పసికూనల పోరులో యూఏఈదే పైచేయి | T20 WC 2026: UAE beat canada by 5 wickets | Sakshi
Sakshi News home page

పసికూనల పోరులో యూఏఈదే పైచేయి

Feb 13 2026 6:48 PM | Updated on Feb 13 2026 6:51 PM

T20 WC 2026: UAE beat canada by 5 wickets

టీ20 ప్రపంచకప్‌లో ఇవాళ (ఫిబ్రవరి 13) మధ్యాహ్నం పసికూనలు యూఏఈ, కెనడా జట్ల మధ్య పోటీ జరిగింది. ఈ మ్యాచ్‌లో యూఏఈ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన కెనడా.. హర్ష్‌ ఠాకూర్‌ (50) అర్ద సెంచరీతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. నవ్నీత్‌ ధలీవాల్‌ (34), శ్రేయస్‌ మొవ్వ (21) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. మిగతా ఆటగాళ్లంతా స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు. 

కెప్టెన్‌ దిల్ప్రీత్‌ బజ్వా 11, యువరాజ్‌ సమ్రా 5, నికోలస్‌ కిర్టన్‌ 4, జస్కరన్‌ సింగ్‌ 4 (నాటౌట్‌), సాద్‌ బిన్‌ జాఫర్‌ 5, డిలాన్‌ హేలిగర్‌ 6 (నాటౌట్‌) పరుగులు చేశారు. యూఏఈ బౌలర్లలో జునైద్‌ సిద్దిఖీ (4-0-35-5) అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. అతనికి ముహమ్మద్‌ జవాదుల్లా (4-0-16-1) సహకరించాడు.

అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన యూఏఈ ఆదిలో కాస్త తడబడినప్పటికీ.. చివర్లో గేర్‌ మార్చి 19.4 ఓవర్లలో గెలుపు తీరాలకు (5 వికెట్ల నష్టానికి) చేరింది. 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా.. ఓపెనర్‌ ఆర్యాంశ్‌ శర్మ (74 నాటౌట్‌), షోయబ్‌ ఖాన్‌ (51) పట్టుదలగా ఆడి యూఏఈని గెలిపించారు. 

కెనడా బౌలర్లలో సాద్‌ బిన్‌ జాఫర్‌ (4-0-14-3) యూఏఈ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. కలీమ్‌ సనా (4-0-29-1), డిలన్‌ హేలిగర్‌ (4-0-33-0) కూడా పర్వాలేదనిపించారు. అయితే ఆర్యాంశ్‌, షోయబ్‌ పట్టుదల ముందు వీరి ఈ ప్రదర్శనలు ఉపయోగపడలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement