'భారతీయ పేరెంటింగ్‌'పై మ్యాట్రిమోని యాప్ సీఈవో ఫైర్‌..! | Gurugram CEO Questions Indian Parenting: | Sakshi
Sakshi News home page

'భారతీయ పేరెంటింగ్‌'పై మ్యాట్రిమోని యాప్ సీఈవో ఫైర్‌..! భావోద్వేగప‌రంగా..

Feb 9 2026 1:18 PM | Updated on Feb 9 2026 2:10 PM

Gurugram CEO Questions Indian Parenting:

భారతీయ పేరెంటింగ్‌పై గురుగ్రామ్‌ సీఈవో, నాట్‌ డేటింగ్‌ సహ వ్యవస్థాపకుడు పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. చాలామంది భారతీయ తల్లిదండ్రుల పిల్లల పెంపకం సరైనది కాదన్నారు. తల్లిదండ్రులు మంచివాళ్లేనని, కానీ పెంపకంలో ఆలోచన తీరు సరిగా లేదన్నారు. పేరెంటింగ్‌పై ఎన్నో పుస్తకాలు వచ్చినా ఎందుకనో భారతీయ తల్లిదండ్రుల తీరు మారట్లేదని, వాళ్లు పిల్లలను పెంచడం లేదు, ఫలితాలను పెంచుతున్నారంటూ సోషల్‌మీడియా వేదికగా విమర్శించారు. ఇంతకీ ఆయన ఎందుకిలా అన్నారు. అసలు ఆ సీఈవో ఆంతర్యం ఏంటీ అంటే..

భారతీయ కుటుంబ వ్యవస్థను యావత్తు ప్రపంచం మెచ్చుకుంటే..మన భారతీయుడు, గురుగ్రామ్‌కి చెందిన మ్యాట్రిమోని యాప్ సీఈవో జస్వీర్‌ సింగ్‌ భారత పేరెంటింగ్‌ని తప్పుపడుతున్నారు. భారత తల్లిదండ్రులు పిల్లలను పెంచే విధానం అత్యంత అధ్వాన్నమైనది అని తిట్టిపోశారు. వాళ్లు పిల్లలను తమ సొంత ఆస్తులుగా చూస్తారని అన్నారు. ప్రపంచంలో మిగిలిన ప్రాంతాల్లో చూసిన దానికంటే అత్యంత భిన్నంగా ఉంటుందన్నారు. సాంస్కృతికంగా భారతీయ పేరెంటింగ్‌ విధానంలో పెద్దలు ఎల్లప్పుడూ గొప్పవారు అని గుండెల్లో నాటుకుపోతుందన్నారు. 

అంతేగాదు జస్వీర్‌ సింగ్‌ సోషల్‌మీడియా ఎక్స్‌పోస్ట్‌లో భారత తల్లిదండ్రుల పిల్లలను పెంచే విధానం గురించి ఇలా రాసుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లల పెంపక విధానాలలో కెల్లా అత్యంత చెత్త విధానంగా పేర్కొన్నారు. దీన్ని ప్రెషర్ కుక్కర్ పేరెంటింగా అభివర్ణించారు. ఇక్కడ భారత తల్లిదండ్రులు చెడ్డవారు కాదు గానీ ఆలోచన తీరు సరైనది కాదంటున్నారు. ముఖ్యంగా పిల్లలను ప్రశ్నించే విధంగా పెంచరన్నారు. 

తల్లిదండ్రులదే తుది నిర్ణయం..
చాలామటుకు తల్లిదండ్రులు పిల్లలను పెంచరని, వాళ్ల ఫలితాలను పెంచుతారని రాసుకొచ్చారు. వాళ్లు వ్యక్తలుగా స్వతంత్రంగా ఉండాలని కోరుకోరు. ఎందుకంటే భారత్‌లో ఒక పిల్లవాడు ఏం చదువుకోవాలి, భవిష్యత్తులో ఏ వృత్తిలో కొనసాగించాలి, ఎలాంటి జీవితాన్ని గడపాలి...అన్ని తల్లిదండ్రులే ఆలోచిస్తారు, నిర్ణయిస్తారు. ఆఖరికి ఎవరిని పెళ్లి చేసుకోవాలన్నది కూడా తల్లిదండ్రలదే ఫైనల్‌ నిర్ణయం అన్నారు. 

ఇక్కడ భారత పేరెంట్స్‌ దృష్టిలో మానసిక ఆరోగ్యం, ఆసక్తి, ఉత్సుకత, ఆప్టిట్యూడ్‌, తదితరాలన్ని ఎందుకు పనికిరానివి, విలువలేనివి అన్నారు. కేవలం వాళ్ల మైండ్‌లో తల్లిదండ్రులుగా తమకే అన్ని తెలుసని, మేము చెప్పినట్లుగా చేయాలనే ధోరణే ఎక్కువగా ఉంటుందన్నారు. చెప్పాలంటే ఇదొక వస్తుమార్పిడిలా ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే తామే ఈ ప్రపంచంలోకి పిల్లల్ని తీసుకొచ్చాం కాబట్టి వాళ్లపై తమకే సర్వహక్కులు ఉంటాయన్నట్లుగా ఉంటుంది వారి తీరు. 

ప్రశ్నించడమే అతిపెద్ద నేరం..
దాంతో పిల్లలు భావోద్వేగపరంగా చిక్కుకుపోతుంటారు. పైగా వైఫల్యాన్ని నేరంగా చూస్తారు. అదొక సిగ్గుచేటు, ఆందోళనగా పిల్లల మైండ్‌లోకి చొప్పిస్తారు. అంతేగాదు బంధువుల్లోనూ, సమాజంలోనూ తక్కువ అయినట్లుగా ప్రతిక్షణం పిల్లలకు నూరుపోస్తుంటారు.  దీన్ని ఇక్కడ తల్లిదండ్రులుగా తాము పిల్లల భవిష్యత్తును కాపాడుతున్నట్లుగా ఫీలవుతుంటారు కానీ, సవాలుని స్వీకరించేలా కాకుండా వైఫల్యం నుంచి కాపాడుకుంటున్నట్లుగా పెంచుతున్నాం అని గ్రహించరని మండిపడ్డారు. అంతేగాదు ఇక్కడ పిల్లలు ప్రశ్నించడం అనేది అగౌరమైనది, ఒకవేళ ఏ పిల్లవాడైన ధైర్యంగా ప్రశ్నించడం మొదలుపెడితే..అతడని దూరంగా ఉంచాల్సిన వ్య‍క్తిగా నిలబెడతారు. 

కేవలం నిశబ్దాన్ని ప్రోత్సహిస్తారు. ముందు తల్లిదండ్రులుగా వాళ్లు ఇలానే పెరిగారు, నియంత్రించబడ్డారు, ప్రశ్నించలేదు, భావోద్వేగపరంగా అణిచివేయబడ్డారు..కాబట్టి అదే తర్వాతి తరాలకు పునరావృతం అవుతుందని అన్నారు. అలాగే కొంతమంది పిల్లలకు చిన్న వయసులోనే పెద్దలకు మించిన పరిణితి, అపారమైన మేధస్సు ఉంటుంది, అయినప్పటకీ అక్కడ కూడా ప్రశ్నించడం ద్రోహం, విబేధించడం, అపరాధం అనే భావన కిందకు రావడం దురదృష్టకరం అని అన్నారు. కొందరు తల్లిదండ్రలు ఇలా ప్రశ్నిస్తున్నందుకు పనిష్మెంట్‌తో నొరు నొక్కే ప్రయత్నం చేస్తుంటారు లేదా గర్విష్టులు, మొండోడు కింద ముద్రవేస్తారని అన్నారు. 

నో చెప్పడానికి జంకేలా..
ఇక్కడ తల్లిదండ్రులు సమాజా అభిప్రాయానికి భయపడతారని అంటున్నారు. పిల్లలను తమను అనుసరించి, తమపై ఆధారపడేలా పెంచుతారని అన్నారు. అదీగాక తల్లిదండ్రలు మరో విషపూరి సంస్కృతికి ప్రాధాన్యత ఇస్తారు. అదేంటంటే పక్కంటి పిల్లవాడితో ప్రతిదానితో పోలుస్తూ..పెంచే ప్రయత్నం చేస్తుంటారు.. ఇది అన్నిట్లంకంటే దారుణైమనది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ భారతీయ తల్లిదండ్రులు సమాజంపై పోరాడలేక తమ భయాలను పిల్లలపై వేస్తారు, ఆధిపత్యం చెలాయిస్తారని అన్నారు. సింపుల్‌గా చెప్పాలంటే పిరికితనంతో పెంచుతారని, అది పితృస్వామ్యం విధేయత నుంచి వచ్చిందని అన్నారు. 

తల్లిదండ్రులు 'నో' అని స్వతహాగా చెప్పడం నేర్చుకోలేదు..పిల్లలకు అది నేర్పించరు. చెప్పాలంటే భారత పేరెంటింగ్స్‌ తమ పిల్లలను బాగా పెంచామనే ముసుగులో వారికి తెలియని నష్టం చేకురుస్తున్నారు. పైగా వ్యక్తిగత వైఫల్యాన్ని తరతరాలు మోసేలా చేస్తున్నారని తిట్టిపోశారు జస్వీర్‌ సింగ్‌. ఆయన ఉద్దేశ్యం ప్రకారం భారత పేరెంటింగ్‌ టాలీవుడ్‌ మూవీ బొమ్మరిల్లు లాంటిదని తేల్చేశారు. 

అయితే గత దశాబ్ద కాలంలో పెంపకం గురించి మనస్తత్వవేత్తలు, అధ్యయనాలు, కౌన్సలర్లు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. అలాగే నకుల్ మెహతా, జాన్కీ మెహతా వంటి మిలీనియల్ తల్లిదండ్రులు ఆధునిక అవగాహనతో పిల్లలను స్వతంత్రంగా ఆరోగ్యకరంగా ఎలా పెంచచ్చో అనుభవాలను షేర్‌ చేసుకున్నారు కూడా.

 

చదవండి: నీతా అంబానీ ధరించిన చానెల్‌ బ్లేజర్‌ ..అంత ఖరీదా!?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement