టీమిండియా టీ20 స్టార్ అభిషేక్ శర్మ 2025లో అదరగొట్టాడు. ఈ ఏడాది అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. భారత్ తరఫున ఈ సంవత్సరంలో 21 టీ20 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ శర్మ.. 193కు పైగా స్ట్రైక్‌రేటుతో 859 పరుగులు స్కోరు చేశాడు.
అశూ ప్రశంసలు
తద్వారా ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న అభిషేక్ శర్మ (Abhishek Sharma).. టీమిండియా టాప్ రన్‌స్కోరర్‌గానూ నిలిచాడు. ఈ నేపథ్యంలో ఈ విధ్వంసకర ఓపెనర్‌పై టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ ఏడాది ఆద్యంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న అభిషేక్‌ను.. ‘మెన్స్ టీమ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’గా అభివర్ణించాడు.

వన్డేలలోనూ ఆడించాలి
అదే విధంగా.. వన్డేల్లోనూ అభిషేక్ శర్మను ఆడిస్తే బాగుంటుందని అశూ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు ‘అశ్ కీ బాత్’లో మాట్లాడుతూ.. ‘‘ఇది అభిషేక్ శర్మ ఆగమనం మాత్రమే కాదు. టీమిండియా నవతరంలోని ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ ఆగమనం ఇది. 2025లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాడు అతడే.
ముఖ్యంగా పవర్ ప్లేలో అతడి బ్యాటింగ్ అద్భుతం. వన్డేల్లోనూ అతడి ఆటను చూడాలని ఉంది. ఈ ఏడాది పురుషుల క్రికెట్లో అత్యుత్తమ ప్లేయర్ అతడే’’ అని అభిషేక్ శర్మను అశూ కొనియాడాడు. కాగా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరఫున సత్తా చాటిన అభిషేక్ శర్మ.. 2024లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.
ఇప్పటి వరకు భారత్ తరఫున 33 టీ20 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ శర్మ 1115 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, తొమ్మిది అర్ధ శతకాలు ఉన్నాయి. తదుపరి టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో సత్తా చాటేందుకు అభిషేక్ శర్మ సిద్ధంగా ఉన్నాడు.
చదవండి: ఇంగ్లండ్, పాక్ కాదు.. టీ20 వరల్డ్‌కప్ సెమీస్ చేరే జట్లు ఇవే!


