భార్య కోసం ప్రతి ఏడాది మూడు కిలోలు బంగారమా..!? | Dubai based Indian crorepati Satish Sanpal buys 3 kg gold for wife every year | Sakshi
Sakshi News home page

భార్య కోసం ఏడాదికి 3 కిలోల బంగారం కొంటున్నాడు..!

Feb 9 2026 3:37 PM | Updated on Feb 9 2026 4:20 PM

Dubai based Indian crorepati Satish Sanpal buys 3 kg gold for wife every year

బంగారం ధరలు ఏ రేంజ్‌లో ఉ‍న్నాయో తెలిసిందే. రోజు రోజుకి ధరలు గుభ గుయ్యిమనేలా కొండపైకి ఎక్కి కూర్చొంటున్నాయి. సామాన్యులు కొనాలి అన్న ఆలోచనే మనసులోకి రానివ్వలేనంతగా భయపెడుతోంది దాని ధర. మరోవైపు వెండి ధర కూడా అలానే అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడిదంతా ఎందుకంటే..ఇంతలా బంగారం ధర దద్దరిల్లిపోతుంటే..ఇక్కడొక వ్యక్తి భార్య కోసం ప్రతి ఏడాది ఏకంగా మూడు కిలోల బంగారం కొంటాడంట. మూడు కిలలు అంటే ఇప్పుడున్న గోల్డ్‌ ధరల ప్రకారం..ఎంత ఖర్చు అవుతుందో ఆలోచిస్తేనే..నోటమాటరాదు కదా..!. మరి అలాంటిది అంతలా ఎవడ్రాబాబు బంగారం కొంటుంది అంటే..

భారత సంతతికి చెందిన బిలియనీర్‌ సతీష్ సన్పాల్ భార్య తబిందా సన్పాల్, నెట్‌ఫ్లిక్స​్‌లో తన రాబోయే రియాలిటీ షో 'దేశీ బ్లింగ్' ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ షో దుబాయ్‌లోని ఉన్నత వర్గ భారతీయ ప్రవాసులపైనా, వారి విలాసవంతమైన జీవనశైలిని హైలెట్‌ చేస్తుంది. ఈ సిరీస్‌లో నటీనటులు కరణ్‌ కుంద్రా, తేజస్వి ప్రకాష్‌తో పాటు డాన్యూబ్ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ రిజ్వాన్ సజన్, అనక్స్ హోల్డింగ్ వ్యవస్థాపకుడు సతీష్ సన్పాల్ వంటి ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. 

ఈ షో ధనవంతులు ఆడంబర జీవితాన్ని వారి విలాసవంతమైన వైభవాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపిస్తుంది. ఆ ట్రైలర్‌లో బారత సంతతికి చెందిన బిలియనీర్‌ సతీష్‌ సన్పాల్‌ భార్య తబిందా సన్పాల్‌ తన భర్తకు బంగారంపై ఉన్న ప్రేమను గురించి వెల్లడిస్తుంది. తన భర్త సతీష్‌కు బంగారం కొనడం అంటే చాలా ఇష్టమని, ప్రతి ఏడాది తన కోసం మూడు కొలోల బంగారం కొంటాడని పేర్కొంది. అంటే ప్రస్తుతం ధర బట్టి..కిలో బంగారం సుమారు రూ. 1.5 కోట్లు పలుకుతుంది. అంటే మూడు కిలోల బంగారం రూ. 4.5 కోట్లు పైమాటే పలుకుతుంది..!.

ఎవరీ సతీష్‌ సన్పాల్‌.. ?
సతీష్ సన్పాల్ భారతదేశంలో జన్మించిన అనక్స్ హోల్డింగ్ చైర్మన్. అతని కంపెనీ దుబాయ్ రియల్ ఎస్టేట్, ఆర్థిక మార్కెట్లు, హాస్పిటాలిటీ, మీడియా వంటి అనేక రంగాలలో భాగస్వామ్యం ఉంది. అతను బ్రిటిష్-పాకిస్తానీ మహిళ అయిన తబిందా సన్పాల్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ఇసాబెల్లా అనే ఒక ఏడాది కుమార్తె ఉంది. ఆయన  గతేడాది ప్రారంభంలో తన కుమార్తెకు కస్టమ్‌ పింక్‌ రోల్స్‌ రాయిస్‌ను బహుమతిగా ఇచ్చి వార్తల్లో నిలిచాడు. 

ఇక సన్పాల్‌ ఒక ఇంటర్వ్యూలో తాను భారతదేశంలోని జబల్‌పూర్‌లో జన్మించానని, కేవలం రూ. 80 వేలు జేబులో పెట్టుకుని దుబాయ్‌కి వచ్చినట్లు తెలిపాడు. ఇక తబిందా కూడా అదే ఇంటర్వ్యూలో తాను ముస్లీం కావడంతో మొదట్లో తన కుటుంబం సతీష్‌ని పెళ్లి చేసుకోవడాన్ని అంగీకరించలేదని, అయితే ఆయన సాధించిన విజయం చూసి అభిప్రాయం మార్చుకుందని అంటుంది. అందుకు సతీష్‌ వెంటనే డబ్బు దేవుడు కాదని, అలా అని దేవుడి కంటే తక్కువ కూడా కాదని నవ్వుతూ అన్నాడు.

 

(చదవండి: 'భారతీయ పేరెంటింగ్‌'పై మ్యాట్రిమోని యాప్ సీఈవో ఫైర్‌..! భావోద్వేగప‌రంగా..)

 

Advertisement
 
Advertisement
Advertisement