నేటి నుంచి ఐఎస్‌ఎల్‌ | Indian Super League 12th Season Football Tournament Starts Today, More Details Inside | Sakshi
Sakshi News home page

ISL: నేటి నుంచి ఐఎస్‌ఎల్‌

Feb 14 2026 3:47 AM | Updated on Feb 14 2026 1:46 PM

Indian Super League 12th season football tournament starts today

కోల్‌కతా: సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. నెలలపాటు కొనసాగిన సందిగ్ధత వీడింది. నేటి నుంచి ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) 12వ సీజన్‌ ఫుట్‌బాల్‌ టోర్నీ మొదలుకానుంది. మొత్తం 14 (బెంగళూరు, చెన్నైయిన్, ఈస్ట్‌ బెంగాల్, గోవా, ఇంటర్‌ కాశీ, జంషెడ్‌పూర్, కేరళ బ్లాస్టర్స్, మొహమ్మదాన్‌ స్పోరి్టంగ్, మోహన్‌ బగాన్‌ సూపర్‌ జెయింట్, ముంబై సిటీ, నార్త్‌ ఈస్ట్‌ యునైటెడ్, ఒడిశా, పంజాబ్, స్పోరి్టంగ్‌ క్లబ్‌ ఢిల్లీ) జట్లు టైటిల్‌ కోసం తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. 

ఒక్కో జట్టు 13 మ్యాచ్‌లు ఆడుతుంది. నాకౌట్‌ దశ లేకుండా మూడు నెలలపాటు సాగే ఈ లీగ్‌లో అత్యధిక పాయింట్లు సాధించిన జట్టు విజేతగా అవతరిస్తుంది. సాల్ట్‌లేక్‌ స్టేడియంలో నేడు జరిగే తొలి మ్యాచ్‌లో కేరళ బ్లాస్టర్స్‌ జట్టుతో డిఫెండింగ్‌ చాంపియన్‌ మోహన్‌బగాన్‌ సూపర్‌ జెయింట్‌ జట్టు తలపడుతుంది. రెండో మ్యాచ్‌లో ఇంటర్‌ కాశీ జట్టుతో ఎఫ్‌సీ గోవా జట్టు పోటీపడుతుంది.  

Advertisement
 
Advertisement
Advertisement