T20 WC 2026: సత్తా చాటిన సాయితేజ.. యూఎస్‌ఏ భారీ స్కోర్‌ | T20 WC 2026: USA set 197 runs target to netherlands | Sakshi
Sakshi News home page

T20 WC 2026: సత్తా చాటిన సాయితేజ.. యూఎస్‌ఏ భారీ స్కోర్‌

Feb 13 2026 9:24 PM | Updated on Feb 14 2026 10:33 AM

T20 WC 2026: USA set 197 runs target to netherlands

టీ20 వరల్డ్‌కప్‌ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 13) రాత్రి మొదలైన మ్యాచ్‌లో యూఎస్‌ఏ, నెదర్లాండ్స్‌ జట్లు తలపడుతున్నాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో యూఎస్‌ఏ తొలుత బ్యాటింగ్‌ చేసి భారీ స్కోర్‌ చేసింది. టాస్‌ ఓడి నెదర్లాండ్స్‌ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన యూఎస్‌ఏ.. సాయితేజ ముక్కామల (79), శుభ్‌మ్‌ రంజనే (48 నాటౌట్‌) సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.

మిగతా యూఎస్‌ఏ ఆటగాళ్లలో మొనాంక్‌ పటేల్‌ (36), షయాన్‌ జహంగీర్‌ (20) కూడా రాణించారు. సంజయ్‌ కృష్ణమూర్తి (1), మిలింగ్‌ కుమార్‌ (3), హర్మీత్‌ సింగ్‌ (1) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. మొహమ్మద్‌ మొహిసిన్‌ ఒక్క పరుగుతో అజేయంగా నిలిచాడు. నెదర్లాండ్స్‌ బౌలర్లలో బాస్‌ డి లీడ్‌ (4-0-37-3) అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. లొగాన్‌ వాన్‌ బీక్‌ (4-0-28-1), కైల్‌ క్లెయిన్‌ (4-0-35-1), ఫ్రెడ్‌ క్లాసెన్‌ (3-0-32-1) కూడా పర్వాలేదనిపించారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనను నెదర్లాండ్స్‌ ధాటిగా ప్రారంభించింది. తొలి 5 ఓవర్లలో ఆ జట్టు 41 పరుగులు చేసింది. అయితే కీలకమైన రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మైఖేల్‌ లెవిట్‌ 3 పరుగులు చేసి కెంజిగే బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ కాగా.. మ్యాక్స్‌ ఒడౌడ్‌ 13 పరుగులు చేసి హర్మీత్‌ సింగ్‌ బౌలింగ్‌లో మిలింద్‌ కుమార్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన​్‌కు చేరాడు. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ గెలవాలంటే 90 బంతుల్లో మరో 156 పరుగులు చేయాలి.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement