అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య డబ్ల్యూ75 టోరీ్నలో భారత మహిళల టెన్నిస్ నంబర్‌వన్, తెలంగాణ ప్లేయర్ సహజ యామలపల్లి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. థాయ్‌లాండ్‌లోని నొంతాబురి పట్టణంలో ఈ టోర్నీ జరుగుతోంది. గురువారం జరిగిన సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 378వ ర్యాంకర్ సహజ 6–3, 7–5తో థాయ్‌లాండ్‌కు చెందిన అన్చిసా చాంటాపై గెలుపొందింది.
1 గంట 54 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సహజ మూడు ఏస్‌లు సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేసింది. తన సరీ్వస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సరీ్వస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. తొలి సరీ్వస్‌లో 23 పాయింట్లు గెలిచిన భారత యువతార, రెండో సర్వీస్‌లో 18 పాయింట్లు సొంతం చేసుకుంది. క్వార్టర్ ఫైనల్లో లీసా పిగాటో (ఇటలీ)తో సహజ తలపడుతుంది. ఇదే టోర్నీ డబుల్స్ విభాగం క్వార్టర్ ఫైనల్లో రుతుజా భోస్లే (భారత్)–వుషువాంగ్ జెంగ్ (చైనా) జోడీ 6–3, 6–3తో క్యోకా ఒకమురా (జపాన్)–పీంగ్‌టార్న్ ప్లిపుయెచ్ (థాయ్‌లాండ్) జంటపై గెలిచింది.


