కొలంబోకు చేరుకున్న అభిషేక్ త‌ల్లిదండ్రులు.. పాక్‌తో మ్యాచ్‌కు డౌటే | Abhishek Sharmas parents reach Colombo while IND vs PAK availability still uncertain | Sakshi
Sakshi News home page

IND vs PAK: కొలంబోకు చేరుకున్న అభిషేక్ త‌ల్లిదండ్రులు.. పాక్‌తో మ్యాచ్‌కు డౌటే

Feb 14 2026 12:40 PM | Updated on Feb 14 2026 12:50 PM

Abhishek Sharmas parents reach Colombo while IND vs PAK availability still uncertain

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో కొలంబో వేదిక‌గా ఆదివారం పాకిస్తాన్‌-భార‌త్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా విధ్వంస‌క‌ర ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ ఆడుతాడా లేదా? అన్న‌ది ఇంకా క్లారిటీ లేదు. కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా అభిషేక్ గత మూడు రోజులుగా ఇబ్బంది పడుతున్నాడు. దీంతో న‌మీబియాతో మ్యాచ్‌కు దూర‌మ‌య్యాడు.

అయితే ఆస్ప‌త్రి నుంచి అభిషేక్  డిశ్చార్జ్ అయినప్ప‌టికి ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించిక‌పోయిన‌ట్లు తెలుస్తోంది. కానీ అభిషేక్ భార‌త జ‌ట్టుతో కలిసి కొలంబోలో అడుగుపెట్టాడు. అత‌డు ప్ర‌స్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు.

కాగా శనివారం (ఫిబ్రవరి 14) సాయంత్రం జరిగే నెట్ సెషన్‌లో అభిషేక్ పాల్గొనే అవకాశం ఉంది. ఈ ప్రాక్టీస్ తర్వాతే అతను పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడతాడా లేదా అనే దానిపై టీమ్ మేనేజ్‌మెంట్ ఓ నిర్ణ‌యం తీసుకోనుంది.  అయితే అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న అభిషేక్‌ను చూసేందుకు అత‌డి త‌ల్లిదండ్రులు కొలంబోకు చేరుకున్నారు. ఒకవేళ అభిషేక్ శర్మ పూర్తిగా కోలుకోకపోతే సంజూ శాంస‌న్ ఓపెన‌ర్‌గా కొన‌సాగ‌నున్నాడు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement