
టీమిండియాతో ఆసియా కప్-2025 సూపర్-4 మ్యాచ్‌లో.. శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిస్సాంక అద్భుత ప్రదర్శన కనబరిచాడు. భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి... 52 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ మొత్తంగా 58 బంతులు ఎదుర్కొని 107 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉండటం విశేషం.
కోహ్లి ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
ఈ నేపథ్యంలో టీమిండియాతో మ్యాచ్ సందర్భంగా పాతుమ్ నిసాంక (Pathum Nissanka) ఆసియా కప్ టీ20 టోర్నీలో సరికొత్త చరిత్ర లిఖించాడు. ఈ ఖండాంతర క్రికెట్ ఈవెంట్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఘనత సాధించాడు. ఈ క్రమంలో భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును నిసాంక బద్దలు కొట్టాడు.
కాగా ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఆసియా కప్ టోర్నీలో శ్రీలంక ఇప్పటికే ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. మరోవైపు.. లీగ్, సూపర్-4 మ్యాచ్‌లలో పరాజయమే ఎరుగక ఫైనల్ చేరింది టీమిండియా. ఈ క్రమంలో సూపర్-4 దశలో చివరిగా ఈ రెండు జట్లు (IND vs SL) నామమాత్రపు మ్యాచ్‌లో తలపడ్డాయి.
అభిషేక్ శర్మ ధనాధన్
దుబాయ్‌లో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక.. తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 202 పరుగులు సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (31 బంతుల్లో 61) మరోసారి మెరుపులు మెరిపించగా.. తిలక్ వర్మ (49 నాటౌట్), సంజూ శాంసన్ (23 బంతుల్లో 39) రాణించారు.
Beast mode Abhishek Sharma! 🥵#SonySportsNetwork #DPWorldAsiaCup2025 #INDvSL pic.twitter.com/CrQW1M492m
— Sony Sports Network (@SonySportsNetwk) September 27, 2025
నిసాంక మెరుపు సెంచరీ
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన లంకకు.. భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఆదిలోనే షాకిచ్చాడు. ఓపెనర్ కుశాల్ మెండిస్‌ను డకౌట్ చేశాడు. అయితే, భారత శిబిరానికి ఈ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. మరో ఓపెనర్ నిసాంకతో పాటు వన్‌డౌన్ బ్యాటర్ కుశాల్ పెరీరా (32 బంతుల్లో 58) ధనాధన్ దంచికొట్టాడు.
టీమిండియా సూపర్ విజయం
ఆఖర్లో దసున్ శనక (11 బంతుల్లో 22 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్ల ఆట ముగిసేసరికి శ్రీలంక కూడా ఐదు వికెట్ల నష్టానికి సరిగ్గా 202 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ టై కాగా.. సూపర్ ఓవర్ నిర్వహించారు.
అయితే, ఈసారి టీమిండియా ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వలేదు. ఆరు బంతుల్లో లంకను రెండు పరుగులకు కట్టడి చేసి రెండు వికెట్లు తీసిన వికెట్ తీసిన భారత్.. ఆ తర్వాత తొలి బంతికే మూడు పరుగులు చేసి జయభేరి మోగించింది.
ఆసియా కప్ టీ20 చరిత్రలో అత్యధిక పరుగుల వీరులు వీరే
🏏పాతుమ్ నిసాంక (శ్రీలంక)- 12 ఇన్నింగ్స్‌లో 434* పరుగులు
🏏విరాట్ కోహ్లి (ఇండియా)- 9 ఇన్నింగ్స్‌లో 429 పరుగులు
🏏అభిషేక్ శర్మ (ఇండియా)- 6 ఇన్నింగ్స్‌లో 309 పరుగులు
🏏బాబర్ హయత్ (హాంకాంగ్)- 8 ఇన్నింగ్స్‌లో 292 పరుగులు
🏏మొహమ్మద్ రిజ్వాన్ (ఇండియా)- 6 ఇన్నింగ్స్‌లో 281 పరుగులు.
చదవండి: IND vs SL: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
Pathum Nissanka anchors the chase with a six-hitting spree 💥
Watch #INDvSL LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/jlzQgHf6Ga— Sony Sports Network (@SonySportsNetwk) September 26, 2025