సహజ, రష్మిక ఓటమి | Sahaja Yamalapalli Bhamidipaty Shrivalli Rashmika lost in the pre quarterfinals | Sakshi
Sakshi News home page

సహజ, రష్మిక ఓటమి

Feb 12 2026 3:53 AM | Updated on Feb 12 2026 3:53 AM

Sahaja Yamalapalli Bhamidipaty Shrivalli Rashmika lost in the pre quarterfinals

పుణే: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య డబ్ల్యూ75 మహిళల టోర్నీ సింగిల్స్‌ విభాగంలో భారత క్రీడాకారిణుల పోరాటం ముగిసింది. భారత నంబర్‌వన్‌ సహజ యామలపల్లి, రెండో ర్యాంకర్‌ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక ప్రిక్వార్టర్‌ ఫైనల్లో వెనుదిరిగారు. 

బుధవారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో తెలంగాణ అమ్మాయి సహజ 3–6, 2–6తో టాప్‌ సీడ్‌ లియోలియా జీన్‌జీన్‌ (ఫ్రాన్స్‌) చేతిలో, హైదరాబాద్‌ ప్లేయర్‌ రష్మిక 2–6, 1–6తో మనన్‌చాయ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓడిపోయారు. డబుల్స్‌ విభాగం తొలి రౌండ్‌లో రష్మిక–అంకిత రైనా (భారత్‌) ద్వయం 6–1, 6–4తో జీల్‌ 
దేశాయ్‌–మాయా రాజేశ్వరన్‌ (భారత్‌) జంటపై గెలిచి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది.   

Advertisement
 
Advertisement
Advertisement