ఫైనల్లో రష్మిక జోడీ | Srivalli Rashmika in the final of the doubles category of the ITF W75 tournament | Sakshi
Sakshi News home page

ఫైనల్లో రష్మిక జోడీ

Feb 14 2026 3:45 AM | Updated on Feb 14 2026 3:45 AM

Srivalli Rashmika in the final of the doubles category of the ITF W75 tournament

పుణే: భారత మహిళల టెన్నిస్‌ రెండో ర్యాంకర్, హైదరాబాద్‌ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక తన కెరీర్‌లో ఏడో డబుల్స్‌ టైటిల్‌కు విజయం దూరంలో నిలిచింది. అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) డబ్ల్యూ75 టోర్నమెంట్‌ డబుల్స్‌ విభాగంలో శ్రీవల్లి రష్మిక ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన డబుల్స్‌ సెమీఫైనల్లో రష్మిక–అంకిత రైనా (భారత్‌) ద్వయం 7–5, 6–3తో పొలీనా (బెల్జియం)–మరియా గొలోవినా (రష్యా) జంటపై విజయం సాధించింది. 

77 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక–అంకిత తమ తొలి సర్వీస్‌లో 27 పాయింట్లు, రెండో సర్వీస్‌లో 9 పాయింట్లు సంపాదించారు. తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేశారు. నేడు జరిగే ఫైనల్లో మిసాకి మత్సుదా–ఇరి షిమిజు (జపాన్‌)లతో రష్మిక–అంకిత తలపడతారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement