చేతిలో పదివేలు ఉంటే చాలు..ఆ దేశాల్లో లక్షాధికారులే..? | countries where the Indian Rupee makes you feel rich | Sakshi
Sakshi News home page

చేతిలో పదివేలు ఉంటే చాలు..ఆ దేశాల్లో లక్షాధికారులే..?

Jan 29 2026 4:02 PM | Updated on Jan 29 2026 4:33 PM

countries where the Indian Rupee makes you feel rich

ఏదైనా టూర్‌కి వెళ్లాలంటే ఎంత ఖర్చు అవుతుందో అని లెక్కలు, ప్లాన్‌లు వేసేస్తుంటాం. బడ్జెట్‌ సరిపోతుందనుకుంటే..టూర్‌ ప్లాన్‌ లేదంటే నో చెప్పేస్తాం. అలాంటిది ఈ దేశాలకు మాత్రం డబ్బు ప్రసక్తి లేకుండా హాయిగా చుట్టొచ్చేయొచ్చట. జస్ట్‌ చేతిలో వంద రూపాయాలుంటే చాలు హాయిగా అక్కడున్న ప్రదేశాలను ధీమాగా చూసేయొచ్చు. అదేంటని విస్తుపోకండి..ఎందుకంటే అక్కడ మన రూపాయి విలువే ఎక్కువ. అందువల్ల చేతిలో పదివేలు ఉన్నాచాలు..లక్షాధికారిలా ఎంజాయ్‌ చేసి వచ్చేయొచ్చు. మరి ఆ దేశాలేవో సవివరంగా తెలుసుకుందామా..!.

ప్రవాసులకు అత్యంత సరసమైన ధరలో ఖర్చులు కలిసొచ్చే దేశాల జాబితాలో వియత్నాంది అగ్రస్థానం. భారతీయులు వియత్నాంకు జస్ట్‌ ఆన్‌లైన్ వీసా పొందే సదుపాయం కూడా ఉంది. అక్కడ హా లాంగ్ బే, హనోయ్, హో చి మిన్ సిటీ, హోయ్ ఆన్, మెకాంగ్ డెల్టా మొదలైన ప్రదేశాలను తక్కువ ఖర్చుతో సందర్శించవచ్చు. తర్వాతి స్థానం లావోస్‌ది.

లావోస్‌
ఇక్కడ భూభాగంలో దాదాపు 70 శాతం అడవులతో కప్పబడి ఉంటుంది. ఇక్కడ ట్రెక్కింగ్, కయాకింగ్, జిప్ లైనింగ్, హాట్ ఎయిర్ బెలూనింగ్ మొదలైన సాహస కార్యకలాపాలను తక్కువ ఖర్చుతో ఆస్వాదించవచ్చు. ఇక్కడ పర్యాటకులు తప్పక సందర్శించాల్సిన అనేక ప్రదేశాలు ఉన్నాయి, లుయాంగ్ ప్రాబాంగ్, వియంటియాన్, కువాంగ్ సి జలపాతం, బుద్ధ పార్క్. మన రూపాయి ఇక్కడ కరెన్సీ ప్రకానం 253.25 లావోటియన్ కిప్‌లు పలుకుతుంది.

ఇండోనేషియా
ఇండోనేషియా బాలి, జకార్తా, గిలి దీవులు, కొమోడో జాతీయ ఉద్యానవనం వంటి అనేక ఆకర్షణలతో సహజ సౌందర్యంతో నిండిన ప్రదేశం. లెక్కలేనన్ని అగ్నిపర్వత ద్వీపాలు, స్పష్టమైన ఆకాశం, నీలి జలాలు, సముద్ర జీవులతో, ఇండోనేషియా ప్రపంచంలోని అతిపెద్ద ద్వీప దేశాలలో ఒకటి. తనహ్ లాట్ టెంపుల్ వద్ద సూర్యాస్తమయం, లెంబోంగన్ రీఫ్ క్రూయిజ్, ఆయుంగ్ వైట్ వాటర్ క్రూయిజ్ అన్నీ సందర్శించదగినవి. ఇక్క మన రూపాయి ఇండోనేషియా కరెన్సీలో 193.77 ఇండోనేషియా రుపియా.

కంబోడియా
అందమైన పర్యాటక ప్రాంతాల్లో కంబోడియా ఒకటి . భారత పాస్‌పోర్ట్ హోల్డర్లు 30 రోజుల్లో వీసా ఆన్ అరైవల్ పొందవచ్చు. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అంగ్కోర్ వాట్, అలాగే అందమైన బీచ్‌లు, మ్యూజియంలు, అరణ్యాలకు నిలయం. ఇక్కడ ఒక రూపాయి విలువ 46.76 కంబోడియన్ రీల్

పరాగ్వే
ఇది అసున్సియన్, పలాసియో డి లోపెజ్, మ్యూజియో డెల్ బారో, యిప్కారా సరస్సు, సాల్టోస్ డెల్ ముండో జలపాతాలు, లా శాంటిసిమా ట్రినిడాడ్ డి పరానా, సెర్రో కోరా నేషనల్ పార్క్, ఎన్‌కార్నాసియన్ పట్టణం వంటి అనేక ఆకర్షణలకు నిలయంగా ఉంది.

దక్షిణ కొరియా
ఇక్కడ మన దేశ కరెన్సీ విలువ కాస్త తక్కువగా ఉంటుంది. దక్షిణ కొరియాలో వసతి కొంచెం ఖరీదైనది. ముఖ్యంగా సియోల్ వంటి ప్రధాన నగరాల్లో, వసతి, ఆహారం, రవాణా, ఆకర్షణల ఖర్చు భారతదేశంలో కంటే ఎక్కువగా ఉంటుంది. సమర్థవంతమైన ప్రజా రవాణా వ్యవస్థ ఉన్నప్పటికీ, రవాణా ఖర్చులు భారతదేశంలో కంటే ఎక్కువగా ఉంటాయి. 

దక్షిణ కొరియాలో ఏడు రోజుల పర్యటనకు రూ.70 వేల నుంచి లక్ష రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చవుతుంది. విమాన ఛార్జీలు, వసతి ఖర్చును తగ్గించడానికి మార్గం ఆఫ్-సీజన్‌లో ప్రయాణించడం.ఇక్కడ ఒక్క రూపాయి 17.19 దక్షిణ కొరియా వోన్.

(చదవండి: కుక్క కోసం రూ. 15 లక్షలా..? ఎన్నారై దంపతులు..)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement