ్లి వెస్టిండీస్‌పై ఆగస్టు 15న వన్డే సెంచరీ చేయగా.. టెస్టు సెంచరీ చేసింది మాత్రం పడిక్కలే కావడం గమనార్హం. అదేవిధంగా 21వ శతాబ్దంలో టీమిండియా తరపున మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి టెస్ట్ సెంచరీ బాదిన రెండో ప్లేయర్‌గా పడిక్కల్ రికార్డులెక్కాడు.పడిక్కల్ కంటే ముందు సౌరవ్ గంగూలీ మాత్రమే ఈ ఘనత సాధించాడు. ఓవరాల్‌గా భారత్ తరఫున నెంబర్ 3 పొజిషన్లో టెస్ట్ సెంచరీ సాధించిన ఎడమ చేతి వాటం బ్యాటర్‌గా సలీమ్ దురానీ, బాపూ నాడ్కర్ణి, అజిత్ వాడేకర్, ఏక్నాథ్ సోల్కర్, సురీందర్ అమర్నాథ్, వినోద్ కాంబ్లీ పడిక్కల్ చేరాడు.భారీ స్కోర్ దిశగా భారత్ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. క్రీజులో పడిక్కల్(131), రిషబ్ పంత్(27) ఉన్నారు. -
పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా భారత్
గాలే వేదికగా శ్రీలంకతో తొలి టెస్టును భారత్ ఘనంగా ఆరంభించింది. మొదటి రోజు ఆటలో ఆతిథ్య జట్టుపై టీమిండియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 73 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 288 పరుగుల భారీ స్కోర్ సాధించింది. యువ బ్యాటర్ దేవ్‌దత్త్ పడిక్కల్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. పడిక్కల్ 131 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. అతడితో పాటు రిషబ్ పంత్(31) క్రీజులో ఉన్నాడు. కాగా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగన భారత్‌కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (32), రాహుల్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అయితే యశస్వి దురదృష్టవశాత్తూ రనౌటయ్యాడు. అదేవిధంగా సెంచరీ దిశగా దూసుకుపోతున్న రాహుల్(77) కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కేవలం 16 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య ఒక్కడే వికెట్ పడగొట్టాడు.చదవండి: బీసీసీఐ బిగ్ ట్విస్ట్.. అగార్కర్‌కు చెక్? రేసులోకి ఊహించని పేరు -
శ్రీలంక గడ్డపై శతక్కొట్టిన పడిక్కల్
రెండేళ్ల తర్వాత భారత టెస్టు జట్టులోకి వచ్చిన దేవ్‌దత్త్ పడిక్కల్.. తన రీఎంట్రీ మ్యాచ్‌లో సత్తాచాటాడు. గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో పడిక్కల్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. ఈ కర్ణాటక బ్యాటర్ 134 బంతుల్లో తన మొదటి అంతర్జాతీయ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 9 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. కాగా సాయిసుదర్శన్ గాయం కారణంగా లంకతో సిరీస్‌కు దూరం కావడంతో పడిక్కల్‌కు జట్టులో చోటు దక్కింది. ఈ క్రమంలో తనకు లభించిన అవకాశాన్ని పడిక్కల్ సద్వినియోగపరుచుకున్నాడు. పడిక్కల్ 105 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 61 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 234 పరుగులు సాధించింది. అయితే 77 పరుగులతో మంచి రిథమ్‌లో ఉన్న కేఎల్ రాహుల్ గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. -
IND vs SL: టీమిండియాకు ఊహించని షాక్!
శ్రీలంకతో తొలి టెస్టు సందర్భంగా టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. ఫామ్‌లో ఉన్న ఓపెనింగ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. టీ విరామం అనంతరం తిరిగి బ్యాటింగ్‌కు వచ్చిన అతడు.. కండరాలు పట్టేయడంతో వెంటనే మైదానాన్ని వీడాడు.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సీజన్లో భాగంగా టీమిండియా రెండు మ్యాచ్‌లు ఆడేందుకు శ్రీలంకకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గాలె వేదికగా శనివారం తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.77 పరుగులుఓపెనర్లలో యశస్వి జైస్వాల్ (32) రనౌట్ కాగా.. కేఎల్ రాహుల్ నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. టీ విరామానికి ముందు ఈ కుడిచేతి వాటం బ్యాటర్ మొత్తంగా 162 బంతులు ఎదుర్కొని.. తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 77 పరుగులు సాధించాడు.చేయి నొప్పిఈ క్రమంలో రాహుల్ సెంచరీ దిశగా పయనిస్తున్న వేళ్ల.. టీ బ్రేక్ నుంచి రాగానే ఒక్కసారిగా అసౌకర్యానికి గురయ్యాడు. బ్యాటింగ్‌కు వెళ్లే ముందే తన కుడిచేయి నొప్పిగా ఉందని అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. డ్రెసింగ్‌రూమ్ నుంచి ఫిజియో వచ్చేలోగా.. మరో ఎండ్‌లో ఉన్న దేవదత్ పడిక్కల్ వచ్చి.. రాహుల్ చేయిని స్ట్రెచ్ చేశాడు. దీంతో అతడికి నొప్పి మరింత ఎక్కువైంది.కుంటుకుంటూఇంతలో ఎడమ చేయి కూడా నొప్పి పుట్టడంతో రాహుల్ విలవిల్లాడాడు. ఫిజియో వచ్చి పరిశీలించగా.. రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. వెళ్తున్నపుడు కూడా రాహుల్ కుంటుతూ నడవడం ఆందోళనకరంగా పరిణమించింది. ఫిజియో సాయం లేకుండా అతడు అసలు నిల్చోలేకపోయాడు. ఇక రాహుల్ స్థానంలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ క్రీజులోకి రాగా.. వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ శతకం పూర్తి చేసుకున్నాడు. టెస్టు కెరీర్లో అతడికి ఇదే తొలి సెంచరీ.గాయాల బెడదఇదిలా ఉంటే.. ఇప్పటికే టీమిండియా గాయాల బెడదతో సతమతమవుతోంది. హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ గాయాల బారిన పడి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందుతున్నారు. తాజాగా రాహుల్ కూడా గాయపడటం టీమిండియా శిబిరంలో కలకలం రేపుతోంది.చదవండి: జైసూను రనౌట్ చేయనా?.. తప్పేముంది?.. కానివ్వు! -
అరుదైన ఘనత.. సచిన్ సరసన యశస్వి జైశ్వాల్
టీమిండియా ఓపెనర్ యశస్వి జైశ్వాల్ మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. తన కెరీర్లో మొదటి 30 టెస్టులను వేర్వేరు మైదానాలలో ఆడిన మూడో భారత క్రికెటర్‌గా జైశ్వాల్ రికార్డులకెక్కాడు. గాలే వేదికగా శ్రీలంకతో ప్రారంభమైన తొలి టెస్టులో యశస్వి ఈ ఫీట్ అందుకున్నాడు. ఈ రేర్ ఫీట్ జైశ్వాల్ కంటే ముందు సచిన్ టెండూల్కర్(32), సంజయ్ మంజ్రేకర్‌లు(30) సాధించారు. తాజా మ్యాచ్‌తో వీరి సరసన యశస్వి చేరాడు. 2023లో డొమినికా వేదికగా వెస్టిండీస్‌పై అరంగేట్రం చేసిన జైశ్వాల్.. ఇప్పటివరకు ఆడిన ఏ 30 టెస్టుల్లోనూ ఒక్క వేదికను కూడా రెండోసారి పునరావృతం చేయకపోవడం గమనార్హం.ఇక ఈ మ్యాచ్‌లో జైశ్వాల్‌ను దురదృష్టం వెంటాడింది. మొదటి ఇన్నింగ్స్‌లో 32 పరుగులు చేసి మంచి టచ్‌లో కనిపించిన జైశ్వాల్.. ఊహించని విధంగా రనౌటయ్యాడు. 11వ ఓవర్లో కేఎల్ రాహుల్ మిడ్-ఆన్ వైపు డ్రైవ్ షాట్ ఆడగా.. శ్రీలంక బౌలర్ కేశర నువంత బంతిని ఆపే క్రమంలో నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న జైశ్వాల్‌ను ఢీకొట్టాడు. దీంతో జైస్వాల్ కింద పడిపోయాడు. అంతలోనే రాహుల్ బౌలర్ ఎండ్‌వైపు పరిగెత్తుకుంటూ వచ్చాడు. జైశ్వాల్ పడిపోవడం చేసి రాహుల్ క్రీజు మధ్యలోనే అగిపోయాడు. వెంటనే లేచిన జైస్వాల్ మాత్రం స్ట్రైకర్ ఎండ్ వైపు పరిగెత్తే ప్రయత్నం చేయడంతో రాహుల్ బౌలర్ ఎండ్‌వైపు రన్ చేశాడు.కానీ జైస్వాల్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకొని నాన్ స్ట్రైకర్‌వైపు పరిగెత్తాడు. దీంతో ఇద్దరు బ్యాటర్లు ఒకే ఎండ్‌కు చేరుకోవడంతో జైశ్వాల్ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. -
సెంచరీ కొట్టిన టీమిండియా
శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా మెరుగైన ఆరంభం అందుకుంది. భోజన విరామ సమయానికి వంద పరుగుల మార్కు దాటింది. గాలె వేదికగా శనివారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.జైసూ రనౌట్ఓపెనర్ యశస్వి జైస్వాల్ దూకుడుగా ఆడుతూ మంచి ఆరంభం అందించాడు. అయితే, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో సమన్వయ లోపం కారణంగా.. అనూహ్య రీతిలో రనౌట్ అయ్యాడు. ఇందుకు లంక బౌలర్ కేశారా నువాంత కూడా ఒక రకంగా కారణమే.ఇక మొత్తంగా 37 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్.. ఐదు ఫోర్ల సాయంతో 32 పరుగులు చేసి.. తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. కేఎల్ రాహుల్‌తో కలిసి తొలి వికెట్‌కు 47 పరుగులు జోడించాడు. అనంతరం.. ఆచితూచి ఆడుతున్న రాహుల్‌కు జతైన దేవదత్ పడిక్కల్ దూకుడుగానే మొదలుపెట్టాడు.నిలకడగా..ఈ క్రమంలో భోజన విరామ సమయానికి 27 ఓవర్లలో టీమిండియా వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 77 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 32 పరుగులు... పడిక్కల్ 49 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ బాది 35 పరుగులతో క్రీజులో నిలిచారు. UPDATEఇదిలా ఉంటే.. వర్షం వల్ల లంచ్ తర్వాత ఆటకు అంతరాయం కలిగింది. మైదానం తడిగా ఉన్నందున దాదాపు గంట సేపు ఆటను నిలిపివేశారు. రెండింటికి మళ్లీ ఆట మొదలైంది.తుది జట్లుటీమిండియాయశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.శ్రీలంకలాహిరు ఉదార, నిషాన్ మదుష్క, దినేష్ చండిమాల్, కమిందు మెండిస్, ధనంజయ డి సిల్వా(కెప్టెన్), సోనాల్ దినుషా, నిరోషన్ డిక్వెల్లా(వికెట్ కీపర్), కేశర నువంత, ప్రబాత్ జయసూర్య, లాహిరు కుమార, అసిత ఫెర్నాండో.చదవండి: సన్‌రైజర్స్ కొంపముంచిన క్లాసెన్! -
జైసూను రనౌట్ చేయనా?.. ఇందులో తప్పేముంది?.. కానివ్వు!
శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ అనూహ్య రీతిలో అవుటయ్యాడు. నిలకడగా ఆడుతున్న అతడు.. తప్పుడు నిర్ణయం కారణంగా రనౌట్‌గా వెనుదిరిగాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సీజన్లో భాగంగా రెండు మ్యాచ్‌లు ఆడేందుకు భారత్ శ్రీలంకకు వెళ్లిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గాలె వేదికగా శనివారం తొలి టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ కాస్త వేగంగా ఆడగా.. కేఎల్ రాహుల్ నెమ్మదిగా ఆడే ప్రయత్నం చేశాడు.Off the Mark! 💥 Yashasvi Jaiswal gets going with a sweetly timed boundary. 👊Watch #SLvIND, 1st Test, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/EYTG3ht7CY— Sony Sports Network (@SonySportsNetwk) August 15, 2026దూకుడుగా జైసూ..ఇక 37 బంతుల్లోనే 32 పరుగులతో జైస్వాల్ జోరు మీదున్న సమయంలో.. దురదృష్టం అతడిని వెంటాడింది. భారత ఇన్నింగ్స్ 11వ ఓవర్లో లంక అరంగేట్ర ఆఫ్ స్పిన్నర్ కేశారా నువాంత బంతితో రంగంలోకి దిగాడు.ఈ క్రమంలో కేశారా వేసిన ఆఖరి బంతిని రాహుల్ మిడాన్ దిశగా బాదాడు. అయితే, కేశారా బంతిని ఆపే క్రమంలో జైసూ కాళ్లకు అడ్డుగా వచ్చాడు. దీంతో అదుపుతప్పిన జైసూ నేలమీద పడిపోయాడు. ఈలోపే కేఎల్ రాహుల్ సింగిల్ కోసం రాగా.. కిందపడి లేచిన తర్వాత కూడా జైసూ పరుగుకు సిద్ధంగా ఉన్నానన్నట్లుగా ముందుకు ఉరికాడు.జైసూను రనౌట్ చేయనా?.. కానీ ఇంతలోనే లంక ఫీల్డర్ బంతిని అందుకుని వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లా వైపు విసిరాడు. అప్పటికి రాహుల్, జైస్వాల్.. ఇద్దరూ బౌలర్ ఎండ్‌లోనే ఉన్నారు. వీరిలో ముందుగా రాహుల్ తన బ్యాట్‌ను నేలమీద పెట్టి సేఫ్ అయ్యాడు. అయితే, బంతిని అందుకున్నప్పటికీ డిక్వెల్లా వెంటనే బెయిల్స్‌ను పడగొట్టలేదు.Yashasvi Jaiswal was looking so good and his timing today was brilliant, but this unfortunate run-out spoiled the day for himHe scored 32 at a strike rate of 88, but this run out....... #INDvsSL pic.twitter.com/lUtlbsBXpZ— Ajay Jadeja (@AjayJadeja171) August 15, 2026ఇందులో తప్పేముంది?.. కానివ్వు!రనౌట్ చేయనా అన్నట్లుగా కెప్టెన్ ధనంజయ డి సిల్వను అడిగాడు. ఇందుకు ధనంజయ.. ‘ఇందులో తప్పేముంది? కానివ్వు’ అన్నట్లుగా సైగ చేయడంతో డిక్వెల్లా బెయిల్స్‌ను పడగొట్టాడు. ఫలితంగా జైస్వాల్ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. ఏదేమైనా అటు కేశారా.. ఇటు రాహుల్‌తో పాటు జైసూ తొందరపాటు కారణంగా టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది.ఈ దారుణమైన మిక్సప్నకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కొంతమంది రాహుల్‌ను.. మరికొందను జైస్వాల్‌ను విమర్శిస్తున్నారు. ఇంకొందరు మాత్రం తప్పంతా కేశారాదేనని తిట్టిపోస్తున్నారు. కాగా జైసూ రనౌట్ కాగానే రాహుల్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు. ఇక జైస్వాల్ 32 పరుగుల వద్ద అవుట్ కాగా.. అతడి స్థానంలో దేవదత్ పడిక్కల్ క్రీజులోకి వచ్చాడు.చదవండి: లంచ్‌బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరెంతంటే?చదవండి: సన్‌రైజర్స్ కొంపముంచిన క్లాసెన్! -
తుది జట్టులో అతడికి నో ఛాన్స్! బిగ్ హింట్ ఇచ్చిన గిల్
భారత్-శ్రీలంక మధ్య తొలి టెస్ట్ ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత ప్లేయింగ్ ఎలెవన్‌కు సంబంధించి కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బిగ్ హింట్ ఇచ్చాడు. తొలి టెస్ట్‌లో టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో పాటు ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగే అవకాశముంది.రవీంద్ర జడేజా, మానవ్ సుత్తార్, కుల్దీప్ యాదవ్ పేర్లు స్పిన్నర్లగా ఖారారైనట్లు సమాచారం. అదేవిధంగా పేస్ బౌలింగ్ విభాగంలో సీనియర్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌తో కర్ణాటక స్పీడ్ స్టార్ ప్రసిద్ద్ కృష్ణ బంతిని పంచుకోనున్నట్లు గిల్ సంకేతాలు ఇచ్చాడు. దీంతో గుర్నూర్ బ్రార్, జమ్మూ కాశ్మీర్ స్పీడ్ స్టార్ అకిబ్ నబీలు బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశముంది."గుర్నూర్ బ్రార్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. పాత బంతితో కూడా అతడు బౌన్స్ రాబట్టగలడు. అయితే మరోవైపు ప్రసిద్ద్ కృష్ణ కూడా గత కొంత కాలంగా అద్భుతంగా రాణిస్తున్నాడు. ప్రసిద్ధ్ ఇటీవల జరిగిన వార్మప్ మ్యాచ్‌లో సత్తాచాటాడు. అందుకే వీరిద్దరిలో ఒకరిని ఎంచుకోవడం నిజంగా కష్టమైన నిర్ణయమే. జస్ప్రీత్ బుమ్రా లేకపోవడంతో ప్రసిద్ద్, బ్రార్ వంటి పేస్ బౌలర్లకు తమ సత్తా చాటుకునేందుకు ఈ సిరీస్ ఒక మంచి అవకాశం" అని గిల్ ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు. కాగా వన్డేల్లో తన టాలెంట్‌ను నిరూపించుకోవడంతో గుర్నూర్ బ్రార్‌ను శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు కూడా ఎంపిక చేశారు. కానీ శ్రీలంక కండీషన్స్ కారణంగా అతడికి తుది జట్టులో చోటు దక్కే సూచనలు కనిపించడం లేదు. లంక పిచ్‌లు ఎక్కువగా స్పిన్నర్లకు అనుకూలిస్తాయన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్ ముగ్గురు ఫుల్ టైమ్ స్పిన్నర్లతో బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది.భారత తుది జట్టు (అంచనా): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవద్ పడిక్కల్, గిల్ (కెప్టెన్), పంత్ ( వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ -
కెప్టెన్‌గా నేను ఓకే.. WTC ఫైనల్ చేరతాం: శుబ్‌మన్ గిల్
శ్రీలంకతో కీలక టెస్టు సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసులో ఉండాలంటే భారత్ ఈ సిరీస్‌లో ఆతిథ్య జట్టును 2-0తో వైట్‌వాష్ చేయాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తొలి టెస్టు ఆరంభానికి ముందు టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ స్పందించాడు.కెప్టెన్‌గా నేను ఓకే.. WTC ఫైనల్ చేరతాం‘‘కెప్టెన్‌గా నా పాత్రలో నేను ఎంతో సౌకర్యవంతంగానే ఉన్నాను. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకోవడమే మా లక్ష్యం. అందుకోసం మేము ఆరు నుంచి ఏడు టెస్టులు గెలవాల్సి ఉంది. కాబట్టి శ్రీలంక నుంచే ఆ పని మొదలుపెడతాము’’ అని గిల్ పేర్కొన్నాడు.నాకు దక్కిన గొప్ప గౌరవంఅదే విధంగా.. ‘‘చారిత్రక 600వ టెస్టులో నాయకుడిగా టీమిండియాను ముందుకు నడిపించడం నాకు దక్కిన గొప్ప గౌరవం. అది కూడా స్వాతంత్ర్య దినోత్సవం రోజు కావడం మరింత విశేషం’’ అని గిల్ హర్షం వ్యక్తం చేశాడు. కాగా భారత్- శ్రీలంక మధ్య ఆగష్టు 15న తొలి టెస్టు మొదలుకానుంది. ఇందుకు గాలె వేదిక.మా జట్టుతో సంతృప్తిగానే ఉన్నాంకాగా శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, బ్యాటర్ సాయి సుదర్శన్, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)పై వస్తున్న విమర్శలపై గిల్ స్పందించాడు.‘‘మేము CoEతో తరచూ చర్చలు జరుపుతూనే ఉన్నాము. ఆటగాళ్ల గాయాల గురించి అప్డేట్లు తెలుసుకుంటున్నాం. దురదృష్టవశాత్తూ సాయి సుదర్శన్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. కాబట్టి అతడిని టెస్టు మ్యాచ్‌లో ఆడించి రిస్క్ తీసుకోలేము. మా జట్టులో ఉన్న పదిహేను మంది సభ్యులతో ప్రస్తుతం సంతృప్తిగానే ఉన్నాము’’ అని గిల్ పేర్కొన్నాడు.డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే..ఇదిలా ఉంటే.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే.. తాజా సీజన్లో మిగిలిన తొమ్మిది మ్యాచ్‌లలో కనీసం ఆరు మ్యాచ్‌లు తప్పక గెలవాల్సిందే. ఇందులో శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ కాస్త ఈజీ టార్గెట్. ఆ తర్వాత, న్యూజిలాండ్‌తో రెండు, ఆస్ట్రేలియా గడ్డ మీద ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది.వీటిలో కనీసం ఆరు గెలవడంతో పాటు రెండు డ్రా చేసుకోవాలి. లేదంటే కచ్చితంగా ఏడు టెస్టులు గెలవాలి. ఇక ఈ సీజన్లో ఇప్పటికి టీమిండియా తొమ్మిది టెస్టులు పూర్తి చేసుకుని.. నాలుగు గెలిచి.. నాలుగు ఓడిపోయి.. ఒకటి డ్రా చేసుకుంది. తద్వారా పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. -
చీఫ్ సెలక్టర్ లేదా హెడ్‌కోచ్ అవుతా: టీమిండియా దిగ్గజం
భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో భాగమయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నాడు. తనకు ఏ పదవి ఇచ్చినా వంద శాతం న్యాయం చేస్తానంటూ మనలోని మాటను వెల్లడించాడు.గంభీర్, అగార్కర్‌పై విమర్శలుకాగా టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్, చీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌పై గత కొంతకాలంగా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. వీరి నేతృత్వంలో వైట్‌బాల్ క్రికెట్లో ఐసీసీ టోర్నీలో భారత జట్టు మంచి ఫలితాలు నమోదు చేస్తున్నప్పటికీ.. టెస్టుల్లో మాత్రం ఇటీవల ఘోర పరాభవాలు చవిచూసింది.వరుస పరాభవాలుఎన్నడూలేని విధంగా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్‌వాష్ కావడం.. పాతికేళ్ల తర్వాత సొంతగడ్డపై సౌతాఫ్రికా చేతిలో 2-0తో క్లీన్‌స్వీప్ కావడం తీవ్ర విమర్శలకు కారణమైంది. ఇక స్వదేశంలో న్యూజిలాండ్‌కు తొలిసారి వన్డే సిరీస్ కోల్పోవడం.. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో 2-0తో క్లీన్‌స్వీప్ కావడం.. ఇంగ్లండ్ చేతిలో టీ20 సిరీస్‌లో 4-0తో వైట్‌వాష్ కావడం, వన్డే సిరీస్‌ను కోల్పోవడం తాజా ఉదాహరణలు.చీఫ్ సెలక్టర్, హెడ్‌కోచ్ అయ్యేందుకు సిద్ధంఈ నేపథ్యంలో శ్రీలంకతో తాజాగా రెండు టెస్టుల సిరీస్ తర్వాత వీరి భవితవ్యంపై స్పష్టత రానుందనే వార్తలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో హర్భజన్ సింగ్ బీసీసీఐలో ఏ పదవి ఇచ్చినా చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించడం గమనార్హం.‘‘బీసీసీఐ అధ్యక్షుడు, చీఫ్ సెలక్టర్ లేదంటే హెడ్‌కోచ్... ఈ మూడింటిలో ఏ బాధ్యత ఇచ్చినా నెరవేర్చేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. భారత క్రికెట్‌కు ఏ స్థాయిలోనైనా సేవ చేయడం నాకు ఎల్లప్పుడూ సంతోషమే. భవిష్యత్తులో ఈ మూడింటిలో ప్రతీ పాత్ర పోషించాలని నేను కోరుకోవడం లేదు.గంభీర్‌కు మద్దతుఅయితే, నా తలరాతలో ఏది రాసి ఉంటే అదే జరుగుతుంది. ఒకవేళ నాకే గనుక నిజంగా అవకాశం వస్తే.. అత్యుత్తమంగా రాణించేందుకు శాయశక్తులా కృషి చేస్తా’’ అని భజ్జీ PTI ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అదే విధంగా ప్రతీ దానికి గంభీర్‌ను విమర్శించడం తగదని.. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగానే అతడు ప్రతీ నిర్ణయం తీసుకుంటాడని అండగా నిలిచాడు.చదవండి: వీవీఎస్ లక్ష్మణ్‌కు బీసీసీఐ అత్యున్నత పదవి! -
లంక సిరీస్‌లో అతడే మా ఎక్స్-ఫ్యాక్టర్: భారత బౌలింగ్ కోచ్
గాలే వేదికగా శ్రీలంకతో తొలి టెస్ట్‌లో తలపడేందుకు టీమిండియా తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి శుభారంభం చేయాలని గిల్ సేన పట్టుదలతో ఉంది. అయితే ఆగస్టు 15న ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌కు ముందు భారత బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు.లంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత జట్టుకు కేఎల్ రాహుల్ ఎక్స్ ఫ్యాక్టర్‌గా మారనున్నాడని మోర్కెల్ తెలిపాడు. కాగా ప్రస్తుత భారత జట్టు బ్యాటింగ్ యూనిట్లో శ్రీలంకలో టెస్ట్ క్రికెట్ ఆడిన అనుభవం రాహుల్‌కే ఒక్కడికే ఉంది. ఈ క్రమంలోనే రాహుల్ తనకు ఉన్న అనుభవంతో యువ ఆటగాళ్లను ముందుండి నడిపిస్తాడని మోర్కల్ అభిప్రాయపడ్డాడు."టెస్టుల్లో కేఎల్ రాహుల్ గత కొన్నేళ్లుగా భారత బ్యాటింగ్ యూనిట్‌ను నడిపిస్తున్న తీరు ఒక అద్భుతం. శ్రీలంక కండీషన్స్, పిచ్‌లపై అతడికి మంచి అనుభవం ఉంది. అతడికి ఉన్న ఈ అనుభవం యువ ఆటగాళ్లకు నెట్ ప్రాక్టీస్ సమయంలో ఎంతగానే ఉపయోగపడింది. అదేవిధంగా గత కొన్ని నెలలుగా మా బాయ్స్ వ్యక్తిగతంగా తమ ఆటను ఎంతో మెరుగుపరుచుకున్నారు.ఈ సిరీస్‌ను సొంతం చేసుకోవడమే మా ముందున్న ప్రధాన లక్ష్యం. అందుకోసం ప్రత్యేక వ్యూహాలను సిద్దం చేసుకున్నాము. కండీషన్స్ అలవాటు పడేందుకు మేము 10 రోజుల ముందే ఇక్కడకు వచ్చాం" అని ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో మోర్కల్ పేర్కొన్నాడు. కాగా బ్యాటింగ్ పరంగా భారత్ పటిష్టంగా కనిపిస్తున్నప్పటికి.. బౌలింగ్‌లో మాత్రం బలహీనంగా ఉంది. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం భారత జట్టుకు ప్రధాన సమస్యగా మారింది. భారత పేస్ బౌలింగ్ యూనిట్ మహ్మద్ సిరాజ్ లీడ్ చేయనున్నాడు. అకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్ వంటి వారికి తొలిసారి భారత టెస్ట్ జట్టులో చోటు దక్కింది. -
మాదే పైచేయి: టీమిండియాకు శ్రీలంక కెప్టెన్ వార్నింగ్
టెస్టు సిరీస్ నేపథ్యంలో శ్రీలంక కెప్టెన్ ధనంజయ డి సిల్వ టీమిండియాకు హెచ్చరికలు జారీ చేశాడు. సాధారణంగా లంకలో స్పిన్నింగ్ వికెట్లు ఉంటాయని.. కానీ ఈసారి వర్షాల వల్ల పరిస్థితిలో కాస్త మార్పు ఉంటుందని పేర్కొన్నాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సీజన్లో భాగంగా భారత్- శ్రీలంక మధ్య రెండు టెస్టులకు షెడ్యూల్ ఖరారైంది.పిచ్‌లు అంత పొడిగా ఉండవుగాలె వేదికగా ఆగష్టు 15 నుంచి తొలి టెస్టు మొదలుకానున్న నేపథ్యంలో లంక సారథి ధనంజయ డి సిల్వ మీడియాతో మాట్లాడాడు. ‘‘సాధారణంగా శ్రీలంకలో టర్నింగ్ వికెట్లు ఉంటాయి. అయితే, ప్రస్తుతం వాతావరణం వేరుగా ఉంది. వర్షాలు పడుతున్నాయి కాబట్టి పిచ్‌లు అంత పొడిగా ఉండవు.ఆట స్వరూపాన్నే మార్చివేయగలరుఇక మా బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది. పిచ్‌లు కాస్త అనుకూలంగా ఉన్నా.. ఆట మొదలైన 2-3 రోజులు ఉపయోగకరంగా ఉంటాయి. ఆతర్వాత పిచ్ టర్న్ కావడం మొదలవుతుంది. స్పిన్నర్లే మా ప్రధాన ఆయుధం అయినప్పటికీ.. మా జట్టులో కొంతమంది నైపుణ్యాలున్న సీమర్లు కూడా ఉన్నారు.కివీస్, సౌతాఫ్రికా చేతిలో వైట్వాష్లుఆట స్వరూపాన్నే వారు మార్చివేయగలరు’’ అని ధనంజయ డి సిల్వ గిల్ సేనకు హెచ్చరికలు జారీ చేశాడు. అదే విధంగా.. ‘‘ఇండియాలోనూ టర్నింగ్ వికెట్లు ఉంటాయి. అయితే, స్వదేశంలో టీమిండియా న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్ల చేతుల్లో వైట్‌వాష్ అయింది.మాదే పైచేయి.. అతడే మా బలంఈ సిరీస్‌లలో వాళ్లు విఫలమైనప్పటికీ పూర్తిగా టర్నింగ్ వికెట్ల మీద పట్టు కోల్పోయారని కాదు. తిరిగి పుంజుకునేందుకు వాళ్లు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, గణాంకాల పరంగా చూస్తే మాదే పైచేయి. ముఖ్యంగా ఇరుజట్లలోనూ గాలెలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా ప్రభాత్ జయసూర్య ఉన్నాడు.అతడి అనుభవం మాకు తప్పక ఉపయోగపడుతుంది. శ్రీలంకలో పర్యటిస్తున్న జట్ల బ్యాటర్లపై చాలా ఏళ్లుగా అతడు ఆధిపత్యం కనబరుస్తున్నాడు. ఈ స్పిన్ బౌలర్ మా ప్రధానం బలం.బుమ్రా లేకున్నా..ఇక టీమిండియా తమ ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సేవలు కోల్పోయింది. వారికి అది అతిపెద్ద లోటు. అయితే, మిగతా బౌలర్లను ఎదుర్కొనేందుకు కూడా మేము బాగా హోంవర్క్ చేసి.. పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాము.ఏదేమైనా అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆడటం అంత తేలిక కాదు. నాలుగు, ఐదో రోజు కూడా ఆట పూర్తిగా మారిపోతుంది. టీమిండియాను ఓడించడానికి గొప్ప అవకాశం మా ముందుంది. మేము ఇది సాధిస్తామనే నమ్మకం నాకు ఉంది’’ అని ధనంజయ డి సిల్వ పేర్కొన్నాడు. కాగా 2017 తర్వాత టీమిండియా తొలిసారి శ్రీలంక గడ్డ మీద టెస్టు సిరీస్ ఆడుతోంది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సహా జట్టులోని మెజారిటీ మంది ఆటగాళ్లకు లంకలో టెస్టులు ఆడటం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే.. తొలి టెస్టుకు ముందు శ్రీలంక క్రికెట్ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆరంభంలో పేసర్లు వికెట్లు తీసేందుకు ఇబ్బంది పడ్డా ఆ తర్వాత ప్రభావం చూపగలిగారు. కొలంబో వికెట్ పాతబడే కొద్ది బ్యాటర్లకు కాస్త అనుకూలించింది. చదవండి: ఆసీస్ గడ్డ మీద చరిత్ర సృష్టించిన బంగ్లా పేసర్ -
'అతడొక అద్భుతం.. కచ్చితంగా లెజెండ్ అవుతాడు'
భారత్-శ్రీలంక మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సమయం దగ్గరపడుతోంది. ఇందులో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి కీలకమైన డబ్ల్యూటీసీ పాయింట్లు సాధించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియాపై శ్రీలంక బౌలింగ్ దిగ్గజం చమింద వాస్ కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికి భారత జట్టు పటిష్టంగా ఉందని అతడు అభిప్రాయపడ్డాడు. అదేవిధంగా భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను సైతం వాస్ పొగడ్తలతో ముంచెత్తాడు. కాగా ఈ సిరీస్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025-27 సైకిల్లో భాగంగా జరుగుతోంది."రోహిత్, విరాట్ లేకపోయినా భారత జట్టు ఏ మాత్రం బలహీనపడలేదు. శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ రూపంలో బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. టీమిండియాలో ప్రతిభకు కొదవలేదు,ఎంతోమంది యువ ఆటగాళ్లు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా కెప్టెన్ గిల్ గురుంచి ఎంత పొగిడినా తక్కువే. అతడొక అద్భుతం. గిల్‌కు అత్యుత్తమ బ్యాటింగ్ స్కిల్స్‌తో పాటు మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఎంతటి ఒత్తిడిలోనైనా చాలా ప్రశాంతంగా ఉంటాడు. టెస్ట్ క్రికెట్లో కచ్చితంగా ఒక లెజెండ్ అవుతాడు. గాలేలో జరగనున్న తొలి టెస్ట్‌లో మా జట్టుకు కచ్చితంగా అతడి నుంచి ముప్పు పొంచి ఉంది. శుబ్‌మన్ క్రీజులో సెటిల్ అయ్యాక అవుట్ చేయడం చాలా కష్టం. మా బౌలర్లు అతడిని ఎలా అడ్డుకుంటారో చూడాలి మరి" అని వాస్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.చదవండి: IND vs SL: గంభీర్‌తో శ్రీలంక మైండ్ గేమ్స్.. ఏమి జరిగిందంటే? -
గంభీర్‌తో శ్రీలంక మైండ్ గేమ్స్.. ఏమి జరిగిందంటే?
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో టీమిండియా మరో కీలక పోరుకు సిద్దమైంది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది.ఇందులో భాగంగా తొలి మ్యాచ్ ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ప్రారంభం కానుంది. ఈ క్రమంలో శ్రీలంక క్రికెట్ బోర్డు పర్యాటక జట్టు హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్‌తో మైండ్ గేమ్స్ ఆడటం ప్రారంభించింది.ఏమి జరిగిందంటే?తొలి టెస్టు కోసం శ్రీలంక జట్టు గాలేలో గత రెండు రోజులగా క్లోజ్డ్ డోర్ ప్రాక్టీస్ సెషన్స్ నిర్వహిస్తోంది. అయితే బుధవారం లంక ప్రాక్టీస్ సెషన్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. బ్యాటింగ్ కోచ్ సితాంషు కోటక్‌తో కలిసి సడన్‌గా గాలే మైదానంలోకి ఎంట్రీ ఇచ్చాడు. వీరిద్దరూ నేరుగా తొలి టెస్టు కోసం తాయారు చేసిన ప్రధాన పిచ్ వద్దకు పరిశీలించారు.గంభీర్, కోటక్ అక్కడికి చేరుకోగానే గ్రౌండ్ సిబ్బంది పిచ్‌పై ఉన్న కవర్లను కొద్దిసేపు పక్కకు తొలగించారు. కాసేపు పిచ్‌ను పరిశీలించి వారిద్దరూ వెళ్లిపోయారు. ఆ సమయంలో పక్కనే ఉన్న నెట్స్‌లో శ్రీలంక ప్రాక్టీస్ చేస్తున్నారు.అయితే గంభీర్-కోటక్ ద్వయం వెళ్లిపోయిన వెంటనే గాలే స్టేడియం సిబ్బంది పిచ్‌లో కొన్ని మార్పులు చేశారు. కవర్లను పూర్తిగా తొలగించి, గ్రాస్ మోవర్తో పిచ్‌పై ఉన్న పచ్చికను కట్ చేశారు. ఆ తర్వాత సాఫ్ట్ రోలర్‌ను ఉపయోగించి చదును చేశారు.కాగా తుది జట్టును ఖరారు చేసేటప్పుడు పిచ్‌కు అధిక ప్రాధాన్యత ఉంటుంది. వికెట్ కండీషన్ బట్టి తుది జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడు శ్రీలంక క్రికెట్ గంభీర్‌తో మైండ్ గేమ్స్ ఆడి కాస్త కన్ఫ్యూజ్ చేసింది. గంభీర్ అండ్ కో ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగాలా? ముగ్గురు స్పిన్నర్లతో వెళ్లాలా అన్న సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది.చదవండి: 30 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్ -
సిరాజ్ చిలిపి పని.. భయపడుతూనే ఓకే చెప్పిన సర్ఫరాజ్ ఖాన్
టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఓ చిలిపి పని చేశాడు. టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన సర్ఫరాజ్ ఖాన్‌కు హెయిర్‌కట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.భయపడుతూనే ఓకే చెప్పిన సర్ఫరాజ్వైరల్ అవుతున్న వీడియోలో సిరాజ్.. సర్ఫరాజ్ దగ్గరకు వెళ్లి హెయిర్‌కట్ చేస్తానంటూ ముందుకొచ్చాడు.అయితే సర్ఫరాజ్ మాత్రం సిరాజ్ ప్రతిపాదనపై పెద్దగా ఆసక్తి చూపలేదు. పేసర్ హెయిర్‌కటింగ్ నైపుణ్యంపై అతడికి నమ్మకం లేనట్టుగా కనిపించాడు.The way Mohammed Siraj cuts Sarfaraz Khan’s hair like a big brother. 😂Also, look at Shubman Gill and Rishabh Pant’s new haircuts for the Ind vs Sl Test series! pic.twitter.com/RGjrXZodAo— Sonu (@Cricket_live247) August 11, 2026సిరాజ్ హెయిర్‌కట్ చేసేందుకు సిద్ధమవుతుండగా సర్ఫరాజ్ ముఖంలో కాస్త భయం కూడా కనిపించింది. చివరకు తప్పనిసరి పరిస్థితుల్లో సిరాజ్‌కు తన జుట్టును కత్తిరించేందుకు అనుమతించాడు.సిరాజ్ కూడా హెయిర్‌స్టైలిస్ట్ సహాయం తీసుకుంటూ సరదాగా ఈ పని పూర్తి చేశాడు. మరోవైపు సర్ఫరాజ్ మాత్రం వీలైతే అక్కడి నుంచి తప్పించుకోవాలన్నట్లుగా కనిపించాడు.చివరకు సిరాజ్ తన ‘సెషన్’ ముగించడంతో అసలు హెయిర్ స్టైలిస్ట్ రంగంలోకి దిగాడు. జుట్టుకు ఫినిషింగ్ టచ్ ఇచ్చి సర్ఫరాజ్‌కు కొత్త లుక్ తీసుకొచ్చాడు.అనుకోని అవకాశంశ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు సర్ఫరాజ్ అనూహ్యంగా టీమిండియాలోకి తిరిగి వచ్చాడు. సాయి సుదర్శన్ కుడి కాలిలోని టో స్ట్రెస్ రియాక్షన్ కారణంగా సిరీస్‌కు దూరం కావడంతో అతని స్థానంలో సర్ఫరాజ్‌ను ఎంపిక చేశారు.సర్ఫరాజ్ ఇప్పటికే కొలంబోలో భారత జట్టుతో చేరాడు. ఆగస్టు 15న గాలేలో ప్రారంభమయ్యే తొలి టెస్టులో అతడు తుది జట్టులో ఉంటాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.ఆరు టెస్టుల్లో 371 పరుగులుసర్ఫరాజ్ ఇప్పటివరకు భారత్ తరఫున ఆరు టెస్టులు ఆడాడు. 37.10 సగటుతో 371 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 150 పరుగులు.సర్ఫరాజ్ గతంలో జట్టులో ఉన్నప్పటికీ అవకాశాలు దక్కని సందర్భాలు ఉన్నాయి. 2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం భారత జట్టులో ఉన్నప్పటికీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.ఇప్పుడు సాయి సుదర్శన్ గైర్హాజరీతో మరో అవకాశం లభించింది. శ్రీలంకలో ఈ అవకాశాన్ని సర్ఫరాజ్ ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి.WTC రేసులో భారత్ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత్ ఐదో స్థానంలో ఉంది. ఆరో స్థానంలో ఉన్న శ్రీలంకతో జరిగే ఈ సిరీస్‌లో మెరుగైన ఫలితాలు సాధించడం భారత జట్టుకు కీలకం.తొలి టెస్ట్ ఆగస్టు 15 నుంచి గాలేలో జరగనుండగా.. రెండో టెస్ట్ ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబోలోని ఎస్ఎస్సీ మైదానంలో జరగనుంది.శ్రీలంక టెస్టు సిరీస్‌కు భారత జట్టుశుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారంశ్ జైన్, ఔకిబ్ నబీ, సర్ఫరాజ్ ఖాన్. -
IND vs SL: టీమిండియాకు భారీ షాక్!
శ్రీలంక టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్ ప్లేయర్లు జస్ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్‌లు శ్రీలంక టూర్ నుంచి తప్పుకోగా.. తాజాగా ఈ జాబితాలోకి మరో కీలక ఆటగాడు చేరాడు. ఈ సిరీస్‌కు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉన్న సుందర్.. మోకాలి గాయం నుంచి కోలుకుంటున్నాడు. అతడు మొదటి టెస్టుకు కాకపోయినా కొలంబో వేదికగా జరిగే రెండో టెస్టు సమయానికైనా జట్టుతో కలుస్తాడని సెలక్టర్లు భావించారు. కానీ ఇప్పుడు వాషీ కోలుకోవడానికి మరింత సమయం పట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో సిరీస్ మొత్తానికే అతడు దూరం కానున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తమ కథనంలో పేర్కొంది. వాషీ విషయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదని సీఓఈ భావిస్తున్నట్లు సమాచారం. లంక పర్యటనకు వెళ్లిన జట్టులో రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, సారాంశ్ జైన్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లగా ఉన్నారు. వాషీ స్ధానంలో మానవ్ లేదా సారాంశ్లలో ఎవరికో ఒకరికి తుది జట్టులో చోటు దక్కనుంది. అదేవిధంగా బుమ్రా స్ధానంలో జమ్మూ స్పీడ్ స్టార్ ఆకిబ్ నబీ, సుదర్శన్ స్థానంలో ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌కు సెలక్టర్లు ఛాన్స్ ఇచ్చారు. కాగా తొలి టెస్ట్ ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ప్రారంభం కానుంది.శ్రీలంకతో టెస్టులకు భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (వికెట్‌కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్, మానవ్ సుతార్, నబీ, సిరాజ్, ప్రసిద్ధ్, గుర్నూర్, పడిక్కల్, సరాంశ్ జైన్. -
గిల్ కాదు.. అతడితో జాగ్రత్త! శ్రీలంకకు దిగ్గజ క్రికెటర్ వార్నింగ్
శ్రీలంక క్రికెట్ జట్టు సొంత గడ్డపై టీమిండియాతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు సిద్దమైంది. ఈ సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్ ఫర్వీజ్ మహరూఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. శ్రీలంకకు భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ రూపంలో అతిపెద్ద ముప్పు పొంచి ఉందని అతడు అభిప్రాయపడ్డాడు. కాగా ప్రస్తుతం పంత్ అంత మంచి ఫామ్‌లో లేడు. ఇటీవల జరిగిన శ్రీలంక ఎలెవన్‌తో జరిగిన వార్మాప్ మ్యాచ్‌లో కూడా రిషబ్ విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 30 పరుగులు మాత్రమే చేశాడు. అయినప్పటికి తనదైన రోజున ఓంటి చేతితో జట్టును గెలిపించే సత్తా అతడిది. ఈ క్రమంలోనే మహరూఫ్ తమ జట్టు హెచ్చరించాడు."నేను శ్రీలంక డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండి ఉంటే, రిషబ్ పంత్ గురుంచి ఎక్కువగా ఆలోచించేవాడిని. అతడు జట్టుకు ఎక్స్-ఫాక్టర్. టెస్టు క్రికెట్లో కూడా టీ20 తరహా బ్యాటింగ్ చేస్తాడు. పంత్ క్రీజులో ఉంటే కేవలం అర గంటలోనే మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలడు. అతడికి టీమ్ మేనెజ్మెంట్ పూర్తి స్వేచ్ఛనిచ్చింది. అయితే ఈ సిరీస్‌లో శ్రీలంక జట్టు ముగ్గురు లేదా నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశముంది. ప్రభాత్ జయసూర్య వంటి అద్భుతమైన స్పిన్నర్లు జట్టులో ఉన్నప్పటికి పంత్‌ను కట్టడి చేయడం అంత తేలిక కాదు" అని మహరూఫ్ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.భారత్‌తో తొలి టెస్టుకు శ్రీలంక జట్టుధనంజయ డి సిల్వా (కెప్టెన్), లహిరు ఉదారా, నిశాన్ మధుష్క, కమిందు మెండిస్ (వైస్ కెప్టెన్), దినేశ్ చండీమాల్, పసిందు సూరియబండారా, సోనాల్ దినూష, నిరోషన్ డిక్వెల్లా (వికెట్ కీపర్), రమేశ్ మెండిస్, ప్రబాత్ జయసూర్య, కేశర నువంత, మిలన్ రత్నాయకే, అసిత ఫెర్నాండో, లహిరు కుమార, విశ్వ ఫెర్నాండో, దిల్షాన్ మధుశంకచదవండి: Hundred Women 2026: ఎలిమినేటర్ ముంగిట సన్‌రైజర్స్ విధ్వంసం -
భారత్‌తో తొలి టెస్ట్.. శ్రీలంక జట్టు ప్రకటన
భారత్‌తో తొలి టెస్టుకు శ్రీలంక జట్టును ప్రకటించారు. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆగస్టు 15న గాలే వేదికగా తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు.ధనంజయ డి సిల్వా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కమిందు మెండిస్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ జట్టులో అనుభవజ్ఞులతో పాటు యువ ఆటగాళ్లకు చోటు లభించింది. వార్మప్ మ్యాచ్‌లో అదరగొట్టిన బ్యాటర్‌కు చోటుభారత్తో జరిగిన మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన నిశాన్ మధుష్కకు సెలెక్టర్లు తగిన గుర్తింపు ఇచ్చారు. అతని మంచి ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుని తొలి టెస్టు జట్టులో చోటు కల్పించారు.భారత్‌తో టెస్టుకు ముందు మధుష్క చూపించిన ఫామ్ శ్రీలంకకు సానుకూల అంశంగా మారింది. భారత బౌలింగ్‌ను ఎదుర్కొనే బ్యాటింగ్ విభాగంలో అతడు కీలకంగా మారే అవకాశం ఉంది.బౌలింగ్ బాధ్యత ప్రభాత్ జయసూర్యదేశ్రీలంక బౌలింగ్ దళానికి ప్రభాత్ జయసూర్య నాయకత్వం వహించనున్నాడు. అతనితో పాటు రమేశ్ మెండిస్, అసిత ఫెర్నాండో, మిలన్ రత్నాయకే, విశ్వ ఫెర్నాండో వంటి ఆటగాళ్లు జట్టులో ఉన్నారు.ఇక భారత్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆకట్టుకున్న కేశర నువంతకు కూడా తొలి టెస్టు జట్టులో చోటు దక్కింది. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ దిల్షాన్ మధుశంక కూడా జట్టులో ఉన్నాడు.తొలి టెస్టుకు శ్రీలంక జట్టుధనంజయ డి సిల్వా (కెప్టెన్), లహిరు ఉదారా, నిశాన్ మధుష్క, కమిందు మెండిస్ (వైస్ కెప్టెన్), దినేశ్ చండీమాల్, పసిందు సూరియబండారా, సోనాల్ దినూష, నిరోషన్ డిక్వెల్లా (వికెట్ కీపర్), రమేశ్ మెండిస్, ప్రబాత్ జయసూర్య, కేశర నువంత, మిలన్ రత్నాయకే, అసిత ఫెర్నాండో, లహిరు కుమార, విశ్వ ఫెర్నాండో, దిల్షాన్ మధుశంక -
టీమిండియాపై సంచలన అస్త్రాలను ప్రయోగించనున్న శ్రీలంక
భారత్‌తో టెస్ట్ సిరీస్‌కు శ్రీలంక సిద్ధమవుతోంది. ఆగస్టు 15న గాలే వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుండగా.. శ్రీలంక ఇంకా తుది జట్టును ప్రకటించలేదు. ఆటగాళ్ల గాయాలే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టుతో తలపడేందుకు శ్రీలంక ఆటగాళ్లు ఇప్పటికే గాలేలో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఈ సమయంలో ఆతిథ్య జట్టు ఇద్దరు ఆసక్తికరమైన ఆటగాళ్లను జట్టులోకి తీసుకునే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.రోహిత్ శర్మను బోల్తా కొట్టించిన బౌలర్ మళ్లీ వస్తున్నాడా..?భారత్‌తో టెస్ట్ సిరీస్ కోసం లెఫ్ట్ ఆర్మ్ పేసర్ దిల్షాన్ మధుశంకను తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశముంది. రేవ్స్పోర్ట్జ్ నివేదిక ప్రకారం.. మధుశంకకు రీకాల్ దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది.మధుశంకకు భారత్‌పై ప్రత్యేకమైన జ్ఞాపకం ఉంది. 2023 వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంక తరఫున అద్భుతంగా రాణించిన అతడు.. రోహిత్ శర్మను మ్యాచ్ రెండో బంతికే ఔట్ చేశాడు.ఆ మ్యాచ్‌లో రోహిత్ భారీ ఇన్నింగ్స్ ఆడతాడని భావించిన సమయంలో మధుశంక అతడిని పెవిలియన్‌కు పంపించాడు. ఇప్పుడు మరోసారి భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టేందుకు అతడు సిద్ధమవుతున్నాడు. మధుశంక ఇప్పటివరకు శ్రీలంక తరఫున ఒక టెస్ట్, 28 వన్డేలు, 20 టీ20లు ఆడాడు.గిల్, పంత్‌ను పడగొట్టిన కొత్త అస్త్రంమధుశంకతో పాటు ఆఫ్‌స్పిన్ ఆల్‌రౌండర్ కేశర నువంతకు తొలిసారి శ్రీలంక టెస్ట్ జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.ఇటీవల భారత్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో నువంత తన సత్తా చూపించాడు. భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు రిషభ్ పంత్ వికెట్లను పడగొట్టాడు.అంతేకాదు.. భారత్-ఏ, శ్రీలంక-ఏ మధ్య జరిగిన రెండో అనధికారిక టెస్టులో నువంత ఏకంగా ఐదు వికెట్లు తీసుకున్నాడు.ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు 15 మ్యాచ్‌లు ఆడిన నువంత 64 వికెట్లు పడగొట్టాడు. అతని స్ట్రైక్‌రేట్ 39గా ఉంది. దీంతో భారత బ్యాటర్లకు అతడు మరో సవాలుగా మారే అవకాశం ఉంది.ఇద్దరు కీలక బ్యాటర్లు దూరంమరోవైపు శ్రీలంకకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పథుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్ తొలి టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశం లేదు.దీంతో బ్యాటింగ్ విభాగంలో శ్రీలంకకు సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లాను తిరిగి టెస్ట్ జట్టులోకి తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. డిక్వెల్లా చివరిసారిగా 2023 మార్చిలో శ్రీలంక తరఫున టెస్ట్ మ్యాచ్ ఆడాడు.అదే సమయంలో అన్క్యాప్డ్ వికెట్ కీపర్ అంజలా బండారాను కూడా జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. డిక్వెల్లా, బండారా ఇద్దరూ ప్రస్తుతం గాలేలో శ్రీలంక జట్టుతో కలిసి ఉన్నట్లు సమాచారం.WTC ఫైనల్‌కు వెళ్లాలంటే భారత్‌ను ఓడించాల్సిందే..!ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 పాయింట్ల పట్టికలో శ్రీలంక ప్రస్తుతం ఆరో స్థానంలో ఉంది. రెండు సిరీస్‌ల తర్వాత 41.67 శాతం పాయింట్లతో భారత్‌కు వెనుకనే ఉంది. శ్రీలంక ఇంకా ఎనిమిది టెస్టులు ఆడాల్సి ఉంది. WTC ఫైనల్‌కు చేరాలంటే భారత్‌పై సిరీస్ విజయం వారికి అత్యంత కీలకం. -
సర్ఫరాజ్ వద్దు.. అతడినే ఆడించండి: మాజీ క్రికెటర్
శ్రీలంక- టీమిండియా మధ్య టెస్టు సిరీస్‌కు సమయం ఆసన్నమైంది. ఇరుజట్ల మధ్య శనివారం (ఆగష్టు 15) తొలి టెస్టు మొదలుకానుంది. ఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతుందన్న చర్చ జరుగుతోంది.సుదీర్ఘ నిరీక్షణ తర్వాతముఖ్యంగా సాయి సుదర్శన్ స్థానంలో అనూహ్య రీతిలో జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు ఉంటుందా? లేదా? అనే విషయం ఆసక్తికరంగా మారింది. కాగా దేశీ క్రికెట్లో సత్తా చాటిన ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2024లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.అదే ఏడాది చివరగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన సర్ఫరాజ్ ఖాన్‌ను.. ఆ తర్వాత సెలక్టర్లు పక్కనపెట్టారు. ఈ క్రమంలో ఫిట్‌నెస్‌పై మరింతగా దృష్టి పెట్టిన ఈ ముంబైకర్.. భారీగా బరువు తగ్గాడు. దేశీ క్రికెట్లోనూ రాణించి టీమిండియా నుంచి పిలుపు కోసం ఓపికగా ఎదురుచూశాడు.తుదిజట్టులో కష్టమేసాయి సుదర్శన్ గాయపడటంతో ఎట్టకేలకు సర్ఫరాజ్ నిరీక్షణ ఫలించి.. శ్రీలంకతో తలపడే జట్టులో సుదర్శన్ స్థానాన్ని భర్తీ చేశాడు. అయితే, తుదిజట్టులో అతడికి చోటు దక్కడం ప్రస్తుత పరిస్థితుల్లో కష్టంగానే ఉంది. సాయి సుదర్శన్ ఆడే మూడోస్థానానికి దేవదత్ పడిక్కల్ సిద్ధంగా ఉన్నాడు. దీంతో సర్ఫరాజ్ ఆరో స్థానం కోసం చూస్తుండగా.. వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ రూపంలో పోటీ ఉంది.సర్ఫరాజ్ వద్దు.. అతడినే ఆడించండిఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ కిరణ్ మోరే కీలక వ్యాఖ్యలు చేశాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘సర్ఫరాజ్ కంటే ధ్రువ్ జురెల్‌కే తుదిజట్టులో ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే గత కొంతకాలంగా టెస్టు క్రికెట్లో అతడు మెరుగ్గా రాణిస్తున్నాడు.జురెల్ మంచి ఫీల్డర్ కూడా!.. సర్ఫరాజ్ రీప్లేస్మెంట్ ప్లేయర్‌గా జట్టులోకి వచ్చాడు. కాబట్టి అవకాశాల కోసం అతడు ఎదురుచూడాల్సిందే’’ అని కిరణ్ మోరే చెప్పుకొచ్చాడు. పరోక్షంగా సర్ఫరాజ్‌ను కాదని.. జురెల్నే ఆడించాలని సూచించాడు. కాగా జురెల్ కంటే సర్ఫరాజ్ గణాంకాలే మెరుగ్గా ఉన్నాయి. ఆరు మ్యాచ్‌లలో కలిపి సర్ఫరాజ్ 37 సగటుతో పరుగులు రాబట్టగా.. జురెల్ సగటు 34. అంతేకాదు గత ఐదు మ్యాచ్‌లలో జురెల్ బాగా ఇబ్బందిపడ్డాడు. ఇటీవల శ్రీలంక ఎలెవన్‌తో వార్మప్ మ్యాచ్‌లోనూ జురెల్ రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 1, 17 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు.చదవండి: IND vs AFG: బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన బీసీసీఐ -
IND vs SL: టీమిండియా దిగ్గజ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు
టీమిండియా కీలక సిరీస్‌కు సిద్ధమైంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) 2025-27 సీజన్లో భాగంగా శ్రీలంకతో రెండు మ్యాచ్‌లు ఆడేందుకు సన్నద్ధమైంది. ఇందుకోసం ఇప్పటికే లంకకు చేరుకున్న టీమిండియాకు.. వార్మప్ మ్యాచ్‌తో కావాల్సినంత ప్రాక్టీస్ దొరికింది.ముగ్గురు కీలక ఆటగాళ్లు దూరంఈ సిరీస్‌లో 2-0తో గెలిస్తేనే డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్ ఫైనల్ రేసులో టీమిండియా నిలవగలుగుతుంది. అయితే, ఈ కీలక మ్యాచ్‌లకు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, బ్యాటర్ సాయి సుదర్శన్ దూరమయ్యారు. గాయాల వల్ల ఈ ముగ్గురూ సిరీస్‌కు అందుబాటులో లేకుండా పోయారు.ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి కీలక సూచనలు చేశాడు. ఆటగాళ్లు గాయాల బెడద, టెస్టు క్రికెట్లో సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే తప్పక దేశవాళీ క్రికెట్ ఆడాలని సూచించాడు. ఈ మేరకు JITO ప్రీమియర్ లీగ్ ఆరంభం సందర్భంగా మాట్లాడుతూ..అదే అత్యంత ముఖ్యం‘‘ప్రతి ఆటగాడు దేశవాళీ క్రికెట్ ఆడటం అత్యంత ముఖ్యం. ఇటీవలి కాలంలో భారత జట్లు స్పిన్ ఆడేందుకు ఇబ్బంది పడటం చూస్తున్నాం. ఇందుకు కారణం వారు దేశీ క్రికెట్ ఆడకపోవడమే.బీసీసీఐ ఈ విషయంలో కాస్త కఠినంగానే వ్యవహరించాలి. ప్రతి ఒక్క ఆటగాడు మల్టీ-డే మ్యాచ్‌లు ఆడేలా చూడాలి. సీనియర్లను చూసి యువ ఆటగాళ్లు కూడా ఎంతో నేర్చుకుంటారు. వారితో కలిసి ఆడటం వల్ల యువ ప్లేయర్లలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.మనోళ్లు తేలిపోతున్నారుఇటీవల టీమిండియా ఎన్నో టీ20, వన్డే మ్యాచ్‌లు ఆడింది. అయితే, స్పిన్ బౌలింగ్‌లో మనోళ్లు అత్యుత్తమంగా రాణించలేకపోయారు. ఇక టెస్టు ఫార్మాట్ మరింత భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఇంకాస్త జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది’’ అని కపిల్ దేవ్ టీమిండియాతో పాటు బీసీసీఐకి సూచించాడు. కాగా శ్రీలంకతో ఆగష్టు 15 నుంచి టీమిండియా తొలి టెస్టు మొదలుకానుంది. ఇందుకు గాలె వేదిక. చదవండి: IND vs AFG: బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన బీసీసీఐ -
అతడు లేకపోవడం టీమిండియాకు లోటు: శ్రీలంక మాజీ స్టార్
శ్రీలంక- టీమిండియా మధ్య టెస్టు సిరీస్‌కు రంగం సిద్ధమైంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరుజట్ల మధ్య ఆగష్టు 15న తొలి టెస్టు మొదలుకానుంది. ఇందుకు గాలె వేదిక. కాగా భారత జట్టు శ్రీలంక గడ్డపై 2017 తర్వాత టెస్టు సిరీస్ ఆడటం ఇదే మొదటిసారి.ఈ నేపథ్యంలో శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్ ఫర్వేజ్ మహరూఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ లేనిలోటు టీమిండియాకు తప్పక కనిపిస్తుందన్నాడు. IANSతో మాట్లాడుతూ..అశూ లేకపోవడం అతిపెద్ద లోటు‘‘ఈసారి టీమిండియా అశ్విన్‌ను బాగా మిస్సవుతుంది. శ్రీలంక గడ్డ మీద అతడు గతంలో అద్భుతంగా రాణించాడు. ఇక్కడి టర్నింగ్ పిచ్‌లు అతడికి స్వర్గధామం. శ్రీలంక పిచ్ పరిస్థితులకు అశూ సరైన బౌలర్’’ అని ఫర్వేజ్ మహరూఫ్ పేర్కొన్నాడు.కాగా 2015, 2017లో శ్రీలంక గడ్డపై టెస్టు సిరీస్‌లలో టీమిండియా గెలుపులో అశ్విన్‌దే కీలక పాత్ర. ఆరు మ్యాచ్‌లలో కలిపి అతడు 38 వికెట్లు కూల్చాడు. ఇందులో మూడుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. అంతేకాదు బ్యాట్‌తోనూ అశూ దుమ్ములేపాడు. రెండు అర్థ శతకాలతో సత్తా చాటాడు.అదరగొడుతున్న సుతార్ ఇదిలా ఉంటే.. శ్రీలంక పర్యటనకు వెళ్లిన తాజా భారత జట్టులో ప్రస్తుతం నలుగురు స్పిన్నర్లు ఉన్నారు. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లతో పాటు యువ స్పిన్నర్ మానవ్ సుతార్, వెటరన్ ఆటగాడు సారాంశ్ జైన్ కూడా ఉన్నారు. మానవ్ ఇప్పటికే అరంగేట్రం చేయగా.. సారాంశ్ టీమిండియాకు ఎంపిక కావడం ఇదే తొలిసారి.నాకు అవకాశం ఉంటే గనుక..ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పు గురించి కూడా ఫర్వేజ్ మహరూఫ్ స్పందించాడు. ‘‘కొన్ని నెలల క్రితం అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా మానవ్ సుతార్ అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే రాణించాడు. ఇటీవల శ్రీలంక ఎలెవన్ జట్టుతో వార్మప్ మ్యాచ్‌లోనూ బంతి, బ్యాట్‌తో సత్తా చాటాడు.అయితే, తుదిజట్టులో రవీంద్ర జడేజాతో పాటు మానవ్ సుతార్‌కు కూడా చోటిస్తారా? అనేదే ప్రస్తుత ప్రశ్న. కుల్దీప్ యాదవ్ ఎలాగో తుదిజట్టులో ఉంటాడు. ఇక సారాంశ్ జైన్ ఇంకా అరంగేట్రం చేయలేదు. అయితే, అతడు డీసెంట్ బౌలర్. నాకే గనుక అవకాశం ఉంటే.. గాలె టెస్టుకు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్‌లను ఎంపిక చేస్తాను’’ అని ఫర్వేజ్ మహరూఫ్ చెప్పుకొచ్చాడు. కాగా శ్రీలంకతో సిరీస్ టీమిండియాకు అత్యంత ముఖ్యమైనది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సీజన్లో ఫైనల్ రేసులో ఉండాలంటే లంకను భారత్ 2-0తో వైట్‌వాష్ చేయాల్సిందే.చదవండి: T20 WC 2028: పోర్చుగల్ కెప్టెన్‌గా SRH మాజీ ప్లేయర్ -
గౌతమ్ గంభీర్ రికార్డుపై కన్నేసిన రవీంద్ర జడేజా
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా దాదాపు 8 నెలల తర్వాత తిరిగి జాతీయ జట్టు తరపున ఆడేందుకు సిద్దమయ్యాడు. ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా శ్రీలంకతో జరగనున్న తొలి టెస్టులో జడేజా బరిలోకి దిగనున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు జడేజాను పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. జడేజా ముందున్న రికార్డులు ఇవే👉ఈ మ్యాచ్‌లో జడేజా మరో రెండు వికెట్లు పడగొడితే టెస్టుల్లో 350 వికెట్లు మైలు రాయిని అందుకున్న ఐదో భారత బౌలర్‌గా నిలుస్తాడు.👉అదేవిధంగా మరో 4 వికెట్లు సాధిస్తే శ్రీలంకపై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో ఐదో స్దానానికి చేరుకుంటాడు. ప్రస్తుతం ఈ రికార్డు వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ పేరిట ఉంది. ఇషాంత్ శర్మ 12 టెస్టుల్లో 36 వికెట్లు తీయగా, జడేజా 7 టెస్టుల్లోనే 23.72 సగటుతో 33 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో అనిల్ కుంబ్లే (74 వికెట్లు), రవిచంద్రన్ అశ్విన్ (62), హర్భజన్ సింగ్ (53), కపిల్ దేవ్ (45) మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నారు. 👉అదేవిధంగా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ రికార్డుపై కూడా అతడు కన్నేశాడు. మరో 60 పరుగులు చేస్తే టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో గంభీర్(4,154)ను జడ్డూ అధిగమిస్తాడు. కాగా జడేజా మంచి టచ్‌లో ఉన్నాడు. శ్రీలంక ఎలెవన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో జడేజా బ్యాట్‌తో పాటు బంతితో కూడా రాణించాడు.చదవండి: వైభవ్ కాదు.. అతడి సెలక్షన్ ఒక అద్భుతం! -
‘సంగక్కర బూతులు తిట్టాడు’
టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ శ్రీలంక దిగ్గజం కుమార్ సంగక్కర గురించి ఆసక్తికర విషయం వెల్లడించాడు. 2005 నాటి ఢిల్లీ టెస్టు సందర్భంగా సంగక్కర బూతులు తిట్టాడని.. తాను కూడా అందుకు గట్టిగానే బదులిచ్చానని తెలిపాడు.కాగా 2005లో మూడు టెస్టులు ఆడేందుకు శ్రీలంక క్రికెట్ జట్టు భారత్‌కు వచ్చింది. ఇందులో భాగంగా చెన్నైలో తొలి మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. ఈ క్రమంలో ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో భారత్ 188 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్ సందర్భంగా టీమిండియా మేనేజ్మెంట్ అనూహ్య నిర్ణయం తీసుకుంది.సెంచరీ మిస్ఓపెనర్ గౌతం గంభీర్‌కు జోడీగా బౌలింగ్ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్‌ను పంపింది. అయితే, గంభీర్ మూడు పరుగులకే నిష్క్రమించగా.. ఊహించని రీతిలో ఇర్ఫాన్ పఠాన్ 93 పరుగులు సాధించాడు. సెంచరీకి కేవలం ఏడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఇర్ఫాన్ ఇన్నింగ్స్ కారణంగా భారత్ మెరుగైన స్కోరు సాధించింది. ఆ తర్వాత లంకను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసి జయభేరి మోగించింది.మురళీధరన్ బౌలింగ్‌లో సిక్సర్లునాటి సంగతులను ఇర్ఫాన్ పఠాన్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. చీకీ సింగిల్స్‌లో మాట్లాడుతూ.. ‘‘ఢిల్లీలో టెస్టు మ్యాచ్. రెండో ఇన్నింగ్స్‌లో నేను ఓపెనర్‌గా వచ్చి 93 పరుగులు చేశాను. అపుడు శ్రీలంక ఆటగాళ్లు ఎందుకో అసంతృప్తిగా కనిపించారు.సంగక్కర బూతులు తిట్టాడుముఖ్యంగా సంగక్కర కోపంగా ఉన్నాడు. నేను బ్యాటింగ్ చేయడానికి వెళ్లినపుడు అసలేం జరిగిందో తెలియలేదు. ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్‌లో నేను రెండు సిక్సర్లు బాదాను. కొత్త బంతిని ఎదుర్కొంటూ మురళీధరన్ బౌలింగ్‌లో షాట్లు కొట్టగానే వారి ముఖాలు మారిపోయాయి.దీనర్థం మేము వారి ప్రణాళికలను ఛిన్నాభిన్నం చేశాము. ఆ వెంటనే సంగక్కర.. ‘మీరు మోసగాళ్లు. మీ తల్లిదండ్రులు మీకు ఏం నేర్పారు?’ అంటూ బూతులు అందుకున్నాడు. వ్యక్తిగతంగానూ నన్ను మాటలు అన్నాడు. నేనూ ఊరుకోకుండా.. తిరిగి అతడిని తిట్టాడు. ఏదేమైనా ముందైతే అతడు మొదలుపెట్టాడు.మంచి స్నేహితులమయ్యాముఆ తర్వాత మేము ఐపీఎల్లో పంజాబ్‌కు కలిసి ఆడాల్సి వచ్చింది. ఇద్దరి కుటుంబాలు కలిసి కూర్చుని తినాల్సిన పరిస్థితి. అప్పుడు నేను సంగక్కర దగ్గరికి వెళ్లి సారీ చెప్పాను. అతడు కూడా క్షమాపణ కోరాడు.అప్పటి నుంచి మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాము. మ్యాచ్ సమయంలో మా భావోద్వేగాలను నియంత్రించుకోలేక ఆరోజు అలా తిట్టుకున్నాము. మనుషులు పొరపాట్లు చేయడం సహజం. అయితే, పరిణతితో వాటిని ఎలా సరిదిద్దుకున్నామనేదే ముఖ్యం’’ అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు. కాగా ఆనాటి మూడో టెస్టులోనూ శ్రీలంకపై గెలిచి టీమిండియా 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. చదవండి: చరిత్ర సృష్టించనున్న టీమిండియా -
జట్టుకు దూరమైన సర్ఫరాజ్ ఖాన్
ముంబై స్టార్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మేజర్ టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. దేశవాళీ ప్రతిష్టాత్మక రెడ్‌బాల్ టోర్నీ దులిప్ ట్రోఫీ 2026 సీజన్‌కు అతడు అందుబాటులో ఉండటం లేదు. టీమిండియా నుంచి అకస్మాత్తుగా పిలుపు రావడంతో.. సర్ఫరాజ్ ఖాన్ వెస్ట్ జోన్ జట్టును వీడాడు.కాగా దేశవాళీ క్రికెట్లో సర్ఫరాజ్ ఖాన్‌కు ఉన్న రికార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫస్ట్క్లాస్క్రికెట్లో ఇప్పటికే ఐదు వేలకు పైగా పరుగులు సాధించిన ఈ ముంబైకర్.. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2024లో ఎట్టకేలకు అంతర్జాతీయ క్రికెట్లో అడుగపెట్టాడు.2024లో చివరిగా టీమిండియా తరఫునఇప్పటి వరకు టీమిండియా తరఫున ఆరు టెస్టు మ్యాచ్‌లు ఆడిన సర్ఫరాజ్ ఖాన్.. 371 పరుగులు సాధించాడు. అయితే, అదే ఏడాది చివరగా న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌కు తర్వాత అవకాశాలు కనుమరుగయ్యాయి. దీంతో ఫిట్‌నెస్‌పై దృష్టి సారించిన సర్పరాజ్ ఖాన్.. భారీగా బరువు తగ్గి స్లిమ్‌గా తయారయ్యాడు.సాయి సుదర్శన్ స్థానంలోదేశీ క్రికెట్లోనూ మరోసారి సత్తా చాటాడు. అయినప్పటికీ టీమిండియా సెలక్టర్ల నుంచి సర్ఫరాజ్‌కు పిలుపు రాలేదు. అయితే, శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ఎంపికైన సాయి సుదర్శన్ గాయం నుంచి కోలుకోకపోవడం అతడి పాలిట వరంగా మారింది. దీంతో తాజాగా సాయి స్థానాన్ని సర్ఫరాజ్‌తో భర్తీ చేస్తూ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు.ఈ నేపథ్యంలో టీమిండియాతో చేరేందుకు సర్ఫరాజ్ ఖాన్ శ్రీలంకకు పయనమయ్యాడు. ఈ క్రమంలో వెస్ట్ జోన్ జట్టుకు అతడు దూరం కాగా.. సెలక్టర్లు జై గోహిల్‌కు పిలుపునిచ్చారు. ఈ విషయం గురించి వెస్ట్ జోన్, ముంబై చీఫ్ సెలక్టర్ రాజేశ్ పవార్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. జై గోహిల్‌కు అవకాశం‘‘సర్ఫరాజ్ స్థానంలో గోహిల్‌ను ఎంపిక చేశాము. నిజానికి అతడు స్టాండ్ బై ప్లేయర్‌గా ఉండేవాడు. ఇప్పుడు ప్రధాన జట్టులోకి తీసుకున్నాము. రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర తరఫున అతడు అద్భుత ప్రదర్శన కనబరిచాడు’’ అని రాజేశ్ పవార్ పేర్కన్నాడు.కాగా వెస్ట్ జోన్ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ కాగా.. షామ్స్ ములానీ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇక ఆగష్టు 23 నుంచి సెప్టెంబరు 10 వరకు దులిప్ ట్రోఫీ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. మరోవైపు.. టీమిండియా- శ్రీలంక మధ్య ఆగష్టు 15 నుంచి తొలి టెస్టు.. ఆగష్టు 23 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది.దులిప్ ట్రోఫీ 2026 సీజన్‌కు వెస్ట్ జోన్ జట్టు (అప్డేటెడ్)రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), షామ్స్ ములాని (వైస్ కెప్టెన్), హర్విక్ దేశాయ్ (వికెట్ కీపర్), ఉర్విల్ పటేల్ (వికెట్ కీపర్), జైమీద్ పటేల్, పృథ్వీ షా, శివాలిక్ శర్మ, సిద్దార్థ్ దేశాయ్, జై గోహిల్, ముషీర్ ఖాన్, అతీత్ షేత్, ముకుశ్ చౌదరి, తనుశ్ కొటియాన్, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే.చదవండి: నా కాబోయే భర్త అలా ఉండాలి: సారా టెండుల్కర్ -
కలిసి అరంగేట్రం చేశారు.. ఇప్పుడేమో కుస్తీ పడుతున్నారు..!
ప్రస్తుతం భారత టెస్ట్ జట్టులో ఆసక్తికర పోటీ నెలకొంది. ఒకప్పుడు ఒకే మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్.. ఇప్పుడేమో ఒకే స్థానం కోసం కుస్తీ పడుతున్నారు.2024 ఫిబ్రవరి 15న రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌లో ఇద్దరూ ఒకేసారి భారత టెస్ట్ క్యాప్ అందుకున్నారు. సర్ఫరాజ్ దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించి జట్టులోకి రాగా.. రిషభ్ పంత్‌కు బ్యాకప్ వికెట్ కీపర్‌గా జురెల్‌కు అవకాశం దక్కింది.అయితే అరంగేట్రం తర్వాత ఇద్దరి ప్రయాణం పూర్తిగా మారిపోయింది. సుమారు రెండేళ్ల తర్వాత సర్ఫరాజ్ ఆరు టెస్టులకే పరిమితం కాగా.. జురెల్ 10 టెస్టులు ఆడి భారత జట్టు మేనేజ్మెంట్ నమ్మకాన్ని సంపాదించాడు.అయితే తాజాగా సమీకరణలు మారిపోయాయి. లంక టూర్‌కు తొలుత ఎంపికైన సాయి సుదర్శన్ గాయపడటంతో సర్ఫరాజ్ ఖాన్‌కు అనూహ్యంగా జట్టు నుంచి పిలుపు వచ్చింది. ఇదివరకే జట్టులో ఉన్న జురెల్ వార్మప్ మ్యాచ్‌లో విఫలం కావడంతో ఇద్దరి మధ్య పోటీ నెలకొంది. వార్మప్ మ్యాచ్‌లో వన్ డౌన్లో బరిలోకి దిగిన దేవదత్ పడిక్కల్ సూపర్ సెంచరీతో తుది జట్టులో తన స్థానాన్ని ఖాయం చేసుకోగా.. సర్ఫరాజ్ రాకతో జురెల్ స్థానం ప్రశ్నార్థకంగా మారింది.స్పెషలిస్ట్ వికెట్‌కీపర్‌గా రిషబ్ పంత్ జట్టులో ఉన్న నేపథ్యంలో మేనేజ్మెంట్ జురెల్‌కు అవకాశం ఇస్తుందో లేక స్పెషలిస్ట్ బ్యాటర్ అన్న కోణంలో సర్ఫరాజ్‌కు రీఎంట్రీ అవకాశం ఇస్తుందో చూడాలి. మొత్తానికి కలిసి అరంగేట్రం చేసిన ఇద్దరు ప్లేయర్ల మధ్య ప్రస్తుతం తీవ్రమైన పోటీ నెలకొంది.శ్రీలంకతో తొలి టెస్ట్‌కు టీమిండియా (అంచనా)కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్/సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్ -
చరిత్ర సృష్టించనున్న టీమిండియా
భారత క్రికెట్ చరిత్రలో మరో అరుదైన అధ్యాయం ఆవిష్కృతం కానుంది. 2026 ఆగస్టు 15న, దేశం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ టీమిండియా చారిత్రక 600వ టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. శ్రీలంకతో గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌తో భారత టెస్ట్ క్రికెట్లో సరికొత్త మైలురాయిని చేరుకోనుంది. శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో భారత్ ఈ చారిత్రక టెస్ట్ బరిలో దిగనుంది.ఇంగ్లండ్, ఆస్ట్రేలియా తర్వాత భారత్600 టెస్టులు ఆడిన జట్ల జాబితాలో ఇప్పటివరకు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు భారత్ ఈ ప్రత్యేక జాబితాలో చేరనుంది. అలాగే 600 టెస్టుల మైలురాయిని తాకిన తొలి ఆసియా దేశంగానూ భారత్ చరిత్ర సృష్టించనుంది.టెస్ట్ క్రికెట్లో భారత ప్రస్థానం 1932లో ప్రారంభమైంది. అప్పటి నుంచి 94 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో భారత క్రికెట్ ఎన్నో మలుపులు, మరపురాని విజయాలు, దిగ్గజ ఆటగాళ్లను చూసింది.1932లో మొదలైన ప్రయాణంభారత్ తొలి టెస్ట్ మ్యాచ్‌ను 1932 జూన్ 25న ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో ఆడింది. సీకే నాయుడు నాయకత్వంలో ప్రారంభమైన ఆ ప్రయాణం ఇప్పుడు 600వ మ్యాచ్‌కు చేరుకుంది.భారత్ టెస్ట్ ప్రస్థానంలోని ముఖ్యమైన మైలురాళ్లు ఇవే:1వ టెస్ట్: 1932, ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో కెప్టెన్: సీకే నాయుడు100వ టెస్ట్: 1967, ఆస్ట్రేలియాతో కెప్టెన్: మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ200వ టెస్ట్: 1982, పాకిస్థాన్‌తో కెప్టెన్: సునీల్ గవాస్కర్500వ టెస్ట్: 2016, న్యూజిలాండ్‌తో కెప్టెన్: విరాట్ కోహ్లీ600వ టెస్ట్: 2026, శ్రీలంకతో కెప్టెన్: శుభ్‌మన్ గిల్స్వాతంత్ర్య దినోత్సవం రోజున చారిత్రక ఘట్టంఆగస్టు 15.. భారతీయులకు ఎంతో ప్రత్యేకమైన రోజు. అదే రోజున టీమిండియా తన 600వ టెస్ట్ మ్యాచ్ ఆడటం ఈ ఘట్టానికి మరింత ప్రత్యేకతను తీసుకొస్తోంది.1932లో సీకే నాయుడు నాయకత్వంలో మొదలైన భారత టెస్ట్ ప్రయాణం.. పటౌడీ, గవాస్కర్, కపిల్ దేవ్, అజారుద్దీన్, సచిన్, గంగూలీ, ద్రవిడ్, ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజ తరాలను దాటి ఇప్పుడు గిల్ తరం వరకు వచ్చింది.ఇదిలా ఉంటే, టీమిండియా రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్ ఆగస్ట్ 15న ప్రారంభం కానుండగా.. రెండో టెస్ట్ కొలొంబో వేదికగా ఆగస్ట్ 23న మొదలవుతుంది. -
స్పిన్నర్లతో తలనొప్పి.. కుల్దీప్ యాదవ్‌కు నో ఛాన్స్?!
శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు టీమిండియా పూర్తిస్థాయిలో సిద్ధమైంది. శ్రీలంక క్రికెట్ ఎలెవన్‌తో మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌ను భారత జట్టు సద్వినియోగం చేసుకుంది. సమిష్టిగా రాణించి విజయం సాధించింది. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్ ద్వారా టీమిండియాకు కావాల్సినంత ప్రాక్టీస్ దొరికింది.ఈ నేపథ్యంలో గాలె వేదికగా శ్రీలంకతో జరిగే తొలి టెస్టులో పాల్గొనే భారత తుదిజట్టు కూర్పు గురించి చర్చ మొదలైంది. ముఖ్యంగా స్పిన్ విభాగంలో ఎవరికి చోటు దక్కుతుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా శ్రీలంకలోనూ టర్నింగ్ పిచ్‌లు ఉంటాయి.అదరగొట్టిన జడ్డూ, మానవ్ఇక వార్మప్ మ్యాచ్‌లో స్పిన్ విభాగంలో ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, మానవ్ సుతార్ అద్భుతంగా రాణించారు. లంక తొలి ఇన్నింగ్స్‌లో చెరో రెండు వికెట్లు తీసిన వీరిద్దరు.. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో జడ్డూ 63 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగగా.. మానవ్ 41 పరుగులు సాధించాడు.తేలిపోయిన సారాంశ్ఇక లంక రెండో ఇన్నింగ్స్‌లో జడ్డూ రెండు వికెట్లు తీయగా.. మానవ్ పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్లు తీయలేకపోయాడు. అనంతరం లక్ష్య ఛేదనలో జడ్డూ 22 పరుగులు, మానవ్ 4 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగారు. అయితే, ఈ మ్యాచ్‌లో మరో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్ వికెట్లు తీయలేకపోయాడు. పెద్దగా పరుగులు కూడా రాబట్టలేకపోయాడు.మరోవైపు.. లంక తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీసిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం బౌలింగ్‌కు రాలేదు. ఈ నేపథ్యంలో తొలి టెస్టు తుదిజట్టులో ఈ నలుగురిలో ఎవరికి అవకాశం వస్తుందన్న అంశంపై టీమిండియా స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులె స్పందించాడు.కుల్దీప్‌నకు నో ఛాన్స్?!‘‘గాలెకు చేరుకుని పిచ్‌ను పరిశీలించిన తర్వాతే తుదిజట్టుపై నిర్ణయం జరుగుతుంది. అయితే, మా జట్టులోని నలుగురు స్పిన్నర్లు ఎవరికి వారే ప్రత్యేకం. జడ్డూ అనుభవజ్ఞుడు. మానవ్ సుతార్ కూడా అద్భుతంగా ఆడుతున్నాడు.ఇక సారాంశ్ జైన్ దేశీ క్రికెట్లో సత్తా చాటి టీమిండియాలోకి వచ్చాడు. కుల్దీప్ యాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జట్టుకు ఎల్లప్పుడూ మణికట్టు స్పిన్నర్ అవసరం ఉంటుంది. మా నలుగురు స్పిన్నర్లు వైవిధ్యమైన బౌలర్లు. అయితే, పరిస్థితులకు తగ్గట్లే గాలెలో నిర్ణయం తీసుకుంటాం’’ అని సాయిరాజ్ బహుతులె తెలిపాడు.అందుకే బౌలింగ్ చేయలేదుఅదే విధంగా.. వార్మప్ మ్యాచ్‌లో లంక రెండో ఇన్నింగ్స్‌లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్ చేయకపోవడంపై సాయిరాజ్ వివరణ ఇచ్చాడు. ‘‘అతడు మెరుగ్గా ఆడాడు. వికెట్లు తీశాడు. అయితే, తనే విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. మిగిలిన వారికి కూడా బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వాలని భావించాడు. కుల్దీప్ దాదాపు 20 ఓవర్లకు పైగా బౌలింగ్ చేశాడు. కాబట్టి రెస్ట్ తీసుకున్నాడు’’ అని సాయిరాజ్ తెలిపాడు. కాగా భారత్- శ్రీలంక మధ్య ఆగష్టు 15 నుంచి తొలి టెస్టు మొదలుకానుండగా.. ఇందుకు గాలె వేదిక.శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు భారత జట్టుశుబ్‌మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాంశ్ జైన్, ఆకిబ్ నబీ.చదవండి: గిల్, అభిషేక్ కాదు.. అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్ ఇతడే! -
భయపెడుతున్న గాయాలు.. గిల్ ఫిట్‌నెస్‌పై కీలక అప్డేట్!
శ్రీలంకతో తొలి టెస్టుకు ముందు భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఫిట్‌నెస్‌పై జట్టు మేనేజ్మెంట్ కీలక అప్డేట్ ఇచ్చింది. తొలి టెస్టుకు ముందు లంకతో ఆడిన మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో బరిలోకి దిగిన గిల్ చేతి వేలికి చిన్న గాయమైన సంగతి తెలిసిందే. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దూరంగా ఉన్న గిల్.. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చి 44 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే బ్యాటింగ్ చేసే సమయంలో గిల్ చేతి వేలి గాయంతో ఏమైనా బాధపడ్డాడా లేక బాగానే ఉన్నాడా అన్నదానిపై భారత బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే స్పందించాడు. 'నెట్ ప్రాక్టీస్ సందర్భంగా స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న గిల్ చేతి వేలికి చిన్న గాయమైంది. అయితే అతడికి అయిన గాయం మైనర్దే అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగానే వార్మప్ మ్యాచ్‌లో తొలి రెండు రోజులు ఆటకు దూరంగానే ఉన్నాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన గిల్ ఎలాంటి ఇబ్బంది లేకుండా కనిపించాడు. దీంతో అతడి చేతివేలి గాయం పూర్తిగా తగ్గిపోయినట్లే. తన బ్యాటింగ్‌తో తొలి టెస్టుకు దూరమవుతాడన్న సందేహాలను కూడా గిల్ పటాపంచలు చేశాడు. ఇది చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఇప్పటికే టీమిండియాకు ఎంపికైన 13 మంది ఆటగాళ్లు ప్రస్తుతం గాయాల బారిన పడి బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)లో పునరావాస కేంద్రంలో గడుపుతున్నారు. ఇలాంటి సమయంలో మరే ఆటగాడు గాయపడ్డా టీమిండియాకు ఎదురుదెబ్బ అవుతుందని భయపడుతున్నాం. అందుకే గిల్‌కు చిన్న గాయమే అయినప్పటికీ, పూర్తిగా కోలుకోవాలనే వార్మప్ మ్యాచ్‌లో తొలి రెండు రోజులు ఆడించలేదు. చేతి వేలి గాయం మానడంతో చివరి రోజు బ్యాటింగ్‌కు దిగిన గిల్ మంచి ఈజ్‌తో బ్యాటింగ్ చేసి తొలి టెస్టుకు పూర్తి స్థాయిలో సిద్ధమైనట్లు పరోక్షంగా సంకేతాలిచ్చాడు.' అని చెప్పుకొచ్చాడు. లంకతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన గిల్ 55 బంతుల్లో 44 పరుగులు చేశాడు. 21వ ఓవర్లో కేషారా నువంతా బౌలింగ్‌లో గిల్ వెనుదిరిగాడు. ఇక గిల్ గాయం మొదట మేనేజ్మెంట్ను భయపెట్టినప్పటికీ, అతడు పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించడంతో ఊపిరి పీల్చుకుంది. ఇక 2025 నుంచి గిల్ టెస్టుల్లో నాలుగో స్థానంలో వస్తున్నాడు. అంతకముందు 2020 నుంచి 2023 వరకు గిల్ టెస్టుల్లో ఓపెనర్‌గా ఆడాడు. అయితే జైస్వాల్‌కు జతగా కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా అదరగొట్టడంతో వీరి జోడినే శ్రీలంక టెస్టు సిరీస్‌లోనూ కంటిన్యూ చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ లెక్కన గిల్ మరోసారి నాలుగో స్థానంలోనే బ్యాటింగ్‌కు రానున్నాడు. ఇక టెస్టుల్లో గిల్‌కు నాలుగో స్థానంలో మంచి రికార్డు ఉంది. 14 ఇన్నింగ్స్‌ల్లో 88.75 సగటుతో గిల్ ఆరు సెంచరీలు సాధించడం విశేషం. లంకతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా తొలి టెస్టును ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ఆడనుంది.Read: ఐదేళ్ల వయసులోనే MMA చాంపియన్.. ఎవరీ బుడ్డోడు! -
సాయి సుదర్శన్ స్థానంలో ముంబై బ్యాటర్.. బీసీసీఐ అధికారిక ప్రకటన
శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాలో కీలక మార్పు జరిగింది. గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమైన సాయి సుదర్శన్ స్థానంలో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. సాయి కుడి కాలివేలికి గాయం కావడంతో శ్రీలంక పర్యటనకు దూరమయ్యాడు.బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చికిత్స తీసుకుంటున్న సాయి.. జట్టుతో చేరేందుకు అవసరమైన ఫిట్నెస్ క్లియరెన్స్ పొందలేకపోయాడు. సాయి గాయం నుంచి క్రమంగా కోలుకుంటున్నాడని, బీసీసీఐ మెడికల్ టీమ్ అతడి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని బోర్డు వెల్లడించింది.శ్రీలంకకు వెళ్లనున్న సర్ఫరాజ్సర్ఫరాజ్ ఖాన్ కొలంబోలో భారత జట్టుతో కలవనున్నాడు. అక్కడి నుంచి టీమిండియా గాలేకు వెళ్లనుంది. శ్రీలంకతో తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది.సాయి స్థానంలో జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. వార్మప్ మ్యాచ్‌లో దేవదత్ పడిక్కల్ సెంచరీ చేయడంతో నంబర్ 3 స్థానం అతడికి దాదాపుగా ఖరారైపోయింది.శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు అప్డేటెడ్ టీమిండియా ఇదే..శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారంశ్ జైన్, ఆకిబ్ నబీ, సర్ఫరాజ్ ఖాన్ఊహించని అవకాశందేశవాళీ క్రికెట్లో భారీగా పరుగులు సాధించిన తర్వాత సర్ఫరాజ్ ఖాన్ 2024లో ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్ టెస్టులో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తొలి సిరీస్‌లోనే అతడు ఆకట్టుకున్నాడు. మూడు అర్ధ సెంచరీల సాయంతో 200 పరుగులు చేశాడు.అదే ఏడాది బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ అద్భుతమైన సెంచరీ కూడా సాధించాడు. అయితే ఆ తర్వాతి మ్యాచ్‌ల్లో ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో భారత టెస్టు జట్టులో అతడి స్థానం ప్రశ్నార్థకంగా మారింది.2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అతడికి ఒక్క మ్యాచ్‌లోనూ అవకాశం రాలేదు. ఆ తర్వాత సర్ఫరాజ్ భారత టెస్టు జట్టు నుంచి దాదాపుగా కనుమరుగయ్యాడు.ఇప్పటివరకు సర్ఫరాజ్ ఆరు టెస్టులు ఆడి 371 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతడి టెస్టు బ్యాటింగ్ సగటు 37.1గా ఉంది. -
శ్రీలంకతో తొలి టెస్ట్.. భారత తుది జట్టు ఇదే..!
భారత్-శ్రీలంక మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆగస్ట్ 15 నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ గాలే వేదికగా జరుగనుండగా.. రెండో టెస్ట్ ఆగస్ట్ 23 నుంచి కొలొంబోలో జరుగనుంది.దీనికి ముందు శ్రీలంక ఎలెవెన్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి మాంచి జోరు ప్రదర్శించింది. ఈ మ్యాచ్‌తో భారత్‌కు మంచి బ్యాటింగ్ ప్రాక్టీస్ లభించింది. సాయి సుదర్శన్ గైర్హాజరీలో దేవదత్ పడిక్కల్ రూపంలో వన్ డౌన్లో మంచి ఆప్షన్ లభించింది. రెగ్యులర్ బ్యాటర్లు శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్. కేఎల్ రాహుల్ ఆకట్టుకున్నారు. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా బ్యాట్‌తో సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో పేసర్లు పెద్దగా ప్రభావం చూపకపోయినా, స్పిన్నర్లు పర్వాలేదనిపించారు. ఈ మ్యాచ్ ప్రదర్శనలను పరిగణలోకి తీసుకొని తొలి టెస్ట్‌లో టీమిండియా ఎలా ఉండబోతుందో ఓ అంచనా వేద్దాం.ఓపెనర్లు: కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్తొలి టెస్ట్‌లో వీరిద్దరూ ఓపెనర్లుగా బరిలోకి దిగడం ఖాయం. ఇద్దరూ వార్మప్ మ్యాచ్‌లో పరుగులు సాధించడం సానుకూల అంశం. జైస్వాల్ దూకుడుగా ఆడితే.. రాహుల్ పరిస్థితులకు తగ్గట్టుగా ఇన్నింగ్స్‌ను నిర్మించగలడు. శ్రీలంక బౌలర్లను ఎదుర్కోవడంలో ఈ జోడీ కీలకంగా మారనుంది.నంబర్ 3లో దేవదత్ పడిక్కల్సాయి సుదర్శన్ అందుబాటులో లేకపోవడంతో నంబర్ 3 స్థానంలో దేవదత్ పడిక్కల్‌కు అవకాశం దక్కడం ఖాయమైపోయింది. వార్మప్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో పడిక్కల్ అద్భుతమైన సెంచరీ సాధించి తన స్థానాన్ని కన్ఫర్మ్ చేసుకున్నాడు.నాలుగో స్థానంలో గిల్నంబర్ 4లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆడనున్నాడు. వార్మప్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో గాయం కారణంగా బ్యాటింగ్‌కు రాని గిల్.. రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగి మంచి టచ్‌లో కనిపించాడు.నంబర్ 5లో రిషభ్ పంత్‌కు చోటు దక్కే అవకాశం ఉంది. వార్మప్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అతడు విఫలమైనప్పటికీ.. టెస్టుల్లో భారత్‌కు ఉన్న అత్యుత్తమ వికెట్ కీపర్-బ్యాటర్లలో పంత్ ఒకడు. అందువల్ల అతడికి తుది జట్టులో చోటు దక్కడం దాదాపు ఖాయమే.నంబర్ 6లో ధ్రువ్ జురెల్‌కు అవకాశం లభించవచ్చు. వార్మప్ మ్యాచ్‌లో అతడూ పెద్దగా రాణించలేదు. అయినప్పటికీ టెస్టుల్లో బ్యాటింగ్ లైనప్‌ను మరింత లోతుగా ఉంచాలన్న భారత వ్యూహంలో భాగంగా జురెల్‌ను ఆడించే అవకాశం ఉంది.ఆల్రౌండర్లుగా జడేజా, సుతార్ఆల్రౌండర్ స్థానాల్లో రవీంద్ర జడేజాతో పాటు మానవ్ సుతార్‌కు చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. జడేజా టెస్టు క్రికెట్లో భారత్‌కు అత్యంత కీలకమైన ఆటగాళ్లలో ఒకడు. బ్యాటింగ్‌లో 38కు పైగా సగటుతో అతడు మిడిలార్డర్‌కు అదనపు బలం అందించగలడు.మరోవైపు సుతార్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో సుమారు 26 సగటు కలిగి ఉన్నాడు. నంబర్ 8 వరకు బ్యాటింగ్‌ను తీసుకెళ్లడంతో పాటు స్పిన్ బౌలింగ్‌లోనూ అతడు ఉపయోగపడనున్నాడు.స్పిన్ బాధ్యతలు కుల్దీప్వేగాలే పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో భారత్ ముగ్గురు ప్రధాన స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. జడేజా, సుతార్‌తో పాటు కుల్దీప్ యాదవ్ ప్రధాన స్పిన్నర్‌గా వ్యవహరించనున్నాడు. వార్మప్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కుల్దీప్ రెండు వికెట్లు పడగొట్టాడు. గాలేలో టర్నింగ్ పిచ్ లభిస్తే శ్రీలంక బ్యాటర్లకు అతడు పెద్ద సవాల్‌గా మారే అవకాశం ఉంది. శ్రీలంకలో ఇప్పటివరకు ఒకే ఒక్క టెస్టు ఆడిన కుల్దీప్.. ఆ మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు.పేసర్లుగా సిరాజ్, గర్నూర్ బ్రార్తొలి టెస్ట్‌లో భారత్ ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగాలని భావిస్తే.. సిరాజ్‌తో పాటు గర్నూర్ బ్రార్‌కు అవకాశం లభించవచ్చు. బ్రార్ వార్మప్ మ్యాచ్‌లో ఆకట్టుకున్నాడు.శ్రీలంకతో తొలి టెస్ట్‌కు టీమిండియా (అంచనా)కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్ -
సిరాజ్ హ్యాట్రిక్ సిక్సర్స్.. టీమిండియా గెలుపు
శ్రీలంక క్రికెట్ ఎలెవెన్‌తో జరిగిన మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 207 పరుగుల లక్ష్యాన్ని భారత్ 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైన యశస్వి జైస్వాల్ (61 రిటైర్ట్ హర్ట్) మెరుపు అర్ద సెంచరీ చేసి భారత గెలుపుకు గట్టి పునాది వేశాడు. గాయం కారణంగా తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక ఇన్నింగ్స్ (44) ఆడాడు. ఆఖర్లో సిరాజ్ (32 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు) హ్యాట్రిక్ సిక్సర్స్‌తో విరుచుకుపడి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. టార్గెట్ 207లంక ఎలెవెన్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి, టీమిండియా ముందు 207 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. నిషాన్ మధుష్క (63 రిటైర్డ్ హర్ట్) అర్ద సెంచరీతో రాణించగా.. అంజల బండార (35), నిపున్ ధనంజయ (46) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్, రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు తీయగా.. సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ చెరో వికెట్ దక్కించుకున్నారు.పడిక్కల్ అజేయ శతకంభారత్ తొలి ఇన్నింగ్స్‌ను 357 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దేవదత్ పడిక్కల్ (142 నాటౌట్) అజేయ సెంచరీతో సత్తా చాటాడు. రవీంద్ర జడేజా (63 రిటైర్డ్ హర్ట్) అర్ద సెంచరీతో రాణించగా.. కేఎల్ రాహుల్ (40), మానవ్ సుతార్ (41), గుర్నూర్ బ్రార్ (36 నాటౌట్), సరాన్ష్ జైన్ (22 రిటైర్డ్ హర్ట్) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో అసంక మనోజ్, రమేశ్ మెండిస్ తలో 2 వికెట్లు తీయగా.. విశ్వ ఫెర్నాండో, కేశర నువంత చెరో వికెట్ దక్కించుకున్నారు.దీనికి ముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. నిషాన్ మధుష్క (66), రవిందు రషాంత (71), సోనల్ దినుష (52) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్ తలో 2 వికెట్లు తీయగా.. బ్రార్ చెరో వికెట్ దక్కించుకున్నారు.కాగా, ఈ మ్యాచ్ తర్వాత భారత జట్టు శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్ మ్యాచ్ గాలే వేదికగా ఆగస్ట్ 15 నుంచి మొదలుకానుంది. రెండో టెస్ట్ కొలంబో వేదికగా ఆగస్ట్ 23న ప్రారంభం కానుంది. -
టీమిండియాకు గ్రేట్ న్యూస్.. టచ్‌లోకి వచ్చిన జైస్వాల్, గిల్
శ్రీలంక క్రికెట్ ఎలెవెన్‌తో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్ భారత బ్యాటింగ్ విభాగానికి బాగా ఉపయోగపడింది. ప్రతి బ్యాటర్ ఏదో ఒక ఇన్నింగ్స్‌లో మంచి ప్రాక్టీస్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో దేవదత్ పడిక్కల్ (142 నాటౌట్), రవీంద్ర జడేజా (63 రిటైర్డ్ హర్ట్), కేఎల్ రాహుల్ (40).. రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (61 రిటైర్డ్ హర్ట్), శుభ్‌మన్ గిల్ (44) పరుగులు రాబట్టారు. ఆగస్ట్ 15 నుంచి శ్రీలంకతో జరుగబోయే తొలి టెస్ట్‌కు ముందు ఇది శుభపరిణామం. ఇదే జోరును బ్యాటర్లు తొలి టెస్ట్‌లోనూ కొనసాగిస్తే టీమిండియా గెలుపు తథ్యం.టచ్‌లోకి వచ్చిన జైస్వాల్, గిల్తొలి ఇన్నింగ్స్‌లో డకౌటై నిరాశపర్చిన యశస్వి జైస్వాల్, రెండో ఇన్నింగ్స్‌లో పుంజుకొని మెరుపు అర్ద సెంచరీతో చెలరేగాడు. గాయం కారణంగా తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దూరంగా ఉన్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. రెండో ఇన్నింగ్స్‌లో గాయాన్ని అధిగమించడంతో పాటు ఫామ్‌ను కూడా చాటుకున్నాడు. జైస్వాల్, గిల్ టచ్‌లోకి రావడం టీమిండియాకు శుభసూచకం. వీరికి పడిక్కల్, రాహుల్ కూడా తోడైతే తొలి టెస్ట్‌లో టీమిండియా గెలుపును లంక బౌలర్లు అడ్డుకోలేరు.విజయం దిశగా భారత్207 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ గెలుపు దిశగా సాగుతోంది. ఆట చివరి రోజు కావడం, అందులోనూ సమయం కూడా కొద్దిగానే ఉండటంతో భారత బ్యాటర్లు వేగంగా ఆడుతున్నారు. ముఖ్యంగా జైస్వాల్ పరిమిత ఓవర్ల తరహాలో బ్యాటింగ్ చేసి భారత గెలుపుకు పునాది వేశాడు. 30 ఓవర్ల తర్వాత భారత స్కోర్ 152-2గా ఉంది. పంత్ (28), జడేజా (0) క్రీజ్‌లో ఉన్నారు. మరో 55 పరుగులు చేస్తే ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుస్తుంది. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన పంత్ ఈ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూనే భారత్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నాడు. జురెల్ (17) ఒక్కడే కాస్త నిరుత్సాహపరిచాడు.టార్గెట్ 207లంక ఎలెవెన్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి, టీమిండియా ముందు 207 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. నిషాన్ మధుష్క (63 రిటైర్డ్ హర్ట్) అర్ద సెంచరీతో రాణించగా.. అంజల బండార (35), నిపున్ ధనంజయ (46) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్, రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు తీయగా.. సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ చెరో వికెట్ దక్కించుకున్నారు.పడిక్కల్ అజేయ శతకంభారత్ తొలి ఇన్నింగ్స్‌ను 357 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దేవదత్ పడిక్కల్ (142 నాటౌట్) అజేయ సెంచరీతో సత్తా చాటాడు. రవీంద్ర జడేజా (63 రిటైర్డ్ హర్ట్) అర్ద సెంచరీతో రాణించగా.. కేఎల్ రాహుల్ (40), మానవ్ సుతార్ (41), గుర్నూర్ బ్రార్ (36 నాటౌట్), సరాన్ష్ జైన్ (22 రిటైర్డ్ హర్ట్) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో అసంక మనోజ్, రమేశ్ మెండిస్ తలో 2 వికెట్లు తీయగా.. విశ్వ ఫెర్నాండో, కేశర నువంత చెరో వికెట్ దక్కించుకున్నారు.దీనికి ముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. నిషాన్ మధుష్క (66), రవిందు రషాంత (71), సోనల్ దినుష (52) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్ తలో 2 వికెట్లు తీయగా.. బ్రార్ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
టీమిండియా టార్గెట్ 207
శ్రీలంక క్రికెట్ ఎలెవెన్‌తో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో భారత్ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది. లంక ఎలెవెన్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి, టీమిండియా ముందు 207 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే ఆట ఇవాళ (మూడో రోజు) చివరి రోజు కావడంతో ఫలితం తేలే అవకాశం లేదు. ఆటలో మరో సెషన్ మాత్రమే మిగిలి ఉంది.లంక ఎలెవెన్ రెండో ఇన్నింగ్స్‌లో నిషాన్ మధుష్క (63 రిటైర్డ్ హర్ట్) అర్ద సెంచరీతో రాణించగా.. అంజల బండార (35), నిపున్ ధనంజయ (46) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్, రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు తీయగా.. సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ చెరో వికెట్ దక్కించుకున్నారు.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 357 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దేవదత్ పడిక్కల్ (142 నాటౌట్) అజేయ సెంచరీతో సత్తా చాటాడు. రవీంద్ర జడేజా (63 రిటైర్డ్ హర్ట్) అర్ద సెంచరీతో రాణించగా.. కేఎల్ రాహుల్ (40), మానవ్ సుతార్ (41), గుర్నూర్ బ్రార్ (36 నాటౌట్), సరాన్ష్ జైన్ (22 రిటైర్డ్ హర్ట్) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో అసంక మనోజ్, రమేశ్ మెండిస్ తలో 2 వికెట్లు తీయగా.. విశ్వ ఫెర్నాండో, కేశర నువంత చెరో వికెట్ దక్కించుకున్నారు.దీనికి ముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. నిషాన్ మధుష్క (66), రవిందు రషాంత (71), సోనల్ దినుష (52) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్ తలో 2 వికెట్లు తీయగా.. బ్రార్ చెరో వికెట్ దక్కించుకున్నారు.కాగా, ఈ మ్యాచ్ తర్వాత భారత జట్టు శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్ మ్యాచ్ గాలే వేదికగా ఆగస్ట్ 15 నుంచి మొదలుకానుంది. రెండో టెస్ట్ కొలంబో వేదికగా ఆగస్ట్ 23న ప్రారంభం కానుంది. -
శ్రీలంకతో తొలి టెస్ట్.. టీమిండియాకు గుడ్ న్యూస్
శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియాకు గుడ్ న్యూస్. ప్రాక్టీస్ సెషన్లో కుడి చేతి వేలికి గాయం కావడంతో తొలి టెస్టుకు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అందుబాటులో ఉంటాడా?లేదా? ఆందోళన అందరిలోనూ నెలకొంది.అయితే ఇప్పుడు గిల్ పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. అతడు తిరిగి నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ క్రమంలో కొలంబో వేదికగా శ్రీలంక ఎలెవన్‌తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో గిల్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశముంది.ఈ చేతి వేలి గాయం కారణంగానే తొలి రెండు రోజుల ఆటకు మాత్రం అతడు దూరంగా ఉన్నాడు. మూడో రోజు ఫీల్డింగ్ రానప్పటికి బ్యాటింగ్ మాత్రం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. గిల్ గైర్హజరీలో భారత కెప్టెన్‌గా రాహుల్ వ్యహరిస్తున్నాడు.ఇప్పటికే శ్రీలంకతో సిరీస్‌కు ఇన్ఫామ్ ప్లేయర్లు జస్ప్రీత్ బుమ్రా, సాయిసుదర్శన్‌లు గాయం కారణంగా దూరమయ్యారు. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా తొలి టెస్ట్‌లో ఆడేది అనుమానమే. ఇక ఈ ప్రాక్టీస్ మ్యాచ్ విషయానికి వస్తే.. శ్రీలంక జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌ను 363/8 డిక్లేర్ చేసింది.మొదటి ఇన్నింగ్స్‌లో భారత పేసర్లు ఆకట్టుకోలేకపోయారు. కుల్దీప్ యాదవ్, జడేజా, మానవ్ సుతార్ తలా రెండు వికెట్లు సాధించారు. అనంతరం భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 357/6 వద్ద డిక్లేర్ చేసింది. దేవ్‌దత్ పడిక్కల్ (164 బంతుల్లో18 ఫోర్లతో 142 ) భారీ సెంచరీతో కదం తొక్కాడు. నాలుగో స్థానంలో వచ్చిన రవీంద్ర జడేజా 63 పరుగులు సాధించాడు. ఇక మూడో రోజు లంచ్ సమయానికి శ్రీలంక 24 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. -
మరోసారి దొరికిపోయిన జైస్వాల్.. లోపం ఎక్కడుంది?
శ్రీలంక క్రికెట్ ఎలెవన్ జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ డకౌట్ అయ్యాడు. కొలంబో వేదికగా శనివారం నాటి రెండో రోజు ఆటలో లంక బౌలర్ విశ్వ ఫెర్నాండో బౌలింగ్‌లో.. దిలుమ్ సుదీరకు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా పెవిలియన్ చేరాడు.ఈ నేపథ్యంలో లెఫ్టార్మ్ సీమర్లను ఎదుర్కోవడంలో జైసూ వైఫల్యం మరోసారి బయటపడింది. తన టెస్టు కెరీర్లో జైస్వాల్ ఇప్పటి వరకు 29 టెస్టులు ఆడి 2535 పరుగులు సాధించి మంచి రికార్డు కలిగి ఉన్నాడు. అతడి ఖాతాలో ఇప్పటికే ఏడు సెంచరీలు కూడా ఉన్నాయి.కేవలం 200 పరుగులుఅయితే, ఎడమచేతి వాటం ఉన్న ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో జైస్వాల్ ముందు నుంచే ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పటి వరకు తన కెరీర్లో లెఫ్టార్మ్ సీమర్ల బౌలింగ్‌లో జైసూ కేవలం 200 పరుగులు చేసి.. తొమ్మిది సందర్భాల్లో అవుటయ్యాడు. సగటు 22.2గా ఉంది. రైటార్మ్ సీమర్ల బౌలింగ్‌లో మాత్రం జైసూ సగటున 42 పరుగులతో ఏకంగా 1184 పరుగులు రాబట్టాడు.నిజానికి లెఫ్టార్మ్ పేసర్ల యాంగిల్ కారణంగా రైటార్మ్ బ్యాటర్లు ఇబ్బంది పడతారు. కానీ లెఫ్టాండ్ బ్యాటర్ అయిన జైసూ ఇలా వీరి బౌలింగ్‌లో ఇబ్బంది పడటం కాస్త ఆశ్చర్యపరిచే విషయమే అని విశ్లేషకులు అంటున్నారు.వారి బౌలింగ్‌లో మరీ కష్టంకాగా లెఫ్టార్మ్ సీమర్లలో ఆస్ట్రేలియా స్టార్ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో జైసూ 133 పరుగులు చేసి.. మూడు సార్లు అవుటయ్యాడు. సగటు 44.3. అయితే, సౌతాఫ్రికా స్టార్లు మార్కో యాన్సన్, నండ్రీ బర్గర్ మాత్రం జైసూను మరింత ఇబ్బంది పెట్టారు. యాన్సెన్ బౌలింగ్‌లో జైసూ 42 పరుగులు చేసి మూడుసార్లు అవుట్ కాగా.. బర్గర్ బౌలింగ్‌లో కేవలం 21 పరుగులే చేసి మూడుసార్లు పెవిలియన్ చేరాడు.కేవలం టెస్టుల్లోనే కాదు టీ20 ఫార్మాట్లోనూ జైస్వాల్ లెఫ్టార్మ్ సీమర్లను ఎదుర్కోవడంలో బాగా ఇబ్బందిపడుతున్నాడు. ఇప్పటికి వారి బౌలింగ్‌లో 135 పరుగులు చేసి ఐదుసార్లు అవుటయ్యాడు. నెట్స్‌లో గంట ప్రాక్టీస్కాగా లెఫ్టాండ్ బ్యాటర్ అయిన జైసూకు లెఫ్టార్మ్ పేసర్ వేసే బంతి భిన్నమైన కోణంలో వస్తుంది. బౌలర్ బంతిని రిలీజ్ చేసిన మూమెంట్ మీదే అతడు ఎలాంటి షాట్ ఆడాలన్న నిర్ణయం ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా జైస్వాల్ మరోసారి లెప్టార్మ్ పేసర్ చేతికి దొరికిపోయి పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో డకౌట్ అయిన వెంటనే నెట్స్‌లో తిరిగి ప్రాక్టీస్‌కు వెళ్లిన 24 ఏళ్ల జైస్వాల్.. గంటపాటు అక్కడే శ్రమించినట్లు తెలుస్తోంది.చదవండి: పడిక్కల్ భారీ శతకం.. జడ్డూ ఫిఫ్టీ.. బ్రార్ మెరుపులు -
పడిక్కల్ భారీ శతకం.. జడ్డూ ఫిఫ్టీ.. బ్రార్ మెరుపులు
శ్రీలంక క్రికెట్ ఎలెవన్ జట్టుకు టీమిండియా ధీటుగా బదులిస్తోంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో శనివారం నాటి రెండో రోజు ఆట ముగిసేసరికి భారత జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. దేవదత్ పడిక్కల్ భారీ శతకం, రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ, గుర్నూర్ బ్రార్ మెరుపుల కారణంగా మంచి స్కోరు సాధించింది.శ్రీలంక 363 డిక్లేర్డ్శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ సన్నాహకాల్లో భాగంగా టీమిండియా.. శ్రీలంక క్రికెట్ ఎలెవన్‌తో శుక్రవారం నుంచి మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ మొదలుపెట్టింది. కొలంబోలో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. భారత బౌలర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.ఫలితంగా శ్రీలంక క్రికెట్ ఎలెవన్.. తొలిరోజు ఆటలో ఎనిమిది వికెట్ల నష్టానికి 363 పరుగులు సాధించింది. ఇక శనివారం నాటి రెండో రోజు ఆటలో ఓవర్‌నైట్ స్కోరు వద్దనే తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది.జైసూ, పంత్, జురెల్ విఫలం ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ డకౌట్ కాగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్ 40 పరుగులతో రాణించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన దేవదత్ పడిక్కల్ 121 బంతుల్లో శతకం పూర్తి చేసుకుని రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్లు రిషభ్ పంత్ (2), ధ్రువ్ జురెల్ (1) పూర్తిగా విఫలమయ్యారు.ఇలాంటి తరుణంలో నాలుగో స్థానంలో వచ్చిన స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు.. మరో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మానవ్ సుతార్ తోడయ్యాడు. జడ్డూ 117 బంతుల్లో 63 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరగా.. మానవ్ 90 బంతుల్లో 41 పరుగులు చేశాడు. అయితే, అసంక మనోజ్ బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా మానవ్ వెనుదిరిగాడు.గుర్నూర్ బ్రార్ మెరుపులు ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ వచ్చి 15 బంతులు ఎదుర్కొని ఒకే ఒక్క పరుగు చేసి రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. మహ్మద్ సిరాజ్ 8 బంతుల్లో ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్ 22 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగగా.. గుర్నూర్ బ్రార్ మెరుపులు మెరిపించాడు.వరుస విరామాల్లో ఆటగాళ్లు పెవిలియన్ చేరిన తర్వాత పడిక్కల్ మళ్లీ బ్యాటింగ్‌కు దిగాడు. 103 పరుగులతో తిరిగి బ్యాటింగ్ మొదలుపెట్టిన పడిక్కల్.. ఆట ముగిసేసరికి మొత్తంగా 164 బంతులు ఎదుర్కొని 142 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 18 ఫోర్లు ఉన్నాయి.ఆరు పరుగుల తేడాఈ క్రమంలో రెండో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా 90 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. పడిక్కల్ 142 పరుగులతో ఉండగా.. బ్రార్ 18 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 సిక్సర్లు బాది 36 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక క్రికెట్ ఎలెవన్ కంటే కేవలం ఆరు పరుగులు వెనుకబడి ఉంది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌కు ఆదివారం చివరి రోజు. చదవండి: ద్రవిడ్ వద్దన్నాడు.. యువీ ఉంటే కథ వేరుగా ఉండేది -
IND vs SL: పంత్, జురెల్ ఫెయిల్.. జడ్డూ ఫిఫ్టీ
శ్రీలంక క్రికెట్ ఎలెవన్‌తో వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్లు రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్ విఫలమయ్యారు. ఈ ఇద్దరు వికెట్ కీపర్లు బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరారు. దీంతో పంత్, జురెల్ ఆట తీరుపై సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురుస్తోంది.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా టీమిండియా శ్రీలంకతో రెండు మ్యాచ్‌లలో తలపడేందుకు అక్కడికి వెళ్లింది. గాలె, కొలంబో వేదికలుగా ఆగష్టు 15 నుంచి ఈ సిరీస్ మొదలుకానుంది. ఇందుకు సన్నాహకంగా టీమిండియా శ్రీలంక ఎలెవన్‌తో శుక్రవారం నుంచి మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ మొదలుపెట్టింది.కొలంబో వేదికగా టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. శనివారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా ఎనిమిది వికెట్ల నష్టానికి 363 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఓపెనర్లు నిశాన్ మధుష్క (66), రవిందు రశాంత (71), కెప్టెన్ సోనాల్ దినుష (52) అర్ధ శతకాలతో రాణించారు.జైసూ డకౌట్.. పడిక్కల్ శతకంఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆదిలోనే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ డకౌట్ కాగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్ 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అనూహ్య రీతిలో బౌల్డ్ అయ్యాడు. అయితే, వన్‌డౌన్‌లో వచ్చిన దేవదత్ పడిక్కల్ అద్భుత శతకం (121 బంతుల్లో 103) సాధించాడు. ఆ వెంటనే రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగాడు.పంత్, జురెల్ విఫలంఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ వచ్చీ రాగానే వెనుదిరిగాడు. రమేశ్ మెండిస్ బౌలింగ్‌లో అనవసరపు షాట్‌కు ప్రయత్నించి.. నిశాన్ మధుష్కకు క్యాచ్ ఇచ్చాడు. దీంతో ఐదు బంతులు ఎదుర్కొన్న పంత్.. కేవలం రెండు పరుగులు చేసి నిష్క్రమించాడు.మరో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ సైతం తొమ్మిది బంతులు ఎదుర్కొని ఒకే ఒక్క పరుగు చేసి అవుటయ్యాడు. దీంతో పంత్, జురెల్ ఆట తీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.జడేజా అర్ధ శతకం పూర్తిఇదిలా ఉంటే.. తొలి రోజు ఆటలో భాగంగా రెండు వికెట్లు తీసిన స్పిన్‌బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. బ్యాటింగ్‌లోనూ అదరగొడుతున్నాడు. 88 బంతుల్లో జడ్డూ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో 55 ఓవర్ల ఆట ముగిసే సరికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఎలెవన్ కంటే మరో 154 పరుగులు వెనుకబడి ఉంది. మానవ్ సుతార్ ఏడు పరుగులతో ఉన్నాడు.చదవండి: విండీస్‌కు భారీ షాక్.. వన్డే ప్రపంచకప్ టోర్నీకి అప్గాన్ అర్హత -
టీమిండియాకు మరో భారీ షాక్
శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌కు ముందు టీమిండియాను గాయాలు వెంటాడుతున్నాయి. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇప్పటికే సిరీస్‌కు దూరం కాగా.. తాజాగా యువ బ్యాటర్ సాయి సుదర్శన్ కూడా గాయం కారణంగా తప్పుకున్నాడు.తొలుత లంక సిరీస్‌కు బుమ్రాతో పాటు సాయి సుదర్శన్‌ను కూడా ఎంపిక చేశారు. వీరిద్దరూ గాయాల నుంచి పూర్తిగా కోలుకుంటారనుకుంటే, అది జరగలేదు. బుమ్రా ఎడమ మోకాలిలో గాయం.. సాయి సుదర్శన్ కాలి బొటనవేలికి గాయం నుంచి కోలుకునేందుకు గత కొంతకాలంగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రిహాబిలిటేషన్‌లో ఉన్నారు.అయితే గాయాలు ఎంతకీ మానకపోవడంతో తొలుత బుమ్రా, తాజాగా సాయి సుదర్శన్ లంక సిరీస్ నుంచి తప్పుకున్నారు. రోజుల వ్యవధిలో ఇద్దరు రెగ్యులర్ ఆటగాళ్లు వైదొలగడం టీమిండియాకు భారీ ఎదురుదెబ్బే అనుకోవాలి. ఇప్పుడు వీరిద్దరికి ప్రత్యామ్నాయాలుగా ఎవరికి ఎంపిక చేస్తారో చూడాలి. తొలి టెస్ట్ (ఆగస్ట్ 15, గాలే) ప్రారంభానికి ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉంది.లంకలో పరిస్థితులకు అలవాటు పడేందుకు టీమిండియా ప్రస్తుతం ఆ దేశ క్రికెట్ ఎలెవెన్ జట్టుతో మూడు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లంక ఎలెవెన్ జట్టు 8 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు పెద్దగా ఆకట్టకోలేకపోయారు. రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్ తలో 2 వికెట్లు తీయగా.. గుర్నూర్ బ్రార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. సీనియర్ పేసర్లు సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. స్పిన్నర్ సరాన్ష్ జైన్ 11 ఓవర్లు వేసినా ఒక్క వికెట్ దక్కలేదు.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ సెంచరీతో (103 రిటైర్డ్ హర్ట్) సత్తా చాటగా.. కేఎల్ రాహుల్ (40) రాణించాడు. యశస్వి జైస్వాల్ డకౌటై నిరాశపర్చగా.. పంత్ (2), జురెల్ (1) కూడా విఫలమయ్యారు. ప్రస్తుతం రెండో రోజు ఆట (టీ విరామం) కొనసాగుతోంది. -
IND vs SL: శ్రీలంక గడ్డపై శతక్కొట్టిన పడిక్కల్
శ్రీలంక ఎలెవన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ దేవదత్ పడిక్కల్ అద్భుత శతకంతో మెరిశాడు. కొలంబోలో శనివారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా 121 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాగా రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లింది. ఈ సిరీస్ సన్నాహకాల్లో భాగంగా శ్రీలంక ఎలెవన్‌తో శుక్రవారం ప్రాక్టీస్ మ్యాచ్ మొదలుపెట్టింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. రెండో రోజు ఆట సందర్భంగా 363 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. జైసూ డకౌట్అనంతరం భారత్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ డకౌట్ కాగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్ 67 బంతుల్లో 40 పరుగులు చేశాడు. అయితే, కేశారా నువాంత బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు.అయితే, వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ మాత్రం సెంచరీతో దుమ్ములేపాడు. 61 బంతుల్లో అర్థ శతకం పూర్తి చేసుకున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. మరో 60 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. ఫోర్ బాది సెంచరీ పూర్తి చేసుకున్న పడిక్కల్.. 103 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగాడు. అతడి ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు ఉన్నాయి. ఇక పడిక్కల్ స్థానంలో.. రవీంద్ర జడేజాకు తోడుగా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ క్రీజులోకి వచ్చాడు. పంత్ విఫలంఅయితే, పంత్ ఐదు బంతులు ఎదుర్కొని కేవలం రెండు పరుగులు చేసి అవుటయ్యాడు. 42 ఓవర్ల ఆట ముగిసేసరికి జడ్డూ 23 పరుగులతో ఉండగా.. ధ్రువ్ జురెల్ క్రీజులోకి వచ్చాడు.చదవండి: మూడేళ్లుగా తిరుగుతున్నా.. సాయం చేయండి సీఎం గారూ: పంత్


