భారత పోలో జట్టు పైచేయి | Indian polo team prevails | Sakshi
Sakshi News home page

భారత పోలో జట్టు పైచేయి

Feb 14 2026 8:48 AM | Updated on Feb 14 2026 9:59 AM

Indian polo team prevails

సాక్షి, హైదరాబాద్‌: రాధా టీఎంటీ అంతర్జాతీయ ఎరీనా పోలో చాంపియన్‌షిప్‌లో భారత జట్టు తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. లక్సెంబర్గ్‌ జట్టుతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 15–5 గోల్స్‌ తేడాతో  నెగ్గింది.  తొలి చక్కర్‌ ముగిశాక భారత్‌ 6–2తో ఆధిక్యంలోకి వెళ్లింది.

 భారత్‌ తరఫున యూసుఫ్‌ అజ్మీ 2 గోల్స్, కున్వల్‌ విశాల్‌ సింగ్‌ 3 గోల్స్, మొహమ్మద్‌ నయీముద్దీన్‌ ఒక గోల్‌ చేశారు. రెండో చక్కర్‌లో భారత్‌ ఐదు గోల్స్‌ చేసి, రెండు గోల్స్‌ సమరి్పంచుకుంది. ఈ చక్కర్‌లో భారత్‌కు చెతానియా 2 గోల్స్, యూసుఫ్‌ అజ్మీ 2 గోల్స్‌ చేయగా, పెనాల్టీ ద్వారా మరో గోల్‌ వచి్చంది. చివరిదైన మూడో చక్కర్‌లో భారత్‌ నాలుగు గోల్స్‌ సాధించింది. చెతానియా, యూసుఫ్‌ అజ్మీ రెండు గోల్స్‌ చొప్పున చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement