రేపు (ఫిబ్రవరి 12) నమీబియాతో జరుగబోయే టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్ అందుతుంది. కడుపు ఇన్ఫెక్షన్‌తో బాధపడుతూ, గత రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అభిషేక్ శర్మ డిశ్చార్జ్ అయ్యాడని తెలుస్తుంది. ఈ విషయాన్ని అభిషేక్ సహ టీమిండియా సభ్యుడు తిలక్ వర్మ ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వెల్లడించాడు. అయితే అభిషేక్ రేపటి మ్యాచ్ ఆడతాడా లేదా అన్నదానిపై మాత్రం తిలక్ క్లారిటీ ఇవ్వలేదు.
అభిషేక్ జట్టుకు అందుబాటులోకి రావడంతో టీమిండియాకు మరో సమస్య వచ్చి పడింది. అభిషేక్ నమీబియా మ్యాచ్‌కు అందుబాటులోకి రాలేడేమోనని, జట్టు మేనేజ్‌మెంట్ సంజూ శాంసన్‌ను రేపటి మ్యాచ్‌కు సిద్దం చేసింది. సంజూ.. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్‌తో కలిసి ఇవాళ కూడా నెట్స్‌లో చాలాసేపు శ్రమించాడు. మ్యాచ్ సమయానికి అభిషేక్ ఫిట్ అయితే, ఆఖరి నిమిషంలో అయినా సంజూకు హ్యాండ్ తప్పకపోవచ్చు.
ఒకవేళ కీలకమైన పాకిస్తాన్ మ్యాచ్ (ఫిబ్రవరి 15) వరకు అభిషేక్‌కు రెస్ట్ ఇవ్వాలని మేనేజ్‌మెంట్ భావిస్తే మాత్రం, నమీబియాతో మ్యాచ్‌లో ఇషాన్, సంజూ భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారు. ఇక్కడ మరో సమస్య కూడా ఉంది. సంజూ నమీబియా మ్యాచ్‌లో రాణిస్తే.. పాక్‌తో మ్యాచ్‌కు ముందు అభిషేక్‌తో పోటీపడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో మేనేజ్‌మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
ఇటీవలికాలంలో భీకర ఫామ్‌లో ఉన్న అభిషేక్ ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో యూఎస్‌ఏపై గోల్డెన్ డకౌటయ్యాడు. ఆ మ్యాచ్ సందర్భంగానే అతను తొలుత అస్వస్థతకు గురయ్యాడు. ఆతర్వాత టీమ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇంట్లో (ఢిల్లీ) డిన్నర్‌కు వెళ్లినప్పుడు పరిస్థితి క్షీణించి, ఆసుపత్రిలో చేరాడు.
ఈ ప్రపంచకప్‌లో అభిషేక్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అతను తన సహజ శైలిలో అందించే మెరుపు ఆరంభాలు మ్యాచ్ గతినే మార్చేస్తాయి. అభిషేక్ ప్రతి మ్యాచ్‌లో 30, 40 పరుగులు చేసినా టీమిండియా భారీ స్కోర్లు చేసే అవకాశం ఉంటుంది.
భారత బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా ఉంది కాబట్టి, ఆ స్కోర్లను విజయంవంతంగా కాపాడుకోవచ్చు. అభిషేక్‌తో పాటు టీమిండియా సభ్యులంతా తలో మ్యాచ్‌లో సత్తా చాటినా భారత్ మరోసారి ప్రపంచకప్ ఎగరేసుకుపోవడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


