బెల్జియం చేతిలో భారత్‌ పరాజయం | India lose to Belgium in Pro Hockey League | Sakshi
Sakshi News home page

బెల్జియం చేతిలో భారత్‌ పరాజయం

Feb 12 2026 3:45 AM | Updated on Feb 12 2026 3:45 AM

India lose to Belgium in Pro Hockey League

రూర్కెలా: ప్రొ హాకీ లీగ్‌ కొత్త సీజన్‌ను భారత పురుషుల హాకీ జట్టు ఓటమితో ప్రారంభించింది. ప్రపంచ రెండో ర్యాంకర్‌ బెల్జియం జట్టుతో బుధవారం జరిగిన తొలి లీగ్‌ మ్యాచ్‌లో భారత జట్టు 1–3 గోల్స్‌ తేడాతో ఓడిపోయింది. హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ నాయకత్వంలోని భారత జట్టును బెల్జియం జట్టు కట్టడి చేసింది. 

కేవలం రెండు పెనాల్టీ కార్నర్‌లు పొందిన భారత జట్టు అందులో ఒకదానిని సది్వనియోగం చేసుకుంది. ఆట 29వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను శిలానంద్‌ లాక్రా గోల్‌గా మలిచాడు. బెల్జియం తరఫున నెల్సన్‌ ఒనానా (23వ నిమిషంలో), థామస్‌ క్రాల్స్‌ (53వ నిమిషంలో), అర్నో వాన్‌ డెసెల్‌ (57వ నిమిషంలో) ఒక్కో గోల్‌ సాధించారు. 

తమకు లభించిన ఏడు పెనాల్టీ కార్నర్‌లను బెల్జియం వృథా చేసుకోవడం గమనార్హం. నేడు జరిగే రెండో లీగ్‌ మ్యాచ్‌లో అర్జెంటీనాతో భారత్‌ ఆడుతుంది. తొమ్మిది జట్లు పోటీపడుతున్న ప్రొ లీగ్‌లో తాజా గెలుపుతో బెల్జియం 16 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement