ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ టీ20 ప్రపంచకప్ 2026 జట్టులోకి అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చాడు. ఐర్లాండ్‌తో ఇవాళ (ఫిబ్రవరి 11) జరుగనున్న మ్యాచ్‌కు ముందు రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ మార్ష్ గాయపడటంతో స్టీవ్‌ను హుటాహుటిన శ్రీలంకకు పిలిపించారు. స్టీవ్‌కు తొలుత ప్రకటించిన జట్టులో చోటు దక్కలేదు.
బిగ్‌బాష్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్నా, స్టీవ్‌ను ప్రపంచకప్‌కు ఎంపిక చేయకపోవడంపై ముందు నుంచే విమర్శలు ఉన్నాయి. మార్ష్ అనూహ్యంగా గాయపడటంతో స్టీవ్‌కు అవకాశం లభించింది. స్టీవ్ ఫిబ్రవరి 13న జింబాబ్వేతో మ్యాచ్ సమయానికి అందుబాటులోకి రావచ్చని తెలుస్తుంది.
కాగా, ఐర్లాండ్‌తో మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సమయంలో మిచెల్ మార్ష్ గాయపడ్డాడు. తద్వారా అతను ఐర్లాండ్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో ట్రవిస్ హెడ్ ఆసీస్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ప్రాక్టీస్ సమయంలో బంతి తగిలి మార్ష్‌కు టెస్టిక్యులర్ బ్లీడింగ్ సమస్య తలెత్తిందని వైద్యులు తెలిపారు.
క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటన ప్రకారం.. మార్ష్‌కు విశ్రాంతి అవసరం. వైద్యుల సూచనల ఆధారంగా తిరిగి ఆడే సమయం నిర్ణయించబడుతుంది. ఈ గాయం వల్ల ఆయన కదలికలు పరిమితం కావడంతో తక్షణమే జట్టులో మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆసీస్ వేధిస్తున్న గాయాలు
ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆసీస్ ఇప్పటికే ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ లాంటి సీనియర్ బౌలర్ల సేవలను కోల్పోయింది. ఇప్పుడు కెప్టెన్ మార్ష్ కూడా గాయపడటంతో జట్టు సమతుల్యత దెబ్బతింది. అయితే అనుభవజ్ఞుడైన స్టీవ్ స్మిత్ చేరిక, బ్యాటింగ్ లైనప్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది.
ప్రపంచకప్ గ్రూప్ దశలో ఆసీస్ షెడ్యూల్
- ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్ – ఫిబ్రవరి 11
- జింబాబ్వేతో – ఫిబ్రవరి 13
- శ్రీలంకతో – ఫిబ్రవరి 16
- ఒమాన్‌తో – ఫిబ్రవరి 20
ఇదిలా ఉంటే, కొలొంబో వేదికగా ఐర్లాండ్‌తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
తుది జట్లు..
ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), రాస్ అడైర్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్ (కెప్టెన్), కర్టిస్ కాంఫర్, బెంజమిన్ కాలిట్జ్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్కార్తీ, మాథ్యూ హంఫ్రీస్
ఆస్ట్రేలియా : ట్రావిస్ హెడ్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, మాట్ రెన్షా, కూపర్ కోనోలీ, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, నాథన్ ఎల్లిస్, జేవియర్ బార్ట్‌లెట్, మాథ్యూ కుహ్నెమాన్, ఆడమ్ జంపా


